• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర

    ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. రాయలసీమలో సింగమల, ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాంధ్రాలో తెనాలి నుంచి ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనున్నట్లు వైసీపీ పేర్కొంది.

    నేను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతా: జగ్గారెడ్డి

    కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గం కార్యకర్తలతో అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతా. మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ప్రజల ముందు విజయదశమి రోజు తన మనసులోని మాట చెప్తున్నాను.. మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ ని చేసిండ్రు.. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు.. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. నన్ను ముఖ్యమంత్రి అయ్యే వరకు కాపాడుకోండి’ అని వ్యాఖ్యానించారు.

    వైసీపీని ఇంటికి పంపాల్సిందే: పవన్

    వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే జనసేనకు ముఖ్యమని తెలిపారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామని పవన్ పేర్కొన్నారు.

    సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

    శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన శ్రీ భ్రమరాంబ దేవి భక్తులకు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను అశ్వ వాహనంపై కొలువుదీర్చి అర్చకులు, విశేష పూజలు చేశారు. అశేష భక్తజన సందోహం మధ్య శ్రీగిరి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు రమణీయంగా గ్రామోత్సవం నిర్వహించారు.

    అందుకే పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటారు: అంబటి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌కు స్వాంత రాజకీయ ఆలోచన లేదన్నారు. చివరకు లోకేష్ పల్లకి మోసేందుకు పవన్ రెడీ అయ్యారని విమర్శించారు. టీడీపీని కాపాడేందుకు పవన్ ప్రత్నిస్తున్నాడని చెప్పారు. అందుకే పవన్‌ని ప్యాకేజీ స్టార్ అంటారని ఎద్దేవా చేశారు. సున్నా సున్నా కలిస్తే వచ్చేది సున్నానే అని టీడీపీ-జనసేన కలిస్తే కూడా అంతేనన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు.

    చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రా: మాజీ మంత్రి

    చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కోసం జీవితాన్నిఅంకితం చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదు. జగన్ జైలులో ఉన్నంత మాత్రాన అందురిని జైలులకు పంపాలా? చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్ చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రచేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు సుఖంగా లేరు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది’. అని మోత్కుపల్లి విమర్శించారు.

    వైసీపీని ఇంటికి పంపాల్సిందే: పవన్

    వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే జనసేనకు ముఖ్యమని తెలిపారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామని పవన్ పేర్కొన్నారు.

    రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

    AP: పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో రెండు, మూడు రోజల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్‌లో తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మూడు రోజులు కోస్తా ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

    ఆసుపత్రి నుంచి పాడెపై మృతదేహం తరలింపు

    AP: అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మానవ సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగు చూసింది. ముంచంగిపట్టు మండల కేంద్రం ఓ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పాడెపై మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఫోన్ చేసినా అంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు పాడె కట్టి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మోసుకెళ్లాల్సి వచ్చింది.

    కాంగ్రెస్‌లోకి రాజగోపాల్‌రెడ్డి.. క్లారిటీ

    TG: కాంగ్రెస్‌ చేరుతున్నట్లు వస్తోన్న వార్తలపై భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌ ఎల్బీ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని కోరినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. భాజపా పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.