• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘గెలుపు సాధించే వరకూ పోరాడదాం’

    AP: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించేవరకూ పోరడాటమే దసరా స్ఫూర్తి అని ఆమె స్పష్టం చేశారు. ‘మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసింది. కలియుగ అసురులను అంతమొందించేవరకు పోరాడదాం’ అని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ పోస్టర్‌ను ఆమె జత చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రాహ్మణి ఈ వ్యాఖ్యలు చేశారు.

    కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్‌రెడ్డి?

    TG: నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి యూటర్న్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన భాజపాను వదిలి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా భాజపాలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరే విషయమై ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో రాజగోపాల్‌ చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. రేపు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో భేటి కూడా అవుతారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే భాజపాకు గట్టి షాక్‌ తప్పదు.

    నేడు టీడీపీ, జనసేన జేఏసీ తొలి భేటీ

    నేడు రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ భేటికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ హాజరవుతారు. మ. 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ భేటిలో పవన్‌, లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొంటారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహార్‌ సమావేశానికి హాజరవుతారు.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పడుతున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,187 మంది భక్తులు దర్శించుకోగా 29,209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు వచ్చింది. కాగా నేటితో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750గా ఉంది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ … Read more

    నేడు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం

    AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. చివరి రోజైన ఇవాళ అమ్మవారు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మరోవైపు దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది.

    వంగవీటి రాధా పెళ్లి.. హాజరైన పవన్

    వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా, పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పోరంకిలోని M రిసార్ట్స్‌లో జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, కొడాలి నాని, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, జలీల్‌ఖాన్‌, నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, పలువురు ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

    80 స్థానాల్లో గెలుపు ఖాయం: రేవంత్

    TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రెండో విడత అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ భేటిలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులో ఉన్న పార్టీలకు సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 25 లేదా 26వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా ఆ తర్వాత రెండో … Read more

    ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

    AP: ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. ‘జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల నా ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. ఓటమి భయంతోనే నన్ను జైలు గోడల మధ్య బంధించారు. తద్వారా ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ, అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటా’ అని … Read more

    ఏపీలో 300 కిలోల‌ బంగారం సీజ్‌

    AP: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 300 కిలోల‌ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విజ‌య‌వాడ‌, తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు గ‌త నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ దుకాణాల‌తో పాటు గురురాఘ‌వేంద్ర, త‌ల్లం దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. అనంతరం భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు.