• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజధానిగా విశాఖ.. GVL కీలక వ్యాఖ్యలు

    AP: విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం విజయవాడకు వస్తారని ఎంపీ తెలిపారు.

    25 నుంచి ‘నిజం గెలవాలి’ యాత్ర

    AP: చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అదేరోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు.

    దసరా వేళ పసిడి ప్రియులకు షాక్

    దసరా పండగ వేళ పసిడి ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నిన్నటి పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ.220, రూ.220 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750లకు చేరింది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై రూ.1200 పెరిగింది.

    దేశంలోకి 70 మంది ఉగ్రవాదులు!

    నకిలీ పాస్‌పోర్టులతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నాయి. వీరంతా ఐఎస్‌ఐ, జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ ఉగ్ర సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్రం బంగ్లాదేశ్‌ సరిహద్దును అప్రమత్తం చేసింది. అటు భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలకు ఆదేశించింది.

    నేతలకు పవన్ దిశానిర్దేశం

    అమరావతి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. టీవీ చర్చలు, ప్రెస్‌ మీట్లు, సోషల్‌ మీడియా ప్రచారంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతినిధులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు.

    రెడ్‌మీ ఫోన్లలో ఇవే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు!

    మెుబైల్‌ ప్రియులు రెడ్‌మీ ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చాలా మందికి రెడ్‌మీ ఫోన్‌ కొనాలని ఉన్నప్పటికీ ఏది తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో రెడ్‌మీలోని టాప్‌ రేటెడ్‌ మెుబైల్స్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్స్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర చూసి ఏదీ కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఫోన్ల వివరాలు ఆఫర్లు తెలుసుకునేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి.

    గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ అయింది. రోదసి నుంచి గగన్ యాన్ మాడ్యూల్‌ను పారాచ్యూట్ సాయంతో విజయవంతంగా శాస్త్రవేత్తలు కిందకు దింపారు. అంతకుముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం కాసేపు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు సరి చేయడంతో మరోసారి ఇస్రో గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా ఉ.10 గంటలకు TV-D1 సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నిప్పులు కక్కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 8.30 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగం మొదలు పెట్టగా… సాంకేతిక లోపంతో ప్రయోగం తాత్కాలికంగా … Read more

    గగన్‌యాన్‌ ప్రయోగం నిలిపివేత

    ఈరోజు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం నిలిచిపోయింది. గగన్‌యాన్ TV-D1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కౌంట్‌ డౌన్‌కు 4 సెకన్ల ముందు సాంకేతిక లోపం గుర్తించినట్లు వెల్లడించారు. మరో ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    టీడీపీ- జనసేన తొలి భేటీ డేట్ ఖరారు

    టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్‌ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి.

    సీఎం పదవి కాదు ప్రజల భవిష్యత్తే ముఖ్యం: పవన్

    సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పని చేయాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాను ఏరోజూ సీఎం పదవి కోసం విముఖత చూపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన సరిచేసుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.