• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గగన్ యాన్ ప్రయోగం సక్సెస్

    ఇస్రో చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ అయింది. రోదసి నుంచి గగన్ యాన్ మాడ్యూల్‌ను పారాచ్యూట్ సాయంతో విజయవంతంగా శాస్త్రవేత్తలు కిందకు దింపారు. అంతకుముందు రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం కాసేపు నిలిచిపోయింది. శాస్త్రవేత్తలు సరి చేయడంతో మరోసారి ఇస్రో గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా ఉ.10 గంటలకు TV-D1 సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నిప్పులు కక్కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 8.30 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగం మొదలు పెట్టగా… సాంకేతిక లోపంతో ప్రయోగం తాత్కాలికంగా … Read more

    గగన్‌యాన్‌ ప్రయోగం నిలిపివేత

    ఈరోజు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం నిలిచిపోయింది. గగన్‌యాన్ TV-D1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కౌంట్‌ డౌన్‌కు 4 సెకన్ల ముందు సాంకేతిక లోపం గుర్తించినట్లు వెల్లడించారు. మరో ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    టీడీపీ- జనసేన తొలి భేటీ డేట్ ఖరారు

    టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్‌ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి.

    సీఎం పదవి కాదు ప్రజల భవిష్యత్తే ముఖ్యం: పవన్

    సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పని చేయాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాను ఏరోజూ సీఎం పదవి కోసం విముఖత చూపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన సరిచేసుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.

    అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

    ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు.

    ‘బలగం’ డైరెక్టర్‌కి తండ్రిగా ప్రమోషన్

    ‘బలగం’ సినిమా దర్శకుడు, నటుడు వేణు యెల్దండి తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. అయితే వేణుకు ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘బలగం’ తర్వాత మళ్లీ దిల్ రాజు నిర్మాణంలో వేణు మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అందులో కూడా ప్రియదర్శినే హీరోగా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

    ప్రజ్ఞాన్‌పై ఇంకా ఆశలున్నాయి: ఇస్రో

    చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ నిద్రిస్తుంది. దానిని పడుకొనిద్దాం. తనంతటే తానే క్రియాశీలం అయ్యే అవకాశాలు ఇంకా మెండుగా ఉన్నాయి. రోవర్‌ను మైనస్ 200 డిగ్రీల వద్ద పరీక్షించినప్పుడు పనిచేసింది. అందుకే ఇప్పటికీ ప్రజ్ఞాన్ రోవర్ క్రియాశీలమవుతుందనే నమ్మకం ఉందన్నారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.55,700కు చేరింది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ. 60,760కి ఎగబాకింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 77,500కు చేరుకుంది.

    గరుడవాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామివారిని వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు..

    భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

    పెళ్లై మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య పోలీసులకు పట్టించింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. కత్తి శ్రీను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో శ్నీనుపై ఆయన భార్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు పట్టించింది. దీంతో సదరు కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.