• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు మోహిని అవతారంలో శ్రీవారు

    నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో కనిపించనున్నారు. ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రతి 5 నిమిషాలకు బస్టాండ్‌లో ఓ బస్సు నడపనున్నట్లు టీటీడీ తెలిపింది.

    గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది: జగన్

    ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ పథకం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయిబ్రహ్మణ కులాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఏటా వారి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయంగా ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. ఈసందర్భంగా సీఎం జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనకు ఇప్పటికీ తేడా చూడండి. ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో నిలబెట్టుకున్నాం. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది. ఇప్పుడు ప్రతి పైసా ప్రజలకోసమే ఖర్చు పెడుతున్నాం అని … Read more

    ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు

    ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 3రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 23 వరకు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. అయితే ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.55,460కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ. 60,500కు ఎగబాకింది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.

    నారా భువనేశ్వరి కీలక నిర్ణయం

    చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలాగే చంద్రబాబు నిర్వహిస్తున్న భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రారంభిస్తారు.

    ‘జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా’

    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రన్న హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలకు వారం ముందే జీతాలందుకున్న రోజుల నుంచి… జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా.. మమ్మల్ని కరుణించన్న అనే రోజులు వచ్చాయి….అమ్మో ఒకటో తేదీ..ఇది పాత మాట.. ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు ఇవి..వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదులో అరుదు’ అని గంటా పేర్కొన్నారు.

    దసరా సెలవుల్లో మార్పులు

    ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. ఈ నెల 24న హాలీడే బదులుగా సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. దసరా పండుగ దృష్ణ్యా సెలవుల్లో ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది.

    చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి: సజ్జల

    రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ‘ఆయన ఆరోగ్యం పేరుతో టీడీపీ నేతలు బయట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని పత్రికలు అదే పనిగా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నాయి’ అని ఆరోపించారు.

    తెలంగాణలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీ నేత?

    ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులను రేపు ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, అలాగే కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా చేస్తానని ప్రకటించనుంది.

    శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

    మహిళా, శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేపట్టనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌లో బోధన, వైఎస్సార్ పోషణ ప్లస్, గర్భిణీలు, బాలింతలకు డ్రై రేషన్, మాంటిస్సోరి విద్యా విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. దీనితో పాటు ఇతర పథకాల అమలుకు సీఎం జగన్ సూచనలు చేయనున్నారు.