• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఫైబర్‌నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ విచారణ సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాది కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని ఆయన సుప్రీంకోర్టుకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం వరకు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబను అరెస్టు చేయోద్దని సుప్రీం ఆదేశించింది.

    ఎల్లుండి జగనన్న చేదోడు నిధులు రిలీజ్

    సీఎం జగన్ మరో సంక్షేమ పథకం ద్వారా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. అక్టోబర్ 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద నాయి బ్రహ్మాణులు, రజకులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. గత 3 ఏళ్ల నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈసారి నాలుగో విడతగా వారి ఖాతాల్లో జగన్ డబ్బులు జమచేయనున్నారు.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఇదే కేసుపై చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగనుంది. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

    ఎమర్జెన్సీ విడుదలపై కంగనా కీలక ప్రకటన

    కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ విడుదల గురించి ఆమె అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను మందుగా అనుకున్న సమయానికి నవంబర్ 24న విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల చంద్రముఖి 2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులు అయితే పడ్డాయి.

    విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం

    శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్.. పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది నెలల క్రితం స్కూలులో వాటర్ తాగేందుకు విద్యార్థిని స్టాప్ రూంకు వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న కీచక ఉపాద్యాయుడు బాలికను రేప్ చేశాడు. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి రాగా… ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ టీచర్‌ను … Read more

    విశాఖ నుంచే పాలన: సీఎం జగన్

    విశాఖలో పర్యటనలో భాగంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌ నాటికి విశాఖ రాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే పరిపాలనా విభాగమంతా పనిచేస్తుందని తెలిపారు. విశాఖకు ఉజ్జ్వల భవిష్యత్‌ ఉందని చెప్పారు. త్వరలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతోందని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని సీఎం జగన్‌ వెల్లడించారు.

    కేసీఆర్‌పై రాజ్‌నాథ్ నిప్పులు

    జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రెండు సార్లు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులు పరిక్ష రాసే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు అని మండిపడ్డారు.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న మందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అవినీతి జరిగిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణను వాయిదా వేసింది.

    ‘పురందేశ్వరి ఏ పార్టీయే అర్థం కావట్లేదు’

    ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి ఏ పార్టీయో నాకు అర్థం కావడంలేదు.. చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప వేరేది కనబడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీయే చంద్రబాబు అవినీతిపై మాట్లాడితే ఈమె వెనకేసుకొస్తోంది. లోకేష్‌ను వెంటబెట్టుకుని అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లడం విడ్డూరంగా ఉంది. మొన్నటి వరకు బీజేపీని ఇష్టారీతిన తిట్టిన టీడీపీ నాయకులతో జతకట్టడం వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.

    నేను విశాఖకు షిఫ్ట్ అవుతాను: సీఎం జగన్

    విశాఖలోని రుషికొండలో ఇన్ఫోసిస్ ఐటీ హబ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను. నాతో పాటు పరిపాలన విభాగమంతా విశాఖకు మారుతుంది. డిసెంబర్‌లోపు విశాఖకు మారుతాను. ఇక్కడి నుంచి ఏపీ పరిపాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏపీ అతిపెద్ద నగరం. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. సమీప భవిష్యత్‌లో ఐటీ హబ్‌గా మారుతుంది’ అని చెప్పుకొచ్చారు.