• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల

    టీడీపీ కార్యకర్తలు, నేతల ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ను రాజమండ్రి జైలు అధికారులు విడుదల చేశారు. ‘చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. కోర్టు ఆదేశాలు మేరకు చంద్రబాబు బ్యారక్ నందు టవర్ ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేశాము. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన నివేదికను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు.

    సోషల్ మీడియాలో ‘న్యాయానికి సంకెళ్లు’ ట్రెండింగ్

    సోషల్ మీడియాలో న్యాయానికి సంకెళ్లు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు, చేతులకు తాళ్లు, సంకెళ్లు, రిబ్బన్లు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. బాబుతో నేను అంటూ తమ నిరసన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు.

    నేడు విశాఖలో ఐటీ హబ్ ప్రారంభం

    నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఋషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి మంది ఉద్యోగులతో ఐటీ సేవలను ఇన్ఫోసిస్ ప్రారంభిస్తోంది. అలాగే దసరాకు విశాఖ నుంచి పాలన కొనసాగిస్తుండటంతో పరిపాలన భవనాలను జగన్ పరిశీలించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేయనున్నారు.

    కేసీఆర్‌ను కలిసిన పొన్నాల

    ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కలిశారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికారు. కాసేపు ముచ్చటించిన వీరిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పొన్నాల లక్ష్మయ్యాకు అపార అనుభవం ఉంది. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. https://x.com/TeluguScribe/status/1713530171247194400?s=20

    ‘చంద్రబాబు పట్ల దారణంగా ప్రవర్థిస్తున్నారు’

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ కక్ష్య పనికిరాదన్నారు. వైద్యుల నివేదికలు పక్కన పెట్టి దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్ల నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

    బిగ్ బాస్ హౌస్‌లోకి ‘శుభ శ్రీ’ రీ ఎంట్రీ?

    బిగ్‌బాస్ హౌస్‌లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు ఉండి ఎలిమినేట్ అయిన రతిక రోజ్, దామిని, శుభశ్రీలో ఒకరికి తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నాగార్జున అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో శుభశ్రీ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 5 వారాల జర్నీలో శుభశ్రీ టాస్క్‌ల పరంగా 100శాతం ఎపర్ట్స్ అయితే ఇచ్చింది. మరి హౌస్‌లోకి … Read more

    ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు బాల త్రిపురసుందరీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. కాసేపట్లో దర్శనాలు ఆరంభం కానున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భారీగా తరలి వస్తుండటంతో కొండపైకి ప్రైవేటు వాహనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

    టీకాంగ్రెస్ తొలి జాబితా విడుదల

    తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. టికెట్లు దక్కని ఆశవాహులను బుజ్జగించేందుకు జానా రెడ్డి నేతృత్వంలోని కోర్ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది. వచ్చే వారం నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ బస్సు యాత్ర చేపట్టనున్నారు. Courtesy Twitter: Courtesy Twitter:

    శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    చంద్రబాబుకు జైలు సరికాదు: మంత్రి మల్లారెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని జైలులో పెడతారా?అని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేకపోయినా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. దేశంలోనే ది బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన తర్వాత చాలా బాధేసిందని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.