• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు బాల త్రిపురసుందరీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. కాసేపట్లో దర్శనాలు ఆరంభం కానున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భారీగా తరలి వస్తుండటంతో కొండపైకి ప్రైవేటు వాహనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

    టీకాంగ్రెస్ తొలి జాబితా విడుదల

    తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. టికెట్లు దక్కని ఆశవాహులను బుజ్జగించేందుకు జానా రెడ్డి నేతృత్వంలోని కోర్ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది. వచ్చే వారం నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ బస్సు యాత్ర చేపట్టనున్నారు. Courtesy Twitter: Courtesy Twitter:

    శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    చంద్రబాబుకు జైలు సరికాదు: మంత్రి మల్లారెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని జైలులో పెడతారా?అని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేకపోయినా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. దేశంలోనే ది బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన తర్వాత చాలా బాధేసిందని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

    చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య సరిస్థితిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరం జైలు అధికారులు ప్రభుత్వ వైద్యుల సూచనలను పాటించేలా చూడాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు సూచించారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    లోకేష్, భువనేశ్వరి భావోద్వేగం

    జైలులో చంద్రబాబును కలిసి ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి ఆందోళన చెందారు. ములాఖత్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే భువనేశ్వరి, లోకేష్ దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. జైలులో చంద్రబాబును చూసి చాలా బాధేసిందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

    ‘జైలులో చంద్రబాబు హత్యకు కుట్ర’

    AP: అనారోగ్యం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ చంద్రబాబును రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందన్నారు ‘చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది. భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్‌ సర్కార్‌దే బాధ్యత. ఆయన ఆరోగ్యంపై ఎందుకీ కక్ష?’ అని ప్రశ్నించారు.

    పెళ్లి చేయలేదని కన్న తండ్రి హత్య

    AP: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. తెల్లవారుజామున తండ్రి బాలభద్రాచారిని ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లిన కుమారుడు గురునారాయణ పథకం ప్రకారం హతమార్చాడు. తొలుత తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్వల్ప గాయాలైన గురునారాయణను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    అన్న ఫ్యామిలీనే బలిగొన్న తమ్ముడు

    పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు సొంత అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. ఖరడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్థికంగా స్థిరపడిన అన్న సత్వీర్‌సింగ్‌పై నిందితుడు కక్ష పెంచుకున్నాడు. సత్వీర్‌సింగ్‌, అమన్‌దీప్‌ కౌర్‌ దంపతులతోపాటు వారి కుమారుడు లఖ్‌వీర్‌ సింగ్‌ను చంపేశాడు. తొలుత అన్న భార్యను కత్తితో పొడిచి అనంతరం అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

    ‘మనుషుల ప్రాణాలకు విలువ లేదు’

    HYD: గ్రూప్ 2 అభ్యర్థిని మర్రి ప్రవల్లిక (23) బలవన్మరణంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదని విమర్శించారు. ఈ పెద్దమనిషి (కేసీఆర్) పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని మండిపడ్డారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్‌ను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.