తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.51,300కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి రూ.55,960కి ఎగబాకింది. వరుసగా బంగారం ధరలు పెరుగుదల సామాన్యులను కలవరపెడుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.74,400 వద్ద కొనసాగుతోంది.