• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రేపు కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటన

  రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్‌లో రూ.7కోట్లతో నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ హౌస్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటనను మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  TSPSC పరీక్షల షెడ్యూల్ విడుదల

  గతంలో నోటిఫికేషన్లు జారీ చేసిన పలు ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ను TSPSC విడుదల చేసింది. ఏప్రిల్ 25న అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష, మే 7న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మే13న పాలిటెక్నిక్ లెక్చరర్ల ఎగ్జామ్, 17న ఇంటర్, సాంకేతికి విద్యాశాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ భర్తీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్ విధానంలో జరగనున్నట్లు పేర్కొంది.

  లాస్ట్ షాట్ తోప్‌.. దసరా టీజర్‌పై రాజమౌళి ప్రశంసలు

  హీరో నాని నటించిన దసరా టీజర్‌పై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. దసరా టీజర్ విజువల్స్ తనకు బాగా నచ్చాయని ట్వీట్ చేశారు. నాని మెకోవరర్ చాలా బాగా తీశారని కితాబిచ్చారు. కొత్త దర్శకుడు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారన్నారు. లాస్ట్ షాట్ తోప్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ముఖ్యమైన పట్టణాల్లో ఆంధ్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

  మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ఫిష్ ఆంధ్ర హబ్‌ల ఏర్పాటును ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని ప్రొత్సహించేందుకు ముఖ్యమైన పట్టణాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆంధ్ర ఫిష్ బ్రాండ్‌ను విస్తరించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదేక్రమంలో మత్స్య ఉత్పత్తిని పెంచడానికి ఫిష్ సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.

  పెషావర్‌లో ఆత్మహుతి దాడి… 28 మంది మృతి

  పాకిస్థాన్- పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు పాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో గుమిగూడగా.. ఒక్కసారిగా ఆత్మహుతి దాడి జరిగింది. పెలుళ్ల ధాటికి మసీదులోని భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిలో పాక్ పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

  సాంకేతిక సమస్యపై సీఎం జగన్ సీరియస్

  విమానంలో సాంకేతిక సమస్యపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. జీఏడీ, సీఎంవో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానంలో సాంకేతిక సమస్యపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఇవాళ రాత్రికే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో సీఎం భేటీకానున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

  ఛీ అప్పటి వరకు ఆగలేవా? రీతూపై నెటిజన్ల ఆగ్రహం

  [VIDEO](url): క్యారెక్టర్ ఆర్టిస్ట్, జబర్‌దస్త్‌ ఫేమ్ రీతూ చౌదరి తాజాగా పోస్ట్ చేసిన ఇన్‌స్టా రీల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నిన్నటి వరకు తండ్రిని కోల్పోయాను. ఆయన జ్ఞాపకాలతోనే జీవితమంతా బతికేస్తా అని రీతూ పోస్టులు పెట్టింది. అయితే సడెన్‌గా పల్చటి చీరలో అందాల ఆరబోతకు రీతూ దిగడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి దిన కర్మ వరకు ఆగలేవా? అప్పుడే అందాల ఆరబోత మొదలు పెట్టావ్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఆమె ఫ్యాన్స్‌ మాత్రం రీతూ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఈ … Read more

  విషమంగా తారకరత్న ఆరోగ్యం

  తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్మో సపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. కండిషన్ క్రిటికల్ ఉన్నట్లు పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తున్నట్లు వెల్లడించారు.

  సీఎం జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

  సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫైలెట్లు వెంటనే విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  తారకరత్న ట్రీట్‌మెంట్ వీడియో లీక్

  [VIDEO](url): తారకరత్న చికిత్సకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. కుప్పంలో నారలోకేష్ యువగళం పాదయాత్రలో హార్ట్‌ స్ట్రోక్‌తో తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆ చికిత్సకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. https://twitter.com/klapboardpost/status/1618925779756400640/video/2