• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబుకు కంటి సమస్య

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు కంటి సమస్య ఉందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. సివిల్ సర్జన్ బీ.శ్రీనివాసరావు చంద్రబాబును టెస్ట్ చేసి దృష్టి సమస్య ఉందని స్పష్టం చేశారు. కుడి కంటిలో క్యాటారాక్ట్ ఉందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వెంటనే శస్త్ర చికిత్స చేయకుంటే కుడి, ఎడమ కంటి చూపుల్లో తేడా ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.

    పరిగికి నీళ్లు ఎందుకు తేలేదు: రేవంత్

    కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ రెండుసార్లు సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ఏమైంది?.. కొడంగల్‌ వరకు గోదావరి జలాలు తీసుకొస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు.. ఏపీవాళ్లు తెలంగాణ నీళ్లు తీసుకెళ్లారని కేసీఆర్‌ ఆనాడు విమర్శించారు. పరిగికి కేసీఆర్‌ ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? భూముల్ని ఆక్రమించిన మిమ్మల్ని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరగడంతో రూ.57,400కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.660 పెరగడంతో రూ.62,620కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం

    తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వేడిమి, రాత్రి తీవ్రమైన చలితో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం హైదరాబాద్‌- హయత్ నగర్‌లో సాధారణం కన్నా తక్కువగా 21 డిగ్రీలు, మెదక్‌లో 5 డిగ్రీలు తక్కువగా 13.4, రామగుండంలో 2.4 డిగ్రీలు తక్కువగా 17.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కాగా ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

    రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది: డీకే

    డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ జోస్యం చెప్పారు. ‘భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ సిద్ధాంతం.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మీరిప్పుడు రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ అందర్ని కలుపుకుని పోతుంది. తెలంగాణలో మార్పుకోసం దేశమంతా ఎదురుచూస్తోంది.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధాని మోదీ అన్నారు. ఇచ్చిన అన్ని గ్యారెంటీలను డిసెంబర్‌ 9 నుంచి అమలు చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలువుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

    రీ రిలీజ్‌కు సిద్ధమైన ముత్తు

    సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన క్లాసిక్ మూవీ ‘ముత్తు’ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమైంది. తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్‌ చేయనున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయనప్పటికీ నవంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజిని సరసన మీనా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

    రామ్‌చరణ్ కూతురు ఫోటో ఇదేనా?

    రామ్‌చరణ్- ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లింకార కొణిదెల ఫోటో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఇది నిజమైన ఫోటోకాదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రూపొందించిన చిత్రం. ఈ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. నిజంగా మెగా ప్రిన్సెస్ ఇలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. క్లింకారా పుట్టినప్పటి నుంచి రామ్‌చరణ్-ఉపాసన దంపతులు గోప్యత పాటిస్తున్నారు. కాగా ప్రస్తుతం వీరిద్దరు ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి హడావుడిలో బిజీగా ఉన్నారు.

    వివాహితపై ఇద్దరు మహిళల అసహజ శృంగారం

    హైదరాబాద్- యూసుఫ్ గూడలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు దాడి చేసి.. అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఆమెపై తీవ్రంగా దాడి చేసి వంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం అపహరించారు. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బస్టాప్‌లో తలదాచుకుంటున్న ఆమె దగ్గరకు ఇద్దరు మహిళలు సమీపించారు. మాయమాటలు చెప్పి వారింటికి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. తెరుకున్న వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    వీహెచ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

    టీకాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. అంబర్‌పేట టికెట్‌ తనకు రాకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అసలు రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేయించింది ఉత్తమే నంటూ వ్యాఖ్యానించారు. తనను, జగ్గారెడ్డి లాంటి సీనియర్లను బయటకు పంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈక్రమంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లొద్దని అధిష్టానం ఆదేశించింది. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.

    లక్ష్మి బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదు

    మేడి గడ్డ లక్ష్మి బ్యారేజ్ కుంగడంపై మహదేవ్ పుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు … Read more