• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లుంగీ డ్యాన్స్‌కు అఫ్గాన్ క్రికెటర్ల స్టెప్పులు

    పాకిస్థాన్‌పై విజయం అనంతరం అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్టేడియం నుంచి బస్సులో తమ హోటల్ గదిలోకి వెళ్లేంత వరకు డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని లుంగి డ్యాన్స్ పాటకు స్టెప్పులు వేశారు. రషిద్ ఖాన్‌తో పాటు ఇతర ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ ఆనందించారు. కాగా నిన్న పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. https://x.com/CricCrazyJohns/status/1716631803585561031?s=20

    రిలయన్స్ జియో సూపర్ ప్లాన్

    రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్‌ను ప్రకటించింది. రూ.3,227కో రీచార్జ్ చేస్తే సంవత్సరం పాటు రోజుకు 2జీబీ డేటాతో పాటు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబిస్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఒకవేళ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే.. జీ5, సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు. ఏడాది కాలపరిమితితో జియో మరో ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీని ధర రూ.1,999

    అతనిలా బౌలింగ్ వేయాలనుకున్నా కానీ.. : కులదీప్

    టీమిండియా బౌలర్ కులదీప్ యాదవ్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నాకు వసీం అక్రమ్ బౌలింగ్ అంటే ఇష్టం. ఆయనలాగే బౌలింగ్ వేయాలని అనుకున్నా. కానీ మా కోచ్ సూచనల ప్రకారం లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌గా మారాను. ఇప్పుడు షేన్ వార్న్ అనుసరిస్తున్నాను. ఆయనలాగే బౌలింగ్ వేయడానికి ఇష్టపడుతాను. బౌలింగ్‌లో ఎమైన అనుమానాలు ఉంటే వార్న్ పాత వీడియోలు చూస్తుంటాను. బ్యాటర్లను ఏవిధంగా బోల్తా కొట్టించాడు వంటివి పరిశీలిస్తుంటాను’ అని చెప్పుకొచ్చాడు.

    ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర

    ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. రాయలసీమలో సింగమల, ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాంధ్రాలో తెనాలి నుంచి ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనున్నట్లు వైసీపీ పేర్కొంది.

    చిరంజీవి కొత్త నుంచి లెటెస్ట్ అప్‌డేట్

    మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న MEGA156 చిత్రం నుంచి లెటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్ కొబ్బరికాయ కొట్టి లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌తో సినిమాని ప్రారంభించారు. https://x.com/UV_Creations/status/1716705085076681107?s=20

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

    వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(సి), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్ దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, … Read more

    మరో ఇద్దరు బందీలను వదిలిపెట్టిన హమాస్

    మరో ఇద్దరు బందీలను హమాస్ మిలిటెంట్లు తమ చెర నుంచి వదిలి పెట్టారు. మానవత దృష్టితో ఇద్దరు వృద్ధులను విడిచి పెట్టినట్లు పేర్కొన్నారు. వీరిద్దరు ఇజ్రాయేల్ దేశస్థులు. వారం క్రితం ఇద్దరు అమెరికాకు చెందిన తల్లి కూతుళ్లను హమాస్ ఉగ్రవాదులు విడిచి పెట్టారు. ప్రస్తుతం తమ వద్ద 222 మంది బందీలుగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు హమాస్‌పై దాడుల ఉద్ధృతిని పెంచనున్నట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది. తాము హమాస్‌ పూర్తిగా ధ్వంసం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

    నారావారి పల్లెలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు

    నారా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు నారా భువనేశ్వరి చేరుకున్నారు. నారావారి కులదేవత సత్తెమ్మ, నాగులమ్మలకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అత్తమామలు నారా ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధులకు నారా భువనేశ్వరి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు. చంద్రబాబు తప్పకుండా జైలు నుంచి విడుదలవుతారని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

    ఆక్స్‌ఫర్డ్‌ నుంచి కవితకు ఆహ్వానం

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఈనెల 30న ఆ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘డెవలప్‌మెంట్ ఎకనామిక్స్’అంశంపై మాట్లాడాలని ఆమెకు ఆహ్వానం అందింది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై కవిత ప్రసంగించనున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిన తీరు, 24 గంటలు విద్యుత్, రైతు బంధు వంటి కార్యక్రమాలపై కీలకోపన్యాసం చేయనున్నారు.

    భగవంత్ కేసరి రికార్డు కలెక్షన్లు

    బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 106. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. మరోవైపు అమెరికాలోనూ భగవంత్ కేసరి అదరగొడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా శ్రీలీల కూతురుగా నటించింది. థమన్ సంగీతం అందించగా.. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేశారు.