• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో చలి మొదలైంది

    తెలంగాణలో అప్పుడే చలికాలం ప్రారంభమైంది. మొన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు చలికి ఒణికిపోతున్నారు. హన్మకొండలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.7 డిగ్రీలు తగ్గి 17.3 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 17.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాల తిరోగమనం, ఉత్తరాది నుంచి చలిగాలులు వీయటం వల్ల పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాత్రి పూట 9 గంటల తర్వాత చలితీవ్రత పెరుగుతోంది.

    తీవ్ర తుపాన్‌గా బలపడిన ‘హమూన్’

    బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్‌కు ‘హమూన్‌’గా పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. తీవ్ర తుపాన్గా మారిన హమూన్.. ఈశాన్య దిశగా కదులుతోంది. ఒడిశాలోని పారాదీప్కు ఆగ్నేయంగా, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నం బంగ్లాదేశ్ చిట్టగాంగ్, ఖేప్ పురా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా భారత్‌లో ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    జనవరి నెల కోటా టికెట్లు విడుదల

    జనవరి నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్లను టీటీడీ వెబ్ సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. జనవరి నెలకు సంబంధించి నిన్న శ్రీవాణి భక్తుల దర్శనం, వసతి కోటా టికెట్లు విడుదల చేసింది. అటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల వరకు సమయం పడుతోంది. సోమవారం స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.12 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    అందుకే ఓడిపోయాం: బాబర్ అజామ్

    అఫ్గానిస్థాన్‌పై ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ స్పందించాడు. ‘ఈ ఓటమి మమ్మల్ని మరింత బాధపెట్టింది. మంచి టార్గెట్ అఫ్గాన్ ముందు ఉంచినా కాపాడుకోలేకపోయాం. స్పిన్నర్లు అనుకున్నంత రాణించలేకపోయారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం. అఫ్గాన్ ప్లేయర్లు బాగా ఆడారు. నాణ్యమైన ఆటతీరు కనబరిచారు. అందుకే వారు గెలిచారు. ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పాడు.

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ రోడ్డు వద్ద టాటా సూమోను లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

    నేను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతా: జగ్గారెడ్డి

    కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నియోజకవర్గం కార్యకర్తలతో అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇంకా పదేళ్లకైనా సీఎం అవుతా. మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ప్రజల ముందు విజయదశమి రోజు తన మనసులోని మాట చెప్తున్నాను.. మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ ని చేసిండ్రు.. మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు.. మీ ఆశీర్వాదం తోటి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. నన్ను ముఖ్యమంత్రి అయ్యే వరకు కాపాడుకోండి’ అని వ్యాఖ్యానించారు.

    నేడు బంగ్లాదేశ్‌తో సౌతాఫ్రికా ఢీ

    వరల్డ్ కప్- నేటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఒక్క విజయంతో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బలమైన దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వాలని బంగ్లా కసరత్తు చేస్తోంది.

    22 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ దసరా సేల్

    ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌తో ముందుకొచ్చింది. బిగ్ దసరా సేల్‌ ఈనెల 22 నుంచి 29 వరకు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్స్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. బిగ్‌ దసరా సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, కొటాక్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ కార్డు హోల్డర్లకు 10శాతం డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించింది. సూపర్ కాయిన్స్ ద్వారా మరో 5శాతం అదనపు డిస్కౌంట్ అయితే పొందవచ్చు. దీని తర్వాత దీవాళికి మరో సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనుంది.

    శ్రీలంక టార్గెట్ 263

    వరల్డ్‌కప్‌లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 70(80), లోగాన్ వాన్ బేక్ 59 (75) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మడుశనక 4, కాసూన్ రంజిత 4 వికెట్లు పడగొట్టారు.

    భగవంత్ కేసరి రికార్డు వసూళ్లు

    బాలయ్య నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు రూ.19 కోట్లు కొల్లగొట్టడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును దాటేసింది. మొత్తానికి రెండు రోజుల్లోనే రూ.51.12 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక వీకెండ్స్ ఉండటంతో కలెక్షన్లు ఇంకా సాలిడ్‌గా ఉండే అవకాశం ఉంది. అటు అమెరికాలోనూ భగవంత్ కేసరి 8 లక్షల డాలర్స్‌ మార్క్‌ను దాటేసింది.