iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!

    iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!

    March 16, 2024

    వివో (Vivo) సబ్‌ బ్రాండ్ ఐకూ (iQoo) భారత్‌లో మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 12న తీసుకొచ్చిన iQoo Z9 ఫోన్‌కు హై రేంజ్‌ వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఐకూ జెడ్‌9 టర్బో (iQoo Z9 Turbo) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను రిలీజ్‌ చేయనుంది. ఐకూ Z9 5G మెుబైల్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఉండే అవకాశముంది. అయితే తాజాగా ఈ ఐకూ ఈ ‘ఐకూ Z9 టర్బో’ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. ఇందులో డిస్‌ప్లే, చిప్‌సెట్, బ్యాటరీ సహా మరిన్ని వివరాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    ఈ నయా ఐకూ మెుబైల్‌.. 6.7 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానుంది. దీనికి 120Hz రిఫ్రెష్‌ రేట్‌, HDR, 1800 nits పీక్‌ బ్రైట్‌నెస్‌, 1220 x 2712 pixels రిజల్యూషన్‌, Dragontrail Star 2 Plus ప్రొటెక్షన్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఈ iQOO Z9 Turbo ఫోన్‌.. Android 14 ఆధారిత Funtouch 14 ఆపరేటింగ్‌ సిస్టమ్, Qualcomm Snapdragon 8s Gen 3 ప్రొసెసర్‌ వర్క్ చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ ఐకూ మెుబైల్‌.. మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశముందని లీకైన సమాచారం చెబుతోంది. 8GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB ROM, 12GB RAM / 256GB ROM స్టోరేజ్‌ ఆప్షన్స్‌ మెుబైల్‌ను పొందవచ్చని అంటున్నారు. ఇక microSD కార్డు సాయంతో స్టోరేజ్‌ను 1TB వరకూ పెంచుకోవచ్చట. 

    కెమెరా

    ఈ iQOO Z9 Turbo మెుబైల్‌.. డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా + 2 MP OIS డెప్త్‌ సెన్సార్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్‌ కెమెరాను కూడా ఫిక్స్‌ చేశారని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా 4K వీడియోలు, HDR ఫొటోలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నాయి.

    బ్యాటరీ

    ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. దీనికి ఏకంగా 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేయనుందట. ఇదే నిజమైతే ఈ ఫోన్‌ మంచి బ్యాటరీ లైఫ్‌ను అందించే అవకాశముంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా ఉన్నందున మెుబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకునేందుకు వీలు పడుతుంది.

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ vivo iQOO Z9 Turbo మెుబైల్‌.. Wi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.3, A2DP, LE, GPS, GALILEO, GLONASS, QZSS, BDS వంటి కనెక్టివిటీ ఫీచర్లతో రానుందట. అలాగే అండర్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌, గైరో, ప్రాక్సిమిటీ, కాంపస్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉంటాయని సమాచారం. 

    కలర్ ఆప్షన్స్‌

    లీకైన సమాచారాన్ని బట్టి ఈ నయా ఐకూ ఫోన్‌.. బ్లాక్ (Black) కలర్‌లో అందుబాటులోకి రానుంది. లాంచింగ్‌ రోజున మిగిలిన కలర్ ఆప్షన్స్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. 

    ధర ఎంతంటే?

    iQOO Z9 Turbo ధర, లాంచింగ్ తేదీపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్‌.. ఏప్రిల్‌లో కచ్చితంగా భారత్‌లో అడుగుపెడుతుందని టెక్‌ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఈ ఫోన్‌ ధర రూ.25,000 లోపు ఉండొచ్చని సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version