• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సీజన్‌ మెుత్తానికి దూరమవుతున్న స్టార్‌ ప్లేయర్లు వీరే!

    క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ (IPL 2024) మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్‌ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లు వివిధ కారణాల వల్ల సీజన్‌ మెుత్తానికి దూరమవుతున్నారు. మరికొందరు పాక్షికంగా కొన్ని ఆటలకు అందుబాటులో ఉండటం లేదు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.  మహ్మద్‌ షమీ (Mohammed Shami) ఐపీఎల్‌లో ‘గుజరాత్‌ టైటాన్స్‌’ (Gujarat … Read more

    Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

    ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ (Col CK Nayudu Trophy)లో ఆంధ్రా బ్యాటర్‌ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) విధ్వంసం సృష్టించాడు. రైల్వే జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రైల్వే జట్టు బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లో ప్రతీ బంతిని సిక్స్‌గా మలిచిన వంశీ కృష్ణ.. ఆ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 64 బంతుల్లో 110 రన్స్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. … Read more

    రంజీ గెలిస్తే ఆటగాళ్లకు BMW కార్లు: HCA

    రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. దీంతో పాటు రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామని వెల్లడించారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు … Read more

    Beautiful Cricketers Wives: ఇర్పాన్ పఠాన్ భార్యతో పాటు ఈ భారత క్రికెటర్ల భార్యలు ఎంత ఫేమస్సో తెలుసా?

    భారత మాజీ క్రికెటర్‌ ‘ఇర్ఫాన్ పఠాన్‌’ (Irfan pathan) పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా తన 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఇర్ఫాన్‌.. తొలిసారి తన భార్య ముఖాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఇర్ఫాన్‌ (#IrfanPathan) పేరు వైరల్‌ అవుతోంది. ఇర్ఫాన్‌ భార్యను తొలిసారి చూసిన వారంతా ఫీదా అవుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇర్ఫాన్‌ భార్య సఫా బేగ్ ఓ సెలబ్రిటీ అన్న విషయం చాలా మందికి … Read more

    Sania Mirza: సానియా మీర్జా – షోయాబ్‌ విడిపోవడానికి అసలు కారణం ఇదేనా?

    స్టార్‌ కపుల్స్‌ సానియా మిర్జా – షోయబ్‌ మాలిక్ జంట అధికారికంగా విడిపోయింది. ఈ జంట విడిపోతున్నట్లు గత కొన్నేళ్లుగా షికారు చేస్తున్న పుకార్లను నిజం చేస్తూ పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించడంతో పాటు వివాహ ఫొటోలను షేర్‌ చేయడంతో అవి ట్రెండింగ్‌గా మారాయి.  పాక్‌ నటి సనా జావేద్‌ను షోయాబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశాడు. గత … Read more

    ముంబై వదిలి ఆర్సీబీకి బుమ్రా?

    టీమిండియా బౌలర్ బుమ్రా ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కలకలం రేపింది. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బుమ్రా పోస్ట్‌ పెట్టాడు. దీంతో అతడు ముంబై వదిలి ఆర్సీబీకి వెళ్లిపోయే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం (2015) నుంచి బుమ్రా, ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు.

    టాస్ ఓడిన భారత్.. టీం ఇదే!

    మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్ల వివరాలు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.

    మిచెల్‌ మార్ష్‌పై భారత్‌లో కేసు

    ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ మార్ష్‌పై భారత్‌లో కేసు నమోదైంది. వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన మార్ష్‌ చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి ఇలా ఆ ట్రోఫీని అవమానించడంతోపాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచినట్లు కేశవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    టీ20 అంటే చాలు సూర్య చెలరేగిపోతాడు

    నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆసీస్‌తో టీ20లో సూర్యకుమార్ చెలరేగిపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులతో సూర్యకుమార్ కొనసాగుతున్నాడు. నిన్నటి ఆసీస్ మ్యాచ్‌లో సూర్య 80 పరుగులు చేసి జట్టును విజయతీరానికి చేర్చాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 19.5 ఓవర్లలో 209 పరుగులను ఛేదించి ఆసీస్‌పై తొలి విజయం సాధించింది.

    కోహ్లీకి మూడో ర్యాంకు

    ప్రపంచకప్‌లో సత్తాచాటిన కోహ్లి, భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డేల్లో తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి (791 పాయింట్లు) మూడు, రోహిత్‌ (769) నాలుగో స్థానాల్లో నిలిచారు. శుబ్‌మన్‌ గిల్‌ (826) నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. బాబర్‌ ఆజాం రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ 3, జస్‌ప్రీత్‌ బుమ్రా 4, కుల్‌దీప్‌ యాదవ్‌ 6, మహ్మద్‌ షమి 10 స్థానాల్లో ఉన్నారు.