• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
  MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
  ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
  Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
  See More

  టాస్ గెలిచిన భారత్.. సిరాజ్ దూరం

  ఆసీస్‌తో వన్డే సీరిస్‌లో తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మొహాలి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. జట్ల వివరాలు; ఆసీస్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(w), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్(సి), సీన్ అబాట్, ఆడమ్ జంపా భారత్: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w/c), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, … Read more

  ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియానే నం.1

  నేడు ఆసీస్‌తో జరిగే మొదటి వన్డేలో టీమిండియా గెలిస్తే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా జట్టుగా అవతరిస్తుంది. ప్రస్తుతం 115 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత్.. పాక్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలుస్తుంది. భారత్ ఇప్పటికే టీ20లు, టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. మరోవైపు అశ్విన్ 3 వికెట్లు పడగొడితే అనిల్ కుంబ్లే (142)ను అధిగమించి ఆసీస్‌పై ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు.

  నేడు ఆసీస్‌తో తలపడనున్న భారత్

  నేడు మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. వరల్డ్ కప్‌కు ముందు బలబలాలను పరీక్షించుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఓడినప్పటికీ కమీన్స్ సారథ్యంలోని ఆసీస్ మంచి ఫామ్‌లోనే ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ రోహిత్, కోహ్లీ, హార్దిక్, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు.

  రేపటి నుంచి ఆసీస్‌తో వన్డే సిరీస్

  రేపటి నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత తలపడనుంది. మొదటి రెండు వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, పాండ్యా, కుల్దీప్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. చివరి వన్డేకు వీరంతా తిరిగి జట్టులో చేరనున్నారు. టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొహాలి వేదికగా తొలి వన్డే జరగనుంది. వరల్డ్ కప్‌కు ముందు సన్నాహాకంగా ఈ సీరిస్‌ను టీమిండియా భావిస్తోంది.

  అందుకే అతడితో ఓవర్ వేయించ లేదు: రోహిత్

  ఆసియా కప్ ఫైనల్లో భారత్ శ్రీలంకను చిత్తుచేసిన విషయం తెలిసిందే.. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 7 ఓవర్లు వేసి 6 వికెట్లును పడగొట్టాడు. అయితే సిరాజ్‌తో 8 ఓవర్ వేయించకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సపోర్ట్ టీమ్ సూచన మేరకు మరో ఓవర్ వేయించలేదని తెలిపాడు. సిరాజ్ ఫిట్‌నెస్ కూడా ముఖ్యమని చెప్పాడు. అందుకే ఓవర్లు వేసే అవకాశం ఉన్నా మరో ఓవర్ అతడితో వేయించలేదని వెల్లడించాడు.

  టీమిండియా కొత్త జెర్సీ ఇదే?

  వన్డే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. దీనిపై భారత కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ ప్రత్యేకంగా వీడియోను సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. అందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిశారు. అయితే, జెర్సీలపై కుడివైపు అడిడాస్‌ లోగో, ఎడమవైపు బీసీసీఐ టీమ్‌ లోగో ఉంది. జర్సీ మధ్యలో స్పాన్సర్‌ డ్రీమ్‌ 11 పేరు, దాని కింద ఇండియా అని … Read more

  సిరాజ్ మళ్లీ నెంబర్ వన్

  వన్డే ర్యాంకింగ్స్‌ బౌలింగ్ విభాగంలో టీమిండియా క్రికెటర్ మహమ్మద్‌ సిరాజ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అతడు ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్‌ వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి. హేజిల్ వుడ్ రెండో స్థానంలో, ట్రెంట్ బౌల్ట్‌ మూడో స్థానంలో ఉన్నారు. అఫ్గాన్‌ స్పిన్నర్లు ముజీబుర్ రెహ్మన్, రషీద్‌ఖాన్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మూడు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

  ‘హార్థిక్ ఫామ్ శుభసూచకం’

  టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాపై క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హార్థిక్ తిరిగి అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తున్నాడు. ప్రపంచకప్‌‌కు హార్థిక్ ఫామ్ శుభసూచకం’ అని పాకిస్థాన్ ట్రికెటర్ వసీమ్ అక్రమ్ కొనియాడారు. హార్థిక్ కొంత కాలంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అతడు మళ్లీ జట్టుకు వెన్నెముకగా మారాడు. ఆసియా కప్‌లో హార్థిక్ ఆటతీరును చూస్తే అర్థమవుతోంది’ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్ కామెంట్ చేశారు.

  వన్డే వరల్డ్ కప్ సాంగ్ వచ్చేసెందోచ్…!

  వన్డే ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో ఐసీసీ ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను రూపొందించింది. “దిల్‌ జషన్‌ జషన్‌ బోలే” అంటూ సాంగ్‌ సాగుతోంది. ఈ సాంగ్‌లో అభిమానులను “వన్ డే ఎక్స్‌ప్రెస్‌”లో ప్రయాణిస్తున్నారు. ఈ సాంగ్‌ను ప్రీతమ్ చక్రవర్తి కంపోస్ చేశారు. స్టార్ హీరో రణవీర్ సింగ్ మైక్ పట్టుకుని పాడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. రణ్‌వీర్‌తోపాటు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ కూడా ఆడిపాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. https://x.com/ICC/status/1704384709646864506?s=20

  పొట్టి క్రికెట్‌లో మ‌రో సంచ‌ల‌నం

  పొట్టి క్రికెట్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. ఆసియా గేమ్స్‌లో మంగోలియా మ‌హిళ‌ల జ‌ట్టు కేవ‌లం 15 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. ఆ జ‌ట్టులోని ఏడుగురు డ‌కౌట్ కావ‌డం విశేషం. ఇండోనేషియాతో ఈ రోజు జ‌రిగిన మ్యాచ్‌లో మంగోలియాకు ఇదే తొలి అంత‌ర్జాతీయ పోరు. కానీ, ఇండోనేషియా బౌల‌ర్లు చెల‌రేగంతో మంగోలియా 10 ఓవ‌ర్ల‌లోనే కుప్ప‌కూలింది. ఇండోనేషియా పేస‌ర్ అండ్రియాని 4 వికెట్ల‌తో స‌త్తా చాటింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది.