‘జట్టును గెలిపించడం రోహిత్‌కు తెలుసు’
భారత్, ఆసీస్ రేపు టైటిల్ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ‘అతడు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ఎన్నోసార్లు ఫైనల్ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉంది. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసు’. అని జహీర్ చెప్పుకొచ్చాడు.