కెప్టెన్సీకి బాబర్ గుడ్‌బై
పాకిస్థాన్ జట్టు కెప్టెన్నీకి బాబర్ అజామ్ గుడ్‌బై చెప్పాడు. వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను, టీ20లకు షహీన్ షా అఫ్రిదిని కెప్టెన్లుగా పీసీబీ నియమించింది. అయితే ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పాక్ ఐదు మ్యాచ్‌లు ఓడి సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.