• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    శ్రీలంకకు ఐసీసీ షాక్

    శ్రీలంకకు ICC షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. శ్రీలంక క్రికెట్‌ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

    Aus Vs Ban: టాస్ గెలిచి ఆసీస్ బౌలింగ్

    వన్డే వరల్డ్ ‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తుదిజట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్‌వుడ్‌. బంగ్లాదేశ్‌ తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ … Read more

    ప్రపంచకప్‌లో వైఫల్యంపై స్పందించిన పాక్ కెప్టెన్

    ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ స్పందించారు. టీవీలో మాటలు చెప్పడం సులువని వ్యాఖ్యానించాడు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే తనకు నేరుగా ఫోన్‌ చేయొచ్చన్నారు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదని చెప్పారు. ‘ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో లేను. ఫీల్డింగ్‌లో నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరుగులు రాబట్టి జట్టుకు విజయాన్ని అందించాలని ఆలోచిస్తా’. అని బాబర్‌ వివరించాడు.

    రోహిత్‌ వద్దన్నా కెప్టెన్సీ అప్పగించాం: గంగూలీ

    మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌శర్మ విముఖత ప్రదర్శించాడని తెలిపారు, ఎలాగైనా కెప్టెన్‌గా ఉండాల్సిందేనని అతడిని ఒప్పించామని చెప్పుకొచ్చారు. మూడు ఫార్మాట్లలో తీరికలేక భారత జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ మొదట ఒప్పుకోలేదన్నారు. కానీ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రోహిత్‌ సరైనోడని భావించానని తెలిపారు. అందుకే అతడిని బలవంతంగా ఒప్పించానని గంగూలీ చెప్పుకొచ్చారు.

    దక్షిణాఫ్రికా లక్ష్యం 245 రన్స్‌

    వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గనిస్తాన్‌ జట్టు 244-10 (50) స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 97*( 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో అప్గన్‌ స్కోరు 200 దాటగల్గింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రహ్మాత్ షా 26, హష్మతుల్లా షాహిది 2, ఇక్రామ్‌ అలిఖిల్ 12, మహమ్మద్‌ నబీ 2, రషీద్‌ ఖాన్ 14, నూర్‌ అహ్మద్‌ 26, ముజీబ్‌ 8, నవీన్‌-ఉల్‌-హక్‌ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 2 … Read more

    Rohit sharma Net Worth 2023: రోహిత్‌ శర్మ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?

    టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit sharma) ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)లో అదరగొడుతున్నాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్‌ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్‌లూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో ఎప్పటికప్పుడు తనను మెరుగుపరుచుకుంటున్న రోహిత్‌.. ఆస్తుల వృద్ధిలోనూ ఏటా పైపైకి ఎగబాకుతున్నాడు. భారత్‌లోని అత్యంత సంపన్నులైన క్రీడాకారుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇంతకీ రోహిత్‌ శర్మ ఆస్తులు విలువ ఎంత? అతడికి ఎన్ని ఖరీదైన కారు ఉన్నాయి? … Read more

    AFG vs RSA: టాస్ గెలిచి ఆఫ్గాన్ బ్యాటింగ్

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్‌), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ … Read more

    న్యూజిలాండ్‌ ఘన విజయం

    వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన డారిల్‌ మిచెల్ (43; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత … Read more

    Richest Cricketers 2023: ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన టాప్‌-10 క్రికెటర్లు వీరే..!

    ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉన్న క్రీడల్లో క్రికెట్‌ (Cricket) ఒకటి. ఫుట్‌బాల్ (Football) తర్వాత అత్యధిక మంది ఇష్టపడే క్రీడగా క్రికెట్‌కు పేరుంది. అందుకే క్రికెట్‌లో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉంటారు. కోట్లాది మందిని ప్రభావితం చేయగల సామర్థ్యం వారికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ కోసం వారిని బ్రాండ్ అంబాసీడర్లకు నియమించుకొని కోట్లాది రూపాయలను ముట్టచెబుతుంటాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు అత్యంత సంపన్నులుగా మారారు. ప్రపంచంలోని టాప్‌-10 రిచెస్ట్‌ క్రికెటర్లు … Read more

    స్వల్ప స్కోరుకు శ్రీలంక ఆలౌట్‌

    వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ అయ్యింది. 46.4 ఓవర్లలో 171-10 స్కోరు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్‌ పెరీరా (51) అర్ధ శతకంతో రాణించాడు. ఓ దశలో 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన లంకను మహీశ్‌ తీక్షణ (39) ఆదుకున్నాడు. అతడు చివరి వరకూ నాటౌట్‌గా నిలబడటం వల్లే లంక ఈ మాత్రం స్కోరైనా చేయగల్గింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, ఫెర్గూసన్‌ 2, శాంట్నర్‌ 2, రచిన్ రవీంద్ర 2, సౌథీ ఒక వికెట్ … Read more