Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్‌ స్పెషల్‌ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్‌ స్పెషల్‌ వీడియో

    Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్‌ స్పెషల్‌ వీడియో

    January 8, 2025

    డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్‌ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్‌ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సూచించాడు. ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

    రౌడీ బాయ్‌ ఏం చెప్పాడంటే?

    సైబర్‌ నేరాలు, మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సూచించాడు. తాజాగా రిలీజ్‌ చేసిన వీడియోలో తన ఫ్రెండ్‌కు జరిగిన ఘటనను పంచుకున్నాడు. ‘ఫ్రెండ్‌, శ్రేయోభిలాషి అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు సైతం మెసేజ్‌లు సృష్టిస్తారు. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్ చెక్‌ చేసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడిని కాదు అని చెప్పండి’ అంటూ వీడియోను విజయ్‌ ముగించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమాజానికి ఉపయోగపడే వీడియో చేసినందుకు విజయ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

    ‘VD 14’ క్రేజీ అప్‌డేట్‌..

    టాక్సీవాలాతో బ్లాక్‌ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌తో విజయ్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. VD14 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 1854 – 78 మధ్య కాలంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూవీకి బాలీవుడ్ సంగీత ద్వయం ఎంపికైనట్లు సమాచారం. ఆదిపురుష్‌కు పనిచేసిన అజయ్‌-అతుల్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ సమకూర్చనున్నట్లు ఒక్కసారిగా వార్తలు మెుదలయ్యాయి. ఇక ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

    ‘VD 12’తో విజయ్‌ బిజీ..

    ప్రస్తుతం విజయ్‌.. ‘VD12’ షూటింగ్‌తో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించినా అదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ (హరి హర వీరమల్లు) మూవీ రాబోతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేయబోతున్నట్లు తెలిసింది. విడుదలకు ఎలాగూ సమయం ఉండటంతో షూటింగ్‌ మెల్లగా చేస్తున్నారని టాక్‌. ఫిబ్రవరిలో మొత్తం షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీలంక నేపథ్యంలో మెుత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర నిర్మాత కన్ఫార్మ్‌ చేశారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version