Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!

    Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!

    January 8, 2025

    హైదరాబాద్ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లోనే మాయని మచ్చలాగా మిగిలిపోయింది. బన్నీ రాక నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం (డిసెంబర్‌ 7) సికింద్రాబాద్‌ కిమ్స్‌కు వెళ్లిన బన్నీ ఆంక్షల మధ్య శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఇదిలా ఉంటే మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) సంధ్యా థియేటర్‌ ఘటనపై తొలిసారి స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

    నిహారిక ఏమన్నదంటే..

    కోలీవుడ్‌లో నిహారిక నటించిన ఫస్ట్‌ ఫిల్మ్ ‘మద్రాస్‌ కారన్‌’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరో రెండ్రోజుల్లో జనవరి 10న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. షాన్‌ నిగమ్‌ హీరోగా చేసిన ఈ చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ ఇంటర్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్‌ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సంధ్య థియేటర్‌ ఘటన నన్ను ఎంతో బాధించింది. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరు. మహిళ మృతి చెందడం బాధకరం. ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరికీ జరగకూడదు. తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మరోసారి ఇండస్ట్రీలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవద్దని కోరుకుంటున్నా. ఈ దుర్ఘటన నుంచి అల్లు అర్జున్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. 

    ‘బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా’

    మెగా హీరోల నుంచి ఏమేమి నేర్చుకున్నారన్న ప్రశ్నలకు నిహారిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అల్లు అర్జున్‌ గురించి మాట్లాడుతూ అతడి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు చెప్పింది. ‘అల్లు అర్జున్‌ లుక్స్‌ పరంగా ఎంతో కేరింగ్‌ తీసుకుంటాడు. సినిమా సినిమాకు స్టైల్‌, లుక్‌ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీ నాకు ఇన్‌స్పిరేషన్‌’ అని నిహారిక తెలిపింది. సోదరుడు వరుణ్‌ తేజ్‌ గురించి మాట్లాడుతూ తన ప్రతీ సినిమాకు సైన్‌ చేసే ముందు అతడితో డిస్కస్‌ చేస్తానని చెప్పింది. అటు రామ్‌చరణ్‌తో చాలా సరదాగా ఉంటానని, ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి అన్నది ఆయన్ను చూసి నేర్చుకున్నట్లు నిహారిక చెప్పుకొచ్చింది. 

    నిహారిక.. రొమాంటిక్‌ సాంగ్‌ గుర్తుందా?

    కొద్ది రోజుల క్రితం నెట్టింట హల్‌చల్‌ చేసిన నిహారిక బోల్డ్ రొమాంటిక్‌ సాంగ్‌.. ‘మద్రాస్‌ కారణ్‌’ (Madras Kaaran) సినిమాలోనిదే. మణి రత్నం ‘సఖి’ సినిమాలో మాధవన్‌, షాలిని చేసిన ‘నగిన నగిన’ పాటకు రీమిక్స్‌గా ఆ సాంగ్‌ రూపొందింది. ఇందులో నిహారిక, షాన్‌ నిగమ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్‌ – రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. నిహారిక ఆ స్థాయిలో రొమాన్స్‌ చేయడం అదే తొలిసారి. దీంతో ఆ తమిళ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసించగా ఎక్కువ మంది విమర్శించారు. అందరూ అభిమానించే మెగా ఫ్యామిలీకి ఇలాంటి బోల్డ్‌ సాంగ్‌లో చేయడం ద్వారా నిహారిక తలవొంపులు తెచ్చిందని ట్రోల్స్ చేశారు. 

    కోలీవుడ్‌లో గతంలోనే మెరిసినా నిహారిక..

    ‘మద్రాస్‌ కారణ్‌’ (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ హీరోయిన్‌గా నిహారిక చేస్తోన్న ఫస్ట్‌ తమిళ చిత్రం. అయితే నటిగా మాత్రం ఆమెకు ఇది రెండో ఫిల్మ్‌. నిహారిక గతంలోనే ఓ తమిళ చిత్రంలో నటించింది. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన ‘ఓరు నళ్లనాళ్‌ పాతు సోల్రెన్‌’ చిత్రంలో నిహారిక కనిపించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’ (ప్రొడ్యూసర్‌గా కూడా) చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం ‘మద్రాస్‌ కారణ్‌’తో పాటు తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version