• TFIDB EN
  • నిహారిక కొణిదెల
    జననం : డిసెంబర్ 18 , 1993
    ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తెలుగులో ఒక మనసు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. తాజాగా నిర్మాతగాను మారి కమిటీ కుర్రోళ్లు అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. 2020లో నిహారిక, చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కానీ ఈ జంట వ్యక్తిగత కారణాలతో 2023లో విడిపోయారు.

    నిహారిక కొణిదెల వయసు ఎంత?

    నిహారిక కొణిదెల వయసు 31 సంవత్సరాలు

    నిహారిక కొణిదెల ఎత్తు ఎంత?

    5'6" (168cm)

    నిహారిక కొణిదెల అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, మ్యూజిక్ వినటం

    నిహారిక కొణిదెల ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యూయేషన్‌

    నిహారిక కొణిదెల ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సెయింట్‌ మేరీస్‌ కాలేజ్‌, హైదరాబాద్

    నిహారిక కొణిదెల రిలేషన్‌లో ఉంది ఎవరు?

    డైరెక్టర్‌ ప్రణీత్‌తో నిహారిక రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

    నిహారిక కొణిదెల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    సాయిధరమ్‌ తేజ్‌

    నిహారిక కొణిదెల‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ ఐదు చిత్రాల్లో నిహారిక నటించింది.

    నిహారిక కొణిదెల‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    నాన్న కూచి, ముద్దపప్పు ఆవకాయ్‌, మ్యాడ్‌హౌస్‌, డెడ్‌ పిక్సెల్స్ సిరీస్‌లలో నిహారిక నటించింది. అలాగే గతంలో బుల్లితెరపై 'ఢీ జూనియర్‌' షో హోస్ట్‌గాను పనిచేసింది.

    నిహారిక కొణిదెల Hot Pics

    Images

    Niharika Konidela hot

    Images

    Niharika Konidela outfit

    నిహారిక కొణిదెల In Ethnic Dress

    Images

    Niharika Konidela In Ethnic Wear

    Images

    Niharika Konidela Hot In Ethnic Wear

    నిహారిక కొణిదెల In Saree

    Images

    Niharika Konidela Images in Saree

    Images

    Niharika Konidela Images in Traditional Saree

    నిహారిక కొణిదెల In Half Saree

    Images

    Niharika Konidela Images in Half Saree

    Images

    Niharika Konidela In Half Saree

    నిహారిక కొణిదెల With Pet Dogs

    Images

    Niharika Konidela's Pet

    Images

    Niharika Konidela With Pet

    నిహారిక కొణిదెల Childhood Images

    Images

    Niharika Konidela Childhood Pics

    Images

    Niharika Konidela Images in Childhood with Chiranjeevi

    నిహారిక కొణిదెల అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Niharika Konidela

    Viral Videos

    View post on X

    Niharika Konidela Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Niharika Konidela Hot Insta Reel

    నిహారిక కొణిదెల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నిహారిక కొణిదెల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తెలుగులో ఒక మనసు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ 'నాన్న కూచి' గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. నిహారిక కొణిదెల ఎప్పుడు పుట్టింది? 1993, డిసెంబర్ 18న జన్మించింది నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? ఒక మనసు(2023)  నిహారిక కొణిదెల ఎత్తు ఎంత? 5 అడుగుల 6అంగుళాలు  నిహారిక కొణిదెల ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ నిహారిక కొణిదెల అభిరుచులు? డ్యాన్సింగ్, పాటలు వినడం నిహారికకు పెళ్లి అయిందా?  2020లో నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. కానీ ఈ జంట వ్యక్తిగత కారణాలతో 2023లో విడిపోయారు. నిహారిక కొణిదెలకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్ నిహారిక కొణిదెలకు ఇష్టమైన కలర్ ?  వైట్ నిహారిక కొణిదెలకు ఇష్టమైన హీరో? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నిహారిక కొణిదెల తల్లిదండ్రుల పేర్లు? నాగబాబు, పద్మజ కొణిదెల నిహారిక కొణిదెలకు ఇష్టమైన హీరోయిన్? పూజా హెగ్డే నిహారిక కొణిదెల పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. నిహారిక కొణిదెల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు పలు టీవీ షోల్లో యాంకరింగ్ చేసింది నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/niharikakonidela/ నిహారిక కొణిదెలకు టాటూ ఎక్కడ ఉంది? వీపు వెనుక భాగంలో ఆమె ఇన్సియల్ ఉంటుంది https://www.youtube.com/watch?v=oja4Pks0S80
    ఏప్రిల్ 04 , 2024
    Niharika Konidela: బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన నిహారిక.. వీడియో వైరల్ మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా, నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర ఇండస్ట్రీపై వేసింది. అటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి మంచి మార్కులు కొట్టేసింది. 2020 డిసెంబర్‌లో చైతన్య కృష్ణను వివాహం చేసుకున్న ఆమె కొంతకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గతేడాది జులైలో అతడితో విడిపోవడంతో తిరిగి ఈ అమ్మడి దృష్టి సినిమాలపై పడింది. ఇటీవలే ప్రొడ్యుసర్‌గా మారి 'కమిటీ కుర్రోళ్లు' అనే బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం తీసింది. అటు తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా సైతం నటిస్తోంది. అందులో నిహారిక చేసిన రొమాంటిక్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.  రొమాంటిక్‌ సాంగ్‌లో.. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) అనే చిత్రంలో నిహారిక (Niharika Konidela) నటిస్తోంది. షాన్‌ నిగమ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిహారికతో పాటు ఐశ్వర్య దుత్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైనర్‌ రిలీజ్‌ చేయగా దానికి విశేష స్పందన వచ్చింది. తాజాగా షాన్‌ నిగమ్‌, నిహారిక మధ్య సాగే ఓ రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్‌, షాలిని మధ్య వచ్చే 'నగిన నగిన' పాటను రీమిక్స్‌ చేసి దీన్ని విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో నిహారిక, షాన్‌ నిగమ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్‌ - రొమాంటిక్‌ డ్యాన్స్‌ ఉన్నాయి. నిహారిక ఈ స్థాయిలో రొమాన్స్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ తమిళ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.  https://twitter.com/SivareddE/status/1865713969794806123 నెటిజన్ల మండిపాటు 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) మూవీ సాంగ్‌ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బోల్డ్‌ రొమాంటిక్‌ పాటల్లో నటించి మెగా ఫ్యామిలీ పరువు తీసిందని ఆరోపిస్తున్నారు. గ్లామర్‌ పాత్రలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చక్కగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసి మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావొచ్చు కదా అని సూచిస్తున్నారు. మూడు నిమిషాల సాంగ్‌లోనే ఈ స్థాయిలో గ్లామర్‌ షో చేస్తే ఇక సినిమాలో ఇంకెంత ఎక్స్‌పోజింగ్ ఉంటుందోనని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం నిహారికకు అండగా నిలుస్తున్నారు. దారుణంగా విమర్శించేంత ఎక్స్‌పోజింగ్‌ నిహారిక చేయలేదని మద్దతిస్తున్నారు. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాల్సిన అవసరం ఉంటుందని గుర్తుచేస్తున్నారు.   https://twitter.com/naprapanchamm/status/1865716593709244888 https://twitter.com/Manaki_Enduku_/status/1866059745263484992 గతంలో విజయ్ సేతుపతితో.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నిహారిక చేస్తోన్న ఫస్ట్‌ తమిళ చిత్రం కాదు. ఆమె గతంలో తమిళంలో ఓ చిత్రం చేసింది. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్‌ పాతు సోల్రెన్‌' చిత్రంలో నిహారిక నటించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్‌ కారణ్‌'తో పాటు తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 
    డిసెంబర్ 09 , 2024
    Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్‌’ సిరీస్‌ మెప్పించిందా? నటీనటులు: వైభవ్‌ రెడ్డి, రితికా సింగ్‌, చరణ్‌, ఆకాంక్ష సింగ్‌, నయన్‌ సారిక, రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను తదితరులు రచన, దర్శకత్వం : మానస శర్మ సినిమాటోగ్రఫీ : ధనుష్‌ భాస్కర్‌ సంగీతం : పి.కె. దండి నిర్మాత : నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ: పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఓటీటీ వేదిక: సోనీలివ్‌ విడుదల తేదీ : సెప్టెంబర్‌ 12, 2024 మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కొత్త నటీనటులతో సరికొత్త కథాంశాన్ని తెరెకెక్కించి నిహారిక ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా ఆమె నిర్మించిన వెబ్‌సిరీస్‌ 'బెంచ్‌ లైఫ్‌'పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందడం, ఐటీ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న మానస శర్మ అనే మహిళ డైరెక్షన్‌ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇందులో వైభవ్‌ రెడ్డి, చరణ్‌ పెరి, రితికా సింగ్‌, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. సోనీలివ్‌లో సెప్టెంబర్‌ 12 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? నిహారిక ఖాతాలో మరో సక్సెస్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. మంచి స్నేహితులు కూడా. అదే ఆఫీసులో పని చేసే ఇషా (ఆకాంక్ష సింగ్)ను తొమ్మిదేళ్లుగా బాలు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడు. మరోవైపు మీనాక్షి డైరెక్టర్‌ కావాలని కలలుకంటుంది. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలోనే భార్య (నయన్‌ సారిక), ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రవి గోవా వెళ్లాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకు ముగ్గురు ఫ్రెండ్స్‌ బెంచ్‌ అడుగుతారు. బెంచ్‌ వచ్చిన తర్వాత ఏమైంది? కంపెనీలో ప్రసాద్‌ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్‌) రోల్ ఏంటి? భార్యతో రవికి మనస్ఫర్థలు రావడానికి కారణం ఏంటి? రవి తన ప్రేమను ఇషాకు చెప్పాడా? లేదా? డైరెక్టర్‌ కావాలన్న ఇషా కల ఏమైంది? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే బాలు పాత్రకు నటుడు వైభవ్‌ పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో ఫన్‌ జనరేట్‌ చేశాడు. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్‌ చక్కగా నటించింది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్‌ యువతిగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో హైలెట్‌ అంటే చరణ్‌ పెరి, నయన్‌ సారిక అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి నటనతో పాటు వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మీనాక్షి పాత్రలో రితిక చక్కగా ఒదిగిపోయింది. ఇష్టంలేని జాబ్‌ చేయలేక డైరెక్టర్‌ అయ్యేందుకు కష్టపడే యువతి పాత్రలో ఆమె మెప్పించింది. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకురాలు మానస శర్మ యువతరానికి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రను ఒక అర్థం ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. అయితే రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్‌ మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సహజత్వం కనిపించదు. రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా ప్లస్‌ అయ్యింది. అలాగే రాజేంద్రప్రసాద్ & నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా డైరెక్టర్‌ మానస శర్మ మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వైభవ్‌ నోటి నుంచి వచ్చే బూతులు, ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్‌ అయ్యేలా సిరీస్‌ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ వాతావరణాన్ని చక్కగా ప్రజెంట్‌ చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆర్ట్‌ వర్క్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ వంటి ఇతర విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ప్రధాన తారాగణం నటనడైరెక్షన్‌ స్కిల్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా బోల్డ్‌ డైలాగ్స్‌ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్‌ కావడం Telugu.yousay.tv Rating : 3/5 
    సెప్టెంబర్ 12 , 2024
    Akira Nandan: అకీరా నందన్‌ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్‌ కామెంట్స్‌.. అదేంటి అలా అనేసింది! టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఒకరు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను పవన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పవన్ ఫోకస్‌ మెుత్తం రాజకీయాలపైనే ఉంది. ఈ నేపథ్యంలో అతడి కుమారుడు అకీరా నందన్‌ (Akira Nandan) సినీ రంగ ప్రవేశం చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో అకీరాకు సంబంధించిన ఏ చిన్న ఫొటో లభించినా దానిని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ చేస్తున్నారు. పవన్‌ లుక్స్‌ను అతడిలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఎప్పటికైనా అకీరా ఇండస్ట్రీలో అడుగుపెడతారని ఫ్యాన్స్‌ ధీమాలో ఉన్నారు. అయితే మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) చేసిన లేటెస్ట్‌ కామెంట్స్‌ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. అకీరా నందన్ ఫిల్మ్‌ ఎంట్రీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘ఆ ఆలోచన ఉందని తెలియదు’ మెగా డాటర్‌, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్లోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ అందుకుంది. ఈ సినిమాపై తాజాగా నిర్వహించిన ఇంటర్యూలో అకీరా నందన్‌కు సంబంధించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి అకీరా నందన్‌ ఎంట్రీ ఎప్పుడు ఉందని నిహారికను ఓ జర్నలిస్టు అడిగారు. అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సి వస్తే మీ బ్యానర్‌లో ఆయన డెబ్యూ ఉండొచ్చా? అని ప్రశ్నించారు. దీనికి నిహారిక స్పందిస్తూ ‘అకీరా ఇంకా చిన్న కుర్రాడు. అతడికి సినిమాలోకి వచ్చే ఆలోచన ఉందని తెలియదు. నేను వాడ్ని ఎప్పుడు అడగలేదు. వస్తే కచ్చితంగా చేస్తాను’ అంటూ నిహారిక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.  https://twitter.com/i/status/1833762404749996233 నెటిజన్ల మిశ్రమ స్పందన అకీరా ఎంట్రీపై నిహారిక స్పందన చూసి మెగా అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పవన్‌ వారసత్వం గురించి ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తుంటే నిహారిక మాత్రం తెలియదని సింపుల్‌గా చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ అకీరాను అడగలేదని నిహారిక చెప్పడం సమంజసంగా లేదని అంటున్నారు. అకీరా ఎంట్రీపై ఓ క్లారిటీ సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారిక వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. తెలియనప్పుడు తెలీదు అని చెప్పకుండా ఇంకేమి సమాధానం ఇస్తారని అంటున్నారు. అకీరా సినిమాల్లోకి వస్తే కచ్చితంగా మూవీ చేస్తానంటూ ఆమె చెప్పింది కదా అని గుర్తుచేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక లేటేస్ట్‌ కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.  హీరోగా చూడాలని ఉంది: రేణూ దేశాయ్‌ అకీరా సినీ రంగ ప్రవేశంపై అతడి తల్లి రేణు దేశాయ్‌ గతంలోనే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అకీరాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తిలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నటనకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కూడా అకీరా ఆసక్తి చూపించేవాడు కాదని తేల్చి చెప్పారు. సినిమాల్లోకి రావాలని ఆసక్తి ప్రస్తుతానికి అతడిలో లేదని రేణు దేశాయ్‌ తెలిపారు. అకీరా ఏం కావాలనుకుంటే అతడి ఇష్టమని చెప్పారు. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం దాన్ని బ్యాండ్‌ బాజా భారత్‌ లెవల్లో అనౌన్స్‌ చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు అదే అవుతుందని చెప్పుకొచ్చారు. అకీరాను హీరోగా చూడాలని తనకూ కోరికగా ఉందని మనసులో మాట చెప్పుకొచ్చారు.  అకీరా.. మల్టీ టాలెంటెడ్‌ అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు మల్టీ టాలెంటెడ్‌. ఆటలు, పాటలు, మ్యూజిక్‌ ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. కర్రసాము కూడా అకీరా నేర్చుకున్నాడని సమాచారం. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అటు చదువులో కూడా అకీరా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నట్లు తెలిపారు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో యానిమల్‌ (Animal) సినిమాలోని నాన్న సెంటిమెంట్ ఉన్న సాంగ్‌కు పియానో వాయించాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.  https://twitter.com/i/status/1747251367033577947
    సెప్టెంబర్ 11 , 2024

    నిహారిక కొణిదెల పెంపుడు కుక్క పేరు?

    బజ్‌

    నిహారిక కొణిదెల తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    నిహారిక తండ్రి నాగబాబు.. టాలీవుడ్‌ దిగ్గజ నటులు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు సోదరుడు. నాగబాబుకూడా నటుడిగా 50కి పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా తొమ్మిది చిత్రాలు నిర్మించారు. తల్లి పద్మజ హౌమ్‌ మేకర్‌.

    నిహారిక కొణిదెల‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    టాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌.. నిహారికకు సోదరుడు అవుతాడు. మెగా హీరోలు రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరిష్‌ కజిన్స్ అవుతారు.

    నిహారిక కొణిదెల పెళ్లి ఎప్పుడు అయింది?

    ఐపీఎస్‌ అధికారి కొడుకు చైతన్య జొన్నలగడ్డను నిహారిక 9 డిసెంబర్‌ 2020న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల 2023లో ఈ జంట విడాకులు తీసుకుంది.

    నిహారిక కొణిదెల Family Pictures

    Images

    Niharika Konidela Family

    Images

    Niharika Family

    నిహారిక కొణిదెల ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    స్టార్‌ హీరోలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లకు మేనకోడలు కావడం వల్ల నిహారిక చాలా పాపులర్‌ అయ్యింది.

    నిహారిక కొణిదెల లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ఒక మనసు చిత్రంతో నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నిహారిక కొణిదెల తొలి చిత్రం ఏది?

    సైరా నరసింహా రెడ్డి' (ఇందులో నిహారిక గెస్ట్‌ రోల్‌ చేసింది)

    నిహారిక కొణిదెల కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఒక మనసు' చిత్రంలో సంధ్యా పాత్ర

    నిహారిక కొణిదెల బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    నిహారిక కొణిదెల బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    నిహారిక కొణిదెల రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన నటి ఎవరు?

    నిహారిక కొణిదెల ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    నిహారిక కొణిదెల ఫెవరెట్ సినిమా ఏది?

    నిహారిక కొణిదెల ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    నిహారిక కొణిదెల ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నిహారిక కొణిదెల ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    నిహారిక కొణిదెల కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    బ్యాంకాక్‌

    నిహారిక కొణిదెల ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    నిహారిక ఆస్తుల విలువ రూ.30 కోట్ల వరకూ ఉంటుంది.

    నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.3 మిలియన్లు

    నిహారిక కొణిదెల సోషల్‌ మీడియా లింక్స్‌

    నిహారిక కొణిదెలపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    2022 హైదరాబాద్ డ్రగ్స్‌ కేసులో నిహారిక పేరు బయటకు రావడం వివాదానికి కారణమైంది.

    నిహారిక కొణిదెల కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    నిహారిక సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగాను వ్యవహరిస్తోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మ్యాడ్‌ హౌస్‌, హెల్లో వరల్డ్‌ సిరీస్‌లను ఆమె నిర్మించింది.

    నిహారిక కొణిదెల కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    నిహారిక కొణిదెల.. తన బాబాయ్ పవన్‌ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు ఇస్తోంది. ఆ పార్టీలో ఆమె తండ్రి నాగబాబుక్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
    నిహారిక కొణిదెల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నిహారిక కొణిదెల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree