మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా, నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర ఇండస్ట్రీపై వేసింది. అటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి మంచి మార్కులు కొట్టేసింది. 2020 డిసెంబర్‌లో చైతన్య కృష్ణను వివాహం చేసుకున్న ఆమె కొంతకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గతేడాది జులైలో అతడితో విడిపోవడంతో తిరిగి ఈ అమ్మడి దృష్టి సినిమాలపై పడింది. ఇటీవలే ప్రొడ్యుసర్‌గా మారి ‘కమిటీ కుర్రోళ్లు‘ అనే బ్లాక్ బాస్టర్ చిత్రం తీసింది. అటు తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా సైతం నటిస్తోంది. అందులో నిహారిక చేసిన రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రొమాంటిక్ సాంగ్‌లో..
ప్రస్తుతం తమిళంలో ‘మద్రాస్ కారణ్’ (Madras Kaaran) అనే చిత్రంలో నిహారిక (Niharika Konidela) నటిస్తోంది. షాన్ నిగమ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిహారికతో పాటు ఐశ్వర్య దుత్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైనర్ రిలీజ్ చేయగా దానికి విశేష స్పందన వచ్చింది. తాజాగా షాన్ నిగమ్, నిహారిక మధ్య సాగే ఓ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మణి రత్నం ‘సఖి‘ సినిమాలో మాధవన్, షాలిని మధ్య వచ్చే ‘నగిన నగిన’ పాటను రీమిక్స్ చేసి దీన్ని విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో నిహారిక, షాన్ నిగమ్ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్ – రొమాంటిక్ డ్యాన్స్ ఉన్నాయి. నిహారిక ఈ స్థాయిలో రొమాన్స్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ తమిళ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
నెటిజన్ల మండిపాటు
‘మద్రాస్ కారణ్’ (Madras Kaaran) మూవీ సాంగ్ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బోల్డ్ రొమాంటిక్ పాటల్లో నటించి మెగా ఫ్యామిలీ పరువు తీసిందని ఆరోపిస్తున్నారు. గ్లామర్ పాత్రలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చక్కగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావొచ్చు కదా అని సూచిస్తున్నారు. మూడు నిమిషాల సాంగ్‌లోనే ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే ఇక సినిమాలో ఇంకెంత ఎక్స్‌పోజింగ్ ఉంటుందోనని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం నిహారికకు అండగా నిలుస్తున్నారు. దారుణంగా విమర్శించేంత ఎక్స్‌పోజింగ్ నిహారిక చేయలేదని మద్దతిస్తున్నారు. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాల్సిన అవసరం ఉంటుందని గుర్తుచేస్తున్నారు.
గతంలో విజయ్ సేతుపతితో..
‘మద్రాస్ కారణ్’ (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నిహారిక చేస్తోన్న ఫస్ట్ తమిళ చిత్రం కాదు. ఆమె గతంలో తమిళంలో ఓ చిత్రం చేసింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన ‘ఓరు నళ్లనాళ్ పాతు సోల్రెన్’ చిత్రంలో నిహారిక నటించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్’, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం ‘మద్రాస్ కారణ్’తో పాటు తెలుగులో ‘వాట్ ద ఫిష్’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!