• TFIDB EN
  • డార్లింగ్
    UATelugu
    రాఘవ్‌ (ప్రియదర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్‌ అంటూ కలలు కంటాడు. భార్యను తీసుకొని హనీమూన్‌కు పారిస్‌ వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ‌అతడి లైఫ్‌లోకి మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆనంది (నభా నటేష్‌) వస్తుంది. ఆమెతో రాఘవ్‌ ఎన్ని తిప్పలు పడ్డాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 Aug 134 months ago
    డార్లింగ్ చిత్రం ఆగస్టు 13నుంచి డిస్నీ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
    రివ్యూస్
    YouSay Review

    Darling Movie Review: ప్రియదర్శిని ఓ ఆట ఆడుకున్న లేడీ అపరిచితురాలు.. మరి ‘డార్లింగ్‌’ మెప్పించిందా?

    ప్రియదర్శి (Priyadarsi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్' (Darling Movie Review In T...read more

    How was the movie?

    తారాగణం
    ప్రియదర్శి పులికొండ
    నభా నటేష్
    అనన్య నాగళ్ల
    బ్రహ్మానందం
    మురళీధర్ గౌడ్
    రఘు బాబు
    విష్ణు Oi
    డి కృష్ణ తేజ
    సిబ్బంది
    అస్విన్ రామ్దర్శకుడు
    కె నిరంజన్ రెడ్డినిర్మాత
    చైతన్య రెడ్డినిర్మాత
    వివేక్ సాగర్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;</strong>
    HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్‌ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్‌ 23) ప్రభాస్‌ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్‌ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం. చదువులో యావరేజ్‌&nbsp; ప్రభాస్‌ చదువు పరంగా యావరేజ్‌ స్టూడెంట్‌. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్‌ పిరియడ్‌ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు. మతిమరుపు ఎక్కువ ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్‌ డేస్‌ నుంచి తన ఫ్రెండ్స్‌ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.&nbsp; ‘నువ్వు హీరో ఏంట్రా’ కెరీర్‌ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్‌ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్‌ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్‌ తీసుకున్నాక 'ఈశ్వర్‌' ఆఫర్‌ వచ్చింది.&nbsp; డార్లింగ్‌ పిలుపుకు కారణం ఇదే ప్రభాస్‌ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్‌ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్‌ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్‌ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్‌ సినిమా కూడా రావడం గమనార్హం. అతిథి పాత్రలు రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హిందీలో వచ్చిన 'యాక్షన్‌ జాక్సన్‌' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం గమనార్హం.&nbsp; పెదనాన్నతో రెండు చిత్రాలు దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్‌’ వంటి చిత్రాల్లో ప్రభాస్‌ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు. ముచ్చటగా మూడుసార్లు ప్రభాస్‌ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్‌ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.&nbsp; తొలి దక్షిణాది హీరో ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్‌ గుర్తింపు పొందాడు. ప్రభాస్‌ తర్వాత టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రీసెంట్‌గా రామ్‌చరణ్‌ ఈ ఘనత సాధించారు.&nbsp; నటుడు కాకుంటే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో వర్క్‌ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్‌ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్‌ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>Darling Movie Review: ప్రియదర్శిని ఓ ఆట ఆడుకున్న లేడీ అపరిచితురాలు.. మరి ‘డార్లింగ్‌’ మెప్పించిందా?</strong>
    Darling Movie Review: ప్రియదర్శిని ఓ ఆట ఆడుకున్న లేడీ అపరిచితురాలు.. మరి ‘డార్లింగ్‌’ మెప్పించిందా?
    న‌టీన‌టులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ రామ్‌ సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై మాట‌లు: హేమంత్‌ నిర్మాత‌లు:&nbsp; కె.నిరంజ‌న్ రెడ్డి, చైత‌న్య రెడ్డి విడుద‌ల తేదీ: 19-07-2024 ప్రియదర్శి (Priyadarsi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్' (Darling Movie Review In Telugu). ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జూలై 19న ‘డార్లింగ్‌’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రాఘవ్‌ (ప్రియ దర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్‌ అంటూ కలలు కంటాడు. అందుకోసం కష్టపడి ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్‌గా సెటిల్ అవుతాడు. తండ్రి (మురళీధర్‌ గౌడ్‌) చూసిన సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవ్వగా చివర క్షణంలో ఆమె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో రాఘవ సూసైడ్‌కు రెడీ అవుతాడు. ఆ సమయంలోనే రాఘవకు ఆనంది (నభా నటేష్‌) పరిచయమవుతుంది. చూసిన కొద్ది నిమిషాలకే నచ్చేయడం, ఆ విషయం ఆమెకు చెప్పడం, ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. అయితే ఆనందికి మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉందని శోభనం రోజున రాఘవ్‌కు తెలుస్తుంది. దీని వల్ల రాఘవ్‌ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఆనందిలో ఉన్న ఐదు పర్సనాలిటీస్‌ (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ) ఎవరు? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఎవరెలా చేశారంటే రాఘ‌వ పాత్ర‌లో హాస్య నటుడు ప్రియ‌ద‌ర్శి మరోమారు ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో&nbsp; ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. కథానాయిక నభా నటేష్‌ విభిన్నైన కోణాలున్న పాత్రలో అదరగొట్టింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో మెప్పించింది. స్ప్లిట్‌ పాత్ర‌ల్లోని వేరియేష‌న్స్‌ను త‌న‌దైన న‌ట‌న‌తో చ‌క్క‌గా చూపించింది. నభా నటేష్‌, ప్రియద‌ర్శి మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి, అయితే నభా నటేష్‌ పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ అంత‌గా కుద‌ర్లేద‌నిపిస్తుంది. అటు అన‌న్య నాగ‌ళ్ల‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. సుహాస్‌, బ్ర‌హ్మానందం, నిహారిక కొణిదెల త‌దిత‌రులు అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కుమ‌న్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ కాన్సెప్ట్‌ను దర్శకుడు అశ్విన్‌ రామ్‌ వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. తొలి భాగం అంతా పెళ్లి కోసం హీరో పడే పాట్లు, పీటలపై పెళ్లి ఆగిపోవడం, ఆత్మహత్యకు యత్నించడం, ఆనందితో పరిచయం ఏర్పడటం, ఆపై వివాహం కూడా చేసుకోవడం అంతా చకచకా ఫన్నీ వేలో జరిగిపోతాయి. తొలి భాగంలో ఓవైపు నవ్విస్తూనే ఆడియన్స్ థ్రిల్‌ను సైతం పంచారు దర్శకుడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్టోరీ డల్‌ అయినట్లు అనిపిస్తుంది. పేలవమైన హీరోయిన్‌ గతం, కథంతా ఒకే దగ్గర తిరుగుతుంటం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ విషయంలోనూ డైరెక్టర్ బాగా కన్ఫ్యూజ్‌ చేసేశారు. ఓవరాల్‌గా సినిమాలో కొత్తదనం ఉన్నా ఆద్యంతం అలరించడంలో మాత్రం దర్శకుడు అశ్విన్‌ రామ్ తడబడ్డాడని చెప్పవచ్చు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక వివేక్‌ సాగర్‌ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు వియషంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రియదర్శి, నభా నటేష్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌స్క్రీన్‌ప్లేసంగీతం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 19 , 2024
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఎంతో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.&nbsp; ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు&nbsp; మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు&nbsp; ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్&nbsp; ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే? పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత&nbsp; రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా&nbsp; ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్&nbsp; తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం&nbsp; ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్‌కు బిగ్‌ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ... ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. శరవేగంగా షూటింగ్ ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్‌గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్‌ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు&nbsp; కన్నప్ప గెటప్‌లో&nbsp; విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్‌లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు. టీజర్ డేట్ ఫిక్స్ కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్‌ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మార్చారు. ఈ చిత్రం టీజర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
    మే 15 , 2024
    వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్‌ కమింగ్  సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
    వచ్చే రెండెళ్లలో ప్రభాస్ అప్‌ కమింగ్ సినిమాలు ఇవే.. తొలిసారి పోలీస్ ఆఫిసర్‌గా ప్రభాస్
    ]ప్రస్తుతం డార్లింగ్ చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో 2024లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో కూడా పఠాన్ తరహా యాక్షన్ ఉంటే&nbsp; ఆ ఏడాది ఊపేస్తుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?</strong>
    Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 23న స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. తాము ఎక్స్‌పెక్ట్‌ చేసిన స్థాయిలో పోస్టర్‌ లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉందంటే? ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు మారుతి (Director Maruti) తెరకెక్కిస్తున్న 'ది రాజాసాబ్‌' (The Raja Saab) చిత్రంలో మాళవికా మోహనన్‌ (Malavika Mohanan), నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal), రిద్ధి కుమార్‌ (Riddhi Kumar) హీరోయిన్లుగా చేస్తున్నారు. బుధవారం ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెషల్‌ వీడియోతో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ప్రభాస్‌ సింహాసనం మీద నోటిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌కు గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. https://twitter.com/rajasaabmovie/status/1849400931978240114 అదేం పోస్టర్‌ అంటూ ట్రోల్స్‌! రాజాసాబ్‌ తాజా పోస్టర్ చూసి తాము తీవ్రంగా డిజప్పాయింట్‌ అయినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌ నోట్లో సిగర్ పెట్టుకొని ఉన్న పోస్టర్‌ను ‘సై’ సినిమాలోని బిక్షు యాదవ్‌తో పోలుస్తున్నారు. బర్త్‌డే రోజున ఇలాంటి పోస్టర్‌ రిలీజ్‌ చేసి రాజాసాబ్‌ టీమే ప్రభాస్‌ను ట్రోల్‌ చేసిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్‌ లుక్‌కు కాంపిటీషన్ ఇచ్చేలా ప్రభాస్‌ పోస్టర్ ఉందని మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు. మోషన్‌ వీడియోలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చాలా పూర్‌గా ఉందని, సడెన్‌గా చూసి ఫ్యాన్ మేడ్‌ అనుకున్నానని ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రభాస్‌ను ఇలా ఒక్క పోస్టర్‌ గురించి ట్రోల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభాస్‌ను టార్గెట్‌ చేస్తున్న వారికి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ దీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రభాస్‌ సక్సెస్‌ను తట్టుకోలేకనే ఇలా ట్రోల్స్‌ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.&nbsp; https://twitter.com/apashyam_kiriki/status/1849072391244091807 https://twitter.com/globalstar_ntr/status/1849035870319362545 https://twitter.com/RavirockzNTR/status/1849018605377348020 https://twitter.com/Niteesh__09/status/1849012939560264070 పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జోరు ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.  250 రోజులపాటు ట్రెండింగ్‌ మరోవైపు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన 'సలార్‌' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చి అదరగొట్టింది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకొని హాట్‌స్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. 250 రోజుల పాటు వరుసగా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచినట్లు పేర్కొంది. దీంతో ప్రభాస్‌ దూకుడు ఓటీటీలోనూ కొనసాగుతోందంటూ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సలార్‌ను హై వోల్టేజ్‌ చిత్రంగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సినిమాను నింపేశారు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. https://twitter.com/DisneyPlusHS/status/1849068031244402840
    అక్టోబర్ 24 , 2024
    <strong>The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!</strong>
    The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్‌’ సినిమా నుంచి ఓ రొమాంటిక్‌ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; లేటెస్ట్ అప్‌డేట్‌ అదుర్స్‌ ప్రభాస్‌ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్‌ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్‌ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్‌ ట్రీట్‌ (టీజర్‌/ట్రైలర్‌ రిలీజ్‌) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్‌ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌ వింటేజ్‌ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్‌ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్‌ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న 'రాజా సాబ్‌' రిలీజ్‌ కానుంది. రాజా సాబ్‌ ఫొటో లీక్‌! రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్‌’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రిలీజ్‌ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్‌గా చూపిస్తుండటంతో ఈ హైప్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్‌ లాంగ్‌ హెయిర్‌తో ఫుల్‌ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్‌ రిద్ది కుమార్‌ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్‌ సందర్భంగా మానిటర్‌ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్‌ చేసినట్లు కనిపిస్తోంది.&nbsp; https://twitter.com/Baahubali230/status/1848209164553814057 రీ-రిలీజ్‌ల సందడి మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్‌ చేసి స్పెషల్‌ షోస్‌ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్‌’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘మిర్చి’, ‘రెబల్‌’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్‌ చేస్తున్నారు.&nbsp; భారీ ధరకు మ్యూజిక్ రైట్స్‌ రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్‌ రాజాసాబ్‌ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్‌ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు! ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    <strong>Viswam Movie: గోపిచంద్‌ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!&nbsp;</strong>
    Viswam Movie: గోపిచంద్‌ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!&nbsp;
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) హవా నడుస్తోంది. డార్లింగ్‌ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ పేరు దేశంలో మారుమోగుతోంది. ఇండియన్‌ ఫిల్మ్‌ లవర్స్‌ ప్రభాస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ నుంచి సౌత్‌ వరకూ ప్రభాస్‌ నామస్మరణలతో ఇండస్ట్రీలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్‌చల్‌ చేస్తోంది. తన మిత్రుడు గోపిచంద్‌ కోసం ప్రభాస్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ప్రభాస్‌తో ఎలివేషన్స్‌! మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ (Gopichand) హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ (Prabhas) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ ఈ సినిమా భాగస్వామ్యం అవ్వడం నిజమేనని తెలుస్తోంది. అయితే వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం ద్వారా ప్రభాస్‌ ఈ మూవీలో పాలుపంచుకుంటాడని టాక్‌ వినిపిస్తోంది. గోపిచంద్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌కు ప్రభాస్‌ తన వాయిస్‌తో ఎలివేషన్‌ ఇస్తాడని అంటున్నారు. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఓ సినిమాలో ఇలా వాయిస్‌ ఓవర్‌ ఇవ్వలేదు. స్నేహితుడైన గోపిచంద్‌ కోసమే ప్రభాస్‌ ఇందుకు ఓకే చెప్పినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌, గోపిచంద్‌ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా! హీరో గోపిచంద్‌ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన గత చిత్రాలు ఆయన నటించిన గత నాలుగు చిత్రాలు భీమా, రామబాణం, పక్కా కమర్షియల్‌, ఆరడుగుల బుల్లెట్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో గోపిచంద్‌కు సక్సెస్‌ తప్పనిసరిగా మారింది. అటు దర్శకుడు శ్రీను వైట్ల సైతం ఒకప్పటిలా బ్లాక్‌బాస్టర్స్‌ ఇవ్వలేకపోతున్నాడు. 2011లో వచ్చిన 'దూకుడు' తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకూ శ్రీను వైట్లకు రాలేదు. దీంతో అతడు కూడా 'విశ్వం' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ప్రభాస్‌ను సినిమాలో భాగం చేయడం ద్వారా 'విశ్వం'పై హైప్‌ తీసుకురావాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను సంప్రదించి అతడి ద్వారా హీరోకు ఎలివేషన్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందో? లేదో? చూడాలి.&nbsp; ఆఫ్‌ స్క్రీన్‌ ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ గోపిచంద్‌ ఎంత మంచి మిత్రులో ఇండస్ట్రీ మెుత్తం తెలుసు. ‘వర్షం’ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు తొలిసారి కలిసి నటించారు. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తే గోపిచంద్‌ విలన్‌గా అలరించారు. అప్పటి నుంచి వీరి స్నేహం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఆహా వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్‌ షోలో వీరిద్దరు పాల్గొని హోస్ట్‌ బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరిద్దరిని తొలిసారి ఒక షోలో చూసి ఫ్యాన్స్‌ తెగ ఖుషి అయ్యారు. ప్రభాస్‌, గోపిచంద్‌ మంచి ఫ్రెండ్స్‌ అని తెలుసుగానీ, మరి ఈ స్థాయి బెస్ట్ ఫ్రెండ్స్‌ అని ఈ ఎపిసోడ్‌ తర్వాతనే తెలిసిందని చాలా మంది నెటిజన్లు పోస్టులు సైతం పెట్టారు.&nbsp; https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA ‘విశ్వం’ రిలీజ్ ఎప్పుడంటే? గోపిచంద్‌, శ్రీను వైట్ల కాంబోలో వస్తోన్న 'విశ్వం' చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్‌ (Kavya Thapar) నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా పూర్తైనట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. గతంలో రంజాన్‌ కానుకగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=1LoKTtrxjmM
    జూలై 16 , 2024
    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ
    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ
    పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన పుష్ప 2  సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమా విజయానికి ప్రధాన కారకులు దర్శకుడు. నాకు పేరు వచ్చినా, ఇతర నటీనటులు గుర్తింపు పొందినా ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌కు చెందుతుంది. నా పాత్రకు ఎంత ప్రశంసలు వచ్చినా, అవన్నీ ఆయన చేసిన డిజైన్ వల్లనే సాధ్యమయ్యాయి,” అని చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఆసక్తికరంగా మాట్లాడుతూ, “ఈ రోజు ఇక్కడ నేను ఉండగలగడం సుకుమార్ గారి ప్రేమ కారణం. ఇంతకంటే నేను మరేం చెప్పగలను? డార్లింగ్” అంటూ సుకుమార్‌ను ప్రశంసించారు. ఇక తన ప్రసంగంలో అల్లు అర్జున్, “నాకు సినిమా కలెక్షన్ల గురించిపెద్దగా నంబర్లు గుర్తులేవు. కానీ ఈ సినిమా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మామయ్యకు కృతజ్ఞతలు అల్లు అర్జున్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, “మా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు,” అని అన్నారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలిపారు. “సినీ పరిశ్రమపై మీ ప్రేమ ఎప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది,” అని కొనియాడారు. ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రస్తావిస్తూ, “ఈ ప్రత్యేక జీవోకి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. పర్సనల్‌గా కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్యూ సో మచ్!” అంటూ చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలతో కొన్ని రోజులుగా అల్లు Vs మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్‌కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇది వివాదం!&nbsp; గత కొంతకాలంగా అల్లు అర్జున్ అభిమానులు – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని కోరగా, “చెప్పను బ్రదర్,” అని చెప్పిన అల్లు అర్జున్ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఇక ఇటీవలే ఏపీ  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి పర్సనల్‌గా వెళ్లి అల్లు అర్జున్  మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మరింత పెరిగింది. ఫ్యాన్స్‌కు బన్నీ సందేశం అయితే ఇప్పుడు సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ పేరు స్పెషల్‌గా ప్రస్తావిస్తూ “కళ్యాణ్ బాబాయ్” అని చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలకు తావులేదనే విషయాన్ని అభిమానుల్లోకి స్పష్టంగా తీసుకెళ్తుందని&nbsp; పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని మాటల వలన అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువయ్యాయి. కానీ ఈ సక్సెస్ మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనసును దోచుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమా టీమ్‌కి, తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పిన అల్లు అర్జున్, టికెట్ ధరల పెంపు నిర్ణయంపై కూడా అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వివాదాలకు ఎప్పటికైనా ముగింపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బన్నీ చేసిన కామెంట్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీసి వివాదాలు తగ్గుతాయని అంతా ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే, పుష్ప విజయాన్ని మించిపోయేలా బన్నీ మాటలు అభిమానుల హృదయాలను దోచుకున్నాయి.
    డిసెంబర్ 07 , 2024
    <strong>Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!</strong>
    Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!
    దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కచ్చితంగా టాప్‌ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు ప్రభాస్‌. నిలకడగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఏ కథనాయకుడికి అందనంత ఎత్తులో డార్లింగ్‌ నిలిచాడు. అటువంటి ప్రభాస్‌కు ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం లభించనున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. సమగ్ర సమాచారంతో డాక్యుమెంటరీ! ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) ప్రభాస్‌ డాక్యుమెంటరీని ప్లాన్‌ చేస్తున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరుకు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో డాక్యుమెంటరీ బృందం మాట్లాడనుందట. అలాగే ప్రభాస్‌తో చేసిన నటులు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అభియాలను కూడా వీడియోల రూపంలో సేకరించనుందట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ డాక్యుమెంటరీపై ఇప్పటినుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది.&nbsp; రాజమౌళిపై సైతం దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ సైతం ఓ డాక్యుమెంటరీ చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఆగస్టు 2 నుంచి దీనిని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పని విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో కూడా ఫన్నీగా తెలియజేశారు. అటు రాజమౌళి భార్య రమా రాజమౌళి, సంగీతం దర్శకుడు కీరవాణి సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజమౌళి సినిమాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.&nbsp; ప్రభాస్‌కు విలన్‌గా గోపిచంద్‌! ప్రభాస్‌, గోపిచంద్‌ మధ్య మంచి ప్రెండ్‌షిప్‌ ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చేసిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల విశ్వం మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా గోపిచంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు విలన్‌గా చేసే ఛాన్స్‌ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే గోపిచంద్‌ మాత్రం తన నిర్ణయాన్ని తెలియజేయలేదని టాక్‌. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.&nbsp; ప్రభాస్‌ బర్త్‌డే కానుక ప్రభాస్‌ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్‌’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్‌ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్‌ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్‌ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్‌’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్‌ చేసి రిలీజ్‌ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌’ అంటూ వదిలిన ‘ఈశ్వర్‌’ ట్రైలర్‌ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.&nbsp; https://www.youtube.com/watch?v=gTA9ghC4ehs
    అక్టోబర్ 15 , 2024
    <strong>Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!</strong>
    Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్‌ మైథాలజీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్‌, హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం కూడా ‘కల్కి’ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విషయంలో డార్లింగ్‌ ప్రభాస్‌ను మెగాస్టార్‌ ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.&nbsp; ‘కల్కి’ బాటలో ‘విశ్వంభర’! ప్రభాస్‌ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఏకంగా 16 భారీ సెట్లు వేయించారు. సీజీ వర్క్‌ అని తెలియకుండా ఈ సెట్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆడియన్స్‌కు అద్భుతమైన ఐ ఫీస్ట్‌ను అందించాయి. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీమ్‌ కూడా ‘కల్కి’ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ మూవీ కోసం కొత్త లోకాన్నే సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8 భారీ సెట్స్‌ వేశారని టాక్‌. మరో 4 సెట్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ అద్భుతమైన సెట్స్‌ వేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెటప్‌ను నిర్మిస్తున్నారు.&nbsp; కల్కి తర్వాత విశ్వంభరే టాప్‌! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో భారీ ఎత్తున సెట్లు వేసిన చిత్రం విశ్వంభరేనని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కూడా కల్కి స్థాయిలో విజువల్‌ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. అటు మెగాస్టార్‌ చిరంజీవి సైతం కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. హీరో ప్రభాస్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అలరిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోను మెగాస్టార్‌ చిరు స్వయంగా పంచుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ‘విశ్వంభర’ కోసం చిరు ఎంత డెడికేషన్‌తో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది.&nbsp; మెగాస్టార్ అసంతృప్తి లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'విశ్వంభర' సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌ ఫుటేజీని తాజాగా చిరు పరిశీలించినట్లు సమాచారం. అంతా బాగానే ఉన్న కొన్ని సీన్లపై చిరు అభ్యంతరం వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది. కథ నుంచి ఆ సన్నివేశాలు డీవియేట్‌ అవుతున్నట్లు ఆయన భావించారట. దర్శకుడు వశిష్టకు కొన్ని మార్పులను సైతం సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా సన్నివేశాలకు సంబంధించి రీషూట్‌ జరిగే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. రీ షూటింగ్ ప్రభావంతో విడుదల తేదీలో ఏమైనా మార్పులు వస్తాయా అన్న అనుమానం కలుగుతోంది.&nbsp; విలన్‌గా బాలీవుడ్‌ నటుడు ‘విశ్వంభర’లో చిరుకు విలన్‌గా బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌ నటిస్తున్నాడు. అతడు గతంలో నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్‌’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్నాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్‌ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. తను నటించే మరో చిత్రంలోని పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో ‘విశ్వంభర’కు నో చెప్పాడని సమాచారం. ఇక కునాల్‌ కపూర్‌తో ఇప్పటికే కొన్ని సీన్స్‌ కూడా చిత్రీకరించారట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. View this post on Instagram A post shared by Kunal Kapoor (@kunalkkapoor)
    ఆగస్టు 03 , 2024
    <strong>The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?</strong>
    The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?
    వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ఫ్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్‌ చిత్రం రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డెట్‌ను&nbsp; ఈరోజు సాయంత్రం 5.03 గంటలకు చిత్ర బృందం రివీల్ చేసింది. గ్లింప్స్‌ ఎలా ఉందంటే? &nbsp;కలర్‌ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైక్‌పై వచ్చిన&nbsp; ప్రభాస్ లుక్ అదిరిపోయింది.&nbsp; డార్లింగ్ గెటప్‌లో ప్రభాస్ హ్యండ్సమ్‌గా కనిపించారు. ప్లవర్ బొకేతో బైక్ దిగి మెస్మరైజ్ చేశాడు. బొకేలోని ప్లవర్స్‌ తెంపి ఓ కారు అద్దంలో తన అందం చూసుకుంటూ దిష్టి తీసుకోవడం అదిరిపోయింది. https://www.youtube.com/watch?v=YFZMBqyXkqQ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన కంటెంట్‌పై ఫోకస్ పెడుతూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. సలార్, కల్కి2898ఏడి విజయాలతో ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. కల్కి చిత్రం రూ. 1100 కోట్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ హరర్‌ జనర్‌లో.. కల్కి సక్సెస్‌ నుంచి బయటకు వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్‌ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కల్కి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న స్పిరిట్‌లో నటించాల్సి ఉండగా.. ప్రభాస్ చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్, కాస్త వాటికి విరామం ఇచ్చి రొమాంటిక్&nbsp; జనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కల్కి తర్వాత రాజా సాబ్ చిత్రాన్నే తొలుత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం రొమాంటిక్ హరర్‌ జనర్‌లో తెరకెక్కుతోంది. సాయంత్రం 5 గంటలకు సర్‌ప్రైజ్ ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను,&nbsp; అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రాజా సాబ్‌ సినిమాకు సంబంధించిన&nbsp; గ్లింప్స్ ను సోమవారం (జులై 29 ) సాయంత్రం 5:03 గంటలకి రిలీజ్ చేసి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. గ్లింప్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హ్యాండ్సమ్ లుక్ బాగుందని పోస్ట్‌ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా సూపర్బ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp; ఆ హిందీ సాంగ్ రీమిక్స్ 'రాజా సాబ్‌' (Raja Saab) చిత్రంలో ఒకప్పటి సూపర్ హిట్‌ హిందీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో.. మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు ఉన్నాయి.‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పనులను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    జూలై 29 , 2024
    <strong>This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!</strong>
    This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!
    ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు డార్లింగ్‌ ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామం రాఘవం కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్‌గా మారి చేసిన ద్విభాషా చిత్రం 'రామం రాఘవం' (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్‌రాజ్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; పేక మేడలు హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్‌ వర్రే అన్నారు.&nbsp; క్రైమ్‌ రీల్‌ సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateWanda RuseSeriesEnglishNetflixJuly 15T・P BONSeriesJapaneseNetflixJuly 17The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18BahishkaranaSeriesTeluguZee 5July 19BarzakhSeriesHindiZee 5July 19HotspotMovieTelugu DubAhaJuly 17My Spy: The Eternal CityMovieEnglishAmazon&nbsp;July 18Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon&nbsp;July 19
    జూలై 15 , 2024
    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
    Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్‌ తీసుకొచ్చిన ప్రభాస్‌.. అసలు ఏం జరిగిందంటే?
    టాలీవుడ్‌ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల ‘సలార్‌’ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ అందుకున్న డార్లింగ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మరోమారు తన సత్తా ఎంటో చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ప్రభాస్‌ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పెళ్లికి సంబంధించి గతంలో పలుమార్లు రూమర్లు సైతం వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్‌ పెట్టిన ఓ పోస్టు.. అతడి పెళ్లిపై మళ్లీ చర్చను లేవనెత్తాయి.&nbsp; ‘ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు’ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. అయితే లేటెస్ట్‌గా ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వ్యక్తి గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆ ప్రత్యేక వ్యక్తి ప్రభాస్‌ మనసుకు నచ్చిన యువతి అయ్యి ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.&nbsp; అసలు నిజం ఇదే! ప్రస్తుతం ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ (Nag Ashwin).. ఈ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు టీజర్‌ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్‌ బచ్చన్‌ చేసిన అశ్వద్థామ పాత్రను రివీల్‌ చేశారు. అలాగే కమల్‌ హాసన్‌ రోల్‌ను కూడా గ్లింప్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. దీనిని ఉద్దేశించే ప్రభాస్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు సమాచారం. కల్కి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే డార్లింగ్‌ లేటెస్ట్‌ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.&nbsp; కమల్‌ అంటే చాలా ఇష్టం ప్రభాస్‌ ఫేవరేట్‌ హీరోల్లో దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ ముందు వరుసలో ఉంటారు. కమల్‌పై తనకున్న అభిమానం గురించి డార్లింగ్‌ ఇప్పటికే చాలా సార్లు తెలియజేశారు. కమల్‌.. కల్కి సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు. ‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.&nbsp; నెలాఖరులో ఫస్ట్‌ సింగిల్‌! కల్కి 2898 ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా మ్యూజికల్‌ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ సరిగమ సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు త్వరలో ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ కూడా విడుదల చేయనున్నట్లు హింట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరులో దానిని రిలీజ్‌ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.&nbsp;
    మే 17 , 2024
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కాజల్ అగర్వాల్ ఎవరు? కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్? కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్&nbsp; వయస్సు ఎంత? కాజల్ అగర్వాల్&nbsp; 1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 38 సంవత్సరాలు&nbsp; కాజల్ అగర్వాల్&nbsp; మందన్న ముద్దు పేరు? కాజు కాజల్ అగర్వాల్&nbsp; మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; కాజల్ అగర్వాల్&nbsp; ఎక్కడ పుట్టింది? ముంబాయి కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా? 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు? కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు? వైట్, రెడ్, బ్లూ కాజల్ అగర్వాల్‌ అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? ఎగ్స్, తియ్యని పండ్లు కాజల్ అగర్వాల్‌ అభిమాన నటుడు? జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్‌ తొలి సినిమా? లక్ష్మి కళ్యాణం(2007) కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు? మగధీర, బృందావనం, డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ ఏం చదివింది? మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది కాజల్ అగర్వాల్‌ పారితోషికం ఎంత? కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కాజల్ అగర్వాల్‌ తల్లిదండ్రుల పేర్లు? వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ అగర్వాల్‌ ఎన్ని అవార్డులు గెలుచుకుంది? కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది. కాజల్ అగర్వాల్‌ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? కాజల్ అగర్వాల్‌ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.&nbsp; కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు? నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en కాజల్ అగర్వాల్‌ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? కాజల్ అగర్వాల్‌ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది. కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రామ్ చరణ్, తమన్నా భాటియా https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
    ఏప్రిల్ 27 , 2024
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.&nbsp; ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.&nbsp; హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ&nbsp; కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.&nbsp; ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్&nbsp;
    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై ప్రకటన.. ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.&nbsp; https://twitter.com/DailyCultureYT/status/1666291610722930689?s=20 ఇక సినిమాల జాతరే.. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్‌ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1666136550361673728?s=20 ఆదిపురుష్ సినిమా.. ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.&nbsp; చిరంజీవి కామెంట్స్‌.. ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.&nbsp; https://www.youtube.com/watch?v=A8NS3vSJ1Gc కృతి సనన్.. ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.&nbsp; ప్రభాస్‌పై కృతి సనన్.. ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది.&nbsp; ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది. https://www.youtube.com/watch?v=fmbZE7J9IMA ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.&nbsp;&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=JopeURxPZmE హైలెట్స్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.&nbsp; ముఖ్య అతిథులు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. https://www.youtube.com/watch?v=qkD5juVLDgM
    జూన్ 07 , 2023
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం. &nbsp; ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.&nbsp; తండ్రి ఎవరు?&nbsp; ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా&nbsp; ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.&nbsp; పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 18 , 2023
    <strong>Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!</strong>
    Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్‌!
    హైదరాబాద్ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లోనే మాయని మచ్చలాగా మిగిలిపోయింది. బన్నీ రాక నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం (డిసెంబర్‌ 7) సికింద్రాబాద్‌ కిమ్స్‌కు వెళ్లిన బన్నీ ఆంక్షల మధ్య శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఇదిలా ఉంటే మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) సంధ్యా థియేటర్‌ ఘటనపై తొలిసారి స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  నిహారిక ఏమన్నదంటే.. కోలీవుడ్‌లో నిహారిక నటించిన ఫస్ట్‌ ఫిల్మ్ 'మద్రాస్‌ కారన్‌' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరో రెండ్రోజుల్లో జనవరి 10న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. షాన్‌ నిగమ్‌ హీరోగా చేసిన ఈ చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ ఇంటర్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్‌ ఘటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సంధ్య థియేటర్‌ ఘటన నన్ను ఎంతో బాధించింది. ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరు. మహిళ మృతి చెందడం బాధకరం. ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి ఘటనలు ఎవరికీ జరగకూడదు. తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మరోసారి ఇండస్ట్రీలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవద్దని కోరుకుంటున్నా. ఈ దుర్ఘటన నుంచి అల్లు అర్జున్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.  https://twitter.com/pakkatelugunewz/status/1876916188577431653 ‘బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా’ మెగా హీరోల నుంచి ఏమేమి నేర్చుకున్నారన్న ప్రశ్నలకు నిహారిక ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అల్లు అర్జున్‌ గురించి మాట్లాడుతూ అతడి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు చెప్పింది. ‘అల్లు అర్జున్‌ లుక్స్‌ పరంగా ఎంతో కేరింగ్‌ తీసుకుంటాడు. సినిమా సినిమాకు స్టైల్‌, లుక్‌ మార్చుకుంటాడు. ఈ విషయంలో బన్నీ నాకు ఇన్‌స్పిరేషన్‌’ అని నిహారిక తెలిపింది. సోదరుడు వరుణ్‌ తేజ్‌ గురించి మాట్లాడుతూ తన ప్రతీ సినిమాకు సైన్‌ చేసే ముందు అతడితో డిస్కస్‌ చేస్తానని చెప్పింది. అటు రామ్‌చరణ్‌తో చాలా సరదాగా ఉంటానని, ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి అన్నది ఆయన్ను చూసి నేర్చుకున్నట్లు నిహారిక చెప్పుకొచ్చింది.  నిహారిక.. రొమాంటిక్‌ సాంగ్‌ గుర్తుందా? కొద్ది రోజుల క్రితం నెట్టింట హల్‌చల్‌ చేసిన నిహారిక బోల్డ్ రొమాంటిక్‌ సాంగ్‌.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) సినిమాలోనిదే. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్‌, షాలిని చేసిన 'నగిన నగిన' పాటకు రీమిక్స్‌గా ఆ సాంగ్‌ రూపొందింది. ఇందులో నిహారిక, షాన్‌ నిగమ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్‌ - రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. నిహారిక ఆ స్థాయిలో రొమాన్స్‌ చేయడం అదే తొలిసారి. దీంతో ఆ తమిళ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసించగా ఎక్కువ మంది విమర్శించారు. అందరూ అభిమానించే మెగా ఫ్యామిలీకి ఇలాంటి బోల్డ్‌ సాంగ్‌లో చేయడం ద్వారా నిహారిక తలవొంపులు తెచ్చిందని ట్రోల్స్ చేశారు.  https://twitter.com/SivareddE/status/1865713969794806123 కోలీవుడ్‌లో గతంలోనే మెరిసినా నిహారిక.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ హీరోయిన్‌గా నిహారిక చేస్తోన్న ఫస్ట్‌ తమిళ చిత్రం. అయితే నటిగా మాత్రం ఆమెకు ఇది రెండో ఫిల్మ్‌. నిహారిక గతంలోనే ఓ తమిళ చిత్రంలో నటించింది. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్‌ పాతు సోల్రెన్‌' చిత్రంలో నిహారిక కనిపించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’ (ప్రొడ్యూసర్‌గా కూడా) చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్‌ కారణ్‌'తో పాటు తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 
    జనవరి 08 , 2025
    <strong>Wamiqa Gabbi Hot: అందాల ఆరబోతతో రెచ్చిపోయిన వామికా గబ్బి..</strong>
    Wamiqa Gabbi Hot: అందాల ఆరబోతతో రెచ్చిపోయిన వామికా గబ్బి..
    బాలీవుడ్‌ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) తన అంద చందాలతో సోషల్‌ మీడియాలోనూ షేక్‌ చేస్తోంది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది.  తాజాగా బ్లూ సూట్‌లో ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు స్మార్ట్‌ లుక్స్‌తోనే అందరికీ చెమటలు పట్టించింది. ఎద అందాలు చూపిస్తూ వలపు వల విసిరింది.&nbsp; వామికా (Wamiqa Gabbi) ఎద సొగసులు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తన అందంతో బాలీవుడ్‌ను ఏలడం ఖాయమని ప్రశంసలు  రిలీజ్‌కు సిద్ధమైన బాలీవుడ్‌ చిత్రం ‘బేబీ జాన్‌’లో ఈ అమ్మడు సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. హాట్‌ హాట్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొనుతుండటంతో ఈ అమ్మడి పేరు ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. వామికా (Wamiqa Gabbi) గబ్బి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1993 సెప్టెంబర్‌ 29న చండీగఢ్‌లోని పంజాబీ ఫ్యామిలీ జన్మించింది.  చండీగఢ్‌లోనే ఆమె విద్యాభ్యాసం అంతా సాగింది. నటనపై ఆసక్తితో చండీగఢ్‌ నుంచి ముంబయికి వామికా షిఫ్ట్ అయ్యింది.&nbsp; కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలు లేక ముంయిలో ఎన్నో ఇబ్బందులు పడింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చే వరకు చిన్న చిన్న రోల్స్‌ చేసింది.&nbsp; హిందీలో వామిక (Wamiqa Gabbi) నటించిన మెుట్ట మెుదటి చిత్రం 'జబ్‌ వి మెట్‌' (2007). ఆ తర్వాత ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘మాసం’, ‘బిట్టూ బాస్‌’ వంటి చిత్రాలు చేసింది.  బాలీవుడ్‌లో వచ్చిన ‘సిక్సిటీన్‌’ సినిమాతో వామికా తొలిసారి లీడ్‌ రోల్‌లో నటించింది. ఆ మూవీ సక్సెస్‌ కాకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.&nbsp; ఆ తర్వాత ప్రముఖ సింగర్‌ హనీసింగ్‌ నటించిన పంజాబి చిత్రం 'మేరా 22 మే తేరా 22'లో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. అందులో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; సుధీర్‌ బాబు హీరోగా నటించిన 'భలే మంచి రోజు' చిత్రంతో టాలీవుడ్‌లో వామిక (Wamiqa Gabbi) అడుగుపెట్టింది. ఈ మూవీ సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో మరో ఛాన్స్‌ వామికకు రాలేదు.  ఆ తర్వాత వరుసగా పంజాబీ, హిందీ చిత్రాల్లో నటించి వామికా బాగా పాపులర్‌ అయ్యింది. గతేడాది 'కూఫియా' ఫిల్మ్‌లో కనిపించి మెప్పించింది.  ప్రస్తుతం ఆమె చేతిలో 'బేబీ జాన్‌'తో పాటు ‘కిక్లి, 'జీనీ', 'దిల్‌ కా దర్వాజా కోల్‌ నా డార్లింగ్‌' ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘బేబీ జాన్‌’ క్రిస్మస్‌ కానుగా డిసెంబర్‌ 25న రిలీజ్‌ కాబోతోంది.&nbsp; ఓవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను పంచుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. ప్రస్తుతం వామికా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన ఫొటోలను ట్రెండ్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
    డిసెంబర్ 19 , 2024
    <strong>Spirit: ప్రభాస్‌ సరసన మృణాల్‌ ఠాకూర్.. పిక్స్ వైరల్</strong>
    Spirit: ప్రభాస్‌ సరసన మృణాల్‌ ఠాకూర్.. పిక్స్ వైరల్
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో ‘స్పిరిట్‌’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ కెరీర్‌ పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో వీరి కాంబోలో రానున్న 'స్పిరిట్‌' (Spirit) ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకూ స్పిరిట్‌కు సంబంధించి ఎన్నో గాసిప్స్‌ బయటకు వచ్చాయి. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్ అయినట్లు తెలుస్తోంది.  మృణాల్‌తో ప్రభాస్‌ రొమాన్స్‌! ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్‌ థాకూర్‌ (Mrunal Thakur) ఫిక్స్ అయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సందీప్‌ రెడ్డి వంగాతో ఆమెకు అగ్రిమెంట్‌ కూడా కుదిరిందని బజ్‌ వినిపిస్తోంది. తొలుత ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలించిన సందీప్‌.. ఫైనల్‌గా సీతారామం బ్యూటీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు పెయిర్‌గా ఆమె అయితేనే చక్కగా బాగుటుందని మూవీ టీమ్‌ భావించినట్లు సమాచారం. పైగా ఈ జోడీ ఇప్పటివరకూ కలిసి నటించకపోవడంతో తెరపై చూసిన వారికి ఫ్రెష్‌గా అపిస్తుందని మేకర్స్ అనుకున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.  ఫుల్‌ స్వింగ్‌లో స్క్రిప్ట్‌ వర్క్‌.. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా ఫోకస్‌ మెుత్తం ‘స్పిరిట్‌’ (Spirit) పైనే ఉంది. ఈ మూవీ ప్రీ - ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ చూపిన విధంగా ప్రభాస్‌ను ఆయన ప్రభాస్‌ను రీ ఇంట్రడ్యూస్‌ చేస్తారని లేటెస్ట్‌ సమాచారం అందుతోంది. ఇక స్పిరిట్‌కు సంబంధించి మరో పోస్టర్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ‘పోలీసులలో మంచి వారుంటారు.. చెడ్డవారుంటారు.. అలాగే అతడూ ఉన్నాడు’ అంటూ రక్తంతో తడిసిన పోలీసు మెడల్‌ పోస్టర్‌ సైతం నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు అప్‌డేట్స్‌తో స్పిరిట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/thetalkenti/status/1867877611852226619 https://twitter.com/BFilmyOfficial_/status/1867880194939277662 ప్రభాస్‌ - మృణాల్ ఏఐ పిక్స్‌ వైరల్‌ ప్రభాస్‌తో మృణాల్‌ జతకట్టడం ఖాయమంటూ నెట్టింట ప్రచారం మెుదలు కావడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్ అలెర్ట్‌ అయ్యారు. ‘స్పిరిట్‌’లో వారి జోడీ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించి ఏఐ జనరేటేడ్‌ పిక్స్‌ను నెట్టింట అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఖాకీ డ్రెస్‌లో ప్రభాస్‌, బ్లాక్‌ శారీలో మృణాల్ ఉన్న ఏఐ పిక్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే ఎదురెదురుగా ప్రభాస్, మృణాల్‌ నిలబడి ఒకరి కళ్లల్లో మరొకరు చూసుకుంటున్న ఫిక్‌ కూడా మెప్పిస్తోంది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి. https://twitter.com/ursnaveenOO7/status/1867872170392822045 https://twitter.com/MalayalamReview/status/1867901481430741203 https://twitter.com/Box_Office_BO/status/1867870995748622686 https://twitter.com/Akashsinghakki4/status/1867919899416477813 విలన్స్‌గా బాలీవుడ్‌ జంట బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారాడు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు స్పిరిట్‌లోనూ విలన్‌గా అతడే నటించబోతున్నట్లు సమాచారం.  ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సైఫ్‌ అలీఖాన్‌ భార్య కరీనా కపూర్‌ (Kareena Kapoor) కూాడా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు రూమర్లు ఉన్నాయి. అదే నిజమైతే ‘స్పిరిట్‌’పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.  https://twitter.com/dreamworlddigi/status/1867924942609666122
    డిసెంబర్ 14 , 2024

    @2021 KTree