మలయాళ సినీ నటి హనీ రోజ్ (Honey Rose) తనపై జరుగుతున్న వేధింపుల గురించి సోషల్ మీడియాలో కొద్దికాలంగా చర్చిస్తోంది. ఈ వేధింపుల నేపథ్యంలో ఇటీవల ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు ఆధారంగా, ఎర్నాకుళం పోలీసులు రెండు రోజుల క్రితం 27 మందిపై కేసు నమోదు చేశారు. వీరంతా సోషల్ మీడియాలో హనీ రోజ్‌పై అసభ్య పోస్ట్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన కేరళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా అరెస్టు చేసింది. అతనిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వయనాడ్ ప్రాంతంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై హనీ రోజ్ స్పందిస్తూ, “ఇప్పుడు నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ కేసు విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారికి తెలియజేశాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన మాటిచ్చారు” అని తెలిపారు.
వేధింపులపై స్పందన
‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హనీ రోజ్, ఇటీవల తనపై ఓ ప్రముఖ వ్యాపారవేత్త వల్ల జరిగిన వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ఒక వ్యక్తి కావాలనే నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ఆ విషయంపై మౌనంగా ఉంటుంటే, చాలా మంది ‘మీరు ఆ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారా?’ అని ప్రశ్నిస్తున్నారు” అని హనీ రోజ్ తెలిపారు.
ఆవ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని, కానీ వివిధ కారణాల వల్ల హాజరుకాలేదని ఆమె చెప్పారు. “దానికి ప్రతీకారంగా, నేను హాజరవుతున్న ఈవెంట్లకు వచ్చి నన్ను కించపరిచేలా ప్రవర్తించడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు,” అని ఆమె వివరించారు.
దేనికైనా ఒక హద్దు
“నా లుక్స్ గురించి చేసే సరదా జోక్స్, మీమ్స్‌లను నేను పెద్దగా పట్టించుకోను. విమర్శలు స్వాగతిస్తాను. కానీ వాటికి ఒక హద్దు ఉంటుంది. అసభ్యకరమైన వ్యాఖ్యలు మాత్రం సహించలేను,” అని హనీ రోజ్ స్పష్టం చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో, హనీ రోజ్ చేసిన ఫిర్యాదు కేసు విచారణలో కీలకమైన మలుపుగా బాబీ చెమ్మనూరును అరెస్టు చేయడం జరిగింది.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!