చైనాకి ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ఇన్ఫీనిక్స్ (Infinix) సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘ఇన్ఫీనిక్స్ హాట్ 40ఐ’ (Infinix Hot 40i) పేరుతో అధునాతన బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేయబోతోంది. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లోనే ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ మోడల్ గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది. అయితే భారత్‌లో దీని లాంచింగ్ ఆలస్యమైంది. ఫిబ్రవరి 16న దీనిని విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకునే దీనిని ట్రై చేయవచ్చని కంపెనీ వర్గాలు సూచించాయి. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? తదితర విశేషాలను ఈ కథనంలో చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
Infinix Hot 40i మెుబైల్.. 6.56 అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 1612 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 480 nits పీక్ బ్రైట్‌నెస్‌తో ఫోన్ రానుంది. అలాగే Unisoc T606 SoC కలగలిసిన Mali-G57 MC1 జీపీయూ, Android 13 ఆధారిత XOS 13.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ పనిచేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ మెుబైల్ గరిష్టంగా 8GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కింద మరో 8GB RAMను అదనంగా పొందవచ్చు. అటు microSD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకునే వెసులుబాటును కంపెనీ కల్పించింది.
బ్యాటరీ
ఈ ఇన్ఫీనిక్స్ మెుబైల్‌ను బిగ్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5000mAh బ్యాటరీని ఫోన్‌కు అమర్చారు. దీని సెగ్మెంట్‌లో వచ్చిన మెుబైల్స్ పోలిస్తే Infinix Hot 40i చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
కెమెరా క్వాలిటీ
Infinix Hot 40i మెుబైల్‌ను నాణ్యమైన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ చెప్పింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP AI సెన్సార్ ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్ కోసం ఏకంగా 32MP ఫ్రంట్ కెమెరాను ఫోన్‌కు ఫిక్స్ చేశారు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ ఫోన్ 4G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. ఇందులో Wi-Fi 5 (802.11 a/b/g/n/ac), Bluetooth, GPS, 3.5 mm ఆడియో జాక్, DTS Sound వంటి ఆడియో ఫీచర్లు ఉన్నాయి. అలాగే సైడ్ మౌంటెడ్ పింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలోమీటర్, ఈ-దిక్సూచి కూడా ఫోన్‌లో ఉంది.
కలర్ ఆప్షన్స్
Infinix Hot 40i మెుబైల్.. గ్లోబల్ మార్కెట్‌లో నాలుగు రంగుల్లో లాంచ్ అయ్యింది. భారత్‌లోనూ అవే కలర్స్‌లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. పామ్ బ్లూ (Palm Blue), హారిజాన్ గోల్డ్ (Horizon Gold), స్టార్‌ఫాల్ గ్రీన్ (Starfall Green), స్టార్‌లిట్ బ్లాక్ (Starlit Black) రంగుల్లో ఈ మెుబైల్‌ను పొందవచ్చు.
ధర ఎంతంటే?
Infinix Hot 40i ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 16న లాంచింగ్ సందర్భంగా ప్రకటించే అవకాశముంది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో దీని ధరను బట్టి ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!