Apple తన సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లను ఆవిష్కరించింది, ఇందులో Mac కంప్యూటర్ల కోసం macOS Sequoia, iPadOS 18, watchOS 11, tvOS 18 ఉన్నాయి. ఈ అప్డేట్లు Apple ప్రొడక్ట్స్‌పై కొత్త ఫీచర్లు, కస్టమైజేషన్ ఆప్షన్లను అందిస్తున్నాయి. iOS 18 తాజా అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
macOS Sequoia ముఖ్యమైన ఫీచర్లు
macOS Sequoia ఒక కొత్త iPhone Mirroring ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని ద్వారా యూజర్లు తమ కంప్యూటర్ నుంచి నేరుగా స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేయగలరు. అదనంగా, విండో టైలింగ్ కోసం డ్రాగ్ కంట్రోల్‌లను కలిగి ఉంది. దీనివల్ల థర్డ్-పార్టీ యాప్‌ల అవసరం లేకుండా చేస్తుంది. Safari బ్రౌజర్లో ఇప్పుడు కొత్తగా రీడర్ మోడ్ అందుబాటులోకి వచ్చింది. బ్రౌజ్ చేస్తున్నప్పుడు ప్రదేశాలు, మీడియా గురించి సంబంధిత సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. Windows గేమ్స్ ఆడటానికి Game Porting Toolkit 2 ను కూడా కలిగి ఉంది.
macOS 15 Sequoia ఎలా ఇన్స్టాల్ చేయాలి?
- Apple మెనును క్లిక్ చేసి System Settings యాప్‌ను తెరవండి.
- General > Software Update కు వెళ్లండి.
- macOS 15 Sequoia అప్డేట్ అందుబాటులో ఉంటే, Update Now పై క్లిక్ చేయండి.
- ఇన్స్టాలేషన్ ప్రారంభించడానికి మీ అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- అప్డేట్ ఇన్స్టాల్ అయిన తర్వాత, మీ పరికరం ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది.
iPadOS 18 ముఖ్యమైన ఫీచర్లు
iPadOS 18లో కొత్తగా టిండెడ్ ఐకాన్లు, హోమ్ స్క్రీన్‌పై విడ్జెట్లు ఉంటాయి, వీటివల్ల కస్టమైజేషన్ మెరుగవుతుంది. ఇది macOS లో లభించే కొత్త Messages ఫీచర్లను అందిస్తోంది. గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి Game Mode ని కొత్తగా తీసుకొచ్చింది.
iPadOS 18 ఎలా ఇన్స్టాల్ చేయాలి?
- మీ iPad పై Settings యాప్‌ను తెరవండి.
- General > Software Update కు వెళ్లండి.
- iPadOS 18 అప్డేట్ అందుబాటులో ఉంటే, Download and Install పై క్లిక్ చేయండి.
- మీ పాస్‌కోడ్‌ని నమోదు చేసి ఎంటర్ చేయండి
- అప్డేట్ డౌన్లోడ్ అయిన తర్వాత, Install Now పై క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మీ iPad ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది.
watchOS 11 ముఖ్యమైన ఫీచర్లు
watchOS 11 లో కొత్తగా ఎక్సర్సైజ్ మోడ్లు, మెరుగైన స్లీపింగ్ ట్రాకింగ్ వంటి డీటైల్డ్ హెల్త్ ఇన్‌సైట్‌లతో ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లను తీసుకొచ్చింది. వాచ్ ఫేస్ పై విడ్జెట్లు, కాంప్లికేషన్లు, మరింత కస్టమైజేషన్‌ను అనుమతిస్తాయి. ఇది యాక్సెసిబిలిటీ ఫీచర్లను కూడా తీసుకొచ్చింది, అందులో AssistiveTouch ఉంది. దీని ద్వారా యూజర్లు చేతి గెస్చర్లతో తమ వాచ్‌ను కంట్రోల్ చేయగలరు. అదనంగా, watchOS 11 హెల్త్ యాప్‌లో ఎక్స్టెండెడ్ ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంది. ఇది యూజర్లకు వారి ఆరోగ్య డేటాను అన్ని Apple పరికరాలపై పొందడానికి సహాయపడుతుంది.
watchOS 11 ఎలా ఇన్స్టాల్ చేయాలి?
- మీ iPhone లో Watch యాప్‌ను తెరవండి.
- General > Software Update కు వెళ్లండి.
- watchOS 11 అందుబాటులో ఉంటే, Download and Install పై క్లిక్ చేయండి.
- మీ Apple Watch ఛార్జర్ కు కనెక్ట్ అయి కనీసం 50% బ్యాటరీ ఉన్నట్లు నిర్ధారించండి.
- అప్డేట్ పూర్తయిన తర్వాత, వాచ్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది.
tvOS 18 ముఖ్యమైన ఫీచర్లు
tvOS 18 ప్రధానంగా Apple TV అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని సెట్టింగ్‌లు ఉండేలా ఫీచర్లు తీసుకొచ్చింది. Apple TVలో tvOS 18 FaceTime సపోర్ట్ చేస్తుంది. తద్వారా వినియోగదారులు Continuity Camera ని ఉపయోగించి పెద్ద స్క్రీన్ పై వీడియో కాల్స్ చేయవచ్చు. ఈ అప్డేట్ SharePlay, గేమింగ్ ఆప్టిమైజేషన్లను కూడా సపోర్ట్ చేస్తుంది. స్నేహితులతో గేమ్‌లు ఆడేటప్పుడు లేదా కంటెంట్ చూసేటప్పుడు కనెక్ట్ అవ్వడం మరింత సులభతరం అవుతుంది.
tvOS 18 ఎలా ఇన్స్టాల్ చేయాలి?
- మీ Apple TV పై Settings కి వెళ్లండి.
- System > Software Updates కు వెళ్లండి.
- అప్డేట్ అందుబాటులో ఉంటే, Download and Install పై క్లిక్ చేయండి.
- అప్డేట్ పూర్తయిన తర్వాత యాపిల్ టీవీ ఆటోమెటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది.
Apple తీసుకొచ్చిన తాజా సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కొత్త ఫీచర్లు, కస్టమైజేషన్, ప్రొడక్టివిటీ, పనితీరును మెరుగుపరుస్తూ వచ్చాయి. macOS Sequoia లో iPhone Mirroring, iPadOS 18 లో గేమ్ మోడ్, watchOS 11లో హెల్త్ ఫీచర్లు యూజర్లకు మెరుగైన అనుభవాన్ని ఇస్తాయి. AI ఇంటిగ్రేషన్‌తో రాబోయే యాపిల్ ఉత్పత్తులు ఈ ఎకోసిస్టమ్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తాయి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?