దేశంలో టాటా కంపెనీ (Tata Company) కార్లకు మంచి గుడ్‌విల్ ఉంది. టాటా మోటార్స్ (Tata Motors) నుంచి ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టియాగో, టిగోర్, నెక్సాన్ ఇప్పటికే మార్కెట్‌లోకి రాగా తాజాగా SUV విభాగంలో టాటా పంచ్ ఈవీ (Tata Punch EV Vs Mahindra XUV 400 ) విడుదలైంది. దీని ప్రైస్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈవీ కార్లతో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉన్నాయని టాటా వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Mahindra XUV 400 ఎలక్ట్రిక్ కారుకు Tata Punch EV గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతా? వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.
బ్యాటరీ పవర్
Mahindra XUV 400 మోటార్ పవర్ 148 bhp 310 Nm కాగా.. Tata Punch EV 80 bhp 114 Nm పర్‌ఫార్మెన్స్ కలిగి ఉంది. మహేంద్ర ఈవీ కారు.. 39.4 kWh బ్యాటరీ సామర్థ్యం, 100 kW మోటార్ పవర్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీని గరిష్ట పవర్ 147.51bhpగా ఉంది. అదే టాటా పంచ్ విషయానికి వస్తే 25 kWh, 35 kWh అత్యాధుని బ్యాటరీ సామర్థ్యాలతో మార్కెట్‌లోకి వచ్చింది.
మైలేజ్
35 kWh బ్యాటరీ పవర్ కలిగిన Tata Punch EV కారును ఒకసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 421 కి.మీ వరకూ ప్రయాణించవచ్చు. అదే Mahindra XUV 400 ఒకసారి ఛార్జ్‌తో 415.5 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే టాటా పంచ్ ఈవీ కాస్త బెటర్ పొజిషన్‌లో ఉన్నట్లు చెప్పవచ్చు.
సీటింగ్
Tata Punch EV కారు ఐదు డోర్లతో లాంచ్ అయ్యింది. ఐదుగురు వ్యక్తులు కారులో కూర్చునేందుకు సీటింగ్ అరేంజ్‌మెంట్ చేశారు. అటు Mahindra XUV 400 కారు కూడా ఐదు డోర్స్, లోపలి భాగంలో ఐదు సీట్లను కలిగి ఉంది. మహీంద్ర 368 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తే టాటా పంచ్ ఈవీ 366 లీటర్ల స్టోరేజ్ స్థలాన్ని డిక్కీలో కలిగి ఉంది.
ఛార్జింగ్ టైమ్
3.3kW AC వాల్ బాక్స్ ఛార్జర్‌తో Tata Punch EV కారును 9.4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని టాటా వర్గాలు తెలిపాయి. అదే 7.2kW AC ఛార్జర్‌తో ఐదు గంటల్లోనే కారును ఛార్జ్ చేయవచ్చని పేర్కొన్నాయి. 50kW DC fast chargerను వినియోగిస్తే 10-80 శాతం ఛార్జింగ్‌కు 56 నిమిషాలు మాత్రమే పడుతుందని స్పష్టం చేశాయి. Mahindra XUV 400 కారు ఫుల్ ఛార్జ్ కావడానికి 6గం.ల 30ని.ల సమయం తీసుకుంటుంది.
కార్ ఇంటీరియర్
టాటా పంచ్ (Tata Punch EV Review) ఈవీ కారుకు 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్‌తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను అందించారు. Mahindra XUV 400 కూడా ఇదే తరహా ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మహీంద్రా ఏయిర్ కండీషనర్ మాన్యువల్‌గా ఉంటే టాటా పంచ్‌లో ఇది ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్‌తో పని చేస్తుంది. ఈ రెండు కార్లలో హీటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
పవర్‌ఫుల్ టైర్స్
ఈ రెండు కార్లు స్టీల్ రిమ్స్‌ను కలిగి ఉన్నాయి. Mahindra XUV 400 కారు ముందు వైపు 205 / 65R16 టైర్లను కలిగి ఉంటే.. Tata Punch EV 185 / 70 R15 ఫ్రంట్ టైర్స్‌తో రూపొందింది. వెనక భాగంలో ఈ రెండు కార్లు వరుసగా 205 / 65 R16, 185 / 70 R15 టైర్లను కలిగి ఉన్నాయి. Mahindra XUV 400 టైర్ సైజ్ 16 అంగుళాలు కాగా Tata Punch EV వీల్ 15 అంగుళాలు ఉంది. మహీంద్రా కారు హాలోజెన్ హెడ్‌లైట్స్‌తో రాగా.. టాటా పంచ్ మాత్రం లేటెస్ట్ LED ప్రొజెక్టర్‌తో వస్తోంది.
ఎయిర్ బ్యాగ్స్
Mahindra XUV 400, Tata Punch EV రెండు కార్లు ఎయిర్ బాగ్స్‌ను కలిగి ఉన్నాయి. Mahindra XUV 400 కారు రెండు ఎయిర్‌బాగ్స్ (డ్రైవర్, ఫ్రంట్ పాసెంజర్)తో వస్తే టాటా పంచ్ కారు ఆరు ఎయిర్‌బాగ్స్‌ను కలిగి ఉండటం విశేషం. డ్రైవర్, ఫ్రంట్ పాసెంజర్‌తో పాటు నాలుగు ఎయిర్‌బాగ్స్‌ను భద్రతా ప్రాధాన్యం దృష్ట్యా కారులో అమర్చారు.
ధర ఎంతంటే?
Mahindra XUV 400 EV కారు ధర వేరియంట్‌ను బట్టి రూ.15.49 – 19.39 లక్షలుగా ఉంది. అటు టాటా పంచ్ ఈవీ కారు ధర కూడా మోడల్ ఆధారంగా రూ.10.99-15.49 లక్షల మధ్య అందుబాటులోకి వచ్చింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!