• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hyundai Grand i10 Nios Corporate: హ్యుందాయ్‌ నుంచి సరికొత్త కారు.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ (Hyundai Motors).. తమ కస్టమర్స్‌ కోసం సరికొత్త కారును భారత్‌లో లాంచ్ చేసింది. కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand I10 Nios) లైనప్‌లోనే శక్తివంతమైన కారును విడుదల చేసింది. కార్పొరేట్ పేరుతో (Hyundai Grand i10 Nios Corporate) ఈ నయా మోడల్‌ను తీసుకొచ్చింది. దేశంలోని వాహన ప్రియులను ఈ కారు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో నయా కార్పొరేట్‌ వెర్షన్‌ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    పవర్‌ఫుల్‌ ఇంజిన్‌

    Hyundai Grand i10 Nios Corporate కారును.. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 82 Bhp పవర్, 112NM గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్, 4 స్పీడ్ AMT యూనిట్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ CNG ఇంజిన్‌తో అందుబాటులో లేదు.

    టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌

    ఈ లేటెస్ట్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios Corporate)లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో కూడిన 8.89 సెం.మీ స్పీడోమీటర్, 17.14 సెం.మీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి. USB ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 

    ఇంటీరియర్‌ డిజైన్‌

    ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ కార్పొరేట్ ఎడిషన్.. గ్రే షేడ్‌తో డ్యూయల్ టోన్ ట్రీట్‌మెంట్‌తో వచ్చింది. హ్యాచ్‌బ్యాక్‌లో డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు, ఫుట్‌వెల్ లైటింగ్, ఫ్రంట్ రూమ్ ల్యాంప్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ పాకెట్ ఉన్నాయి. అలాగే డ్రైవర్ సౌలభ్యం కోసం ఇందులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. అదనంగా ఎలక్ట్రికల్లీ ఎడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్రైవర్ విండో కోసం ఆటో అప్ డౌన్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ పవర్ అవుట్లెట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

    భద్రత పరంగా..

    Grand i10 Nios కార్పొరేట్ ఎడిషన్.. భద్రతపరంగా మంచి ఫీచర్లను కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, EBDతో కూడిన ABS, సెంట్రల్ డోర్ లాకింగ్, సీట్ బెల్ట్ రిమైండర్స్, డే అండ్ నైట్ ఐఆర్వీఎం, సెన్సింగ్ డోర్ అన్ లాక్ మొదలైన ప్రామాణికమైన ఫీచర్లను హ్యుందాయ్ అందించింది. 

    కలర్ ఆప్షన్స్‌

    Hyundai Grand i10 Nios Corporate కారును కంపెనీ ఏడు రంగులలో లాంచ్ చేసింది. వీటిలో అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టీల్ బ్లూ, ఫైరీ రెడ్, స్పార్క్ గ్రీన్, కొత్త అమెజాన్ గ్రే షేడ్ కలర్ ఆప్షన్స్‌లో దీని పొందవచ్చు. 

    ధర ఎంతంటే?

    Hyundai Grand i10 Nios Corporate వేరియంట్‌ను.. ధర రూ.6.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. కాగా, AMT వేరియంట్ ధర రూ.7.58 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఇంట్రడక్టరీ, అలాగే ఎక్స్-షోరూమ్ ధరలు అన్న విషయం గమనించాలి. ఈ మోడల్‌పై హ్యుందాయ్ మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు ఏడు సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీని అందిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv