ప్రముఖ కొరియన్ టెక్ కంపెనీ శాంసంగ్ (Samsung)కు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఈ సంస్థ రిలీజ్ చేసే ఫోన్లు (Mobiles), ట్యాబ్స్ (Tabs), ల్యాప్‌టాప్స్ (Laptops) మంచి ఫీడ్ బ్యాక్‌ను కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే శాంసంగ్.. సరికొత్త ట్యాబ్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2022లో తీసుకొచ్చిన Galaxy Tab S6 Lite ట్యాబ్ అప్‌డేట్ వెర్షన్‌ను టెక్ ప్రియుల ముందుకు తీసుకురాబోతోంది. ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ 2024’ (Samsung Galaxy Tab S6 Lite 2024) పేరుతో ఇది రాబోతోంది. ప్రస్తుతం ఈ ట్యాబ్‌కు సంబంధించిన ఫీచర్లను కొన్ని టెక్ కంపెనీలు రివీల్ చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ట్యాబ్ స్క్రీన్
Galaxy Tab S6 Lite (2024) ట్యాబ్లెట్.. 10.4 అంగుళాల WUXGA+ LCD డిస్‌ప్లేతో రానుంది. ఇది 2,000 x 1,200 pixels క్వాలిటీ, 2.4GHz అండ్ 2.0GHz క్లాక్ స్పీడ్స్ కలిగి ఉంటుందని సమాచారం. 2022 ట్యాబ్ వెర్షన్.. Android 12 OS, Snapdragon 720G ప్రొసెసర్‌తో పనిచేస్తే.. లేటెస్ట్ మోడల్ Android 14 ఆధారిత One UI 6 OS, Exynos 1280 SoC ప్రొసెసర్‌తో రానున్నట్లు తెలుస్తోంది.
ర్యామ్ & స్టోరేజ్
Samsung Galaxy Tab S6 Lite (2024) మోడల్.. 4GB RAM + 64GB స్టోరేజ్‌తో రానుంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకూ పెంచుకునే వీలుంది. గత వేరియంట్ కూడా 4 GB + 64 GB స్టోరేజ్‌తోనే రావడం గమనార్హం.
కెమెరా
ఈ నయా శాంసంగ్ ట్యాబ్.. వెనక భాగంలో 8 MP ఆటో ఫోకస్ సెన్సార్‌ను కలిగి ఉండనుంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇది నాణ్యమైన వీడియో కాల్స్ అందించనుంది. అయితే ఈ ట్యాబ్ వెనక భాగంలో ఫ్లాష్ ఫీచర్ ఉండదు. 30fps రిజల్యూషన్‌తో ఫుడ్ హెచ్‌డీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అంతేకాకుండా ట్యాబ్‌ను సులభంగా ఆపరేట్ చేసేందుకు S-pen కూడా కంపెనీ అందించనుంది.
బిగ్ బ్యాటరీ
Samsung Galaxy Tab S6 Lite (2024) ట్యాబ్లెట్‌ను బిగ్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీనికి ఏకంగా 7,040mAh బ్యాటరీని ఫిక్స్ చేసారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బ్యాటరీ 14 గంటల ప్లే వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్లు
Samsung Galaxy Tab S6 Lite (2024) ట్యాబ్.. Wi-Fi, GPS, Bluetooth 5.3, USB Type-C పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో రానుంది. దీనికి 3.5mm జాక్ కూడా అందించారు. ఈ ట్యాబ్ 465గ్రాముల బరువు.. 244.5mm x 154.3mm x 7mm చుట్టు కొలతలను కలిగి ఉండనుంది.
కలర్ ఆప్షన్స్
Samsung Galaxy Tab S6 Lite (2024) ట్యాబ్లెట్ మూడు రంగుల్లో రానున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గ్రే (Grey), మింట్ (Mint), రోజ్ గోల్డ్ (Rose Gold) కలర్స్‌లో దీన్ని పొందవచ్చు.
ధర ఎంతంటే?
Samsung Galaxy Tab S6 Lite (2024).. ధర, విడుదల తేదీపై ఎలాంటి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ఈ ట్యాబ్ ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ధర రూ.29,999 వరకూ ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!