ప్రస్తుత కాలంలో ప్రోటీన్ పౌడర్ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా యువత విపరీతంగా ప్రోటీన్ పౌడర్లను వినియోగిస్తున్నారు. అటు అథ్లెట్లు, బాడీ బిల్డర్లు సైతం తమ ఆహారపు అలవాట్లలో ప్రోటీన్ పౌడర్‌ను భాగం చేసుకుంటున్నారు. కండరాలను పెంచడంతో పాటు శరీరాన్ని దృఢంగా, ఫిట్‌గా ఉంచడంలో ప్రోటీన్ (Protein) కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు, కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్ని రకాల ప్రోటీన్ పౌడర్లు ఉన్నాయి? వాటిని కచ్చితంగా వాడాల్సిందేనా? ప్రోటీన్ పౌడర్ ఎంపికలో అనుసరించాల్సిన విధివిధానాలు? వంటి వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ప్రోటీన్ ఎందుకు అవసరం?
మన శరీరం సరైన రీతిలో పనిచేయడానికి అవసరసమైన స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ కణజాలాలను వృద్ది చేయడంతో పాటు అవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇవి అధిక బరువును తగ్గించడంలో కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. ప్రోటీన్ సహజంగా మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తుంది. అయితే ప్రోటీన్ మోతాదు తమ శరీరానికి ఎక్కువ అవసరమని భావించేవారు ప్రోటీన్ పౌడర్లను వినియోగిస్తుంటారు. ఈ ప్రోటీన్ పౌడర్లను కూడా సోయాబీన్స్, బఠానీలు, బియ్యం, బంగాళదుంపలు, గుడ్లు, పాలు మొదలైన పదార్థాల నుంచే తయారు చేస్తారు. అయితే అవసరానికి అనుగుణంగా మార్కెట్‌లో ఐదు రకాల ప్రోటీన్ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రోటీన్ పౌడర్స్‌లోని రకాలు
వే ప్రోటీన్
పాలవిరుగుడు నుంచి వే ప్రోటీన్ (Whey Protein) లభిస్తుంది. ఇందులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే ఇందులో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జిమ్‌కు వెళ్లే యువతలో ఎక్కువ మంది ఈ ప్రొటీన్‌నే తీసుకుంటారు. వేగంగా జీర్ణమయ్యే గుణాన్ని ఈ ప్రోటీన్ కలిగి ఉంటుంది.
కేసిన్ ప్రోటీన్
ఇది పాల విరుగుడు నుంచే తయారు చేస్తారు. అయితే ఇది నిదానంగా జీర్ణం అవుతుంది. శరీరంలో అమైనో ఆమ్లాల విడుదలకు ఈ కేసిన్ ప్రోటీన్ (Casein Protein) ఉపయోగపడుతుంది. పడుకునేముందు దీన్ని తీసుకోవడం మేలు చేస్తుంది.
మెుక్కల ఆధారిత ప్రోటీన్లు
పాల నుంచే కాకుండా కొన్ని రకాల మెుక్కల నుంచి కూడా ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తారు. శాఖాహారులు, పాల ఉత్పత్తులు పడనివారు (Vegans) ఈ ప్రోటీన్‌ను ఎక్కువగా వాడుతుంటారు. బఠాని, సోయా, జనపనరా, బియ్యం నుంచి ఈ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో అమైనో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఎగ్ ప్రోటీన్
కోడిగుడ్డులో ప్రోటీన్ స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. తెల్లసొన నుంచి అత్యంత నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. డైరీ & మెుక్కల ఆధారిత ప్రోటీన్లు పడని వారు ఎగ్ వైట్ ప్రోటీన్ (Egg White Protein) ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
కొల్లాజెన్ ప్రోటీన్.
చర్మం, కీళ్లు, బంధన కణజాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కొల్లాజెన్ ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రోటీన్ పౌడర్ ప్రయోజనాలు
కండరాల వృద్ధి
కండరాల వృద్ధికి ప్రోటీన్ అవసరం. అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ప్రోటీన్ పౌడర్ విలువైన సాధనమని చెప్పవచ్చు.
బరువు తగ్గుదల
ఒక వ్యక్తి నిర్దిష్టమైన బరువును కలిగి ఉండటానికి ప్రోటీన్స్ అవసరం. ప్రోటీన్స్ కొద్దిగా తీసుకున్నప్పటికీ త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. దీని ఎక్కువ కేలరీస్ శరీరం తీసుకోదు. కాబట్టి బరువు తగ్గే ఛాన్స్ పెరుగుతుంది.
పోషకాలు
ప్రోటీన్ పౌడర్లు.. ప్రోటీన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు, జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
రోగ నిరోధక శక్తి
రోజూ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. యాంటీబాడీస్, రోగనిరోధక కణాల వృద్ధికి ప్రోటీన్ దోహదం చేస్తుంది.
మార్కెట్‌లోని టాప్-10 ప్రోటీన్ పౌడర్స్
1. Gold Standard 100% Whey
ఇది ‘వే ప్రోటీన్’ తయారైన ప్రోటీన్ పౌడర్. రుచికరమైన చాక్లెట్ ఫ్లేవర్‌ను కలిగి ఉంది. 900 గ్రాముల బరువును కలిగి ఉంది. జిమ్ చేసే వారు వర్కౌట్‌కు ముందు ఈ పౌడర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీని అసలు ధర రూ. 3,599 కాగా అమెజాన్‌పై దీనిపై 19శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా ఇది రూ.2,898కు అందుబాటులోకి వచ్చింది.
2. MuscleBlaze Biozyme Performance
ఇది కూడా వే ప్రోటీన్‌తో తయారైంది. అమెరికన్ కంపెనీ దీన్ని తయారు చేసింది. 2021లో ప్రొడక్ట్ ఆఫ్ ది ఇయర్‌గా MuscleBlaze Biozyme ప్రోటీన్ పౌడర్ ఎంపిక కావడం విశేషం. చాక్‌లెట్ ఫ్లేవర్‌తో కేజీ బరువులో ఈ ప్రోటీన్ పౌడర్ వస్తుంది. అమెజాన్‌లో రూ.2,149కు ఇది లభిస్తోంది.
3. Bigmuscles Nutrition
అమెజాన్‌లో లభిస్తోన్న బెస్ట్ ప్రోటీన్ పౌడర్స్‌లో Bigmuscles Nutrition ఒకటి. ఇది ఐదు రకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో ప్రోటీన్ పౌడర్ కోరుకునేవారు దీన్ని పరిశీలించవచ్చు. దీని అసలు ధర రూ.1,349 కాగా అమెజాన్‌లో ఇది రూ.875కే లభిస్తోంది.
4. Optimum Nutrition Gold Standard
మార్కెట్‌లో బాగా సేల్ అవుతున్న ప్రోటీన్ పౌడర్స్‌లో Optimum Nutrition ఒకటి. ఇది 100శాతం వే ప్రోటీన్‌తో తయారైంది. చాక్‌లేట్, వెనిల్లా ఐస్ క్రీమ్ ఫ్లేవర్లలో ఇది లభిస్తోంది. 454 గ్రాముల బరువున్న ఈ ప్రోటీన్ పౌడర్‌ను అమెజాన్ రూ. 1,649 అందిస్తోంది.
5 AS-IT-IS ATOM Whey Protein
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మరో ప్రోటీన్ పౌడర్ ప్యాక్‌గా ‘AS-IT-IS ATOM Whey Protein’ చెప్పవచ్చు. ఇది కేఫ్ లాటే, కుకీస్ & క్రీమ్, కేసర్ కుల్ఫీ, బనానా ఫ్యూజన్ సహా 10 రకాల ఫ్లేవర్లను కలిగి ఉంది. అమెజాన్‌లో రూ.1,720కు ఈ ప్రోటీన్ పౌడర్ లభిస్తోంది.
6. Bigmuscles Nutrition Crude
జిమ్ చేసే యువత ఎక్కువగా ఈ ప్రోటీన్ పౌడర్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇది 1 కేజీ, 2 కేజీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో కేజీ ప్యాకెట్ ధర రూ.999గా ఉంది. రిచ్ చాక్‌లేట్ ఫ్లేవర్‌లో ఇది రానుంది.
7. MuscleBlaze Raw Whey Protein
ఈ ప్రోటీన్ పౌడర్‌కు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ పౌడర్‌కు ఎలాంటి ఫ్లేవర్ లేకపోవడం గమనార్హం. ఇది 1 కేజీ నుంచి 4 కేజీ వరకూ ప్యాక్‌ను కలిగి ఉంది. కేజీ ప్యాక్ ధర అమెజాన్‌లో రూ.1,699గా ఉంది.
8. AS-IT-IS Nutrition Whey Protein
asitis కంపెనీకి చెందిన Nutrition Whey Protein కూడా మంచి గుడ్‌విల్ కలిగివుంది. ఇది మజిల్ పవర్ పెంచడంలో తోడ్పాటు అందిస్తుంది. దీని అసలు ధర రూ.2,322 కాగా అమెజాన్ దీనిపై 32 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా ఇది రూ.1,575 లభిస్తోంది.
9. Amway Nutrilite All Plant Protein Powder
మెుక్కల నుంచి తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ కోరుకునే వారు ‘Amway Nutrilite All Plant Protein’ ట్రై చేయవచ్చు. ఇది బటర్‌స్కాచ్ ఫ్లేవర్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.4,306. అమెజాన్ దీనిపై 33శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని వల్ల ఇది రూ.2,870కి సేల్‌కు వచ్చింది.
10. NAKPRO Perform Whey Protein Concentrate
NAKPRO కంపెనీకి చెందిన ప్రోటీన్ పౌడర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా NAKPRO Perform Whey Proteinను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అమెజాన్‌లో ఇది రూ.1,349 లభిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!