• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TESTOSTERONE: పురుష హార్మోన్‌ లోపమా? పెంచుకోండిలా!

    సంతాన సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. అమ్మాయిల్లోనే కాదు.. అబ్బాయిల్లోనూ కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. మగవారిలో టెస్టోస్టెరాన్‌ అనే హార్మోన్‌ స్థాయి తక్కువ ఉన్న కారణంగా సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మరి, ఈ హార్మోన్‌ స్థాయిలను ఎలా పెంచుకోవాలి. దుష్ప్రభావాలు తొలగిపోవటానికి ఏ చిట్కాలు పాటించాలో ఓ సారి చూద్దాం. 

    వ్యాయామం

    టెస్టోస్టెరాన్‌ స్థాయిని పెంచుకోవటానికి మెుదట ఉపయోగపడేది వ్యాయామం. బరువులు ఎత్తడంతో పాటు యోగాసనాలు వేయడం ద్వారా శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగు పడి హార్మోన్‌ లక్షణాలు పెరుగుతాయి. 

    ఆహారం

    నిత్యం డైట్‌ ఫాలో కావటం వల్ల లేదా అతిగా తినడం వల్ల కూడా టెస్టోస్టెరాన్‌ లెవల్స్‌ తగ్గుతాయి. కార్బొహైడ్రేట్స్‌, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తిని వీటిని కవర్ చేయవచ్చు. పాలు, గుడ్లు, మాంసం, ఆల్‌మండ్స్‌ తీసుకుంటే మంచిది. ఇవి తినటం వల్ల టెస్టోస్టెరాన్ లెవల్స్ పెరుగుతాయి. 

    ఒత్తిడి 

    ఒత్తిడి కారణంగా కూడా ఈ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. పని లేదా కుటుంబ పరంగా మానసిక ఒత్తిడికి గురైన ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిని దరిచేరకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. వ్యాయామం చేయటం, స్నేహితులతో సరాదాగా గడపటం వంటి వాటి ద్వారా ఒత్తిడిని దూరం చేయవచ్చు. 

    సూర్యరశ్మి

    ఈ హార్మోన్ల స్థాయి తక్కువగా ఉన్న వారికి డి విటమిన్‌ అందాలి. అందుకోసం ఉదయాన్నే 6 నుంచి 8 గంటల్లోపు వచ్చే సూర్య రశ్మి ద్వారా దీన్ని పొందవచ్చు. ఫళితంగా ఇబ్బందులు దూరం అవుతాయి. 

    జింక్‌, విటమిన్‌ బి

    జింక్‌, విటమిన్‌ పదార్థాలు తీసుకోవటం ద్వారా టెస్టోస్టెరాన్ హార్మోన్ల స్థాయిని పెంచుకోవచ్చు. ఆకు కూరలు, మాంసంలో లివర్‌, కోడిగుడ్లు, పాలు వంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. 

    అశ్వగంధ

    టెస్టోస్టెరాన్ సమస్యలు సరైన నిద్ర లేకపోతే వస్తాయి. సుమారు 6 నుంచి 8 గంటలు నిద్రపోవటానికి ప్రయత్నించాలి. మరోవైపు అశ్వగంధకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv