నిత్య జీవితంలో టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకుండా అడుగు బయట పెట్టలేని పరిస్థితి. వాట్సాప్ లేకుండా రోజును ప్రారంభించలేం. యూట్యూబ్ చూడకుండా ఎంటర్‌టైన్‌మెంట్ పొందలేం. ఇన్‌స్టా లేకుండా రీల్స్‌ని తిరగేయలేం. జీమెయిల్ లేకుండా వర్క్ స్టేటస్ పోస్ట్ చేయలేం. గూగుల్ మ్యాప్స్ లేకుండా కొత్త ప్రదేశానికి వెళ్లలేం. అసలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లేకుంటే ఇవేవీ చేయలేం. ఇవి లేకుండా బతకడం అంటేనే అసలు ఊహించుకోలేం. కానీ, 20 ఏళ్ల కింద ఇవేవీ లేవనే విషయం మీకు తెలుసా?
ఫేస్‌బుక్(Facebook)
సోషల్ నెట్‌వర్కింగ్‌లో పెను సంచలనం రేపింది ఫేస్‌బుక్. 2004 ఫిబ్రవరిలో ఈ యాప్‌ని తీసుకొచ్చాడు మార్క్ జుకర్ బర్గ్. 2021 నాటికి ఈ యాప్‌కి 285 కోట్ల మంది యూజర్లు అయ్యారు.
జీమెయిల్(Gmail)
గూగుల్ సంస్థ తీసుకొచ్చిన మెయిల్ సర్వీస్ ప్లాట్‌ఫాం ఇది. 2004 ఏప్రిల్ 1న ఈ సర్వీసును లాంచ్ చేశారు. 2019 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల యూజర్లు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెయిల్ సర్వీసు కూడా ఇదే.
గూగుల్ మ్యాప్స్(Google Maps)
ఎక్కడికైనా వెళ్తే కచ్చితంగా మ్యాప్స్ ఆన్ చేస్తాం. ఇలా మనకు తెలియకుండానే నిత్యజీవితంలో భాగమైంది గూగుల్ మ్యాప్స్. 2005 ఫిబ్రవరి 8న మ్యాప్స్‌ని లాంచ్ చేసింది గూగుల్.
యూట్యూబ్(YouTube)
యూట్యూబ్‌ని 2005 ఫిబ్రవరి 14న స్థాపించారు. జావెద్ కరీం, స్టీవ్ చెన్, చాంద్ హర్లీ కలిసి ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కి పురుడు పోశారు. గూగుల్ దీనికి పేరెంట్ కంపెనీగా వ్యవహరిస్తోంది. గూగుల్ తర్వాత అత్యధికంగా ఓపెన్ చేసే యాప్ ఇదే కావడం గమనార్హం.
రెడిట్(Reddit)
సోషల్ న్యూస్ అగ్రిగేషన్ యాప్ ఇది. ఇందులో ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. దీనిని 2005 జూన్ 23న స్థాపించారు.
ట్విటర్(Twitter)
2006 మార్చి 21న ట్విటర్ ఎస్టాబ్లిష్ అయింది. ప్రస్తుతం దీని అధినేతగా ఎలాన్ మస్క్ వ్యవహరిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ట్విటర్‌కు దాదాపు 30 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు సమాచారం.
ఐఫోన్(iPhone)
2007 జూన్ 29న ఐఫోన్ మొదటి జనరేషన్ ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు 14 జనరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 2010లో తొలి ఐపాడ్ (iPad) అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్(Android)
ఇదొక ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుతం ఈ ఓఎస్‌తోనే మెజారిటీ స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నాయి. అయితే, ఆండ్రాయిడ్ 2008 సెప్టెంబర్ 23న రిలీజ్ అయింది.
క్రోమ్(Chrome)
ఇదొక వెబ్ బ్రౌజర్. 2008లో దీనిని తీసుకొచ్చారు. తొలుత మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రవేశపెట్టారు. అనంతరం, ఐఓఎస్, లైనక్స్, మ్యాక్ఓస్ వెర్షన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఇది డీఫాల్ట్ యాప్.
వాట్సాప్(Whatsapp)
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2009 నవంబర్‌లో లాంచ్ అయింది. బ్రియాన్ ఆక్టన్, జాన్ కోయుమ్ దీనిని స్థాపించారు. అనంతరం, మార్క్ జుకర్‌బర్గ్ దీనిని హస్తగతం చేసుకున్నారు.
ఇన్‌స్టాగ్రాం(Instagram)
వీడియో, ఫొటో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఇది. ఈ యాప్ వచ్చింది కూడా పన్నెండేళ్ల కిందటే. 2010 అక్టోబర్ 6న తొలుత ఇన్‌స్టాగ్రాం రిలీజైంది. ఇన్‌స్టాగ్రాంను ఫేస్‌బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కొనుగోలు చేసింది.
మరికొన్ని..
టిక్ టాక్(TikTok) 2016 సెప్టెంబర్
మెసెంజర్(Messenger) 2011 ఆగస్టు 9
అమెజాన్ ప్రైమ్(Amazon Prime) 2006 సెప్టెంబర్ 7
స్నాప్‌చాట్(Snapchat) 2011 జులై 8
జూమ్(Zoom) 2012 సెప్టెంబర్ 10
స్కైప్(Skype) 2003 ఆగస్టు 29
టెస్లా(Tesla) 2003 జులై 1
స్పాటిఫై(Spotify) 2006 ఏప్రిల్ 23
ఉబర్(Uber) 2009 మార్చి
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!