• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Iswarya menon: ఈ అందానికి మగజాతి ఫిదా కావాల్సిందే.. హాట్ పిక్స్‌తో కాక రేపుతున్న ఐశ్వర్య

  తమిళనాడులో పుట్టి, పెరిగిన ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పట్టా పొంది ఊహించని విధంగా సినీ రంగ ప్రవేశం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. కవ్వించే అందాలతో ఐశ్వర్య మీనన్ కుర్రకారు మతి పోగొడుతోంది. పొట్టి పొట్టి బట్టలతో తన అందచందాలను చూపిస్తూ తనకంటూ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది ఐశ్వర్య మీనన్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందీ తమిళ పొన్ను. అసలు సినిమాల్లోకి వస్తానని ఐశ్వర్య మీనన్ కలలో … Read more

  యాడ్స్‌పై మెటా గుడ్‌ న్యూస్‌

  ఇన్‌స్టాగ్రాం, ఫేసుబుక్‌, మెసెంజర్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకపై వివిధ రకాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లు, అడ్వర్టయిజ్‌మెంట్లపై కంట్రోల్ ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా అకౌంట్‌ సెంటర్‌ను ప్రవేశపెడుతోంది. అకౌంట్‌ సెంటర్‌ ద్వారా వ్యక్తిగత విషాలు, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ, యాడ్‌ ప్రిఫరెన్స్‌లు ఇలా అన్నింటినీ మేనేజ్‌ చేసుకోవచ్చు. ప్రతీ యాప్‌లో వేర్వేరుగా కాకుండా యాప్‌ సెంటర్‌లో మార్చుకోవడం ద్వారా అన్నింటికీ వర్తింపజేసుకోవచ్చు.

  ఇన్‌స్టా అలా..ట్విట్టర్‌ ఇలా ఏది బెటర్‌?: ఎలన్ మస్క్‌

  ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసిన నుంచి ఎలాన్‌ మస్క్‌ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక కామెంట్‌ చేసి సోషల్‌ మీడియాలో చర్చకు తెరలేపడం ఆయనకు అలవాటపోయింది. ఇతర సామాజిక మాధ్యమాల మీద ట్రోల్స్‌, విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ ట్వీట్‌లో “ ఇన్‌స్టా గ్రాం జనాన్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ట్విట్టర్‌ జనానికి కోపం తెప్పిస్తోంది. ఈ రెండింటిలో ఏది బెటర్?” అంటూ ప్రశ్నించాడు. దీనికి జనం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

  లవ్ బాబాను నమ్మింది.. నట్టేట మునిగింది..

  ఇన్‌స్టాగ్రామ్‌లో లవ్ ఆస్ట్రాలజర్‌ను నమ్మి ఓ యువతి రూ.47 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక ప్రకటన ఆకట్టుకుంది. ఆ ఫోన్ నంబర్‌ను సంప్రదించి తన సమస్యలు చెప్పుకుంది. తన జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. ఇందుకోసం రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతడు దఫదఫాలుగా రూ.47 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

  ఐసీసీ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

  ఐసీసీ రూపొందించిన ఓ ఇన్‌స్టా వీడియోపై కోహ్లీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇండియా ఫ్యాన్స్ కోసం రోహిత్, రాహుల్, సూర్య కుమార్ యాదవ్, చాహల్‌లతో ఐసీసీ డిజిటల్ విభాగం ఓ వీడియో క్రియేట్ చేసింది. ‘భారత్‌కు మద్దతు తెలిపేందుకు మీరు సిద్ధమా’ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాట్ లేనిదే టీమిండియా లేదు’, ‘ఇందులో కింగ్(విరాట్) ఎక్కడ?’ అని కామెంట్లు చేస్తున్నారు. సానుకూల దృక్పథంతోనే ఐసీసీ దీనిని రూపొందించినా.. ప్రస్తుతం ఇన్‌స్టాలో … Read more

  ఇన్‌స్టాలో రికార్డు సృష్టించిన రామ్‌చరణ్

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో రికార్డు సృష్టించాడు. ఇన్స్టాగ్రామ్ లో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలో 9 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్న హీరోగా చరిత్రకెక్కాడు. RRR మూవీతో రామ్‌చరణ్ క్రేజ్ ఇండియా వైడ్‌గా పెరిగింది. దీంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య కూడా గణనీయంగా ఎగబాకింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వత చరణ్ ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

  ఒరిజినల్‌ ID కార్డ్‌ ఉంటేనే ఇన్‌స్టా అకౌంట్‌

  దేశంలో ఇకపై ఇన్‌స్టాగ్రాం అకౌంట్ కావాలంటే ఒరిజినల్‌ ఐడీ కార్డ్‌ ఉండాల్సిందే. పుట్టిన తేదీ ధ్రువీకరిస్తేనే ఇన్‌స్టాగ్రాం ప్రొఫైల్‌ క్రియేట్‌ అవుతుంది. లేదా వీడియో సెల్ఫీ ద్వారా వయసు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దేశంలో చిన్న పిల్లలు తప్పుడు డేట్‌ ఆఫ్‌ బర్త్‌తో ప్రొఫైల్స్ క్రియేట్‌ చేసి వాడుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో 18+ వయసు వారికి మాత్రమే ఉండే కంటెంట్‌ను చిన్నపిల్లలు చూసి తప్పుదారి పడుతున్నారు. దీనిని నివారించేలా మెటా టెస్టింగ్‌ ప్రారంభించింది.

  అసంత‌ృప్తితో రవి బిష్ణోయ్..?

  ప్రపంచకప్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన రవి బిష్ణోయ్ ఇన్‌స్టాగ్రాం పోస్టు ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ‘సూర్యుడు ఉదయిస్తాడు. మేం మళ్లీ ప్రయత్నిస్తాం’ అని తన ఇన్‌స్టా ఖాతాలో ఈ స్పిన్నర్ స్టోరీ పోస్ట్ చేశాడు. స్టాండ్‌బై గా ఎంపిక చేయడంతో కాస్త అసంతృప్తి చెంది.. ఈ పోస్టు పెట్టాడేమో అనే చర్చ నడుస్తోంది. మరికొందరేమో ఇండియా మ్యాచ్ గురించి ఇలా పెట్టి ఉంటాడని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. Screengrab Instagram: © ANI Photo(file)

  కష్టపడండి.. విజయం సాధించండి

  రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. లైగర్ సన్నాహకాల్లో భాగంగా చేసిన వీడియోను విజయ్ షేర్ చేశాడు. ‘కష్టపడండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. నూతన నైపుణ్యాలు తెలుసుకోండి. తప్పుల నుంచి నేర్చుకోండి. విజయాన్ని సాధించండి. ఆనందంగా జీవించండి’ అని అందులో రాశాడు. ఈ పోస్టు స్ఫూర్తి కలిగించేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని చూడటానికి Watch On బటన్‌పై క్లిక్ చేయండి. View this post on Instagram A post … Read more

  బగ్‌ని గుర్తించినందుకు రూ.38.5లక్షలు

  ఇన్‌స్టాగ్రాంలో బగ్‌ని కనిపెట్టి రూ.38.5లక్షల పారితోషికం పొందాడు జైపుర్‌కి చెందిన నీరజ్‌శర్మ. ఇతరుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లేకుండానే వారి రీల్స్‌లోని తంబ్‌నెయిల్‌ని మార్చే బగ్‌ని నీరజ్ గుర్తించాడు. ఈ లోపాన్ని ఫేస్‌బుక్ సంస్థకు సూచించగా.. డెమో ఇవ్వాలని విద్యార్థికి పిలుపొచ్చింది. దీంతో డెమో చేసి నీరజ్ పంపించగా.. లోపాన్ని అంగీకరించి మెటా సంస్థ భారీగా నజరానా ప్రకటించింది. ఈ ప్రక్రియకు జరిగిన ఆలస్యానికి మరో రూ.3.5లక్షలు అదనంగా సమకూర్చింది.