ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయితే ఇలా చేయండి?
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్ ఖాతాలను హ్యాక్ చేసి మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. మరి కొందరు అసభ్య చిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లయితే ఈ టిప్ ఫాలో అయితే సింపుల్‌గా అకౌంట్‌ను రికవరీ చేసుకోచ్చు.. ముందుగా వెబ్‌బ్రౌజర్‌లో facebook.com/hacked అని సెర్చ్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే My account is compromisedపై క్లిక్ చేయండి. తర్వాత కనిస్తున్న దానిలో ఇ-మెయిల్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫేస్‌బుక్ ఖాతాను తిరిగిపొందొచ్చు.