• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐఫోన్‌ యూజర్లకు ట్విట్టర్‌ బ్లూటిక్ మరింత ఖరీదు

  ఐఫోన్‌ యూజర్లకు ట్విట్టర్‌ షాక్‌ ఇచ్చంది. ట్విట్టర్‌ బ్లూ టిక్‌ను మరింత ఖరీదు చేయనుంది. సోమవారం ఐఫోన్ కోసం కొత్త ట్విట్టర్‌ సర్వీస్‌ను లాంచ్‌ చేయనుంది. ఇందులో ట్వీట్లను ఎడిట్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. 1080p వరకు వీడియోస్‌ను అప్లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే యాపిల్‌ యూజర్లకు మాత్రమే ఎందుకు రేటు పెంచుతున్నారనేదానిపై ట్విట్టర్ స్పష్టతనివ్వలేదు.

  ఐఫోన్ల తయారీ సంస్థకు నిరసన సెగ

  చైనాలో యాపిల్ ఫోన్ల ప్రధాన భాగస్వామి ఫాక్స్ కాన్ కు కార్మికుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. జీతాలు ఇవ్వటం లేదని, బయటకు పంపడం లేదని కార్మికులు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో యాజమాన్యం క్షమాపణ చెప్పింది. కొవిడ్ కారణంగా లక్షల మంది వెళ్లిపోవటంతో కొత్త సిబ్బందిని నియమించుకున్నారు. ఇందులో లోపం గుర్తించామని మెుదట చెప్పిన విధంగా డబ్బులు చెల్లిస్తామని ప్రకటించింది.

  నేటి ముఖ్యాంశాలు @9AM

  త్వరలోనే ఐఫోన్‌లో 5జీ ట్రయల్స్ పెరిగిన బంగారం ధరలు సౌతాఫ్రికాతో నేడు పాకిస్థాన్ కీలక మ్యాచ్ ఇప్పుడు ఆనందంగా ఉన్నా: విరాట్ TS: మునుగోడులో పోలింగ్ ప్రారంభం TS: పాల్వాయి స్రవంతిపై ఫేక్ ప్రచారం AP: గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు AP: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్

  త్వరలోనే ఐఫోన్‌లో 5జీ బీటా ట్రయల్స్

  దేశంలో 5జీని సపోర్ట్ చేసే ఐఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని విడుదల చేస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే, తొలుత ప్రయోగాత్మకంగా బీటా వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. ఈ మేరకు వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కోరింది. నాణ్యత, వేగం వంటి విషయాలపై తమ అభిప్రాయాలను చెప్పాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. సూచనల ఆధారంగా సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో తగిన మార్పులు చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్‌లపై యాపిల్ పరీక్షిస్తోంది. ఐఫోన్ 12, 13, 14, ఎస్ఈ(3వ తరం) ఫోన్లలో 5జీ సపోర్ట్ … Read more

  రేపటి నుంచే వాట్సప్ సేవలు బంద్

  భద్రతాపరమైన లోపాల కారణంగా కొన్ని ఫోన్లలో తమ సేవలను వాట్సప్ నిలిపివేయనున్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచే ఇది అమలులోకి రానుంది. ఆండ్రాయిడ్ 4.0.4 సాఫ్ట్‌వేర్ వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు ఇకపై వాట్సప్ పనిచేయదు. అలాగే ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఓఎస్‌‌తో పనిచేస్తున్న ఐఫోన్లలో కూడా వాట్సప్ యాప్‌ని వినియోగించేందుకు వీలు లేదు. వీరు సాప్ట్‌వేర్‌ని అప్డేట్ చేసుకుంటేనే వాట్సప్ పనిచేసే వీలుంది. దీంతో యూజర్లను వాట్సప్ మరోసారి అప్రమత్తం చేసింది.

  ఈ ఫోన్లలో వాట్సప్ బంద్

  దీపావళి నుంచి కొన్ని ఫోన్లలో ‘వాట్సప్’ యాప్ ఇక పనిచేయదు. ఐఫోన్ యూజర్లలో ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఉన్న ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ ఫోన్లలో ఇక వాట్సప్ తన సేవలను విరమించుకోనుంది. ఇటు ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ కలిగిన మొబైల్ ఫోన్లలోనూ వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఈ ఫోన్లలో అధునాతన సాఫ్ట్ వేర్ లేకపోవడం వల్లే వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌ని నవీకరించుకోవడం లేదా కొత్త ఫోన్ కొనుగోలు చేయడం వల్లే వాట్సప్‌ని తిరిగి ఉపయోగించొచ్చు. పాత వెర్షన్‌తోనే … Read more

  తొలి తరం ఐఫోన్‌కు వేలంలో రూ.32 లక్షలు

  యాపిల్ కంపెనీ ఫోన్లు అత్యంత ఖరీదైనవని మనకు తెలుసు. దీనిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ కూడా చేస్తుంటాం. కానీ ఆ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌, వాళ్లిచ్చే ఫీచర్స్‌కు వీరాభిమానులు ఉంటారు. అందుకే ఎంతైనా పెట్టి కొంటారు. అయితే అలా లేటెస్ట్‌ ఫోన్‌ను ఫీచర్ల కోసం కొనడం ఓకే గానీ….ఐఫోన్‌ తొలితరం ఫోన్‌ అంటే 2007లో స్టీవ్‌ జాబ్స్‌ లాంచ్‌ చేసిన ఫోన్‌ రూ.32 లక్షలకు పైగా ధర పలికింది. బాక్స్‌తో పాటు అలాగే ఉన్నఅప్పటి ఫోన్‌కు వేలం వేయగా ఈ ధర పలికినట్లు CNET … Read more

  యాపిల్ iOS 16లో ఎన్ని కొత్త ఫీచ‌ర్లో !

  యాపిల్ కంపెనీ స‌రికొత్త పీచ‌ర్ల‌తో ఐఓఎస్ 16ను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నుంది. తాజాగా దీనికి సంబంధించిన బీటీ వ‌ర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో యూజ‌ర్ల సౌల‌భ్యం కోసం చాలా ర‌కాల కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తుంది. లాక్‌స్క్రీన్ క‌స్ట‌మైజేష‌న్‌, మెసేజ్ పంపిన త‌ర్వాత 15 నిమిషాల వ‌ర‌కు ఎడిట్ చేసుకోవ‌డం లేదా అన్‌సెండ్ చేసే ఆప్ష‌న్ ఉంటుంది. ఫుల్‌స్క్రీన్ మ్యూజిక్ ప్లేయ‌ర్, ఐక్లౌడ్ ఫోటో లైబ్ర‌రీ, గేమ్స్ కోసం బ్లూటూత్ గేమింగ్ కంట్రోల్స్ ఉంటాయి. యాపిల్ పే ద్వారా ఆర్డ‌ర్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ కోసం సెన్స‌ర్ల … Read more

  సైనికుడి ప్రాణాల‌ను కాపాడిన ఐఫోన్

  ఒక ఐఫోన్ ఉక్రెయిన్ సైనికుడి ప్రాణాల‌ను కాపాడింది. గ‌త కొంత‌కాలంగా ర‌ష్యా ద‌ళాలు ఉక్రెయిన్‌పై దాడి జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల‌ను ఆక్ర‌మించికున్న ర‌ష్యా ఉక్రెయిన్‌పై పూర్తి ప‌ట్టు బిగించేందుకు యుద్ధం కొన‌సాగిస్తుంది. శ‌నివారం ర‌ష్యా ద‌ళాల చేతిలో 16మంది ఉక్రెయిన్ సైనికులు మృత్యువాత‌ప‌డ్డారు. అయితే ఒక సైనికుడిని మాత్రం అత‌డి ఐఫోన్ కాపాడింది. ర‌ష్యా సైనికులు తుపాకితో కాల్చిన‌ప్పుడు ఉక్రెయిన్ సైనికుడి బ్యాగులో ఉన్న ఐఫోన్ 11ప్రో మొబైల్‌కు బుల్లెట్ త‌గిలింది. దీంతో అత‌డికి ఏం కాలేదు. ఒక‌వేళ ఆ … Read more

  ఇండియాలో లాంచ్ అయిన ఐఫోన్ కొత్త ప్రొడక్ట్స్

  ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ ఈనెల 8వ తేదీన ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో పలు ప్రొడక్ట్స్‌ను కంపెనీ విడుదల చేసింది. అందులో మొదటగా ఐఫోన్ ఎస్ఈ 3 మొబైల్‌ను విడుదల చేయగా.. ఐప్యాడ్ ఎయిర్ 5, మ్యాక్ మినీ ఇలా పలు ప్రోడక్ట్స్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 3 ఇండియా ధరను రూ.43,900గా నిర్ణయించారు. ఇందులో యాపిల్ బివోనిక్ A15 చిప్సెట్ ఉండనుంది. దీంతో పాటు ఐప్యాడ్ ఎయిర్ 5ను కూడా లాంచ్ … Read more