• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అద్దె చెల్లించటం లేదని ట్విటర్‌పై దావా

  శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదని భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. కాలిఫోర్నియా స్టేట్‌ కోర్టులో దావా వేశారు. 1355 మార్కెట్‌ స్ట్రీట్‌లోని ఓ పెద్ద భవనంలో ట్విటర్ 4,60,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీనికి డిసెంబర్ నెలకుగాను 3.36 మిలియన్ డాలర్లు, జనవరి నెలకు 3.42 మిలియన్ డాలర్ల అద్దె చెల్లించాలి. ఇది సకాలంలో ఇవ్వకపోవటంతో యజమాని కోర్టుకెక్కారు.

  ఇన్‌స్టా అలా..ట్విట్టర్‌ ఇలా ఏది బెటర్‌?: ఎలన్ మస్క్‌

  ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసిన నుంచి ఎలాన్‌ మస్క్‌ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక కామెంట్‌ చేసి సోషల్‌ మీడియాలో చర్చకు తెరలేపడం ఆయనకు అలవాటపోయింది. ఇతర సామాజిక మాధ్యమాల మీద ట్రోల్స్‌, విమర్శలు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ ట్వీట్‌లో “ ఇన్‌స్టా గ్రాం జనాన్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ట్విట్టర్‌ జనానికి కోపం తెప్పిస్తోంది. ఈ రెండింటిలో ఏది బెటర్?” అంటూ ప్రశ్నించాడు. దీనికి జనం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

  బాలయ్య దెబ్బకు ఇంటర్నెట్ షేక్

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ జనవరి 12 రిలీజ్ కానుంది. ఈ క్రమంలో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘జై బాలయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘నందమూరి బాలకృష్ణ’ హ్యాస్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. బాలయ్య ఫ్యాన్స్ బెనిఫిట్ షోకు సంబంధించి స్క్రీన్‌షాట్‌లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గురువారం తెల్లవారుఝాము నుంచే సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు.

  ట్విటర్‌లో భారీ మార్పులు

  ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌లో భారీ మార్పులు జరగనున్నాయి. వచ్చే వారంలోగా మార్పులను అందుబాటులోకి తీసుకువస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. ముఖ్యంగా రికమెండెడ్ vs ఫాలోడ్‌ ట్వీట్లను తేలికగా కదల్చడం, యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు, ట్వీట్ వివరాల కోసం బూక్‌మార్క్ బటన్‌, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి సౌకర్యాలు కల్పించనున్నారట. ఇందులో కొన్ని ఈ చివరివారంలోనే తీసుకువస్తామని మస్క్ వెల్లడించారు.

  మళ్లీ నిలిచిపోయిన ట్విటర్ సేవలు

  ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విటర్‌లో మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొంతసేపు ట్విటర్ సేవలకు అంతరాయం కలిగింది. వేలాది మంది యూజర్లు మెస్సేజ్‌లు, ట్వీట్లు సెండ్ చేయడం కుదరక అవస్థలు పడ్డారు. గురువారం ఉదయం 6.05 నిమిషాలను నుంచి సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు డౌన్ డిటెక్టర్‌లో 10 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతోనే తరచుగా ట్విటర్‌లో సేవలు నిలిచిపోతున్నట్ల తెలుస్తోంది.

  ట్విటర్‌కు కొత్త సీఈఓ దొరికేశాడు !

  ట్విటర్‌కు కొత్త సీఈఓ కోసం వెతుకుతున్న ఎలాన్ మస్క్‌కు సామాజిక మాధ్యమాల నుంచి రోజుకో కొత్త అనుభవం ఎదురవుతుంది. కొందరు తాము సీఈఓగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పోస్ట్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్‌ చూసి మస్క్ షాకయ్యాడు. ఎలాన్‌ ఫోటోకు కళ్లజోడు, మీసాలు పెట్టి…ట్విటర్ కొత్త సీఈఓ నోల్‌ను చూడండి అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన టెస్లా అధినేత..ఇతడు అద్భుతంగా ఉన్నాడని అన్నారు.

  ట్విటర్ లేబుల్స్‌, బ్యాడ్జిల్లో మార్పులు

  ట్విటర్ వేరిఫైడ్‌ ఖాతాల లేబుల్స్‌, బ్యాడ్జ్‌లకు సంబంధించి మార్పులు జరగనున్నాయి. బిజినెస్, ప్రభుత్వ ఖాతాలను సులువుగా గుర్తించేందుకు వేర్వేరు బ్యాడ్జ్‌లు, లేబుల్స్‌ ఇవ్వనున్నారు. బ్లూ, గోల్డ్‌కు బదులు ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్‌ కేటాయిస్తారట. బిజినెస్‌ వాటికి గోల్డ్‌ కలర్‌తో పాటు లోగో గుండ్రటి ఆకారంలో కాకుండా చతురస్త్రాకారం ఉంటుందని చెప్పారు. బ్లూ టిక్ ఇవ్వటమే కాదు వాటిని వైరిఫై చేయనున్నారట. ప్రభుత్వ ఖాతాలు బ్లూటిక్ కొనాలా? వద్ద అనే విషయంలో స్పష్టత లేదు.

  ‘బ్లూ’ టిక్ వారికి మాత్రమే ఆ అవకాశం

  ట్విటర్‌లో విధానపరమైన నిర్ణయాలపై ‘బ్లూ’ టిక్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పోల్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు ట్విటర్ తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. కాగా ట్విటర్‌ సీఈఓగా మస్క్ పదవిలో కొనసాగాలా? వద్దా? అన్న పోల్ ముగిసింది. దాదాపు 1.7 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో 57 శాతం మంది వైదొలగాలి అని.. 43 శాతం మంది కొనసాగాలి అని ఓట్లు వేశారు. ఈ ఫలితాలపై ఎలన్ మస్క్ ఇంకా స్పందించలేదు.

  నేనెప్పటికీ సంపన్నుడిని కాలేను: ఆనంద్

  సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. ‘మీరెప్పుడు అత్యుత్తమ సంపన్నుడు అవుతారు’ అని ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించగా.. ‘నిజమే.. నేనెప్పటికీ నెం.1 సంపన్నుడిని కాలేను. ఎందుకంటే అలా అవ్వాలనేది నా ఆశయం కాదు’ అని హిందీలో బదులిచ్చారు. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 2.1బిలియన్ డాలర్లతో ఆనంద్ మహీంద్రా 91వ స్థానంలో ఉన్నారు. ఇక ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రాకు కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.