మిల్క్ బ్యూటీ తమన్నా ట్విట్టర్ లో తళుక్కున మెరిసింది. చాలా రోజుల తర్వాత ఈ అందాల భామ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయింది. ‘ఏదైనా అడగండి నేను సమాధానం ఇస్తాను. ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యాను. ఏదైన మాట్లాడుకుందాం’ అంటూ స్టార్ట్ చేసింది. దీంతో ఆమెపై ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె పర్సనల్ విషయాలతో మొదలు అన్నింటిపై చర్చించారు. ఆ చిట్ చాట్ పై ఓ లుకెద్దాం..
ఫ్యాన్: మీ మెరిసే చర్మం రహస్యం?
తమన్నా: మంచి పోషకాహారం, తగినంత విశ్రాంతి మెరుగైన దినచర్య
ఫ్యాన్: మీరు అదృష్టాన్ని నమ్ముతారా?
తమన్నా: నా దృష్టిలో అదృష్టం అంటే కష్టపడి పనిచేయడం.
ఫ్యాన్: భోళా శంకర్ మూవీలో బాస్ చిరంజీవితో డ్యాన్స్ నంబర్‌ని ఆశించవచ్చా?
తమన్నా: మీరు నిరాశ చెందరని మీకు ప్రామీస్ చేస్తున్నా.
ఫ్యాన్: చీరలు లేక వెస్టర్న్ ?
తమన్నా: రెండింటిలో ఒకటి ఎంచుకోవడమంటే చాలా కష్టం
ఫ్యాన్: ఎఫ్3 సెకండాఫ్‌లో మేల్ రోల్ చేసిన అనుభవం ఎలా ఉంది?
తమన్నా: ఈ రోల్ చేయడం వల్ల నాలోని రౌడీ బయటకు వచ్చింది
అందులోని ప్రతి బిట్‌ని ఆస్వాదించాను.
ఫ్యాన్: మీకు ఇష్టమైన సినిమాలు ఏవి ? యాక్షన్/రొమాంటిక్/సస్పెన్స్ థ్రిల్లర్?
తమన్నా: యాక్షన్ అండ్ రోమాన్స్
ఫ్యాన్: మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన పాస్ టైమ్ ఏది?
తమన్నా: చదవడం, పాడ్‌క్యాస్ట్‌లు వినడం, వర్షంలో డ్యాన్స్ చేయడం..
ఫ్యాన్: మీరు పూర్తి స్థాయి డాన్స్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
తమన్నా: నేను కూడా వేయిట్ చేయలేకున్నా… ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి.
ఫ్యాన్: మీరు స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకుంటారు ? ఎందుకంటే నవంబర్ కథ ఇప్పటికీ మేము చూసిన బలమైన స్క్రీన్‌ప్లేలో ఒకటి. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అలా చూస్తామని ఆశిస్తున్నాం.
తమన్నా: నా హృదయానికి హత్తుకునే సబ్జెక్ట్స్ కోసం నిరంతం అన్వేషిస్తూ ఉంటాను. ఆ కథాంశాలు మిమ్మల్ని అలరించడంలో సహాయపడాలి.
ఫ్యాన్: మీ ఫేవరెట్ బ్రెక్ ఫాస్ట్ ?
తమన్నా: అన్నిరకాల దోశలు.. యమ్మీ.. యమ్మీ..
ఫ్యాన్: స్కూల్/కాలేజ్ డేస్‌లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది?
తమన్నా: లిటరేచర్, కెమిస్ట్రీ, హిస్టరీ
ఫ్యాన్: ఇప్పటి వరకు ఒక నటిగా మీకు ప్రత్యేకమైన పాత్ర ఏది?
తమన్నా: ధర్మధురైలోని శుభాషిణి, బాహుబలిలోని అవంతిక పాత్రలను ఆస్వాదించాను
ఫ్యాన్: కేన్స్ పర్యటన నుంచి నేర్చుకున్న విషయాలు ఏమిటి?
తమన్నా: నిజంగా అద్భుతం. భారత ప్రతినిధి బృందంలో భాగం కావడం చాలా గౌరవప్రదమైన విషయం, ముఖ్యంగా ఈ ఏడాది భారత్ భాగస్వామి దేశంగా ఉంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి