భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన RRR చిత్రంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సక్సెస్‌పుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే అభిమానులు, సినీ విమర్శకులు, సెలబ్రిటీలు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ RRR మూవీ రివ్యూను ఒకే వర్డ్‌లో చెప్పాడు. మూవీ చూసిన వెంటనే ట్విట్టర్‌లో ‘TERRRIFIC’ అంటూ ట్విట్ చేశాడు. RRR చిత్రం మనిషిలోని భావోద్వేగాలను, దేశభక్తిని తట్టిలేపే చిత్రం. ఈ మూవీ మరో సూపర్ సక్సెస్ సాధిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ మూవీపై దాదాపు అందరూ పాజిటివ్ టాక్‌నే వెల్లబుచ్చుతుండగా.. ఒక్కరిద్దరూ మూవీ బాగోలేదంటూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. దేశవ్యాప్తంగా RRR మూవీ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవ్‌గన్ కూడ కీలక పాత్రలు పోషించారు.