వాట్సాప్(Whatsapp) నుంచి సరికొత్త ఫీచర్ రానుంది. ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు లేటెస్ట్ ఫీచర్‌ని డెవలప్ చేసింది. చాట్‌లోనే వీడియోలను రికార్డ్ చేసి పంపించుకునేందుకు వీలుగా వాట్సాప్ వీడియో మెసేజ్ ఫీచర్(Video Message Feature)ని ఇప్పటికే బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది.
ఏంటీ ఫీచర్?
ప్రస్తుతం వాట్సాప్ యూజర్లకు వాయిస్ మెసేజ్ ఫీచర్ అందుబాటులో ఉంది. చాట్ చేస్తున్న సమయంలో ఇన్‌స్టంట్‌గా వాయిస్ రికార్డ్ చేసి పంపించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అచ్చం ఇలాగే వీడియోలు కూడా రికార్డ్ చేసి సెండ్ చేయొచ్చు. 60 సెకన్ల లోపు నిడివి ఉండే వీడియోలను అప్పటికప్పుడు లైవ్ రికార్డ్ చేసి పంపించొచ్చు. కచ్చితంగా ఫోన్ కెమెరాతో తీసిన వీడియోలనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. స్టోర్ చేసిన వీడియోలను పంపనివ్వదు.
ఎక్కడ ఉంది?
వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ బటన్ ఉన్న చోటునే ఈ వీడియో మెసేజ్ ఫీచర్ బటన్‌ని రీప్లేస్ చేయనున్నారు. వీడియో నుంచి ఆడియోకి; ఆడియో నుంచి వీడియో రికార్డింగ్ ఫీచర్‌కి మారాలంటే ఈ బటన్‌పై ట్యాప్ చేస్తే చాలు. ఆటోమేటిగ్‌గా ఫీచర్ ఆప్షన్ స్విచ్ అవుతుంది. మెసేజ్ టైప్ బాక్స్‌కి కుడివైపున ఈ బటన్ ఉంటుంది.
ఫేక్ వీడియోలకు చెక్..
వాట్సాప్‌లో పాత వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతాయి. అవి లేటెస్ట్/ లైవ్ వీడియోలో? లేదా పాత వీడియోలో తెలుసుకోవడం కాస్త కష్టం. దీంతో, ఈ వీడియో మెసేజ్ ఫీచర్ ఉపయోగించి సెండ్ చేస్తే కచ్చితంగా అది లేటెస్ట్ వీడియో అని తేలిపోతుంది. వీడియో మెసేజ్ రిసీవర్‌కి ఈ విషయం తెలిసిపోతుంది. వీడియోను ఓపెన్ చేయాలంటే మెసేజ్‌పై ట్యాప్ చేయాలి. బై డీఫాల్ట్‌గా వీడియో మ్యూట్ అయ్యి ఉంటుంది.
వాట్సాప్‌కి నో యాక్సెస్..
వాట్సాప్ ప్రైవసీకి పెద్దపీట వేస్తోంది. సాధారణంగా రికార్డ్ చేసే ఆడియో, వీడియో ఫైల్స్‌ని వాట్సాప్ యాక్సెస్ చేస్తుంది. కానీ, ఈ వీడియో మెసేజ్ ఫీచర్‌తో పంపించిన వీడియోలను వాట్సాప్ యాక్సెస్ చేయలేదు. దీంతో యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లదు. వ్యక్తిగత వీడియోలు పంపించుకోవడం సులువు. రిసీవర్ తప్ప ఇతరులెవరూ ఈ వీడియోలను చూసేందుకు వీలుండదు. ఫార్వర్డ్ కూడా చేయలేరు. అయితే, సెండర్ పంపిన వీడియోను రిసీవర్ స్క్రీన్ రికార్డ్ చేసి షేర్ చేసే వెసులుబాటుని కల్పించింది.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్
యూజర్ చాట్‌లలో చేసే మెసేజులు, ఇమేజ్, వీడియోలు, ఇతర ఫైల్స్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతున్నాయి. వీటి మాదిరే వీడియో మెసేజ్ ఫీచర్ ఉపయోగించి పంపే మెసేజ్‌లు కూడా ఎన్‌క్రిప్ట్ అవుతాయని వాట్సాప్ వెబ్‌సైట్ వాబీటాఇన్ఫో(WABetaInfo) తెలిపింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్