• TFIDB EN
  • భూ
    UATelugu1h 34m
    కియారా (రకుల్ ప్రీత్ సింగ్) ఆమె స్నేహితులు హాలోవీన్ వేడుక సందర్భంగా హాలోవీన్ స్టోరీస్ ఉన్న మర్మమైన పుస్తకాన్ని చదువుతారు. బుక్‌లోని అన్ని అధ్యాయాలు చదవాలని తొలి పేజీలోనే రాసి ఉంటుంది. ఒక్కో అధ్యాయ్యాన్ని ఆపకుండా చదువుతున్న క్రమంలో అందులోని పాత్రలు వీరికి ప్రత్యక్షమవుతుంటాయి. ఈ అసాధారణ పరిస్థితులను, పుస్తకంలోని రహస్యాలను, స్నేహితుల అనుభవాలను ఈ సినిమా ఆవిష్కరించింది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinemaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రకుల్ ప్రీత్ సింగ్
    కియారా
    విశ్వక్ సేన్
    ఆకాష్
    రెబా మోనికా జాన్
    మీరా
    నివేదా పేతురాజ్
    వానతి
    మంజిమా మోహన్
    జానో
    మేఘా ఆకాష్
    మాళవిక
    విద్యుల్లేఖ రామన్
    కావ్య
    పృధ్వీ రాజ్
    పోలీసు
    సిబ్బంది
    ఎ.ఎల్.విజయ్
    దర్శకుడు
    జ్యోతి దేశ్‌పాండే
    నిర్మాత
    రామాంజనేయులు జవ్వాజినిర్మాత
    ఎం. రాజ శేఖ‌ర్ రెడ్డినిర్మాత
    అనిల్ జైన్నిర్మాత
    జివి ప్రకాష్ కుమార్
    సంగీతకారుడు
    ఆంథోనీఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
    Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్‌ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే? 
    నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు. దర్శకుడు: పురుషోత్తం రాజ్ సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి విడుదల తేదీ : మార్చి 01, 2024 టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంట‌బ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వ‌ర‌కూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ డిటెక్టివ్‌ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్‌.. పురాణాల‌తో డిటెక్టివ్ క‌థ‌ని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో క‌థానాయ‌కుడిగా చేశాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేర‌కు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్‌ కిల్లర్‌ మహిళల్ని టార్గెట్‌ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్‌ డిటెక్టివ్‌ భాస్కర్‌ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్‌ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్‌ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే శివ కందుకూరి డిటెక్టివ్ పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. న‌ట‌న ప‌రంగానూ వైవిధ్యం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌థ‌మార్ధంలో స‌ర‌దా స‌న్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియ‌స్ స‌న్నివేశాల‌పైనా బ‌ల‌మైన ప్ర‌భావం చూపించాడు. అటు హీరోయిన్‌ రాశిసింగ్ చాలా అందంగా క‌నిపించింది. రిపోర్ట‌ర్ ల‌క్ష్మిగా ఆమెకీ కీల‌క‌మైన పాత్రే ద‌క్కింది. ష‌ఫి, దేవి ప్ర‌సాద్‌, శివ‌న్నారాయ‌ణ, శివ‌కుమార్ త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే  డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ రాజ్‌.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్‌ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్‌గా చూపించడం అంద‌రినీ క‌నెక్ట్ అయ్యేలా చేస్తుంది. హ‌త్య‌ల పూర్వాప‌రాలు, పోలీసుల ప‌రిశోధ‌న‌, ఆ కేసులోకి హీరో ప్ర‌వేశం, అత‌నికీ స‌వాల్ విసిరే ప‌రిశోధ‌న త‌దిత‌ర అంశాల‌న్నీ ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మ‌లుపులు మ‌రింత ఉత్కంఠ‌ని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్‌ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్‌ దర్శకత్వం ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, క‌ళ త‌దిత‌ర  విభాగాలన్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది.  నిర్మాణంలోనూ నాణ్య‌త క‌నిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనక‌థ‌లో పురాణ నేప‌థ్యంద్వితీయార్థం మైనల్‌ పాయింట్స్‌ ప్ర‌థ‌మార్థంలో కొన్ని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 02 , 2024
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.  ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5  
    మే 10 , 2024
    Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
    Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
    యంగ్‌ హీరోయిన్‌ రాశి సింగ్‌ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్‌ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.  రాశి సింగ్‌ పుట్టిన రోజు ఎప్పుడు?  రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్‌ సింగ్‌, సరితా సింగ్‌. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్‌ సింగ్‌.  రాశి సింగ్‌ విద్యాభ్యాసం ఎక్కడ? ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.  View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) రాశి సింగ్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్‌ హోస్టేస్‌ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌  (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.  రాశి సింగ్‌ వయసు ఎంత? రాశి సింగ్‌ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.  రాశి సింగ్‌ ఎత్తు, బరువు ఎంత?  రాశి సింగ్‌ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ  భామ బాడీ కొలతలు 32-26-34. రాశి సింగ్‌ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది.  ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.  రాశి సింగ్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఎయిర్‌ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.  రాశి సింగ్‌ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది? రాశి సింగ్‌ ఇంగ్లీష్‌, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.  రాశి సింగ్‌ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ? వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.  రాశి సింగ్‌ తెలుగులో ఫేవరేట్‌ హీరో ఎవరు? రాశిసింగ్‌ ఫేవరేట్‌ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.    రాశి సింగ్‌ మెుదటి సినిమా ఏది? తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. రాశి సింగ్‌ గుర్తింపు తెచ్చిన చిత్రం? ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.  రాశి సింగ్‌ మద్యం సేవిస్తుందా? లేదు. రాశి సింగ్‌ సిగరేట్‌ దాగుతుందా? లేదు. రాశి సింగ్‌ మాంసాహారం తింటుందా? అవును. రాశి సింగ్‌ చికెన్‌, మటన్‌తో చేసిన నాన్‌ వెజ్‌ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్‌? https://www.instagram.com/rashi.real/?hl=en ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు? ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
    మార్చి 05 , 2024
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    ఫిబ్రవరిలో లాస్ట్‌ వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. అయితే వ్యూహం, ఆపరేషన్ వాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గవి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శక్తి  ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిస్టారికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఇలాంటి సినిమాలు దేశ రక్షణ కోసం పొరాడే సైనికులకు నిజమై సెల్యూట్ అంటూ ప్రశంసించారు. భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana) శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. చారీ 111 (Chaari 111) స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం చారీ 111. ఈ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేయగా..సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ జనర్‌లో తెరకెక్కింది. చారీ 111 చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateAmbajipeta Marriage Band MovieTeluguAhaMarch 01Indigo MovieIndonesian CinemaNetflix Feb 27American Conspiracy: The Octopus MurdersSeries EnglishNetflix Feb 28Code 8 Part 2MovieEnglishNetflix Feb 28The Mire Season 3Series PolishNetflix Feb 28A Round of ApplauseSeriesTurkishNetflix Feb 29Man SooangMovieThaiNetflix Feb 29The Indrani Mukherjee Story: Buried TruthMovieHindiNetflix Feb 29Furies SeriesFrenchNetflix Feb 29Mamla Legal HighSeriesHindiNetflix March 01My Name is Loh KiwonMovieKoreanNetflix March 01Shake, Rattle & Roll: ExtremeMovieTagalogNetflix March 01Somebody Feed Phil Season 7 SeriesEnglishNetflix March 01Space ManMovieEnglishNetflix March 01The Pig The Snake and the PigeonMovieMandarinNetflix March 01The Netflix SlamMovieEnglishNetflix March 03Bootcut BalarajuMovieTeluguAmazon PrimeMarch 01Wedding Impossible SeriesKoreanAmazon PrimeFeb 26Anyone But YouMovieEnglishAmazon PrimeFeb 26Poor ThingsMovieEnglishAmazon PrimeFeb 27Blue StarMovieTamilAmazon PrimeFeb 29Paw Patrol: The Mythical MovieMovieEnglishAmazon PrimeFeb 29Iwaju SeriesEnglishDisney+hotstarFeb 28  ShogunSeriesEnglishDisney+hotstarFeb 28Wonderful WorldSeriesKoreanDisney+hotstarMarch 01Sunflower Season 2SeriesHindiZee 5March 01Five Nights at Freddy's MovieEnglishJio CinemaFeb 27
    ఫిబ్రవరి 26 , 2024
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.  కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ  ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా  టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌  నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా?
    నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.  అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.  టెక్నికల్‌గా  రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
    జూన్ 16 , 2023
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో  హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.  ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.  సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.  సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.  జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.  మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.  ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌  సిద్ధపడుతున్నట్లు  తెలుస్తోంది.  RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.  అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు. 
    ఏప్రిల్ 25 , 2023
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్‌ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్‌ తన క్రేజ్‌ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ హీరో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  హిస్టారికల్‌ మూవీ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో 'VD14' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. 'ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/MythriOfficial/status/1788443050177659232 భారీ అంచనాలు 'VD14' (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్‌ తొలిసారి చేయనున్న హిస్టారికల్‌ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా కొత్త మూవీ పోస్టర్‌ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ గతంలోనూ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్‌ చేసిన శ్యామ్ సింగరాయ్‌ మూవీ కూడా తెలుగు ఆడియన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.  ‘VD12’ నుంచి అప్‌డేట్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో 'VD12' చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్‌ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.  https://twitter.com/SitharaEnts/status/1788428225003278352 విజయ్‌ డేరింగ్ డెసిషన్‌! 'VD12' సినిమా కోసం హీరో విజయ్‌ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్‌ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 
    మే 09 , 2024
    Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?
    Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో 'రాజమౌళి' (SS Rajamouli) ఒకరు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ (Ramcharan) నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) స్క్రీనింగ్‌ కోసం ఇటీవలే రాజమౌళి తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని గురించి రాజమౌళి కుమారుడు కార్తికేయ (Karthikeya) స్వయంగా ప్రకటించడంతో అంతా ఆందోళన చెందారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.  కార్తికేయ ఏమన్నారంటే? ప్రస్తుతం రాజమౌళి.. జపాన్‌లో ఫ్యామిలితో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న బిల్డింగ్‌ మెుత్తం ఒక్కసారిగా ఊగిపోయినట్లు రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పారు. ‘జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో 28వ ఫ్లోర్‌లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంత సేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌‌‌ను ఫోటోను కార్తికేయ ఈ పోస్టుకు జత చేశారు.  https://twitter.com/ssk1122/status/1770613017081999768? ధైర్యం చెప్పిన జపనీయులు అయితే భూకంపం చూసి కాస్త ఆందోళన చెందిన రాజమౌళి ఫ్యామిలీ (SS Rajamouli Family)కి స్థానిక జపానీయులు  ధైర్యం చెప్పారట. ఇక్కడ భూకంపం రావడం సాధారణమేనని పేర్కొన్నారట. వచ్చింది భారీ భూప్రకంపనలు కాదూ అంటూ వారిని కూల్‌ చేసే ప్రయత్నం చేశారట. అటు కార్తికేయ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కూడా కాస్త టెన్షన్ పడ్డారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌‍గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జపాన్‌లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3 రిక్టర్‌ స్కేల్‌పై నమోదైంద. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రాంతంలో గల ప్రిఫెక్చర్స్ ఏరియాలో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) రాజమౌళికి అదిరే ఆతిథ్యం ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమౌళికి జపనీయులు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు జపనీయులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కి కూడా వచ్చారు. ఒక పెద్దావిడ అయితే రాజమౌళి కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. దీన్ని ప్రత్యేకంగా రాజమౌళి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఓ ఇండియన్ సినిమాకి జపాన్‌లో ఈ రేంజ్‌లో గుర్తింపు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సినిమాను ఇంతలా నెత్తిన పెట్టుకున్న జపనీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్‌తో తాను తీయబోతున్న చిత్రం విశేషాలు కూడా వారితో పంచుకున్నారు. సినిమా రిలీజ్‌ సమయానికి మహేష్‌ను కూడా తీసుకొచ్చి ప్రమేషన్స్‌ చేస్తానని జపనీయులకు దర్శకధీరుడు మాట కూడా ఇచ్చారు.  View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
    మార్చి 21 , 2024
    రవితేజ (Ravi Teja) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రవితేజ (Ravi Teja) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రవితేజ. ఇడియట్, కిక్, విక్రమార్కుడు, వంటి  చిత్రాలు సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో యూత్ ప్రేక్షకులకు రవితేజ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాస్ మహారాజా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రవితేజ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రవితేజ అసలు పేరు? రవి శంకర్ రాజు భూపతి రాజు రవి తేజ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రవితేజ హీరోగా తొలి సినిమా? నీకోసం రవితేజ ఎక్కడ పుట్టాడు? జగ్గంపేట, ఆంధ్రప్రదేశ్ రవితేజ పుట్టిన తేదీ ఎప్పుడు? 1968 జనవరి 26 రవితేజ భార్య పేరు? కళ్యాణి రవితేజ ఫెవరెట్ హీరోయిన్ శ్రీదేవి రవితేజకు ఇష్టమైన సినిమా? షోలే రవితేజకు ఇష్టమైన హీరో? అమితాబ్ బచ్చన్, చిరంజీవి రవితేజ తొలి హిట్ సినిమా? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజకు ఇష్టమైన కలర్? బ్లాక్ రవితేజ హీరోగా రాకముందు ఏం చేసేవాడు? కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు రవితేజ తల్లిదండ్రుల పేర్లు? భూపతిరాజు రాజగోపాల్, భూపతిరాజు రాజ్యలక్ష్మి రవితేజ ఏం చదివాడు? BA రవితేజ  అభిరుచులు సినిమాలు చూడటం, ట్రావెలింగ్ రవితేజ ఎన్ని సినిమాల్లో నటించాడు? 70కి పైగా సినిమాల్లో నటించాడు.  రవితేజకు ఇష్టమైన ఆహారం? ఏదైనా తింటానని రవితేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే స్వీట్స్ అంటే ఇష్టం https://www.youtube.com/watch?v=Mw8TtBVTsG4&lc=UgxKe8s8VAfg-Rljt214AaABAg రవితేజ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 70కోట్లు రవితేజ సినిమాకి ఎంత తీసుకుంటాడు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.25కోట్లు తీసుకుంటాడు . రవితేజకు స్మోకింగ్ అలవాటు ఉందా? స్మోకింగ్ అలవాటు ఉంది రవితేజ మద్యం తాగుతాడా?  తెలియదు
    మార్చి 19 , 2024
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    Shivarathri: శివ భక్తులు తప్పక చూడాల్సిన 5 సినిమాలు… సినిమా లింక్‌లు ఇవిగో..
    శివరాత్రికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రోజున భక్తి పరవశులై హిందువులు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. నీలకంఠేశుడిపైనే మనసు, తనువు లగ్నం చేసి నిష్ఠతో గడుపుతారు. శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటించేవారు జాగారం చేస్తుంటారు. ఈ పవిత్ర రాత్రి సమయంలో మెలుకువతో ఉండి జీవితంలోని చీకట్లను తొలగించుకోవాలని చెబుతుంటారు. శివరాత్రి రోజున జాగారం కీలక ఘట్టం. ఈ సమయాన్ని కొందరు భజనకు కేటాయిస్తే మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొందరు సినిమాలు చూస్తుంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంగా మారినందున చాలామంది ఫోన్‌లోనే సినిమాలు చూసేస్తున్నారు. అయితే, శివరాత్రి రోజున ఆధ్యాత్మికకు సంబంధించిన సినిమాలను చూడాలని భావించే వారు వీటిని ట్రై చేయొచ్చు.  భూ కైలాస్ అలనాటి సినిమా అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా. రావణాసురుడి పాత్రలో ఎన్టీఆర్ నటించారు. శివరాత్రికి మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుంది.  https://www.youtube.com/watch?v=I4C9hhuwxfQ భక్త కన్నప్ప 1976లో వచ్చిన భక్తిరస చిత్రమే ‘భక్త కన్నప్ప’. శివుడి భక్తుడి పాత్రలో దివంగత కృష్ణం రాజు నటించారు. భక్త కన్నప్పగా  ఆ పాత్రకు జీవం పోశారు. ఇది కూడా శివరాత్రి రోజున చూడదగిన సినిమానే. https://www.youtube.com/watch?v=1_oYrqjgBEM మహా శివరాత్రి సాయికుమార్, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది. మీనా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. రేణుక శర్మ దర్శకత్వం వహించారు.  https://www.youtube.com/watch?v=ArgkDQzeHXk శ్రీ మంజునాథ శివరాత్రి సినిమాలనగానే వెంటనే ఈ సినిమా పేరే గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయ్యింది ఈ సినిమా. నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపిస్తారు. భక్తుడిగా అర్జున్, శంకరుడిగా చిరంజీవి నటించారు. అర్జున్ సరసన సౌందర్య కీలక పాత్ర పోషించింది.  https://www.youtube.com/watch?v=6B_kgUvWGsQ జగద్గురు ఆదిశంకర ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో సాగుతుందీ సినిమా. నాగార్జున, సాయికుమార్, మోహన్ బాబు, కమలిని ముఖర్జీ తదితరులు కీలక పాత్ర పోషించారు. శంకరచార్యులుగా కౌశిక్ బాబు నటించాడు. https://www.youtube.com/watch?v=y8bB-aaVZv4 ఈ సినిమాలను చూసి మీలోని ఆధ్యాత్మిక భావాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. శివరాత్రి జాగారాన్ని ఫలప్రదం చేయండి. 
    మార్చి 08 , 2024
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా  విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023   రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ. ఎవరెలా చేశారంటే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో  హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ - బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు. టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.  హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.  ప్లస్‌ పాయింట్‌ రణ్‌బీర్ నటనయాక్షన్‌ సీన్లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ నిడివిసాగదీత సీన్లు రేటింగ్‌ : 4/5
    డిసెంబర్ 01 , 2023
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్‌ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు మంగళవారం ‘RX 100’ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మై నేమ్‌ ఈజ్‌ శృతి ప్రముఖ హీరోయిన్‌ హన్సిక నటించిన లేటేస్ట్‌ మూవీ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name Is Shruthi) సినీ ప్రియులను థ్రిల్‌ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పార్క్‌ లైఫ్‌ విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ (Spark The Life). డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. సప్త సాగరాలు దాటి సైడ్‌-B కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన  (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్వేషి విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateTwin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17ApurvaMovieHindiDisney + HotstarNov 15Chinna MovieTamil/TeluguDisney + HotstarNov 17Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16The crownWeb SeriesEnglishNetflixNov 16Believer 2MovieEnglishNetflixNov 17The DadsDocumentaryEnglishNetflixNov 17SukheeMovieHindiNetflixNov 18The RailwaymenMovieHindiNetflixNov 18 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 13 , 2023
    Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
    Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్‌.. ఈ సాంగ్స్‌ వింటే పూనకాలే!
    ప్రజా గాయకుడు గద్దర్‌ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్‌ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్‌. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్‌ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్‌ ఎందుకంత స్పెషల్‌. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.  బండెనక బండి కట్టి గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి' అనే పాట చాలా స్పెషల్. 'మా భూమి' సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్‌తో గద్దర్‌ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.  https://www.youtube.com/watch?v=8T3F4IuYarM  మల్లెతీగకు పందిరివోలె 1995లో వచ్చిన 'మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ పాటను గద్దర్‌ స్వయంగా రాశారు. ఈ సాంగ్‌ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట. https://www.youtube.com/watch?v=8BxYfk0WhYI పొడుస్తున్న పొద్దుమీద గద్దర్‌ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ కేటగిరీలో గద్దర్‌ నంది ‌అవార్డు అందుకున్నారు. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్. https://www.youtube.com/watch?v=vywBbz6QL7g నా రక్తంతో నడుపుతా ఓరేయ్‌ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్‌ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్‌కు అంతకు మించిన నటనతో ఆర్‌. నారాయణమూర్తి రక్తి కట్టించారు.  https://www.youtube.com/watch?v=XhbiuSTugNc అమ్మ తెలంగాణా  తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్‌కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం. https://www.youtube.com/watch?v=pXgjUMosLWY మరిన్ని పాటలు పైన పేర్కొన్న పాటలతో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.
    ఆగస్టు 07 , 2023
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్ 
    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్ 
    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై ప్రకటన.. ప్రభాస్ ప్రస్తుత వయసు 43. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచ్‌లర్ ప్రభాసే. దీంతో ఎక్కడ కనిపించినా డార్లింగ్‌కు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. కానీ, ఏనాడూ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ‘త్వరలో.. త్వరలో’ అంటూ సమాధానాన్ని దాటవేసేవాడు. ‘ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్’ పుణ్యమా అని ప్రభాస్ పెళ్లిపై కొద్దోగొప్పో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. అది తిరుపతిలోనే జరుగుతుందని తేల్చేశాడు. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ ఈ రిప్లై ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.  https://twitter.com/DailyCultureYT/status/1666291610722930689?s=20 ఇక సినిమాల జాతరే.. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వేగం మందగించింది. గత ఐదేళ్లలో ప్రభాస్ చేసింది 2 సినిమాలు మాత్రమే. 2017లో బాహుబలి2 సినిమా విడుదలయ్యాక 2019లో సాహో రిలీజ్ చేశాడు. మళ్ళీ 2022లో రాధేశ్యామ్‌ సినిమాతో వచ్చాడు. ఇవి రెండూ పెద్దగా రాణించకపోవడంతో ఆదిపురుష్‌పైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే, సినిమాల విషయంలోనూ ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఏడాదికి 2, 3 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చాడు. ఎక్కువ సినిమాలు చేస్తూ తక్కువ మాట్లాడతానని చెప్పాడు.  https://twitter.com/TheAakashavaani/status/1666136550361673728?s=20 ఆదిపురుష్ సినిమా.. ఆదిపురుష్ మూవీ తొలి ట్రైలర్ గతేడాది రిలీజ్ అయినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఓం రౌత్ పనితీరుపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదని ప్రభాస్ పరోక్షంగా కొట్టి పారేశాడు. ఆదిపురుష్ సినిమా వెనకాల ఉన్న కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సినిమా కోసం రోజుకు 20 గంటలు పనిచేశారని గుర్తు చేశారు. దర్శకుడు ఓం రౌత్ పెద్ద యుద్ధమే చేసినట్లు వివరించాడు. తన జీవితంలోనే ఓం రౌత్ లాంటి వ్యక్తులను చూడలేదని ప్రశంసించాడు.  చిరంజీవి కామెంట్స్‌.. ఆదిపురుష్ సినిమా చేయడం నిజంగా తన అదృష్టమని ప్రభాస్ చెప్పాడు. గతంలో చిరంజీవితో జరిగిన సంభాషణను ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పంచుకున్నాడు. ‘రామాయణం సినిమా చేస్తున్నావా? అని చిరంజీవి సర్ అడిగారు. అవునని చెప్పా. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. నీకు దొరికింది అని చెప్పారు’ అంటూ ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు.  https://www.youtube.com/watch?v=A8NS3vSJ1Gc కృతి సనన్.. ప్రభాస్‌కు జంటగా కృతిసనన్ ఈ సినిమాలో నటించింది. సీత పాత్ర పోషించింది. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో కోడై కూశాయి. కానీ, అలాంటిదేమీ లేదని కృతిసనన్ గతంలో ఖండించింది. అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్‌ను బాలయ్య ఈ ప్రశ్న అడిగాడు. దీంతో ‘మేడం అంతా క్లారిటీ ఇచ్చేసిందిగా సర్’ అంటూ డార్లింగ్ జవాబు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ సినిమాలో నటించిన కృతిసనన్ ప్రభాస్ అభినందించాడు. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఫిదా చేసిందని కొనియాడాడు.  ప్రభాస్‌పై కృతి సనన్.. ప్రభాస్‌పై కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్ ప్రభాస్ గురించి చెప్పింది.  ‘ఆన్‌స్క్రీన్‌లో యాక్టీవ్‌గా, ఆఫ్ స్క్రీన్‌లో ప్రభాస్ కామ్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు. ప్రభాస్‌లోని కామ్‌నెస్ ఎవరిలోను చూడలేదు. రాముడిగా ప్రభాస్‌ను తప్ప ఎవరిని ఉహించుకోలేం. ఈ సినిమాలో జానకి పాత్ర ఎంతో ప్రత్యేకం’ అని కృతి చెప్పుకొచ్చింది. https://www.youtube.com/watch?v=fmbZE7J9IMA ప్రభాస్ లేకుండా ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ ఒక్కరికో సొంతం కాదని, భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెందిన సినిమా అంటూ వెల్లడించాడు. ఇది ఇండియన్ ఫిల్మ్ అని ప్రకటించాడు. సినిమా నిర్మాణానికి సహకరించిన నిర్మాత భూషణ్‌కుమార్‌కు ఓం రౌత్ ధన్యవాదాలు చెప్పాడు.    https://www.youtube.com/watch?v=JopeURxPZmE హైలెట్స్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డిజైన్ చేశాడు. అయోధ్య సెట్‌ని అందంగా తీర్చిదిద్దాడు. స్టేజిపై వచ్చాక ప్రభాస్ విల్లును ఎక్కుపెట్టడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.  ముఖ్య అతిథులు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వేడుకలో పాల్గొన్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. https://www.youtube.com/watch?v=qkD5juVLDgM
    జూన్ 07 , 2023
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!
    Batukamma Song: సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్.. ఆడి పాడిన సల్లు భాయ్!
    తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో విశిష్టమైంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. మహిళలు పూలను అలకరించి బతుకమ్మ ఆటలు ఆడతారు. అయితే తెలంగాణ, తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో బతుకమ్మ క్రేజ్‌ పెరగనుంది. ఎందుకంటే బతుకమ్మ వైభవాన్ని సల్మాన్‌ వెండి తెరపై చూపించబోతున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, జగపతి బాబు, పూజా హెగ్డే, భూమిక, షెహ్‌నాజ్‌ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మను ఆ పాటలో చూపించారు.  https://twitter.com/taran_adarsh/status/1641693728367845377?s=20 బతుకమ్మ పాటలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడింది. పూజా హెగ్డే తలపైన బతుకమ్మను మోస్తూ కనిపించారు. హెగ్డేతో పాటు వెంకటేష్‌, భూమికలు బతుకమ్మను తీసుకెళ్తూ కనిపించారు. భూమిక, పూజా హెగ్డే స్టెప్స్‌తో అదరగొట్టారు. పాట చివర్లో సల్మాన్‌ పంచలో కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చారు. పంచ, నుదిటిన బొట్టుతో సల్మాన్‌ తెలుగు తనం ఉట్టిపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది.  https://youtu.be/tdOg8X0RV9I బతుకమ్మ పండగ శోభ ఇప్పుడు బాలీవుడ్‌కు చేరడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సల్మాన్‌ సినిమాలో బతుకమ్మను చూపించడం ద్వారా ఈ పండుగ విశిష్టత మరింత మందికి తెలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ పాటతో బతుకమ్మ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. బతుకమ్మ పాటపై సల్మాన్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నటుడు వెంకటేష్‌ సూచన మేరకే సల్మాన్‌ బతుకమ్మను పాటను పెట్టినట్లు తెలుస్తోంది.  https://twitter.com/RaoKavitha/status/1641699065447710721 ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ‘లవ్‌ యూ భాయ్’ అని సల్మాన్‌ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. జై తెలంగాణ, జై బతుకమ్మ అంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగు సంప్రదాయ లుక్‌లో సల్మాన్‌ అదిరిపోయాడని ప్రశంసిస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సల్మాన్‌కు బతుకమ్మ ఆశీస్సులతో సూపర్‌ హిట్ లభిస్తుందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.  ‘కిసీ కా భాయ్‌, కిసీ కా జాన్‌’ చిత్రాన్ని తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు. వీరుడొక్కడే పేరుతో తెలుగులో ఈ సినిమా డబ్‌ కూడా అయింది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు.ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అంతేగాక వెంకటేష్‌ నటిస్తుండటంతో తెలుగులోనూ విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.
    మార్చి 31 , 2023
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.  అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.  ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ &amp; హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌&nbsp; రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ &amp; ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.  ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌
    జూన్ 29 , 2024
    <strong>Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!</strong>
    Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!
    యానిమల్ (Animal Movie) బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ప్రస్తుతం వెకేషన్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బికినీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్న ఈ అమ్మడు.. అక్కడి అందమైన తీర ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తాజాగా బికినిలో ఫొటో షూట్‌ నిర్వహించి ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; ఎద, థైస్‌ అందాలతో త్రిప్తి దిమ్రి హోయలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆఫ్‌ స్క్రీన్‌లో ఈ స్థాయిలో అందాల జాతర చేయడం ఇదే తొలిసారని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; ఉత్తరాఖండ్‌ గర్వాల్‌లో 23 ఫిబ్రవరి, 1994లో జన్మించిన త్రిప్తి.. 2017లో వచ్చిన ‘పోస్టర్‌ బాయ్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.&nbsp; ఇందులో రియా పాత్రలో అదరగొట్టినప్పటికీ త్రిప్తికి పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత 'లైలా మజ్ను', 'బుల్‌బుల్‌' 'ఖాలా' వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన ‘యానిమల్‌’ (2023) చిత్రం.. త్రిప్తి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.&nbsp; ఇందులో ‘జోయా’ పాత్రలో కనిపించిన త్రిప్తి.. తన అంద చందాలతో యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా రణ్‌బీర్‌తో ఆమె చేసిన బెడ్‌రూమ్‌ సన్నివేశాలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘యానిమల్‌’లో త్రిప్తి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆమె తన గ్లామర్‌తో రాత్రి రాత్రికే స్టార్‌ నటిగా మారిపోయింది.&nbsp; యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే సందడి చేసింది. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్తి దిమ్రికి.. యానిమల్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడిని వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో త్రిప్తి దిమ్రి నటిస్తోంది.&nbsp; ‘బ్యాడ్‌ న్యూస్‌’, ‘విక్కి విద్య కా వోహ్‌ వాలా వీడియో’, ‘భూల్‌ భులయ్యా 3’, ‘ధడక్‌ 2’ చిత్రాల్లో ప్రస్తుతం త్రిప్తి దిమ్రి నటిస్తోంది.&nbsp; ఇక పుష్ప 2 చిత్రంలోనూ త్రిప్తి దిమ్రి ఓ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయమై చిత్ర యూనిట్‌ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    జూన్ 19 , 2024
    Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
    Kalki 2898 AD Trailer: కల్కిలో ప్రభాస్‌ కంటే అమితాబ్‌ పాత్రనే హైలెట్‌ కానుందా? ట్రైలర్‌లో ఎన్నో ప్రశ్నలు!
    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న (Kalki Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో మేకర్స్.. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్‌ 10) కల్కి ట్రైలర్‌ (Kalki Trailer In Telugu)ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ అదరగొట్టింది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్న కల్కి ట్రైలర్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో పాటు కొత్త ప్రశ్నలు రేకెత్తేలా చేసింది. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ప్రభాస్‌.. కల్కినే కాదట! 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా కథ ఇదేనంటూ చాలా రకాల స్టోరీలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. కథను ఎక్స్‌క్లూజివ్‌గా తామే అందిస్తున్నామన్న రీతిలో కొన్ని పేజీలు.. మూవీ ప్లాట్స్‌ను తమకు నచ్చిన విధంగా రాసుకొచ్చాయి. అయితే ఎక్కువ మంది ప్రచారం చేసిన స్టోరీ.. కాస్త కన్విన్సింగ్‌గా ఉన్న కథ ప్రకారం.. ఈ సినిమా కలియుగం చివరిలో జరుగుతుందని, విష్ణు పదవ అవతారమైన కల్కి (ప్రభాస్‌) వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతారని అనుకుంటూ వచ్చారు. అయితే తాజా ట్రైలర్‌ చూసిన తర్వాత అసలు ప్రభాస్‌ కల్కినే కాదని తెలిసి అంతా షాకయ్యారు. మరి ప్రభాస్‌ పాత్ర ఇందులో ఉండనుంది? మరి టైటిల్‌లోని కల్కి ఎవరు? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఏం ట్విస్ట్ ప్లాన్‌ చేశాడో అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=y1-w1kUGuz8 ప్రభాస్‌ ప్రాధాన్యత తగ్గిందా! కల్కి ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ప్రభాస్‌ కంటే బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్‌గా కనిపించినట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ట్రైలర్‌లో ఉన్నప్పటికీ అమితాబ్‌ క్యారెక్టర్‌కు ఇచ్చిన ప్రాధాన్యతతో పోలిస్తే అది కాస్త తక్కువేనని పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్‌ పాత్రను దాచి ఉంచారమోనన్న వాదన కూడా నెట్టింట బలంగా వినిపిస్తోంది. 'రికార్డ్స్‌ చెక్‌ చేసుకో.. ఇప్పటివరకూ నేను ఏ ఫైట్‌ ఓడిపోలేదు' అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్స్‌ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు. జూన్‌ 27న ప్రభాస్‌ చేసే యాక్షన్‌తో థియేటర్లు మోతెక్కిపోతాయని నమ్మకంగా చెబుతున్నారు.&nbsp; దీపికా డబ్బింగ్‌పై ట్రోల్స్‌ కల్కి సినిమాను పరిశీలిస్తే ఇందులోని యాక్టర్లంతా దాదాపుగా తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విభిన్నమైన గెటప్‌లో ఉన్న లోకనాయకుడు కమల్‌ హాసన్‌ను అయితే చాలా మంది డబ్బింగ్‌ వల్లే గుర్తుపట్టారు. అయితే ట్లైలర్‌లో దీపికా డబ్బింగ్‌ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీపిక గొంతు విన్నాక ఏదో తేడాగా ఉందే.. డబ్బింగ్ విషయంలో నాగ్‌ అశ్విన్‌ ఇలా ఎందుకు చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో దీపికా ఇలానే డబ్బింగ్‌ చెప్పిందంటూ పాత వీడియోల్ని షేర్‌ చేస్తున్నారు. దీపిక అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్' మూవీలో తెలుగులో కొన్ని డైలాగ్స్ చెబుతోంది. ఆ వీడియోను ట్రోలింగ్​కు వాడేస్తున్నారు. https://twitter.com/i/status/1800179235677778142 వీటిపైనా నెట్టింట చర్చ..! ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులోని రిచ్​ విజువల్స్, మూవీ కాన్సెప్ట్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ - ప్రభాస్ పాత్రలకు కనెక్షన్ ఏంటి? బుజ్జి - భైరవల కథ ఏంటి? దీపిక పదుకొణె, దిశా పటానీల పాత్రలు ఏంటి? కమల్ హాసన్ డిఫరెంట్​ లుక్, రోల్​ ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మొత్తంగా ట్రైలర్​కు ఫుల్ మార్క్​లు పడ్డాయి.&nbsp;
    జూన్ 11 , 2024

    @2021 KTree