రివ్యూస్
YouSay Review
Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో రాహుల్ సదాశివన్ రూపొందించిన డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఇప్పటికే మలయాళంలో విడుదల...read more
How was the movie?
తారాగణం
మమ్ముట్టి
మనక్కల్ కొడుమోన్ పొట్టి/చాతన్అర్జున్ అశోక్
తేవన్, జానపద గాయకుడుసిద్ధార్థ్ భరతన్
కొడుమోన్ పాటీస్ కుక్అమల్డా లిజ్
మణికందన్ ఆర్. ఆచారి
సిబ్బంది
రాహుల్ సదాశివన్దర్శకుడు
చక్రవర్తి రామచంద్ర
నిర్మాతS. శశికాంత్
నిర్మాతక్రిస్టో జేవియర్సంగీతకారుడు
రాహుల్ సదాశివన్కథ
షెహనాద్ జలాల్
సినిమాటోగ్రాఫర్షఫీక్ మహమ్మద్ అలీఎడిటర్ర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు
దర్శకుడు: రాహుల్ సదాశివన్
సంగీత దర్శకులు: క్రిస్టో జేవియర్
సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్
ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ
నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్
విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో రాహుల్ సదాశివన్ రూపొందించిన డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని రిలీజ్ చేసింది. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
తేవన్ (అర్జున్ అశోకన్) (Bramayugam Review In Telugu) ఒక మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ.. ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ ఓ వంటవాడు (సిద్ధార్థ్ భరతన్)తో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మాత్రమే ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కుడుమోన్ బాగా ఆదరిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. అసలు తేవన్ ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు? కుడుమోన్ పొట్టి ఎవరు ? అడవిలో పాడుబడ్డ భవంతిలో ఏం చేస్తున్నాడు? తేవన్ ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
మలయాళ మెగాస్టార్ మమ్మూటి (Bramayugam Review In Telugu).. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. కుడుమోన్ పొట్టి మిస్టీరియస్ పాత్రలో అద్బుత నటన కనబరిచాడు. మంత్ర శక్తులను గుప్పిట్లోపెట్టుకొని తక్కువ కులం వాళ్లను కిరాతకంగా చంపే ఓ దుష్టుడి పాత్రలో జీవించాడు. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక తేవన్‌గా అర్జున్ అశోకన్, వంట మనిషిగా సిద్దార్థ్ భరతన్ పోటీ పడి నటించారు. తెరపైన ముగ్గురు ఎవరికి వారే తమ ప్రతిభను చాటుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భ్రమయుగం మూవీ ప్రారంభం నుంచే చాలా ఇంటెన్స్‌తో, హై ఎనర్జీతో మెుదలవుతుంది. ఓపెనింగ్ మిస్ అయితే కథకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సిందే. దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మూడు పాత్రలు ఒకరిని మరోకరు చీట్ చేసుకొనే విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్ తెరకెక్కించారు. ఇక సెకండాఫ్‌లో అఖండ జ్యోతిని ఆరిపేయడం తర్వాత జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్‌గా, భయానకంగా ఉంటాయి. సినిమాను చివరి ఫ్రేమ్ వరకు నడిపించిన తీరు దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రతిభకు అద్దం పట్టింది. అయితే స్లోగా ఒకే పాయింట్‌తో కథ సాగడం.. కమర్షియల్ వాల్యూస్‌కు దూరంగా ఉండటం ఓ మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భ్రమయుగం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్రధాన బలంగా మారింది. యాక్టర్ల నటనకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో సన్నివేశాలు హై రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ సినిమా మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సాయపడ్డాయి.
ప్లస్ పాయింట్స్
కథ, స్క్రీన్‌ప్లేనటీనటులుసంగీతంకెమెరా పనితనం
మైనస్ పాయింట్స్
స్లోగా సాగే కథనంకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
ఫిబ్రవరి 23 , 2024
This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
భ్రమయుగం
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజధాని ఫైల్స్
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.
ఊరు పేరు భైరవకోన
సందీప్‌కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
సైరెన్
జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘సైరెన్’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
నాసామి రంగ
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ది కేరళ స్టోరీ
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది.
TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
ఫిబ్రవరి 12 , 2024
Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అహం రీబూట్ (Aham Reboot)
సుమంత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం అహం రీబూట్'. జూన్ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్ ఏంటంటే.. ఆర్జే నిలయ్ (సుమంత్) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్ అని భావించిన నిలయ్.. ఆమె మాటలకు కన్విన్స్ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ వేదిక : ఆహా
105 మినిట్స్ (105 Minuttess)
‘అహం రీబూట్’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్ చిత్రం వచ్చింది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే.. జాను (హన్సిక) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శక్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్యక్తి మరణానికి జాను ఎలా కారణమైంది? దాని బారి నుంచి జాను ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ఆరంభం (Aarambham)
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్ నాగ్ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, లక్ష్మణ్ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్ అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
లవ్ మీ (Love Me)
ఆశిష్ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ప్రాజెక్ట్ జెడ్ (Project Z)
సందీప్ కిషన్ (Sundeep Kishan), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా నటించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్ కిల్లర్ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్ కుమార్ (సందీప్ కిషన్) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : ఆహా
ప్రసన్న వదనం (Prasanna Vadanam)
సుహాస్ (Suhas) రీసెంట్ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్ బ్లైండ్‌నెస్ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.
భ్రమయుగం (Bramayugam)
మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది. డిజిటల్ యుగంలోనూ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : సోనీ లివ్
జూలై 03 , 2024
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్’ సహా 24 చిత్రాలు!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
వెయ్ దరువెయ్
ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’ (Vey Dharuvey). యషా శివకుమార్ హీరోయిన్. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజాకార్
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.
తంత్ర
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
షరతులు వర్తిస్తాయి!
చైతన్యరావ్, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్ కుమార్, విజయ, కృష్ణకాంత్ సంయుక్తంగా నిర్మించారు.
లైన్‌మ్యాన్
త్రిగుణ్, కాజల్ కుందర్ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
రవికుల రఘురామ
ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది.
లంబసింగి
భరత్ రాజ్ హీరోగా బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్ తన్నీరు నిర్మించారు.
యోధ
సిద్ధార్థ్ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యోధ’ (Yodha). సాగర్ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్ జోహార్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇతర చిత్రాలు
పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateHanuman MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
మార్చి 11 , 2024