రివ్యూస్
How was the movie?
తారాగణం
నాగ శౌర్య
కార్తీక ప్రేమ ఆసక్తిరష్మిక మందన్న
హరి ప్రేమ ఆసక్తి మరియు వీరముత్తు జూనియర్ కుమార్తెఅచ్యుత్ కుమార్
వీరముత్తు ప్రత్యర్థి స్నేహితుడిగా మారాడు [చివరికి]మైమ్ గోపి
ఎల్. కార్తీక తండ్రినరేష్
హరి తండ్రిప్రగతి మహావాది
హరి తల్లిహర్ష చెముడు
తెలుగు విద్యార్థిసత్య అక్కల
కాలేజీలో తమిళ విద్యార్థిరఘు బాబు
హరి మరియు కార్తీక ప్రిన్సిపాల్వెన్నెల కిషోర్
కార్తీక కాబోయే భార్యప్రవీణ్
హరి స్నేహితుడుపోసాని కృష్ణ మురళి
హరి మరియు కార్తీకల లెక్చరర్రాజేంద్రన్
సీనియర్ వీరముత్తువాసు ఇంటూరి
కాలేజీ క్యాంటీన్ యజమానిశివన్నారాయణ నారిపెద్ది
వేణుగోపాల్ పరమ తండ్రి
జీఎం కుమార్
జమీందార్సిబ్బంది
వెంకీ కుడుముల
దర్శకుడుఉషా ముల్పూరినిర్మాత
మహతి స్వర సాగర్సంగీతకారుడు
కోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
ఛలో సినిమా విజయంతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం
నాగ శౌర్య అసలు పేరు?
నాగశౌర్య ముల్పూరి
నాగ శౌర్య ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నాగ శౌర్య తొలి సినిమా?
క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
నాగశౌర్యకు వివాహం అయిందా?
2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.
నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు?
ఐశ్వర్య రాయ్
నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా?
టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు.
నాగ శౌర్య ఇష్టమైన హీరో?
తమిళ్ హీరో సూర్య
నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది.
నాగశౌర్యకు ఇష్టమైన కలర్?
నీలం రంగు
నాగ శౌర్య పుట్టిన తేదీ?
1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు.
నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు?
శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్
నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం?
హైదరాబాద్
నాగ శౌర్య ఏం చదివాడు?
బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom)
https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI
నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు
నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు?
నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.
నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం?
పెరుగు వడ
నాగశౌర్య ముద్దుపేరు?
నాని
నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్?
అనుష్క శెట్టి
మార్చి 21 , 2024
రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న ఎవరు?
రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
రష్మిక మందన్న దేనికి ఫేమస్?
రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రష్మిక మందన్న వయస్సు ఎంత?
రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు
రష్మిక మందన్న ముద్దు పేరు?
నేషనల్ క్రష్ రష్మిక
రష్మిక మందన్న ఎత్తు ఎంత?
5 అడుగుల 3 అంగుళాలు
రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది?
విరాజ్ పేట, కర్ణాటక
రష్మిక మందన్నకు వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు?
రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు.
రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు?
బ్లాక్
రష్మిక మందన్న అభిరుచులు?
ట్రావెలింగ్
రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం?
చికెన్, చాక్లెట్
రష్మిక మందన్న అభిమాన నటుడు?
అక్షయ్ కుమార్
రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్?
శ్రీదేవి
రష్మిక మందన్న తొలి సినిమా?
కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు)
రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు?
గీతాగోవిందం, పుష్ప
రష్మిక మందన్న ఏం చదివింది?
సైకాలజీలో డిగ్రీ చేసింది
రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత?
రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు?
సుమన్, మదన్ మందన్న
రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది?
రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?
రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది.
రష్మిక మందన్న సిస్టర్ పేరు?
సిమ్రాన్ మందన్న
రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా?
లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది.
రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/rashmika_mandanna/?hl=en
రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్ లాక్ సీన్లలో నటించింది.
https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
ఏప్రిల్ 16 , 2024
Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.
ఎవరెలా చేశారు?
సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతికంగా?
ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk
ప్లస్ పాయింట్స్
కామెడీ
నటీనటులు
మైనస్ పాయింట్స్
పేలవ కథ, కథనం
క్లైమాక్స్
పాటలు
రేటింగ్: 2.25/5
https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
జూలై 07 , 2023
Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది.
Sreeleela
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది
Samantha
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది.
Courtesy Instagram: samantha
Rashmika Mandanna
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
Sai Pallavi
సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
Rukshar Dhillon
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
Samyuktha Menon
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Keerthy Suresh
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
Divyansha Kaushik
దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
Mirnalini Ravi
మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది.
Kethika Sharma
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది.
Chandini Chowdary
చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Eesha Rebba
ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
Priyanka Jawalkar
"ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
Courtesy Instagram: Dimple Hayathi
Pujita Ponnada
పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది.
Ananya Nagalla
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.
Courtesy Instagram:Ananya Nagalla
డిసెంబర్ 04 , 2024
Double iSmart Movie: రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో అదిరే ట్విస్ట్.. పూరి మార్క్ ఫ్లాష్ బ్యాక్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni), స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). వీరి కాంబోలో 2019లో వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) చిత్రానికి రీమేక్‌గా ఇది వస్తోంది. తొలి భాగం సూపర్ హిట్‌గా నిలవడంతో పార్ట్ 2పై ఆసక్తి నెలకొంది. 2023 జులైలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్ షూటింగ్ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
క్రేజీ ఫ్లాష్ బ్యాక్..!
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart Movie) సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని సమాచారం. యాక్షన్ - థ్రిల్లర్ నేపథ్యంలో ఇది సాగుతుందని అంటున్నారు. పైగా తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండనుందట. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
కసితో ఉన్న పూరి..!
డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్టర్ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘లైగర్’ (Liger Movie) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడంతో పూరీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాకు ముందు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇందుకు కారణమయ్యాయి. దీంతో పూరి తన ఫోకస్ మెుత్తం ‘డబుల్ ఇస్మార్ట్’పై పెట్టారట. దీనిని అద్భుతంగా తెరకెక్కించి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలన్న కసిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో..
ఆ కారణంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం సింగిల్ లాంగ్వేజ్ (తెలుగు)లో రిలీజ్ చేసిన పూరి.. సెకండ్ పార్ట్‌ను మాత్రం దేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తద్వారా తన క్రేజ్‌ను జాతీయ స్థాయికి చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్. ఇందులో భాగంగానే ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
హీరో రామ్‌కూ కీలకమే!
ఇక హీరో రామ్ కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart Movie) చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘స్కంద’ (Skanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. పైగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలో యాక్షన్ మరి ఓవర్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అటు ఈ చిత్రానికి ముందు రామ్ చేసిన ‘వారియర్’ (Warrior Movie In Telugu)) కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రామ్‌కు ఎంతో కీలకంగా మారింది.
ఛలో థాయిలాండ్!
‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను ముంబయిలో పూర్తి చేసిన డైరెక్టర్.. తర్వాతి షెడ్యూల్‌ను థాయిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడ కూడా సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని సమాచారం. ఇందుకోసం త్వరలోనే చిత్ర యూనిట్ థాయిలాండ్‌లో వాలిపోతుందని అంటున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. బిగ్ బుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ గతంలో సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఆ రోజున రిలీజ్ కష్టమే!(Double Smart Release Date)
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మహా శివరాత్రి సందర్భంగా వచ్చే నెల (మార్చి) 8న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగడం లేదని సమాచారం. రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రిలీజ్ తేదీ మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంటున్నాయి.
ఫిబ్రవరి 05 , 2024
Rashmika: హాట్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నేషనల్ క్రష్.. వైరల్‌గా ఫొటోస్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. మరోమారు తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోసింది.
కొంటె చూపులతో మత్తెక్కించే ఫోజుల్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తాజాగా పుకార్లు రేకెత్తాయి.
విజయ్, రష్మిక వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని టాక్ వినిపించింది. మంచి రోజు చూసుకొని ఎంగేజ్‌మెంట్, కొద్ది రోజుల వ్యవధిలోనే వివాహాం కూడా చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై విజయ్ టీమ్ తాజాగా స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.
ఇదిలా ఉంటే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ కోసం విజయ్, రష్మిక కలిసి వర్క్ చేశారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడం, టూర్స్, డిన్నర్ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ వినిపించాయి.
రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇటీవల రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియో ఘటనపై బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.
2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.
అదే ఏడాదిలో వచ్చిన విజయ్ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా, దేవదాస్ మూవీ పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత వరుసగా మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్‌తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్’, బన్నీతో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్‌తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.
హిందీలో అమితాబ్‌తో కలిసి ‘గుడ్ బై’, సిద్దార్థ్ మల్హోత్రాతో జంటగా ‘మిషన్ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.
ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో ఈ భామ నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
పుష్ప-2తో పాటు రష్మిక తెలుగులో ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
జనవరి 09 , 2024
Rashmika Mandanna: రష్మిక మరో ఫేక్ వీడియో ప్రత్యక్షం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!
స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna)ను సోషల్‌మీడియాలోని ఆకతాయిలు మరోసారి టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి ఇబ్బందిపెట్టగా తాజాగా మరో డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.
https://twitter.com/MrReactionWala/status/1722643605729550835
ఇందులో ఆమె జిమ్ సూట్ ధరించి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయేన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.
2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.
అదే ఏడాదిలో వచ్చిన విజయ్ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా, దేవదాస్ మూవీ పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత వరుసగా మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్‌తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్’, బన్నీతో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్‌తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.
హిందీలో అమితాబ్‌తో కలిసి ‘గుడ్ బై’, సిద్దార్థ్ మల్హోత్రాతో జంటగా ‘మిషన్ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.
ప్రస్తుతం రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2తో పాటు, బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal)లోనూ రష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
వీటితో పాటు రష్మిక ఫీ మేల్ సెంట్రిక్ కథాంశంతో సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాకు ‘రెయిన్ బో’ (Rainbow) టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవంబర్ 10 , 2023
Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్ లవ్ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్ సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. మాష్టారు మాష్టారు
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.
https://www.youtube.com/watch?v=AXSm49NGkg8
2. నీ కన్ను నీలి సముద్రం
ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.
https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek
3. చిట్టి నీ నవ్వంటే
జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది. రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.
https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU
4. ఇంకేం ఇంకేం కావాలి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA
5. అడిగా అడిగా
నాని, నివేదా థామస్ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాయి.
https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU
6. చూసి చూడంగానే
2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్ మారుమోగేది. అనురాగ్ కులకర్ణి, స్వరసాగర్ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు.
https://www.youtube.com/watch?v=_JVghQCWnRI
7. పూలనే కునుకేయమంటా
శంకర్ డైరెక్షన్‌లో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్ కూడా ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs
8. మాటే వినదుగా
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.
https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc
9. మధురమే
విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్ రొమాంటిక్ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్, హీరోయిన్ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది.
https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&feature=youtu.be
10. ఎంత సక్కగున్నావే
రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.
https://www.youtube.com/watch?v=eABViudPBFE
మే 31 , 2023
3rd Day BOX OFFICE: స్టార్ హీరో లేకున్నా కలెక్షన్లు కుమ్మేసిన టాప్-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్ ఇమేజ్ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
ఉప్పెన
మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా.. హిట్ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్ వచ్చింది.
దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన పవర్ ప్యాక్డ్ మాస్ చిత్రం దసరా. లుక్, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు నాని.
విరూపాక్ష
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది.
https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్ చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
బింబిసార
కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.
ఇస్మార్ట్ శంకర్
హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.
భీష్మ
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ భీష్మ. బాక్సీఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు.
జాతి రత్నాలు
కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
కార్తీకేయ 2
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
ఏప్రిల్ 24 , 2023
Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్ సూపర్బ్.. ‘బచ్చలమల్లి’తో హిట్ కొట్టాడా?
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు
కథ, దర్శకత్వం: సుబ్బు మంగదేవి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్.నాథన్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2024
అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 20న (Bachhala Malli Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నరేష్ నటన బాగుందా? అతడి ఖాతాలో మరో విజయం పడిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
కథ 1995 - 2005 మధ్య (Bachhala Malli Review) తుని, సూరవరం ప్రాంతంలో సాగుతుంటుంది. బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రి గర్వపడేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ట్రాక్టర్ నడుపుతూ మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఊరిలో ఏదోక గొడవలో తలదూరుస్తూ బేవర్స్‌గా మారిపోతాడు. అప్పుడే అతడి లైఫ్‌లోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. ఆమె రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? కావేరితో అతడి ప్రేమ కథ ఎలా మెుదలైంది? చివరికీ సుఖాంతం అయ్యిందా? లేదా? అసలు తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బచ్చల మల్లి పాత్రలో అల్లరి నరేష్ (Bachhala Malli Review) పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. గమ్యం సినిమాలో చేసిన గాలి శీను పాత్ర తరహాలో బచ్చలమల్లి రోల్ కూడా అతడి కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మూడు వేరియేషన్స్ కలగలిసిన ఆ పాత్రలో నరేష్ అదరగొట్టాడు. హావ భావాలు చక్కగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో పరిణితి చూపించాడు. హీరోయిన్ కావేరి పాత్రలో అమృత అయ్యర్ (Amritha Aiyer) బాగా చేసింది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. రావు రమేశ్ (Rao Ramesh) పాత్ర సినిమాకి కీలకం. అల్లరి నరేష్‌తో వచ్చే సీన్స్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రావు రమేష్ నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాదాసీదాగా కనిపిస్తూనే విలనిజం బాగా పండించాడు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు బలమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సుబ్బు మంగదేవి కంచెలు తెంచుకున్న మూర్ఖుడి కథగా 'బచ్చలమల్లి'ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. చాలా రఫ్‌గా ఉండే హీరో ప్రేమలో పడిన విధానం, ప్రేయసి రాకతో అతడి లైఫ్‌లో వచ్చిన మార్పులు చక్కగా చూపించాడు. తన మూర్ఖత్వంతో ఏమేమి తప్పులు చేశానో హీరో రియలైజ్ అయ్యే సీన్స్ మెప్పిస్తాయి. బంధాలు తెంచుకోవడం చాలా తేలిక.. నిలుపుకోవడంలోనే మన గొప్పతనం దాగుందన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్‌కు లాజిక్స్ ఉండవు. హీరో పాత్రను ప్రభావితం చేసే సన్నివేశాలు చాలా పేవలంగా అనిపిస్తాయి. మూడు పార్శ్వాలుగా కథ చెప్పడం కాస్త గందరగోళానికి గురిచేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ మాత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Bachhala Malli Review) సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటల్లో ‘మా ఊరి జాతర్లో’ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు.
ప్లస్ పాయింట్స్
నరేష్ నటనకథా నేపథ్యంసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తిలేని కథనంలాజిక్స్‌కు అందని సీన్స్‌అక్కడక్కడ పండని ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 20 , 2024
Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్ మల్టీ యూనివర్స్ ఫిల్మ్.. ‘రహస్యం ఇదం జగత్’ మెప్పించిందా?
నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ ఖండాల, ఆది నాయుడు, శివ జుటూరి తదితరులు
డైరెక్టర్ : కోమల్ ఆర్. భరద్వాజ్
సంగీతం: గ్యానీ
సినిమాటోగ్రాఫర్ : టేలర్ బ్లూమెల్
ఎడిటిర్: ఛోటా కె. ప్రసాద్
నిర్మాత: హిరణ్య, పద్మ, కోమల్ ఆర్. భరద్వాజ్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idham Jagath Review). సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు (నవంబర్ 8)న థియేటర్స్‌లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్‌లో ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
కథ అమెరికా (Rahasyam Idham Jagath Review)లో జరుగుతుంటుంది. అకీరా (స్రవంతి), ఆమె లవర్ అభి (రాకేష్) ఇండియా వెళ్లాలని ఫిక్స్ అవుతారు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్ (విశ్వ, కల్యాణ్, అరు)తో ఓ ట్రిప్‌కు వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి అకీరా మాజీ లవర్ విశ్వ కూడా వస్తాడు. మంచు కారణంగా బుక్ చేసుకున్న హోటల్‌లోనే వారంత రాత్రి స్టే చేయాల్సి వస్తుంది. అకీరా స్నేహితుల్లో ఒకరైన సైంటిస్ట్ అరు మల్టీ యూనివర్స్‌పై రీసెర్చ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఓ విషయమై గొడవ జరిగి అకీరా, కల్యాణ్‌ను అభి చంపేస్తాడు. అదే సమయంలో మల్టీ యూనివర్స్‌కి వెళ్లే దారి తాము ఉన్న ఊళ్లోనే ఉందని అరు చెబుతుంది. దీంతో ఫ్రెండ్స్‌ను మళ్లీ బ్రతికించడం కోసం అభి మల్టీ యూనివర్స్‌లోకి తీసుకెళ్లే వామ్ హోల్ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వామ్ హోల్‌ను అభి కనిపెట్టాడా? ఫ్రెండ్స్‌ను బతికించుకున్నాడా? అభి, అకీరా ఇండియాకు వెళ్లారా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
గతంలో అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్‌తో (Rahasyam Idham Jagath Review) మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాడు. వామ్ హోల్‌లోకి ట్రావెల్ చేసే వ్యక్తిగా అదరగొట్టాడు. అకీరా పాత్రలో స్రవంతి మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు బాగా సూట్ అయ్యింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పించాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. షూటింగ్ మెుత్తం అమెరికాలో జరగడం, అక్కడే నటనలో ట్రైనింగ్ తీసుకోవడంతో హాలీవుడ్ చిత్రాల ప్రభావం నటీనటుల్లో స్పష్టంగా కనిపించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ హాలీవుడ్ చిత్రాలైన ’ఇన్సెప్షన్’ (Inception), ‘ఇంటర్‌స్టెల్లార్’ (Interstellar)ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్ కావడానికి మన పురణాల్లోని కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించడం ఆకట్టుకుంది. శ్రీ చక్రానికి, మల్టీ యూనివర్స్‌కు దారితీసే వామ్ హోల్‌తో లింకప్ చేసిన విధానం ఆసక్తి రేపుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్, అక్కడ వారి మధ్య గొడవలు చూపించిన దర్శకుడు ఇంటర్వెల్‌కు ముందు మల్టీయూనివర్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో వామ్ హోల్ కోసం అభి అన్వేషణ, దాని ద్వారా టైం ట్రావెల్ చేసి ఫ్రెండ్స్‌ను కాపాడటం చూపించారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమెరికన్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం, డైలాగ్స్ మన నేటివిటీకి దూరంగా ఉండటం మైనస్‌లుగా నిలిచాయి.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Rahasyam Idham Jagath Review) సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్స్‌ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్‌ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా చెప్పిస్తే బెటర్‌గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
మల్టీ యూనివర్స్ కథపురాణాలతో లింకప్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
హాలీవుడ్ చిత్రాల ప్రభావంఫస్టాఫ్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 08 , 2024
Ashu Reddy Bold Pics: బ్రా లెస్ బ్లేజర్‌లో అషు రెడ్డి ఘాటు అందాలు.. చూస్తే పిచ్చెక్కిపోతారు!
జూ.సమంతగా పాపులర్ అయిన అషు రెడ్డి అందాల జాతర చేయడంలో స్టార్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు.
ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తన అందాలతో నెటిజన్లను కవ్విస్తోంది.
తాజాగా రెడ్ కలర్ బ్లేజర్‌లో అషు అందాల జాతర చేసింది. బ్రా లెస్ కోట్‌లో ఉప్పొంగుతున్న ఎద అందాలతో రచ్చ రచ్చ చేసింది.
ఘాటైన రెడ్ మిర్చిని తలపిస్తూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ అమ్మడి మత్తెక్కించే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక అషు రెడ్డి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించింది.
సోషల్ మీడియా రీల్స్ ద్వారా అషు తొలుత ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే జూ.సమంతగా గుర్తింపు పొందింది.
2018లో వచ్చిన 'ఛల్ మోహన్ రంగ' (Chal Mohana Ranga) చిత్రం ద్వారా అషు తొలిసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఆ తర్వాతి ఏడాదే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’ (Bigg Boss Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌తో ‘#పీకే’ (#PK), ‘ఏ మాస్టర్ పీస్’ (A Masterpiece) వంటి చిత్రాల్లో అషుకి అవకాశం దక్కింది.
అదే సమయంలో బుల్లితెర వ్యాఖ్యాతగానూ మారి పలు షోలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. తన అందచందాలతో అలరించింది.
ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మతో అషు చేసిన బోల్డ్ ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆర్జీవీ ఇంటర్యూతో ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో ఒక్కసారిగా మారుమోగిపోయింది.
ఇక అషు రెడ్డికి బాగా ఇష్టమైన హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). అతడి పేరున ఒంటిపై టాటూ కూడా వేసుకుంది.
నెట్టింట నిత్యం ట్రెండింగ్‌లో నిలిచే ఈ అమ్మడికి వెండితెర (Tollywood)పై పెద్దగా అవకాశాలు రావడం లేదు.
దీంతో తెలుగు పరిశ్రమలోనూ సత్తా చాటేందుకు అషు ప్రయత్నిస్తోంది. అందాల ప్రదర్శనలో రోజు రోజుకు డోస్ పెంచుతోంది.
తద్వారా తన గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌ను ఓ ఊపు ఊపేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు పంపుతోంది.
ప్రస్తుతం అషు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
సెప్టెంబర్ 04 , 2024
Shivam Bhaje Movie Review: కళ్లు పోయిన హీరోకి దైవ బలంతో చూపు వస్తే.. ఆ తర్వాత ఏం జరింది?
నటీనటులు : అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ
డైరెక్టర్ : అబ్దుల్ అప్సర్ హుస్సేన్
సంగీతం : వికాస్ బడిశా
ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్
నిర్మాత : మహేశ్వర రెడ్డి
విడుదల తేదీ : ఆగస్టు 01, 2024
ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్. అబ్దుల్ అప్సర్ హుస్సేన్ రూపొందించిన ఈ చిత్రంలో హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న ‘శివం భజే’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ కథనంలో చూద్దాం.
కథేంటి
చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే ఓ గొడవ కారణంగా చందుకి కళ్లు పోతాయి. శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ పరిణామంతో అతడి కంటికి ఆపరేషన్ జరిగి చూపు వస్తుంది. అయితే కొత్త కళ్లు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తుంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? శత్రుదేశాలతో ఓ సాధారణ రికవరీ ఏజెంట్ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? శివుడి అనుగ్రహంతో చందు నిర్వహించిన కార్యం ఏంటి? కథలో డోగ్రా (కుక్క) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
చందు పాత్రలో హీరో అశ్విన్ బాబు అద్భుత నటన కనబరిచాడు. రెండు డైమన్షన్స్‌లో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. శైలజా పాత్రలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఆకట్టుకుంది. అశ్విన్, దిగంగన మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. ఇక పోలీసు ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ మెప్పించాడు. హాస్య నటుడు హైపర్ అది తన పంచులతో నవ్వులు పూయించాడు. బ్రహ్మాజీ, మురళి శర్మ తమదైన సెటిల్ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఒక మిస్టరీ కథకు డివోషనల్ అంశాలను ముడిపెడుతూ దర్శకుడు అబ్దుల్ అప్సర్ హుస్సేన్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ క్రైమ్ డ్రామాలోని కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే శత్రుదేశాల తాడి నేపథ్యంలో అల్లిన స్టోరీ లైన్ కూడా మెప్పిస్తుంది. అయితే కథ బాగున్నా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అనుకున్న కథను పూర్తి స్థాయిలో తెరపైన ప్రజెంట్ చేయలేకపోయాడు. హత్యలకు సంబంధించిన ట్రాక్ కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. హీరో అశ్విన్ బాబు క్యారెక్టర్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ లాజిక్స్ దూరంగా అనిపిస్తాయి. కథ స్లోగా సాగడం, తొలి భాగంలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ మిస్ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. కథతో సంబంధం లేని సీన్స్ ఎక్కువ ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్ సీన్స్‌ను ఆయన తన కెమెరా పనితనంతో చక్కగా ప్రజెంట్ చేశారు. వికాస్ బడిస సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్
అశ్విన్ బాబు నటనసస్పెన్స్ సీన్స్‌క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
స్లో నారేషన్‌ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంఅసందర్భమైన సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
.
ఆగస్టు 01 , 2024
EXCLUSIVE : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్ స్టోరీ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్‌డేట్ లేని ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గతే ఏడాదే రిలీజ్ కావాల్సింది. రిలీజ్ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
పోస్ట్‌పోన్‌పై విష్వక్ అసహనం!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్ 27 సా. 4.01 గం.లకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్ చేయనని అప్పట్లో విశ్వక్ ప్రకటించడం వివాదస్పదంగా మారింది.
నిర్మాత రియాక్షన్ ఇదే!
‘ఆదికేశవ’ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 8న విడుదల చేయాలన్నది విష్వక్ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్ నాన్న, ఎక్ట్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, సలార్ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్‌కు వెళ్లి సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని అంటానని భావించి విష్వక్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది.
https://www.youtube.com/watch?v=hpFNP5gptFU
ఐటెం సాంగ్‌తో గ్యాప్
ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్ షూట్‌లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్‌ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్ వర్క్ పనులు ఆలస్యం అయ్యాయి.
ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా?
దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్ అనౌన్స్ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూనిట్ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌పైనా టీమ్ ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. లేటెస్ట్‌గా టీజర్ అప్‌డేట్‌ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.
ఏప్రిల్ 24 , 2024
Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, నాగ బాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్దాల
సంగీతం: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు
నిర్మాత: మిర్యాల రమేష్, మిర్యాల సత్యనారాయణ
క్లాస్ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం.
కథ:
1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే?
ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఎవరేలా చేశారంటే
పెదకాపు పాత్ర చేసిన విరాట్ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్ ప్రగతి పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేవిరాట్, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్పాటలు
రేటింగ్ : 3/5
సెప్టెంబర్ 29 , 2023
Gangs Of Godavari Review: విష్వక్ సేన్- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ : 31-05-2024
విష్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్ సేన్).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో విష్వక్ సేన్.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో మాస్ జాతరే అన్నట్లు విష్వక్ నటన ఉంటుంది. ఇక హీరోయిన్ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా నడవడం, రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
విష్వక్ సేన్ నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ స్టోరీ
స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 3/5
Public Talk On Gangs of Godavari
సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/raghav917252/status/1796382241532334575
చాలా రోజుల తర్వాత హౌస్ ఫుల్స్ చూస్తున్నట్లు మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్ అంటూ వ్యాఖ్యానించాడు.
https://twitter.com/PulakithSai/status/1796399917969412273
ఫస్టాఫ్ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్ కొట్టదని స్పష్టం చేశాడు.
https://twitter.com/PinkCancerian/status/1796336006402355622
పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్ వెర్షన్‌లా గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఉందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
మే 31 , 2024
Ashu Reddy: హాట్ బాంబ్ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా, యాంకర్‌గా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలోనూ తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. బుల్లితెర నుంచి వెండి తెరకు గుర్తింపు సంపాదించిన అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? ఆమె ఇష్టాఇష్టాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది?
అమెరికాలోని టెక్సాస్‌లో ఆమ జన్మించింది.
అషూ రెడ్డి పుట్టిన తేదీ?
15 సెప్టెంబర్, 1995
అషూ రెడ్డి స్కూలింగ్ ఎక్కడ జరిగింది?
అషూ స్కూలింగ్ అంతా టెక్సాస్‌లో జరిగింది. అక్కడ ఉన్న గిల్మర్ హై స్కూల్‌లో ఆమె చదువుకుంది.
అషూ రెడ్డి విద్యార్హత ఏంటి?
డెల్లాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది.
అషూ రెడ్డి ఎత్తు ఎంత?
5 అడుగుల 4 అంగుళాలు (166 సెం.మీ)
అషూ రెడ్డి బరువు ఎంత?
60 కిలోలు
అషూ రెడ్డికి సోదరుడు / సోదరి ఉందా?
అషూకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి
అషూ రెడ్డి వయసు ఎంత?
29 సంవత్సరాలు (2024)
అషూ రెడ్డి పూర్తి పేరు ఏంటి?
అశ్విని రెడ్డి
ప్రస్తుతం అషూ రెడ్డి ఎక్కడ ఉంటోంది?
హైదరాబాద్
అషూ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యింది?
సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా అషూ ఫేమస్ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు.
అషూ రెడ్డి తొలి చిత్రం?
‘ఛల్ మోహన్ రంగా’ (2018)
అషూ రెడ్డి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఏది?
ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి.
అషూ రెడ్డి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి?
‘ఛల్ మోహన్ రంగా’, ‘#పీకే’, ‘ఏ మాస్టర్ పీస్ (రైజ్ ఆఫ్ సూపర్ హీరో)’
అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్యూ ఏది?
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ను అషూ రెడ్డి చేసిన ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ఇందులో చాలా అడల్ట్ ప్రశ్నలు ఉన్నాయి.
అషూ రెడ్డి హాబీలు ఏంటి?
ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ఈ భామకు చాలా ఇష్టమట.
అషూ రెడ్డి ఫేవరేట్ హీరో?
ఈ భామ ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్. తన శరీరంపై పవన్ పేరును టాటూ సైతం వేయించుకుంది.
అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏది?
https://www.instagram.com/ashu_uuu/
https://www.youtube.com/watch?v=cmlVZwZOdeg
ఏప్రిల్ 23 , 2024
This Week OTT Movies: ఉగాది, రంజాన్ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
గీతాంజలి మళ్లీ వచ్చింది
అంజలి లీడ్ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
లవ్ గురు
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ చిత్రం.. ‘లవ్ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్ కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం.
డియర్
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘డియర్’ (Dear). తమిళంలో ఏప్రిల్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్ 12న రాబోతోంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.
బడేమియా ఛోటేమియా
బాలీవుడ్ కథానాయకులు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
మైదాన్
భారత ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్’ (Maidaan). బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో లీడ్ రోల్‌లో చేశాడు. అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్ నిర్మాత. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
ఓం భీమ్ బుష్
ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్ బుష్’ (Om Bheem Bush). ఏప్రిల్ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
గామి
యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.
ప్రేమలు
మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్ కాబోతోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu AhaApril 09PremaluMovieTelugu AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
ఏప్రిల్ 08 , 2024
Top TV Hosts In South India: సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!
దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మంజూష (Manjusha)
హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.
వర్షిణి (Varshini)
అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.
విష్ణు ప్రియ (Vishnu Priya)
తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
అషూ రెడ్డి (Ashu reddy)
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.
సౌమ్యరావు (Sowmya rao)
జబర్దస్త్ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
శ్యామల (Shyamala)
అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది.
దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu)
కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.
అనసూయ (Anasuya)
యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్ హిట్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
రష్మి (Rashmi)
జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న మరో యాంకర్ రష్మి. జబర్దస్త్ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.
శ్రీముఖి (Srimukhi)
యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.
వింధ్య (Vindhya)
తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్ ఈమెనే. ఐపీఎల్ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.
రచిత (Rachitha)
ప్రముఖ సీరియల్ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.
పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty)
బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్ మహిళా’, ‘క్యాష్’ వంటి టెలివిజన్ షోలలోనూ ఈమె పాల్గొంది.
ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)
‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్ షోలలోను కనిపించి సందడి చేసింది.
ప్రీతి అస్రాని (Preeti Asrani)
గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar)
ప్రముఖ స్టార్ జంట రాధిక - శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్ అరింధాల్' షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్ తమిళ్ ఛానెల్‌లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్' షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.
వైష్ణవి గౌడ (Vaishnavi Gowda)
కన్నడలో బాగా పాపులర్ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
దీపికా దాస్ (Deepika Das)
కర్ణాటకకు చెందిన దీపికా దాస్.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్ గర్ల్' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 22 , 2024
Pushpa 2 Dialogues: ‘పుష్ప 2’లో గూస్‌బంప్స్ తెప్పించిన డైలాగ్స్.. ఓ లుక్కేయండి!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ నటన, యాస, బాడీ లాంగ్జేవ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న జీవించేసిందంటూ ప్రశంసిస్తున్నారు. బన్నీకి సుకుమార్ ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ పూనకాలు తెప్పించిందని చెబుతున్నారు. డైలాగ్స్ (Pushpa 2 Dialogues) కూడా సినిమాలో బాగా పేలాయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ప్రారంభ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ ఉన్న హైలెట్ డైలాగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ ఎంట్రీ డైలాగ్
జపాన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ను చూపించారు దర్శకుడు సుకుమార్. పుష్ప నుంచి ఎర్ర చందనం తీసుకున్న జపాన్ డీలర్లు డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఈ క్రమంలో కంటైనర్‌లో దుడ్డుతో పాటు వెళ్లిన పుష్ప వారికి చిక్కుతాడు. ఈ క్రమంలో వచ్చే ఎంట్రీ డైలాగ్ హైలేట్‌గా నిలుస్తుంది. జపాన్ భాషలో బన్నీ మాట్లాడటం విశేషం.
పుష్ప రాజ్: హలో! బాగుండారా? నా జపాన్ బ్రదర్స్. (జపాన్ భాషలో)
ఎప్పటి నుండో నా సరుకు యాడికెళ్తుందో సూడాలని అనుకునే వాడిని. ఇన్నాళ్లకు కుదిరుండాది. అంటూ బన్నీ తనను బంధించిన వారిపై విరుచుకుపడతాడు.
కమెడియన్ సత్య : యో.. ఏందప్ప నీకు జపాన్ భాష వచ్చా?
పుష్ప రాజ్ : నలభై దినాలు కంటైనర్‌లో ప్రయాణిస్తూనే 30 దినాల్లో జపాన్ భాష (30 రోజుల్లో జపాన్ నేర్చుకోవడం ఎలా అనే బుక్‌ను చూపిస్తూ) నేర్చుకున్నాలే అప్ప. ఎట్టా ఉండాది నా జపనీస్ భాష.
సత్య: అదిరి పోయింది.. అదిరిపోయింది. ఇంతకీ జపాన్ ఎందుకు వచ్చినావ్ అప్ప?
పుష్పరాజ్ : జపాన్‌కు దుడ్డు (ఎర్ర చందనం) వచ్చింది గానీ, డబ్బు రాలేదప్ప. ఇండియా వాడ్ని మోసం చేస్తే ఎట్టా ఉంటదో సూపించడానికి వచ్చినా..
సత్య: పైసలు కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావా?
పుష్పరాజ్: నాకు రావాల్సింది అణా అయినా, అర్ధ అణా అయినా.. అది ఏడు కొండలు పైన ఉన్నా అయినా, ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు.
పుష్పరాజ్: ఐయామ్ యూనివర్స్ బాస్.. పుష్ప ఈజ్ ద బాస్ (జపాన్ భాషలో)
పోలీసు స్టేషన్ డైలాగ్స్
ఎర్ర చందనం తరలిస్తున్న పుష్ప రాజ్ మనుషులను ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పట్టుకొని జైల్లో వేస్తాడు. తన వారికోసం స్టేషన్‌కు వచ్చిన పుష్ప చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి.
పుష్ప: పుష్ప: నా పిల్లకాయలను లోపల ఏశావా ఏంది? ఒక గంటలో మా శీను గాడి (జైల్లో ఉన్న వ్యక్తి) పెళ్లి ఉండాది. వాళ్లని తోలుకపోవడానికి వచ్చిన.
సీఐ: శీనుగాడి పేరున ఎఫ్‌ఐఆర్ రాశారు. మెుత్తం 230 మంది. ఒక్కరు తక్కువైనా లెక్క తేడా వస్తాది.
పుష్ప: అట్నా.. రేయ్ (తన పక్కన ఉన్న వారితో) మన వాళ్లలో శ్రీనివాస్ ఎవరు ఉన్నార్రా. (ఒక వ్యక్తి నేనున్నా అంటూ ముందుకు వస్తాడు)
సీఐ: అదెట్లా కుదిరిద్ది పుష్ప. ముందు మాదిరి లేదు పుష్ప. రూల్స్ అన్నీ మారిపోయాయ్.
పుష్ప : సీఐ గారికి రూల్స్ మారి పోయాయంట్రా. నేను చెప్పేదా రూల్ ఏంటో. చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఈడ జరిగేదంతా ఒకటే రూలు. అది పుష్పగాడి రూలు.
సీఎంతో మీటింగ్ అప్పుడు..
ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్ప బయలుదేరతాడు. ఈ క్రమంలో సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి సూచిస్తుంది. దీంతో సీఎంతో ఫొటో దిగేందుకు శాలువ కప్పుతుండగా సీఎం హేళన చేస్తూ చెప్పే డైలాగ్ కథను మలుపు తిప్పుతాయి.
ఎంపీ సిద్ధప్ప: పుష్ఫ భార్య మంచి ఫొటో అడిగుండాది. ఫొటో బాగా తీయ్ (కెమెరామెన్‌తో)
సీఎం: ఏంటీ సిద్దప్పు నువ్వు..
ఎంపీ సిద్దప్ప: ఏ అన్నా..
సీఎం: ఈ స్మగ్లర్లు.. పార్టీకి ఫండ్ ఇచ్చినంత ఈజీగా మనం ఫొటోలు ఇవ్వలేం. చెప్పులు కాళ్లను మోస్తున్నాయని చేతులకు తొడుక్కుంటామా ఏందీ.
సీఎం: సిద్దప్ప.. పిల్లోడు కదా. పెళ్లాం మాట విని ఫొటోల కోసం వచ్చుంటాడు. పుష్ప.. పెళ్లాం మాట విని బాగుపడినోడు ఎవ్వడు లేడు. మదిలో పెట్టుకో.
సీఎంతో మీటింగ్ తర్వాత..
సీఎం చెప్పిన మాటలకు బాగా హార్ట్ అయిన పుష్ప బయటకు వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. సీఎంతో మాట్లాడిన కొద్దిసేపటికి ఎంపీ సిద్దప్ప (రావు రమేష్) బయటకు వస్తాడు. ఈ క్రమంలో పుష్ప - సిద్ధప్ప మధ్య వచ్చే సంభాషణ సినిమాకు కీలక మలుపు తిప్పుతుంది.
పుష్ప: ఏం.. సార్. పని అయ్యుండాదే?
ఎంపీ సిద్దప్ప: శాఖ ఏంటో తెలీదు గానీ.. మినిస్ట్రీ అయితే ఇస్తా అన్నాడు. మనమే కొంచెం దుడ్డు (లంచం) ఎక్కువ తడపాలా!
పుష్ప : అది కాదు.. షెకావత్ (ఫహాద్ ఫాజిల్) ట్రాన్స్‌ఫర్ అయ్యుండాదా అని అడుగుతున్నా?
ఎంపీ సిద్దప్ప: కుదరదు అన్నాడప్ప. పోలీసు వాళ్లతో సర్దుకుపోవాలి గానీ వచ్చిన ప్రతీ వాడితో కలియపెట్టుకొని ట్రాన్సఫర్ కోరితే కుదరదన్నాడప్పా. నువ్వు కూడా వద్దన్నావని విడిచేసినా.
పుష్ప: వాడు వద్దనడం వేరు.. నేను వద్దనడం వేరు. చాలా తేడా ఉండాది.
ఎంపీ సిద్దప్ప: ఏందప్ప మాట మారుతుండాది? సీఎం గారిని ఆడు ఈడు అంటున్నావ్. ఫొటో ఇవ్వలేదని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్ కదా.
పుష్ప : అదేం లేదప్ప. సీఎం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. రేపు ఏ సీఎం అయినా అలాగే అంటాడు.
ఎంపీ సిద్దప్ప: నేను అయితే అలా ఎందుకు అంటా? శుభ్రంగా ఇస్తా
పుష్ప : ఏందీ.. ఫొటో ఇస్తావా?
ఎంపీ సిద్దప్ప: ఇస్తానప్పా.. ఎందుకు ఇవ్వను..
పుష్ప : అయితే మీరే సీఎం (సిద్దప్ప వెంటనే షాకవుతాడు)
ఎంపీ సిద్దప్ప: ఏందీ (షాక్‌లో)
పుష్ప : మీరే సీఎం అప్పా..
ఎంపీ సిద్దప్ప: నేను సీఎం ఆ.. (నవ్వుతూ) మతి ఉండే మాట్లాడుతున్నావా?
పుష్ప: ఏమప్పా.. పుష్ప లాంటోడ్ని పక్కన పెట్టుకొని పిల్లి పిత్రి పదవులు (మంత్రి) ఏంటి సామి. పెద్దగా ఆలోచించండి సారు. నా పక్కన పుష్ప లాంటోడు ఉంటే నేను అట్లనే ఆలోచిస్తా.
ఎంపీ సిద్దప్ప: ఆలోచించొచ్చు గానీ.. సీఎం అంటే చాలా అవుద్దీ అప్పా.
పుష్ప : ఎంత అవుతది?
ఎంపీ సిద్దప్ప: తక్కువలో తక్కువ రూ.100 కోట్లు.
పుష్ప : రూ.500 కోట్లు ఇస్తా.. సరిపోద్దా (థియేటర్లలో ఒకటే విజిల్స్)
ఎంపీ సిద్దప్ప: అంత డబ్బు ఎట్టా తెస్తావప్పా?
పుష్ప: దుడ్డు (డబ్బు) గురించి పుష్పకు వదిలేసి.. ఢిల్లీ వెళ్లి ప్రతాప్‌సింగ్ (జగపతిబాబు)ను కలవండి.
జగపతి బాబుతో ఫస్ట్ ఫోన్‌కాల్..
కేంద్ర మంత్రి ప్రతాప్‌సింగ్ (జగపతిబాబు) సింగ్‌తో పుష్ప ఫోన్‌లో మాట్లాడే సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సీఎం సీటు గురించి ఎంపీ సిద్దప్ప అతడితో మాట్లాడుతున్న క్రమంలోనే ప్రతాప్ సింగ్ సోదరుడ్ని పుష్ప కలిసి రూ.5 కోట్లు ఇస్తాడు. దీంతో తన అన్నకు ఫోన్ చేసి ఆ డబ్బు గురించి చెప్తాడు. అప్పుడు పుష్ప-ప్రతాప్ సింగ్ సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
పుష్ప: హలో.. నమస్తే! నా పేరు పుష్ప. మార్కెట్‌లో అందరూ ఎర్ర చందనం పుష్ప అంటుంటార్లే.
ప్రతాప్‌సింగ్: తెలుసప్పా.. కొండారెడ్డి పావలా వాటానే కదా నువ్వు. వింటూనే ఉన్నా.
పుష్ప: నువ్వు పావల వాటా గాడితో మాట్లాడుతున్నావ్ అనుకుంటే.. నేను క్వారీలో లారీ ఆపే గుమస్తా గాడితో మాట్లాడుతున్నాని ఫీలవ్వాల్సి వస్తది. చరిత్రలు ఎందుకులే అన్నా తవ్వుకోవడం.
ప్రతాప్‌సింగ్: ఏందీ ఆ రూ.5 కోట్ల కథ.
పుష్ప: అది నీకు కాదులే అన్న. నీతోడ బుట్టినోడికి. ఫోన్ కలిపిచ్చినందుకు. ఎన్ని దినాలు పాత సోఫాలో కూర్చొని ఉంటావ్. నీకో కొత్త కూర్చి పంపిస్తాలే. దాంట్లో కూర్చో.
పుష్ప: సోఫా అంటే మామూలు సోఫా కాదన్న అది. చానా కాస్ట్లీ సోఫా. రూ.25 కోట్ల రూపాయల సోఫా అది.
ప్రతాప్ సింగ్: ఏ టెండర్ కోసమో చెప్పు. క్వారీనా? మైనింగా?. స్టేట్‌లో ఏ పక్క కావాలో చెప్పు.
పుష్ప: హా హా హా.. మెుత్తం స్టేటే కావాలా. సిద్దప్ప స్టేట్‌కి సీఎం కావాలా.
ప్రతాప్ సింగ్: నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా?
పుష్ప: సరిపోద్ది అన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరి. ఒకసారి ఇచ్చినాక కాదనడానికి లే. కళ్లకద్దుకొని తీసుకోవాల్సిందే. సిద్దప్ప సీఎం అయ్యేది ఖాయం. కాదంటే నాకాడా చాలా సోఫాలు ఉన్నాయిలే.
ప్రతాప్ సింగ్‌తో మీటింగ్ తర్వాత
ఎంపీ సిద్దప్ప: ఏందప్ప ఇది ఫోన్ కనిపినోడికి రూ.5 కోట్లు, మాట్లాడినోడికి రూ.25 కోట్లా. ఇట్టా సింటికేట్ డబ్బంతా పొప్పులు, బెల్లాల మాదిరి పంచుకుంటూ పోతే ఎవరు సమాధానం చెప్పేది.
పుష్ప: నీకు ఇచ్చే లెక్క మారదు సారు.. సిండికేట్‌కు వచ్చే లెక్క మారుద్ది.
ఎంపీ సిద్దప్ప: టన్నుకు అదే రూ.కోటిన్నర లెక్క.. ఎట్లా మారుద్ది.
పుష్ప: మంగళం శ్రీనుకి అమ్మితే టన్నుకు రూ.50 లక్షలు.. మురుగన్‌కు అమ్మితే టన్ను రూ.కోటిన్నర. అదే మురుగన్ అమ్మేటోడికి మనం పోగలిగితే..
ఎంపీ సిద్దప్ప: ఆశ్చర్యం, ఆనందం కలసిన ముఖంతో
పుష్ప: పుష్పగాడి చూపు దేశం దాటేసుండాది. ఏందీ.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్‌నేషనల్..
ఇంటర్నేషనల్ స్మగ్లర్‌తో డీల్..
స్మగ్లర్: పుష్ప రెండక్షరాలు.. నామ్ ఛోటా హై లేకిన్ సౌండ్ బడా.. బూమ్
పుష్ప: సౌండ్ నచ్చుండాదా నీకు.. ఇప్పుడు దందా మాట్లాడదాం చెప్పబ్బా.
స్మగ్లర్: మాల్ ఎంత (హిందీలో)
పుష్ప: 2000 టన్నులు (ఎర్ర చందనం)
స్మగ్లర్: హా హా హా.. టన్నుకు ఎంత?
పుష్ప : రూ. రెండున్నర కోట్లు
స్మగ్లర్: జోక్ చేస్తున్నావా? పుష్ప
పుష్ప: దందా విషయంలో పుష్ప జోకులెయ్యడు. పుష్పతో దందా అంటే చాలా మజా వస్తుంది.
స్మగ్లర్: సరే 2000 టన్నుల మాల్ రూ.5000 కోట్లు
పుష్ప: కాదు.. రూ.4,900 కోట్లు
స్మగ్లర్: రూ.100 కోట్లు ఎందుకు తగ్గించావ్ పుష్ప? మాల్ సరిపడ లేదా?
పుష్ప: మిగతా రూ.100 కోట్లకి నవ్వుతూ.. (హెలికాఫ్టర్ తీసుకొని వెళ్లిపోతాడు)
సిండికేట్ మీటింగ్ సమయంలో..
సిండికేట్ సభ్యులు: షెకావత్ మన కోసం కాచుకొని ఉన్నాడు. ఈ సమయంలో అంత సరుకు పంపించడం కరెక్టెనా?
పుష్ప: కరెక్టో కాదో పుష్ప ఆలోచించడప్ప.. ఒరు నిర్ణయం తీసుకుంటాడు. అది కరెక్ట్ అవుతుంది అంతే.
పుష్ప - రష్మిక సంభాషణ
ఓ సీన్‌లో శ్రీవల్లి (రష్మిక) కాలుకి దెబ్బ తగలుతుంది. పుష్ప స్వయంగా ఆమె కాలు పట్టుకొని మందు రాస్తుంటాడు. అప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్ క్యూట్‌గా అనిపిస్తాయి.
శ్రీవల్లి: కాలు వదిలేయ్ సామి..
పుష్ప: ఏమి..
శ్రీవల్లి: అసలే మీరు పుష్పరాజ్. పెళ్లా కాలు పట్టుకుంటాడని నాకు మాట రానీకు.
పుష్ప: ఏయ్.. పౌరుషంలోనే కాదు.. ప్రేమ విషయంలోనూ పుష్పరాజ్ తగ్గేదేలే (అంటు శ్రీవల్లి కాలితో తన గడ్డని నిమురుతాడు)
పుష్ప - షెకావత్
ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో జరిగిన దానికి పుష్ప సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు పుష్ప- షెకవాత్ మధ్య వచ్చే సంభాషణ వారి మధ్య మరింత శత్రుత్వాన్ని పెంచుతుంది.
ఎంపీ సిద్దప్ప: పుష్ప చెప్పేయప్పా
పుష్ప: సారీ చెప్పే ముందు పుష్ప చేసే ఎటకారపు చర్యలు భలే నవ్వు తెప్పిస్తాయి.
పుష్ప: సరే.. సారీ
షెకావత్ : బ్రహ్మాజీతో పుష్ప సారీ చెప్పింది విన్నావా?
బ్రహ్మాజీ: సారీ చెప్పింది కాదు సార్.. చెప్పాడు అనాలి.
షెకావత్: పుష్ప ఫైర్ అయ్యుంటే చెప్పాడు అనేవాడ్ని.. సారి చెప్పి ఫ్లవర్ అయ్యాడుగా అందుకే చెప్పింది.
‘పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్’
జాతర సందర్భంలో వచ్చే డైలాగ్స్
అజయ్: వీరందర్నీ కొట్టినావని చెప్పి నిన్ను మాలో కలుపుకోవాలా? నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే.
శ్రీవల్లి: యో పెద్ద మనిషి నీ కూతుర్ని కాపాడితే అంతా డ్రామా లాగా అనిపిస్తుందా? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డైనా ఇట్లానే కాపాడతాడు. ఓ జన్మయ్య నీది.
పుష్ప అమ్మ: శ్రీవల్లి.. పెద్ద చిన్న చూసి మాట్లాడు.
శ్రీవల్లి: నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమోగానీ, ఎవడైనా నా మెుగుడ్ని అంటే నేను ఊరుకుండేదే లేదు.
కిడ్నాపర్లకు పుష్పరాజ్ మాస్ వార్నింగ్
సినిమా చివర దశకు చేరుకునే క్రమంలో అజయ్ కూతుర్ని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఓ న్యూస్ ఛానెల్ వేదికగా కిడ్నాపర్లకు పుష్పరాజ్ ఇచ్చే వార్నింగ్ హైలెట్ అనిపిస్తుంది.
పుష్పరాజ్: నా పేరు పుష్ప.. పుష్ప రాజ్. మీరు నాకు పరిచయం అక్కర్లేదు పాయింట్‌కు వస్తున్నా.
పుష్పరాజ్: బిడ్డను ఎత్తుకు పోతార్రా మీరు.. అంత దమ్ముండాదా? కొడ**రా. ఇప్పుడు చెబుతున్నా చెవులు పెద్దవి చేసుకొని వినండి.
పుష్పరాజ్: మీకు ఈ క్షణం నుంచి గంట టైమ్ ఇస్తాండా. ఆ బిడ్డను యాడ నుంచి ఎత్తుకెళ్లారో ఆడనే దింపాలా. అట్ట పోయి ఇట్ట వచ్చినట్లుండాలా.
పుష్పరాజ్: అట్ట కాదని ఆ బిడ్డమీద ఒక్క చిన్న గీత పడాలా.. గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా..
మెగా ఫ్యామిలీకి కౌంటర్లుగా అనిపించే డైలాగ్స్
అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రాజుకున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో పుష్ప 2 లోని కొన్ని డైలాగ్స్ చర్చనీయాంశమవుతున్నాయి. చిరు ఫ్యామిలీకి కౌంటర్‌గా వాటిని మూవీలో పెట్టారన్ని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం.
‘మీ బాస్‌కే నేను బాస్’
'ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు'
‘నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు’
'ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు'
'పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా'
‘పావలా పర్సంటేజ్ వాటా గాడివి ఏంటిరా?
'ఎవడ్రా నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా..’
డిసెంబర్ 05 , 2024