ATelugu2h 21m
చట్టానికి కళ్ళు లేవు అనేది S. A. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 1981 భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి, లక్ష్మి, హేమ సుందర్, కన్నడ ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది 1981లో విడుదలైన తమిళ చిత్రం సత్తమ్ ఒరు ఇరుత్తరైకి రీమేక్. ఈ చిత్రం 30 అక్టోబర్ 1981న విడుదలై కమర్షియల్‌గా విజయం సాధించింది.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Youtubeఫ్రమ్
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
విజయ్మాధవి
రేఖలక్ష్మి
ఇన్స్పెక్టర్ దుర్గపండరీ బాయి
విజయ్ మరియు దుర్గ తల్లిజెవి రమణ మూర్తి
శేషయ్యహేమ సుందర్
జగన్నాథ్ప్రభాకర్
జావేద్సిలోన్ మనోహర్
జాన్ఎం. ప్రభాకర్ రెడ్డి
పోలీస్ చీఫ్జివి నారాయణరావు
రంగామాడా వెంకటేశ్వరరావు
సింహాచలంసారథి
కానిస్టేబుల్రావి కొండల రావు
పోలీస్ ఇన్స్పెక్టర్PJ శర్మ
జైలర్ ఆనంద రావుసిబ్బంది
S. A. చంద్రశేఖర్
దర్శకుడుS. A. చంద్రశేఖర్
నిర్మాతకృష్ణ-చక్రసంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Kavya Thapar VS Bhagyashri Borse: వీరిద్దరిలో టాలీవుడ్‌ను ఏలేది ఎవరంటే?
టాలీవుడ్‌కు హీరోయిన్స్ కొత్త కాదు. సినిమా సినిమాకు కొత్త భామలు పరిచయమవుతూనే ఉంటారు. అందం, అభినయంతో మెప్పించిన వారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగితే మరికొందరు మాత్రం సత్తా చాటలేక కనుమరుగవుతుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15 సందర్భంగా ఇద్దరు హీరోయిన్స్ తెలుగు తెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse), ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో కావ్యా థాపర్ (Kavya Thapar) తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. కావ్య థాపర్ ఇప్పటికే తెలుగులో నాలుగు సినిమాలు చేయగా భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఇదే ఫస్ట్ ఫిల్మ్. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో ఎవరి విజయవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
భాగ్యశ్రీ బోర్సే
అందానికి కేరాఫ్‌గా భాగ్యశ్రీ!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఒక్కో ఈవెంట్లో ఒక్కోరకమైన లుక్‌తో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఈవెంట్లో చీర కట్టులో ట్రెడిషనల్‌గా కనిపించి, మరో ఈవెంట్లో మోడ్రన్ డ్రెస్‌లో కళ్లు చెదిరే గ్లామరస్‌గా కనిపిస్తోంది. అటు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ కూడా ఈ బ్యూటీని హైలెట్ చేస్తోంది. ప్రతీ ప్రమోషన్స్‌లో ఈ అమ్మడిని పాల్గొనేలా చేస్తూ సినిమాపై యూత్‌లో అంచనాలు పెంచేస్తోంది. ఈ హాట్ బ్యూటీ కూడా దొరికిందే ఛాన్స్ అని తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రమోషన్స్‌కు సరికొత్త అందాలు తీసుకొస్తోంది. ఇదే బెస్ట్ ఛాన్స్‌గా భావిస్తూ దూసుకెళ్తోంది.
హరీష్ శంకర్ మార్క్!
‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్, టీజర్, ప్రమోషన్ పోస్టర్స్ గమనిస్తే భాగ్యశ్రీ ఇందులో గ్రామరస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన ఈ అమ్మడు అదిరిపోయే ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. పైగా హీరోయిన్స్‌ను చూపించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్‌కు మంచి పేరుంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్’లో ఇద్దరు హీరోయిన్స్‌తో ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ నుంచి భారీ ఎత్తున అందాల ఆరబోత ఉండే అవకాశముంది. ఈ చిత్రం ద్వారా భాగ్యశ్రీకి సరైన స్టార్ట్ లభిస్తే ఇండస్ట్రీలో ఈ అమ్మడికి తిరుగుండదని చెప్పవచ్చు. పైగా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం భాగ్యశ్రీకి కలిసిరానుంది.
చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్
ఒక్క మూవీ రిలీజ్ కానప్పటికీ భాగ్యశ్రీ బోర్సేతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు తెగ పోటీ పడుతున్నారు. 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ దశలో ఉండగానే అదిరిపోయే ఆఫర్లు భాగ్యశ్రీ దక్కాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని - భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్ కాకుండానే టాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా రెండు బ్లాక్ బాస్టర్లు వస్తే టాలీవుడ్లో భాగ్యశ్రీ టాప్ హీరోయిన్గా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
https://www.youtube.com/watch?v=CS7Wm46EXAA
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
కావ్య థాపర్
కావ్య థాపర్ హల్చల్!
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్గా నటించింది. తెలుగులో ‘ఈ మాయ పేరేమిటో’, ‘ఏక్ మినీ కథ’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలు చేసినప్పటికీ ఈ అమ్మడికి బ్రేక్ రాలేదు. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సక్సెస్‌పై కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అంతేకాదు అందాల ప్రదర్శనకు సైతం ఏమాత్రం వెనకాడలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్, లిరికల్ సాంగ్ వీడియోలు, ప్రమోషన్ పోస్టర్స్ చూస్తే కావ్య థాపర్ ఎంతో హాట్‌గా కనిపించింది. గ్లామరస్ లుక్, కళ్లు చెదిరే హాట్ స్టెప్పులతో యూత్‌ను కట్టిపడేసింది. అంతకాదు లిప్‌లాక్ సీన్లోనూ నటించి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అన్ని అనుకున్నట్లు జరిగి డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ అయితే కావ్య థాపర్ స్టార్ హీరోయిన్గా మారడం పక్కా అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
శ్రీను వైట్ల డైరెక్షన్లో..
గోపిచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వం' చిత్రంలో కావ్య థాపర్‌గా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. హై యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకూ ఇటలీలో నిర్వహించారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా కావ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘పుష్ప 2'లో ఓ స్పెషల్ సాంగ్‌లో కావ్య థాపర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యూత్‌లో ఈ భామ అందాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఐటెం సాంగ్‌ను కావ్య చేయిస్తే ఎలా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వచ్చే ఛాన్స్ ఉందట. వీటితో పాటు మరిన్ని అవకాశాలు కావ్య కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE
కావ్య థాపర్ నేపథ్యం ఇదే!
మహారాష్ట్రకు చెందిన కావ్య థాపర్ 2013లో ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ‘ఏక్ మినీ కథా’ మూవీలోనూ అమృతగా కనిపించి కావ్య మెప్పించింది. ఆ తర్వాత క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించింది. ‘ఈగల్’, ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించింది. కాగా, సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీ బిజీగా ఉంటోంది.తన గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆగస్టు 13 , 2024
Bharateeyudu 3 OTT: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ ఈ ఏడాది జులై 12 'భారతీయుడు 2' రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకా దారుణంగా చతికిల పడింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా 'భారతీయుడు 3' రానుందని సెకండ్ పార్ట్ క్లైమాక్స్‌లోనే దర్శకుడు శంకర్ స్పెషల్ ట్రైలర్ చూపించి మరీ కన్ఫార్మ్ చేశారు. అయితే తాజాగా మూడో పార్ట్‌కు సంబంధించి క్రేజీ బజ్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులోని నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నేరుగా ఓటీటీలోకి ‘భారతీయుడు 3’!
కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రానున్న మరో చిత్రం 'భారతీయడు 3'. వీరి కాంబోలో విజయవంతమైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా రెండు, మూడు భాగాలను రూపొందించారు. ఈ ఏడాది జులైలో విడుదలైన 'భారతీయుడు 2' ప్రేక్షకాదరణ పొందని సంగతి తెలిసిందే. దాంతో మూడో భాగానికి థియేట్రికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. రిస్క్ తీసుకునేందుకు థియేటర్ వర్గాలు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో పార్ట్‌ను నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న శంకర్, కమల్ హాసన్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకురావడం ఇది వారికి అవమానేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ధ్రువీకరించిన ఓటీటీ వర్గాలు!
‘భారతీయుడు 3’ చిత్రం ఓటీటీలోకి రావడం ఖాయమని నెట్‌ఫ్లిక్స్ వర్గాలు సైతం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2025 జనవరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్కు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓటీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం వెల్లడించనున్నట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘భారతీయుడు 2’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో వ్యూస్ సాధించలేకపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమాకు ఆదరణ లభించలేదు. దీంతో ‘భారతీయుడు 3’ ఓటీటీ హక్కులు తక్కువ ధరకే అమ్ముడుపోయే చాన్స్ ఉందని అంటున్నారు.
‘భారతీయుడు 2’పై దారుణమైన ట్రోల్స్!
'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్ హాసన్ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. అయితే యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పాత్రతో యాక్షన్స్ సీక్వెన్స్ చేయించారు డైరెక్టర్ శంకర్. వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉండే వయసులో అలవోకగా స్టంట్స్ చేస్తుండటం చూడటానికి నమ్మశక్యంగా అనిపించలేదు. ఇక ‘భారతీయుడు 2’ కథ, కథనం కూడా చాలా పూర్ ఉందన్న విమర్శలు వచ్చాయి. అసలు శంకర్ చిత్రంలాగే లేదని కామెంట్స్ వినిపించాయి.
గేమ్ ఛేంజర్‌తో గట్టెక్కేనా!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. అంతకుముందు వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. ఈ సినిమా విజయం సాధిస్తే శంకర్ పేరు మరోమారు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగే ఛాన్స్ ఉంది. లేదంటే అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గేమ్ ఛేంజర్ రిజల్ట్ చాలా కీలకంగా మారింది. ‘ఫ్యామిలీ స్టార్’ మిగిల్చిన నష్టాలను ‘గేమ్ ఛేంజర్’ పూడ్చాలని దిల్‌రాజు భావిస్తున్నారు.
అక్టోబర్ 04 , 2024
Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
[toc]
అసలేం జరిగిందంటే?
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్ 19) ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.
తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్
మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
https://twitter.com/HeroManoj1/status/1836692133216174368
జానీ మాస్టర్ టాప్-10 సాంగ్స్
జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్ -10 సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం
మేఘం కరిగేనా (తిరు)
తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. ధనుష్, నిత్య స్టెప్పులను నెక్స్ట్ లెవల్లో కంపోజ్ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.
https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY
అరబిక్ కుతు (బీస్ట్)
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్ బెస్ట్ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది.
https://www.youtube.com/watch?v=vOYJmUE_U24
రంజితమే (వారసుడు)
విజయ్, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో విజయ్, రష్మిక డ్యాన్స్ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్ చివరిలో వచ్చే సింగిల్ టేక్ స్టెప్ విజయ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.
https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8
రారా రక్కమ్మ (విక్రాంత్ రోణ)
విక్రాంత్ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్ దేశంలోని మ్యూజిక్ లవర్స్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్ అందించిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్ స్టెప్‌పై రీల్స్ చేసి వైరల్ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్, కన్నడ నటుడు సుదీప్తో ఆడిపాడింది.
https://www.youtube.com/watch?v=aC9KBju5BNY
నువ్వు కావాలయ్యా (జైలర్)
రజనీకాంత్ గత చిత్రం ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్న వేసిన హుక్ స్టెప్‌కు యూత్ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. రీల్స్ సైతం పెద్ద ఎత్తున చేశారు.
https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk
రౌడీ బేబీ (మారి 2)
సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్ చిత్రీకరణ జరిగింది.
https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI
బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు.
https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ
సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం)
‘రేసుగుర్రం’లోని మాస్ బీట్ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA
లైలా ఓ లైలా (నాయక్)
రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=HGgHSi-kg78
ఏం మాయో చేశావే (ద్రోణ)
2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ టాలెంట్ చూసిన నితిన్ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నితిన్ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్ తర్వాత నుంచి జానీ మాస్టర్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
సెప్టెంబర్ 19 , 2024
This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
ఆ ఒక్కటీ అడక్కు
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రసన్న వదనం
సుహాస్ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఫేస్ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య అనే యువకుడు మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. మరి ఆ కేసుల్లోంచి ఎలా తప్పించుకొన్నాడు? అసలు హంతకుడ్ని చట్టానికి ఎలా అప్పగించాడు? అనేదే కథ.
శబరి
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగులో వరలక్ష్మీ చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ఇదేనని పేర్కొంది.
బాక్
ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘బాక్’ (Baak). తమన్నా (Tamannaah), రాశీ ఖన్నా (Raashii Khanna) కథానాయికలు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది.
జితేందర్‌రెడ్డి
యువ నటుడు రాకేశ్‌వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. దర్శకుడు విరించి వర్మ.. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ప్రణయ విలాసం
ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటించిన ప్రణయ విలాసం (Pranaya Vilasam) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 29 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా.. మంచి ఆదరణ సంపాదించింది. ఈ మూవీలో అర్జున్ అశోక్ మేల్ లీడ్ రోల్లో నటించాడు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateThe Idea Of YouMovieEnglishAmazon PrimeMay 2The WheelSeries EnglishDisney + HotstarApril 30DeArMovieTelugu/TamilNetflixApril 28Boiling Point - 1SeriesEnglishNetflixApril 29Heera MandiSeriesHindiNetflixMay 1Sithan MovieHindiNetflixMay 3The A Typical FamilySeriesKorean/English NetflixMay 4Hacks 3SeriesEnglishJio CinemaMay 3VonkaMovieEnglishJio CinemaMay 3The Tattooist of AuschwitzSeriesEnglishJio CinemaMay 3Migration MovieEnglishJio CinemaMay 1Acapulco S3SeriesEnglishApple Plus TVMay 1
ఏప్రిల్ 29 , 2024
ఈ వారం(April 21) థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు
వేసవి కాలం వచ్చేసింది. కొద్ది రోజుల్లో విద్యార్థులకు సెలవలు వస్తాయి. పిల్లలు, పెద్దలు దొరికిన కాస్త సమయాన్ని సినిమాలు చూడటానికి కేటాయిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఒకసారి అవెంటో తెలుసుకోండి.
విరూపాక్ష
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విభిన్నమైన కథతో కార్తీక్ దండు తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకువస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లుక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
హలో.. మీరా.. !
గార్గేయి ఎల్లాప్రగడ ప్రధానపాత్రలో నటించిన హలో… మీరా ! చిత్రం కూడా ఈ నెల 21న శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా సాగుతుంది. కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కూడా సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ కథతో రూపొందింది. తెరపై కనిపించే.. తెర వెనుక వినిపించే పాత్రలకు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఓటీటీ చిత్రాలు / వెబ్ సిరీస్‌లు
Title CategoryLanguagePlatformRelease DateHow to get rich Series EnglishNetflixApril 18Chimp empire Documentary English Nerflix April 19The marked heart Series EnglishNetflixApril 19Chota bheemSeries HindiNetflixApril 20Tooth pariMovieHindiNetflix April 20Diplomat MovieEnglishNetflixApril 20Satya 2MovieTelugu NetflixApril 21Ready MovieTelugu NetflixApril 21Indian hatch making SeriesHindi NetflixApril 21A tourist guide to loveMovieEnglish NetflixApril 21Garmi SeriesHindi Sony livApril 21Suga Documentary specialHindi hotstarApril 21
https://telugu.yousay.tv/tollywood-cult-movies-shiva-to-dussehra-these-are-the-movies-that-made-the-telugu-audience-drool.html
ఏప్రిల్ 18 , 2023
అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.
ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్‌లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సెన్సార్షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్‌కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్‌పై ఓటీటీ సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.
ఈ సిరీస్‌పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెన్సార్షిప్ ఎందుకు లేదు?
ఓటీటీలకు సెన్సార్షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్సిరీస్ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్‌ని డిజైన్ చేయలేమని తెలిపింది.
సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?
రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్‌కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్‌ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.
ఎందుకు వద్దంటున్నారు?
ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్‌లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
మంచి కన్నా చెడు ఎక్కువ..!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్షిప్ ఉండాలనేది వారి వాదన.
ఈ ప్లాట్‌ఫాంలలో అధికంగా..
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడల్ట్ కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్‌చుప్, ఫనియో మూవీస్, హాట్‌షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్‌లు అడల్ట్ కంటెంట్‌ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.
టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్‌లు(ఇండియా)..
క్లాస్ ఆఫ్ 2020
విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్లు ఉంటుంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.
మేడ్ ఇన్ హెవెన్
నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్‌సిరీస్. 2019లో రిలీజైంది.
గందీబాత్
అడల్ట్ సిరీస్‌లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.
మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్
మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్‌ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.
వర్జిన్ భాస్కర్
రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.
ఆశ్రమ్
ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.
రాత్రి కీ యాత్రి
2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.
మీర్జాపూర్
అమెజాన్ ప్రైమ్‌లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్‌సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.
రానానాయుడు
ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్‌లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్‌ని కలిగి ఉన్నాయి.
ఏప్రిల్ 08 , 2023
HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఒకరు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాలిడ్ విజయాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా అనిపిస్తూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇవాళ (నవంబర్ 23) నాగ చైతన్య పుట్టిన రోజు. 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో చైతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి ఘనమైన కుటుంబ నేపథ్యం అక్కినేని నాగ చైతన్యకు ఉంది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని చైతూ కొణికి పుచ్చుకున్నాడు.
1986 నవంబర్ 23న అక్కినేని నాగార్జున, లక్ష్మీ (డి. రామానాయుడు కూతురు, వెంకటేష్ సోదరి) దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు.
నాగచైతన్య చిన్నప్పుడే లక్ష్మీతో నాగార్జున విడిపోయారు. దీంతో చెన్నైలో తల్లి వద్దనే చైతన్య పెరిగాడు. అక్కడే పీఎస్‌బీబీ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాడు.
హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో కామర్స్ చేశాడు. చదువులో చైతన్య బ్రిలియంట్ ఏమి కాదు. తాను జస్ట్ యావరేజ్ స్టూడెంట్ అని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రస్తుతం నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)ను చూస్తే చాలా ఫిట్‌గా 38 ఏళ్లు వచ్చినట్లు అసలు కనిపించడు. కానీ టీనేజ్‌లో అతడు చాలా లావుగా ఉండేవాడు. 98 కేజీల వరకూ బరువు ఉండేవాడట.
చూడటానికి చాలా బొద్దుగా కనిపిస్తుండటంతో అప్పట్లో అందరూ 'డంబూ' అని చైతూను పిలిచేవారట. అక్కినేని కంటే దగ్గుబాటి ఫ్యామిలీ వారే చైతూనూ బాగా ముద్దు చేశారని సమాచారం.
హీరో కావాలన్న కోరిక నాగచైతన్య చిన్నప్పటి నుంచి లేదట. డిగ్రీ మిడిల్‌కు వచ్చాక కూడా కెరీర్‌పై స్పష్టత లేదట. తండ్రితో షూటింగ్స్ వెళ్లడం వల్ల సినిమాలపై చైతూకి ఆసక్తి వచ్చింది.
సినిమాల్లోకి వస్తానని నాగార్జునకు చైతూ చెప్పగా నీ ఇష్టమని ఆయన బదులిచ్చారు. అయితే బరువు తగ్గాలని మాత్రం సూచించినట్లు తెలిసింది.
నాగార్జున సూచనతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన నాగచైతన్య బాగా బరువు తగ్గాడు. దాంతోపాటు కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్ స్కూల్లో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాడు.
అలా 2009లో 'జోష్' సినిమాతో నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చేసిన 'ఏం మాయ చేశావే' సినిమా నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పింది.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే తెలుగు నటుడు అనగానే ముందుగా నాగ చైతన్యనే గుర్తుకు వస్తాడు. ఈ మధ్య పర్వాలేదు గానీ మెుదట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సైతం చైతూ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు.
సోషల్ మీడియాలో పంచుకుంటే ఇక మన ప్రైవసీ ఏముందని నాగ చైతన్య తరచూ చెబుతుంటాడు. వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రైవేటుగానే ఉండాలని ఈ కుర్ర హీరో అభిప్రాయం.
నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) చూడటానికి సాఫ్ట్‌గా కనిపించినా రేసింగ్‌లో మాత్రం దుమ్మురేపుతుంటాడు. హైస్పీడ్ బైక్స్, కార్లు అవలీలగా నడిపేస్తుంటాడు
వాస్తవానికి రేసర్ కావాలని తొలుత నాగ చైతన్య భావించాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నట్లు అతడి సన్నిహితులు చెప్పారు. కొన్ని కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.
ప్రొఫెషనల్ రేసర్ కానప్పటికీ ఇప్పటికీ రేసర్‌గానే తనని తాను భావిస్తుంటాడు చైతూ. రేసింగ్ కార్లను కొనుగోలు చేయడం అభిరుచిగా పెట్టుకున్నాడు. ఖాళీ సమయాల్లో ఫుల్ స్పీడుతో డ్రైవింగ్ చేస్తుంటాడు.
ప్రస్తుతం చైతూ గ్యారేజీలో ఫెరారీ, నిస్సాన్ జీటీ-ఆర్, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్ రోవర్ వోగ్ లాంటి అత్యంత వేగంగా వెళ్లే కార్లు ఉన్నాయి. వీటితో పాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ వంటి రేసింగ్ బైక్స్ కూడా ఉన్నాయి.
ఫిట్‌నెస్‌కు చైతూ (HBD Akkineni Naga Chaitanya) చాలా ప్రాధాన్యత ఇస్తాడు. క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాడు. ఇందుకోసం ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
చైతూకి మెుహమాటం చాలా ఎక్కువ. అతడితో కొద్దిసేపు మాట్లాడితే ఎవరికైనా ఇది తెలిసిపోతుందని ఆయన ఫ్రెండ్స్ చెబుతుంటారు.
చైతూకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువేనట. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా. బంధుత్వానికి మించిన స్నేహం చిన్నప్పటి నుంచి వారి మధ్య ఉంది.
చైతూ మంచితనం, వ్యక్తిత్వం చూసి 'స్వీట్ కిడ్' అని పేరు పెట్టానని రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చైతూని ఎవరైనా ఇష్టపడతారని పేర్కొన్నారు.
చైతూ ఇష్టమైన ఫుడ్ విషయానికి వస్తే ‘బటర్ చికెన్’ అంటే అతడికి బాగా ఇష్టం. వారంలో కనీసం రెండుసార్లైనా అది ఉండాల్సిందేనని చైతూ చెబుతుంటాడు.
నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)కు ఓ ఊతపదం ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప అది గుర్తించలేరు. ఇంతకీ ఆ పదం ఏంటంటే 'యూ నో'.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నటిపై టీనేజ్ నుంచి నాగచైతన్యకు క్రష్ ఉండేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.
ఏడేళ్ల పాటు ప్రేమించి స్టార్ హీరోయిన్ సమంతను 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాలతే నాలుగేళ్లకే (2021) వారు విడిపోయారు.
ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను 2024 ఆగస్టు 8న చైతు నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది.
ఇక సినిమాల విషయానికొస్తే విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇవాళ (నవంబర్ 23) చైతూ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
https://twitter.com/chay_akkineni/status/1860218199587062221
'NC 24' వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్ సుకుమార్ నిర్మించనున్నారు.
నవంబర్ 23 , 2024
Brahmaji vs Sathyadev: సత్యదేవ్‌పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్!
సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zebra Movie). ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ (Eshwar Karthik) దర్శత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), జెన్నిఫర్ (Jenniffer) హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా హీరో సత్యదేవ్‌తో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఇందులో సత్యదేవ్‌పై బ్రహ్మాజీ నోరుపారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రోమోలో ఏముందంటే?
బ్రహ్మాజీతో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను నటుడు సత్యదేవ్ తన ఎక్స్ ఖాతాలో పంచున్నారు. ఇందులో బ్రహ్మాజీ వస్తూనే 'ఈ న్యూసెన్స్ ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటీ అని చిరగ్గా ముఖంగా పెట్టి సత్యదేవ్‌ను అడిగారు. నువ్వు డ్యాన్స్ చేశావా అని ప్రశ్నించగా.. ఏదో హుక్ స్టెప్ వేశాను అని సత్యదేవ్ అంటాడు. 'హుక్కా.. బొక్కా' అల్లు అర్జున్ అయితే డ్యాన్స్ కోసం వెయిట్ చేస్తారు, నీకోసం ఎవరు చూస్తారు అని బ్రహ్మాజీ విసుక్కుంటాడు. జిబ్రా అనగానే థియేటర్లు బద్దలు కొట్టుకొని ప్రేక్షకులు వచ్చేస్తారా అంటు మండిపడ్డాడు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ జిబ్రాకు వర్క్ చేశారని సత్యదేవ్ చెప్పగానే బ్రహ్మాజీ బిగ్గరగా నవ్వుతాడు. అలా అని పేర్లు వేసేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. అప్పుడు సత్యదేవ్ నీలాగా పోస్టులు పెట్టి డిలీట్ చేయను అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రోమోను మీరు ఓసారి చూసేయండి.
https://twitter.com/i/status/1857340000733720861
మరీ ఓవర్ చేశారా?
ప్రస్తుతం తమ సినిమాలను వినూత్నంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 'జిబ్రా' టీమ్ ఇలా బ్రహ్మాజీ, సత్యదేవ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఎవరైన సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. కానీ ప్రోమోను పరిశీలిస్తే ప్రతీ దశలోనూ బ్రహ్మాజీ 'జిబ్రా' మూవీని ఏకిపారేయడం చూడవచ్చు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సత్యదేవ్‌ను చాలా పర్సనల్‌గా అటాక్ చేసినట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో పోలుస్తూ నీ స్థాయి ఇంతే అన్నట్లు ఇండైరెక్ట్‌గా పంచ్‌లు వేసినట్లు ఉందన్నారు. అలాగే ‘జిబ్రా’ అనేది బ్రహ్మాండమైన సినిమా అనుకోవాలా? జనాలు ఎగబడిపోవాలా? అంటూ చేసిన కామెంట్స్ సినిమాపై నెగిటివిటీని పెంచేలా ఉందని చెబుతున్నారు.
https://twitter.com/powerstarp1/status/1857413471135998113
https://twitter.com/ganeshmunju11/status/1857355491401154992
https://twitter.com/Rohit_RC_/status/1857383353298600053
బ్రహ్మాజీ అలా.. చిరు ఇలా
'జిబ్రా' సినిమా రిలీజ్ నేపథ్యంలో మంగళవారం (నవంబర్ 12)న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్‌పై ప్రశంసలు కురిపించాడు. తనకు మూడో తమ్ముడు అంటూ ఆకాశానికి ఎత్తాడు. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, నిజమైన ఎమోషన్ అతడిలో ఉన్నాయని చెప్పారు. మంచి నటుడు అయినప్పటికీ సరైన సినిమాలు పడదలేన్నారు. అందుకే తన 'గాడ్ ఫాదర్' సినిమాకు రిఫర్ చేసినట్లు చెప్పారు. అతడి చేసిన 'జిబ్రా' సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు.
https://twitter.com/i/status/1856606401709162891
నవంబర్ 16 , 2024
Sai Pallavi: నాని సినిమా షూట్లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ షూటింగ్ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది.
కారణం ఏంటంటే?
శివకార్తికేయన్ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్ షూట్ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’
రాత్రి ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) షూటింగ్ చేస్తునే పగలు మరో మూవీ సెట్లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.
దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్స్ చేశాడు. వాసు, శ్యామ్ సింగరాయ్ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 12 , 2024
Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్ మల్టీ యూనివర్స్ ఫిల్మ్.. ‘రహస్యం ఇదం జగత్’ మెప్పించిందా?
నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ ఖండాల, ఆది నాయుడు, శివ జుటూరి తదితరులు
డైరెక్టర్ : కోమల్ ఆర్. భరద్వాజ్
సంగీతం: గ్యానీ
సినిమాటోగ్రాఫర్ : టేలర్ బ్లూమెల్
ఎడిటిర్: ఛోటా కె. ప్రసాద్
నిర్మాత: హిరణ్య, పద్మ, కోమల్ ఆర్. భరద్వాజ్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idham Jagath Review). సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు (నవంబర్ 8)న థియేటర్స్‌లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్‌లో ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
కథ అమెరికా (Rahasyam Idham Jagath Review)లో జరుగుతుంటుంది. అకీరా (స్రవంతి), ఆమె లవర్ అభి (రాకేష్) ఇండియా వెళ్లాలని ఫిక్స్ అవుతారు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్ (విశ్వ, కల్యాణ్, అరు)తో ఓ ట్రిప్‌కు వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి అకీరా మాజీ లవర్ విశ్వ కూడా వస్తాడు. మంచు కారణంగా బుక్ చేసుకున్న హోటల్లోనే వారంత రాత్రి స్టే చేయాల్సి వస్తుంది. అకీరా స్నేహితుల్లో ఒకరైన సైంటిస్ట్ అరు మల్టీ యూనివర్స్‌పై రీసెర్చ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఓ విషయమై గొడవ జరిగి అకీరా, కల్యాణ్‌ను అభి చంపేస్తాడు. అదే సమయంలో మల్టీ యూనివర్స్‌కి వెళ్లే దారి తాము ఉన్న ఊళ్లోనే ఉందని అరు చెబుతుంది. దీంతో ఫ్రెండ్స్‌ను మళ్లీ బ్రతికించడం కోసం అభి మల్టీ యూనివర్స్‌లోకి తీసుకెళ్లే వామ్ హోల్ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వామ్ హోల్‌ను అభి కనిపెట్టాడా? ఫ్రెండ్స్‌ను బతికించుకున్నాడా? అభి, అకీరా ఇండియాకు వెళ్లారా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
గతంలో అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్‌తో (Rahasyam Idham Jagath Review) మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాడు. వామ్ హోల్లోకి ట్రావెల్ చేసే వ్యక్తిగా అదరగొట్టాడు. అకీరా పాత్రలో స్రవంతి మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు బాగా సూట్ అయ్యింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పించాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. షూటింగ్ మెుత్తం అమెరికాలో జరగడం, అక్కడే నటనలో ట్రైనింగ్ తీసుకోవడంతో హాలీవుడ్ చిత్రాల ప్రభావం నటీనటుల్లో స్పష్టంగా కనిపించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ హాలీవుడ్ చిత్రాలైన ’ఇన్సెప్షన్’ (Inception), ‘ఇంటర్స్టెల్లార్’ (Interstellar)ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్ కావడానికి మన పురణాల్లోని కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించడం ఆకట్టుకుంది. శ్రీ చక్రానికి, మల్టీ యూనివర్స్‌కు దారితీసే వామ్ హోల్‌తో లింకప్ చేసిన విధానం ఆసక్తి రేపుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్, అక్కడ వారి మధ్య గొడవలు చూపించిన దర్శకుడు ఇంటర్వెల్‌కు ముందు మల్టీయూనివర్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో వామ్ హోల్ కోసం అభి అన్వేషణ, దాని ద్వారా టైం ట్రావెల్ చేసి ఫ్రెండ్స్‌ను కాపాడటం చూపించారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమెరికన్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం, డైలాగ్స్ మన నేటివిటీకి దూరంగా ఉండటం మైనస్లుగా నిలిచాయి.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Rahasyam Idham Jagath Review) సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్స్‌ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్‌ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్గా చెప్పిస్తే బెటర్‌గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
మల్టీ యూనివర్స్ కథపురాణాలతో లింకప్సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
హాలీవుడ్ చిత్రాల ప్రభావంఫస్టాఫ్కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 08 , 2024
Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్ చేస్తున్నట్లు హింట్స్!
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)
ఫ్లాప్ వచ్చినా తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్ లభిస్తే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196
రౌడీ బాయ్‌తోనూ..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
అక్టోబర్ 23 , 2024
Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!
టాలీవుడ్ ఫ్యూచర్ హీరోయిన్స్‌గా బాలీవుడ్ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్ లభిస్తే ఈ భామలకు వరుస అవకాశాలు రావడం ఖాయమంటూ పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే ఊహించని విధంగా తొలి చిత్రాలతో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకోలేకపోయారు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr.Bachchan) సినిమా ద్వారా భాగ్యశ్రీ (Bhagyashri Borse) ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. అటు జాన్వీ (Janhvi Kapoor)కి సైతం ‘దేవర’తో మంచి సక్సెస్ వచ్చినప్పటికీ ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో పెద్దగా హైలెట్ కాలేదు. దీంతో ఈ ఇద్దరు ముద్దుగమ్మలు తమ తర్వాతి చిత్రాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
భారమంతా చరణ్‌పైనే!
శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్ తారక్ వంటి బిగ్ స్టార్ నటించిన ‘దేవర’తో తెలుగులో అడుగుపెట్టింది. రిలీజ్‌కు ముందు వరకూ ఈ అమ్మడిపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్‌లోనూ జాన్వీ చురుగ్గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తీరా సినిమా రిలీజయ్యాక జాన్వీ పాత్ర అందరినీ ఊసురుమనిపించింది. ఆమె చేసిన తంగం పాత్ర గెస్ట్‌రోల్‌ను తలపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో జాన్వీ ఆశలన్నీ రామ్ చరణ్- బుచ్చి బాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌పైకి మళ్లాయి. అయితే ఈ సినిమాలోనైనా జాన్వీకి మంచి పాత్ర దొరుకుతుందా? లేదా? అన్న సందేహాం ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌లో ఉంది. నటిగా ఇప్పటికే నిరూపించుకున్న జాన్వీ మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ పాపులర్ కావడం ఖాయమని చెప్పవచ్చు. RC 16తో ఈ భామ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
బ్రైట్‌గా భాగ్యశ్రీ బోర్సె ఫ్యూచర్!
‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్‌కు ముందు వరకూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు టాలీవుడ్లో మారుమోగిపోయింది. ఫ్యూచర్ క్వీన్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్‌గా నిలవడంతో ఆమె పెట్టుకున్న నమ్మకాలన్నీ ఆవిరి అయ్యాయి. అయితే నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘VD12’లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే రీసెంట్గా దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ‘కాంత’ అనే పేరుతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. మరోవైపు పలువురు కుర్ర హీరోలు సైతం భాగ్యశ్రీతో వర్క్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. దీంతో మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఈ అమ్మడి ఫేమ్‌కు ఎలాంటి ఢోకా లేదని చెప్పవచ్చు. సరైన హిట్ లభిస్తే భాగ్యశ్రీ తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోవడం పక్కా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శ్రీదేవి కూతురి నుంచి స్టార్ హీరోయిన్ వరకూ!
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మరాఠీ చిత్రం ‘సైరాత్’కు రీమేక్‌గా వచ్చిన ‘ధడక్’లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుడ్‌లక్ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ క్రమంలోనే 'రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది. రీసెంట్గా బాలీవుడ్లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్’ చిత్రాల్లో ఫీమేల్ లీడ్‌గా చేసి నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హిందీలో 'సన్నీ శాన్‌స్క్రీట్ కి తుల్సీ కుమారి' అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
అక్టోబర్ 03 , 2024
Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.
ఆ భయం అక్కర్లేదు!
దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో సాంగ్ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ మిడిల్లో సాధ్యం కాకపోతే ఎండ్ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
https://twitter.com/DevaraMovie/status/1832446641393246291
దుమ్మురేపిన తారక్
‘దేవర’ నుంచి సెప్టెంబర్ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్ హైట్పైనా కొందరు కామెంట్స్ చేశారు. వాటన్నిటినీ తారక్ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.
https://twitter.com/DevaraMovie/status/1835018489784123480
జాతీయస్థాయిలో ట్రెండింగ్
దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్‌లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
https://twitter.com/DevaraMovie/status/1835682846092226856
'పుష్ప 2'ను దాటేసిన 'దేవర'
విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్ బచ్చన్’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద ‘మిస్టర్ బచ్చన్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్లీ ట్రోల్స్ మెుదలు పెట్టారు.
ఓటీటీలోనూ వెక్కిరింపే!
మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో కనీసం చోటు కూడా దక్కపోవడం గమనార్హం. రవితేజ లాంటి స్టార్ హీరో చేసిన చిత్రం అయినప్పటికీ ‘మిస్టర్ బచ్చన్’కు కనీస వ్యూస్ రాకపోవడంపై నెట్‌ఫ్లిక్స్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను చూసిన కొద్దిమంది కూడా నెట్టింట ట్రోల్స్ చేస్తుండంతో చూడాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.
దారుణంగా ట్రోల్స్
మిస్టర్ బచ్చన్ సినిమాలోని కొన్ని సీన్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇలా ఎలా ఆ సన్నివేశాలను తీశారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఫైట్ సీన్లో రవితేజను చూసి ‘మెుదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తోంది బావా.. అదే ఆడదాన్ని అయ్యుంటే’ అంటూ ఓ నటుడు చెప్పే డైలాగ్ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. అలాగే సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన స్టెప్స్ చూడటానికి ఆడల్ట్ కంటెంట్‌ను తలపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్ కూడా అసందర్భంగా ఉన్నాయని సీన్లకు మధ్యలో వాటిని బలవంతంగా ఇరిక్కించినట్లు ఉన్నాయని మండిపడుతున్నారు. హిందీలో వచ్చిన ‘రైడ్’ మక్కీకి మక్కీ దించేసిన కూడా హిట్ అయ్యేది కదా అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఒక గంట కూడా చూడలేకపోయానని, అరగంటకే ఆపేసా అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
https://twitter.com/nenuneneh/status/1834511822277234953
https://twitter.com/BalaRTCultFan/status/1834481953619542526
https://twitter.com/koppalapn/status/1834462816470007925
https://twitter.com/IamanMCA/status/1834453046287630562
https://twitter.com/Dynamic_boy_7/status/1834439289717096574
https://twitter.com/BunnyJashu3/status/1834299241700757520
కథేంటి
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
సెప్టెంబర్ 13 , 2024
Kannappa: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
టాలీవుడ్లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కన్నప్ప దూకుడు..!
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్ లుక్‌లో కనిపించాడు.
రిలీజ్ ఎప్పుడంటే
ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్‌లాల్ (Mohan Lal), శివరాజ్ కుమార్ (Siva Raj Kumar), మోహన్ బాబు (Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE
మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. అదరహో!
రవితేజ (Ravi Teja) హీరోగా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం.. ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్.. 'షో రీల్స్'ను సోమవారం (జూన్ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్ సాధించి అదరగొడుతోంది.
https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak
దేవిశ్రీ ప్రసాద్ ప్రశంసలు
మిస్టర్ బచ్చన్ నుంచి విడుదలైన మాస్ గ్లింప్స్.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. మిస్టర్ బచ్చన్ గ్లింప్స్‌పై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్ హరీష్ శంకర్ సార్.. పంచ్ డైలాగ్ లేకుండానే పంచ్ క్రియేట్ చేశారు. మాస్ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్ బాస్టర్ లోడ్ అవుతోంది. థియేటర్లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
జూన్ 18 , 2024
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు మరో క్రేజీ ఆఫర్.. డెబ్యూ లేకుండానే ముగ్గురు స్టార్ హీరోలతో!
దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రాని పేరు ప్రఖ్యాతలు.. కొందరికి రాత్రికి రాత్రే వచ్చేస్తుంటాయి. ఒక్క బ్లాక్ బాస్టర్‌తో స్టార్లుగా మారిపోతుంటారు. ఒకప్పుడు ఎక్కువగా హీరోల్లో ఇలాంటి పరిస్థితి కనిపించేంది. కానీ, ప్రస్తుతం ఈ ట్రెండ్ హీరోయిన్ల వైపు మళ్లింది. ఒక్క సక్సెస్‌తో హీరోల కంటే హీరోయిన్లే ఔట్‌స్టాండింగ్ ఫేమ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందుకు విరుద్దం. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్ కానప్పటికీ ఆమె టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రవితేజ, విజయ్‌దేవరకొండ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్లో మరో సినిమాకు ఓకే చెప్పింది.
దుల్కర్ సల్మాన్‌కు జోడీగా..
భాగ్యశ్రీ బోర్సే పేరు.. ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా చేయబోయే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైంది. గతంలో దర్శకుడు పరుశురామ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రవి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇందులో నటించేందుకు భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో భాగ్యశ్రీ క్రేజ్ టాలీవుడ్లో మామూల్గా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భాగ్యశ్రీ ప్రాజెక్ట్స్
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటికే తెలుగులో రెండు స్టార్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో తొలిసారి టాలీవుడ్ ఆఫర్‌ను భాగ్యశ్రీ బోర్సే దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని - భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్ కాకుండానే టాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
జూన్ 11 , 2024
Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ట్వీట్ వెనక నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్..!
ప్రభాస్ హీరోగా చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్ వైడ్‌గా బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.
అపర కుబేరుడికి రిక్వెస్ట్
ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ రిక్వెస్ట్ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/nagashwin7/status/1795534761072693594
ట్వీట్ వెనక మాస్టర్ ప్లాన్
అపర కుభేరుడు ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ ట్వీట్ పెట్టడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్ మస్క్ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్డ్ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్ కూడా అశ్విన్ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్ వైడ్‌గా వచ్చేస్తుంది.
బుజ్జిని నడిపిన చైతూ
బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.
https://twitter.com/chay_akkineni/status/1794262966986215753
బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా?
బుజ్జి అనే ఫ్యూచరస్టిక్ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్ తయారీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
కల్కి బడ్జెట్ తెలిస్తే షాకే!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
మే 29 , 2024
Avika Gor: వెస్టిండీస్ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్!
సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇక్కడి సినిమాలపై రీల్స్ చేసి భారతీయులకు దగ్గరయ్యాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళితో కలిసి ఏకంగా ఓ యాడ్‌లో కూడా కనిపించాడు. తాజాగా వెస్టిండిస్ క్రికెటర్, కోల్కత్తా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. టాలీవుడ్ బ్యూటీ అవికా గోర్‌తో చిందేశాడు. ఓ ప్రత్యేక సాంగ్ ఆల్బమ్‌లో వీరిద్దరు కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చీరకట్టులో అందాల జాతర
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్.. ఓ వైపు క్రికెట్.. మరోవైపు పాటల ఆల్బమ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్.. యంగ్ హీరోయిన్ అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్బమ్ చేశాడు. హిందీలో ‘లడ్కీ తూ కమల్ కీ’ (Ladki Tu Kamaal Ki) పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈ సాంగ్‌ను రస్సెల్ స్వయంగా పాడటం విశేషం. ఇందులో అవికాతో కలిసి రస్సెల్ చిందేశాడు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్లో స్టైలిష్‌గా కనిపించాడు. అటు అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. వీరిద్దరి కలయికలోని ఈ ఆల్బమ్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది.
https://twitter.com/i/status/1788784603085582657
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ..
బుల్లితెరపై (Ladki Tu Kamaal Ki) వచ్చిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో నటి అవికా చైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు చుట్టు ముట్టాయి. తన తర్వాతి చిత్రాలు.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలు సైతం విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సుందరికి ఇక తిరుగులేదని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీపై ఫోకస్ పెట్టిన అవికా.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ మూవీలో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)
నెట్టింట హాట్ ట్రీట్
యంగ్ బ్యూటీ అవికాగోర్ (Avika Gor Russell Dance).. ఓ వైపు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తోంది. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన పోస్టులు పెడుతూనే అదే సమయంలో తన లేటెస్ట్ ఫొటో షూట్లను పంచుకుంటోంది. ఈ భామ హోయలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవికా ఇన్స్టాగ్రామ్ ఖాతాను 1.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
మే 11 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్.. అంచనాలు అందుకోలేకపోయిన చరణ్ బర్త్‌డే ట్రీట్!
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Gamer Changer). ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తుండటం, స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు రీజన్స్‌తో సినిమా షూట్ వాయిదా పడుతూ వస్తుండటంతో రిలీజ్ కూడా జరుగుతూ వస్తోంది. ఇక రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ తేదీని ప్రకటిస్తారని అంతా భావించినా లిరికల్ సాంగ్‌తో మేకర్స్ చేతులు దులుపుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ఓ వార్త బయటకొచ్చింది.
రిలీజ్ డేట్ లాక్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప 2’ (Pushpa 2), ‘దేవర’ (Devara) వంటి చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పై అందరి దృష్టి పడింది. అసలు ఈ ఏడాది వస్తుందా రాదా అన్న సందేహాలు కూడా ఓ దశలో ఫ్యాన్స్‌లో మెుదలయ్యాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ తేదీ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండోచ్చని అంటున్నారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
కాస్త ఓపిక పట్టండి: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత దిల్‌రాజ్.. తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని కీలక అప్డేట్స్ కోసం కాస్త ఓపిక పట్టమని ఫ్యాన్స్‌ను కోరారు. ‘మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుపాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి రీచ్ అయ్యేలా శంకర్ దీనిని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్ చేస్తాం' అని అన్నారు.
రెస్పాన్స్ అంతంతమాత్రమే!
మార్చి 27న చరణ్ బర్త్‌డే కానుకగా ‘గేమ్ ఛేంజర్’ నుండి ‘జరగండి’ పాట విడుదలైంది. అయితే ఈ పాటకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తమన్ రొటీన్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ ఉన్నా కూడా రామ్ చరణ్, కియారా స్టెప్స్ సో సోగానే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుధవారం ఉ. 9 గంటలకు ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ కాగా.. గురువారం ఉ. 9 గంటల సమయానికి 4.5 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక హిందీ, తమిళంలలో అయితే మరీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక దాంట్లో 3 లక్షలు, మరో దాంట్లో 5 లక్షల వ్యూస్‌తో జరగండి సాంగ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఒక్క సాంగ్‌కు అన్ని కోట్లా?
యూట్యూబ్‌లో రిలీజైన ‘జరగండి’ లిరికల్ వీడియో సాంగ్‌ను పరిశీలిస్తే అందులో రంగు రంగు భవనాలను చూడవచ్చు. ఈ సాంగ్ అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అయితే అవన్ని ఒరిజినల్ భవనాలు కాదని.. చూడటానికి నిజమైన ఇల్లులా కనిపించే సెట్స్ అని టాక్ వినిపిస్తోంది. ఈ సెట్ నిర్మించడం కోసం ఏకంగా రూ.16 కోట్లను ఖర్చు చేశారని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే శంకర్ గురించి తెలిసినవారు ఇది మామూలు విషయమేనని అంటున్నారు.
మార్చి 28 , 2024