• TFIDB EN
  • చెన్నకేశవ రెడ్డి
    UATelugu2h 25m
    చెన్నకేశవ రెడ్డి 22 ఏళ్లుగా చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. ఓ జైలర్‌ సాయంతో విడుదలై తనను ఇరిక్కించిన వారిపై పగ తీర్చుకునేందుకు రాయలసీమకు వెళ్తాడు. పోలీసు అయిన చెన్నకేశవ రెడ్డి కుమారుడు తండ్రి నేర కార్యక్రమాలకు అడ్డు తగులుతుంటాడు. తన తండ్రి గతం తెలుసుకొని చివరికీ అతడికి సాయం చేస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinema
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నందమూరి బాలకృష్ణ
    చెన్నకేశవ రెడ్డి మరియు భరత్ రెడ్డి
    టబు
    చెన్నకేశవ భార్య మరియు భరత్ తల్లి
    శ్రియా శరన్
    భరత్ ప్రేమికుడు
    జయ ప్రకాష్ రెడ్డి
    వెంకట్ రెడ్డి
    ఆనందరాజ్
    ధనుంజయ రెడ్డి
    మోహన్ రాజ్జై రెడ్డి
    బ్రహ్మానందం
    సీమ శాస్త్రి
    అలీ
    లగాన్ ఖాన్
    అన్నపూర్ణ
    తల్లి చెన్నకేశవ రెడ్డి
    దేవయాని
    చెన్నకేశవ రెడ్డి సోదరి
    పృథివీరాజ్
    చెన్నకేశవ రెడ్డి బావ
    దేవన్ (నటుడు)
    జడ్జి రవి రెడ్డి
    ఎల్బీ శ్రీరామ్
    హిప్పి లహరి
    వేణు మాధవ్
    ఖైదీ
    శివకృష్ణఎస్పీ రామరాజు
    ఆహుతి ప్రసాద్
    సీత సోదరుడు
    చలపతి రావు
    సత్తి రెడ్డి
    వైజాగ్ ప్రసాద్
    పోలీస్ కమీషనర్ ప్రసాద్
    రఘు బాబు
    వెంకట్ రెడ్డి కుమారుడు
    నాగినీడు
    మంత్రి
    పొన్నంబలం
    ఎంఎస్ నారాయణ
    ఫిష్ వెంకటయ్య
    వెంకట్
    సిబ్బంది
    వివి వినాయక్
    దర్శకుడు
    బెల్లంకొండ సురేష్
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    అజయన్ విన్సెంట్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!</strong>
    HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
    తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్‌ ఒకరు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్‌ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం. శ్రియా శరణ్‌ 1982 సెప్టెంబర్‌ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్‌ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్‌ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్‌ చేశారు. 2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్‌ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.&nbsp; ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్‌’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్‌ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.&nbsp; తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.&nbsp; రామ్‌చరణ్, తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్‌ రోల్‌లో నటించింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.&nbsp; గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్‌ స్కూల్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా ‘షోటైమ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్‌ పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది.&nbsp; సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్‌ వీడియోలలోనూ శ్రియా శరణ్‌ మెరిసింది. 'తిరకటి క్యూన్‌ హవా', 'కహిన్‌ దూర్‌', 'రంగ్‌ దే చునారియా', 'బరి బరి సాంగ్‌' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.&nbsp; ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?</strong>
    HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?
    తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్‌ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్‌ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్‌లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.&nbsp; 1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.&nbsp; టబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన 'బజార్' చిత్రం ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌. https://twitter.com/mimansashekhar/status/1710632340022591556 సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్‌ నేమ్స్‌ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్‌, టబ్స్‌, టబ్బీ, టోబ్లర్‌, టోబ్లెరోన్‌ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో టబు సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది.&nbsp; ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్‌ సూపర్‌ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. హిందీ వచ్చిన ప్రేమ్‌ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్‌ తమ్ముడు సంజయ్‌ కపూర్‌ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్‌ స్టార్ట్‌ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమ్‌ సినిమా సెట్స్‌లోనే నటుడు సంజయ్‌ కపూర్‌తో&nbsp; టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.&nbsp; తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు.&nbsp; ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గన్‌తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్‌ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది. అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్‌ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్‌లో రూమర్లు ఉన్నాయి. 'భోలా' సినిమా ప్రమోషన్స్‌ సమయంలో టబుతో రిలేషన్‌పై అజయ్ దేవ్‌గన్‌ కూడా మాట్లాడారు. టీనేజ్‌ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో 'హమ్‌ సాథ్‌ సాథ్‌' షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు. తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్‌ సీన్స్‌లో తప్పనిసరిగా గ్లిజరిన్‌ వాడతానని తెలిపింది. ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తూ ట్రెండ్‌కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్‌గా కనిపిస్తూ మెపిస్తోంది.
    నవంబర్ 04 , 2024
    <strong>Chiranjeevi: చిరు, బాలయ్య మల్టీస్టారర్‌.. స్టోరీ ఏంటో తేల్చేసిన బోయపాటి శ్రీను!</strong>
    Chiranjeevi: చిరు, బాలయ్య మల్టీస్టారర్‌.. స్టోరీ ఏంటో తేల్చేసిన బోయపాటి శ్రీను!
    టాలీవుడ్‌ దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 60 ఏళ్లు పైబడినా కూడా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల బాలయ్య 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ ఫంక్షన్‌లో పాల్గొన‌్న చిరంజీవి తమ మల్టీస్టారర్‌ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కథ సిద్ధం చేయాలంటూ దర్శకుడు బోయపాటి శ్రీనుకు సవాలు సైతం విసిరారు. అయితే తాజాగా చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; ‘కథ రాయకపోతే వేస్ట్‌’ చిరంజీవి - బాలయ్య మల్టీసారర్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కథ రెడీ చేస్తే తాము చేయడానికి సిద్ధమంటూ ఇరువురు హీరోలు ఓపెన్‌ ఛాలెంచ్‌ చేసిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే డైరెక్టర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి బోయపాటి పేరు ప్రస్తావించడంతో ఈ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌ ఆయనే చేస్తారన్న అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా చిరు - బాలయ్య మల్టీస్టారర్‌పై దర్శకుడు బోయపాటి మాడ్లాడారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన అవార్డ్‌ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయనకు ఈ మల్టీస్టారర్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి బోయపాటి బదులిస్తూ 'చిరు, బాలయ్యను పెట్టుకొని వారికి కథ రాయకపోతే వేస్ట్‌. వారిద్దరే తన సినిమాకి టైటిల్‌' అంటూ క్రేజీ కామెంట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ ‌అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1847303422111801807 బోయపాటే ఎందుకు? బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్‌ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్‌ బోయపాటి.. ఛాలెంజ్‌’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్‌ డైరెక్టర్ వై.వీ.యస్‌. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.&nbsp; https://twitter.com/i/status/1830519890249421017 ఊరమాస్‌ స్టోరీ పక్కానా? మాస్‌ ఆడియన్స్‌ పల్స్ ఏంటో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు. చిరు, బాలయ్యలకు సైతం మాస్‌ ఆడియన్స్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. చిరు హీరోగా చేసిన గ్యాంగ్‌ లీడర్‌, ముఠామేస్త్రీ, ఇంద్ర వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి. అటు బాలయ్య చేసిన ఫ్యాక్షనిస్ట్‌ చిత్రాలు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు కూడా C సెంటర్లలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అటువంటి హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఇక కథ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో చిరు, బాలయ్య యాక్షన్‌కు సరిపోయే దీటైనా ఊరమాస్‌ కథను బోయపాటి సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ చూపించని విధంగా వీరిద్దరిని బోయపాటి చూపిస్తారని అంటున్నారు.&nbsp; బోయపాటికి పోటీగా వై.వి.ఎస్‌ చౌదరి! ‘ఇంద్ర’, ‘సమరసింహారెడ్డి’ సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శకుడు వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆయన మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపించింది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించి మరోమారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వైవీఎస్‌ చౌదరి భావిస్తున్నారట. మరి వీరిద్దరిలో చిరు-బాలయ్య ఎవరి కథను ఫైనల్‌ చేస్తారో చూడాలి.&nbsp; ‘అఖండ 2’ తర్వాతే.. టాలీవుడ్‌లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్‌’ (Lezend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో నాలుగో ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమైంది.&nbsp; ‘అఖండ 2’ అనే టైటిల్‌తో ఇటీవలై కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ కూడా చేశారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే చిరు బాలయ్య మల్టీస్టారర్‌కు బోయపాటిని ఫైనల్‌ చేసినా ‘అఖండ 2’ పూర్తయిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది.&nbsp; https://twitter.com/TeluguChitraalu/status/1846413204492374156
    అక్టోబర్ 19 , 2024
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్‌ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా. 1.Apoorva Sahodarulu (1986) బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు. 2. Ramudu Bheemudu (1988) రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు. 3. Brahmarshi Viswamitra (1991) నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 4. Aditya 369 (1991) ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు. 5. Maatho Pettukoku (1995) ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు. 6. Sri Krishnarjuna Vijayam (1996) సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు. 7. Peddannayya (1997) బాలకృష్ణ డ్యూయల్ రోల్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు. 8. Sultan&nbsp; (1999) శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్‌ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్‌ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు. 9. Chennakesava Reddy (2002) మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు. 10. Allari Pidugu (2005) జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు. 11. Okka Magadu&nbsp; (2005) బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు. 12. Pandurangadu&nbsp; (2008) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు. 13.Simha&nbsp; (2010) మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది. 14. Parama Veera Chakra&nbsp; (2011) దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు. 15. Adhinayakudu&nbsp; (2012) పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు. 16. Legend&nbsp; (2014) బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్‌ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు. Balakrishna's Legend Movie First Look Posters 17. Akhanda (2021) బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది. 18. Veera Simha Reddy&nbsp; (2023) గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్&nbsp; అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
    నవంబర్ 09 , 2023

    @2021 KTree