ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
ఇన్ ( Telugu, Malayalam, Kannada, Tamil )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
జివి ప్రకాష్ కుమార్
భారతీరాజా
ఇవానా
ధీనా
జి. జ్ఞానసంబంధం
చేరంరాజ్
వినోద్ మున్నా
మారుతుపాండి
సిబ్బంది
P. V. శంకర్దర్శకుడు
జి. డిల్లి బాబునిర్మాత
P. V. శంకర్రచయిత
జివి ప్రకాష్ కుమార్
సంగీతకారుడుP. V. శంకర్సినిమాటోగ్రాఫర్
శాన్ లోకేష్ఎడిటర్ర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే!
ఎన్నికల హడావుడితో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. అనుకున్న దాని ప్రకారం మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మే 31 కి వాయిదా పడింది. కానీ జబర్దస్త్ కమెడియన్ గెటప్(OTT Release Movies Telugu) శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ చిత్రం ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే విక్రమ్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం అపరిచితుడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఇవి తప్పితే థియేటర్లలో అలరించే చిత్రాలేవి ఈవారం లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం 20కి పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి వాటిపై ఓ లుక్ వేద్దాం
థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు
రాజు యాదవ్
గెటప్ శ్రీను, అంకిత ఖారత్ జంటగా నటిస్తున్న చిత్రం రాజు యాదవ్(Raju yadav). ఈ సినిమాను సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. క్రికెట్ ఆడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాజు యాదవ్(గెటప్ శ్రీను) మూతికి బలమైన గాయం అవుతుంది. ఆ గాయం వల్ల అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. అతని స్మైలింగ్ ఫేస్ చూసిన అంకిత ఖారత్ అతనికి దగ్గరవుతుంది. అయితే కొన్నినాటకీయ పరిణామాల తర్వాత అతన్ని దూరం పెడుతుంది. అప్పుడు రాజు యాదవ్ ఏం చేశాడు. తన లోపాన్ని అధిగమించేందుకు ఏం చేశాడు అనేది మిగతా కథ. కాగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు(OTT Release Movies Telugu)
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేసేందుకు 20పైగా సినిమాలు సిద్ధమయ్యాయి. వాటిలో ముఖ్యంగా గాడ్జిల్లాX కాంగ్(తెలుగు డబ్బింగ్), చోరుడు(తెలుగు డబ్బింగ్)తో పాటు బస్తర్: ది నక్సల్స్ స్టోరీ, జర హట్కే జర బచ్కే వంటి హిందీ చిత్రాలు ఉన్నాయి. మరి ఏఏ ప్లాట్ ఫామ్స్‌లో ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్ వేయండి.
TitleCategoryLanguagePlatformRelease DateVidya Vasula AhamMovieTeluguAhaMay 17Blood of Zeus S2Series EnglishNetflixMay 15Ashley Madison: Sex, Lies & ScandalSeries EnglishNetflixMay 15Madame WebMovieEnglishNetflixMay 16Bridgerton Season3 Part - 1 SeriesEnglishNetflixMay 16The 8 ShowSeriesKoreanNetflixMay 17Thelma the UnicornMovieEnglish NetflixMay 17PowerMovieEnglishNetflixMay 17CrashSeriesKoreanDisney+ HotstarMay 13ChoruduMovieTelugu DubbedDisney+ HotstarMay 14Uncle SamsikSeriesKoreanDisney+ HotstarMay 15Bahubali: Crown of BloodAnimates SeriesHindiDisney+ HotstarMay 17Outer Range Season 2SeriesEnglishAmazon PrimeMay 16AaveshamMovieTelugu DubbedAmazon PrimeMay 1799SeriesEnglishAmazon PrimeMay 17Bastar: The Naxal StoryMovieHindiZee5May 17Thalaimai SeyalagamSeriesTamilZee5May 17Godzilla x Kong: The New EmpireMovieTelugu DubbedBook My ShowMay 13Demon SlayerSeriesJapaneseJio CinemaMay 13C.H.U.E.C.O Season 2SeriesSpanishJio CinemaMay 14Zara Hatke Zara BachkeMovieHindiJio CinemaMay 17LampanSeriesMarathiSony LivMay 16
మే 14 , 2024
Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?
‘భారతీయుడు’ సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar) తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి. అయితే నటి కస్తూరికి చరిత్ర తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమిళ నేలపై తెలుగు రాజులు, నేతలు, వ్యక్తులు ఎంతటి ఘనత సాధించారో తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.
అసలేం జరిగిందంటే?
తమిళ నటి కస్తూరి చేసిన తాజా కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపాయి. భాజాపాలో చేరిన ఆమె చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని అన్నారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (Sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
తమిళ చరిత్రపై ప్రభావం
తమిళనాడును పరిపాలించిన ప్రముఖ రాజవంశాల్లో చోళులు ఒకరు. వారిలో కుళోత్తంగ చోళుడు తెలుగువాడు. అతడి తండ్రి రాజ రాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజు. ఈయన ఏపీలోని కృష్ణ- గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించాడు. కుళుత్తోంగ చోళుడి తల్లి అమ్మాంగైదేవి చోళ రాజ్యపు యువరాణి. ఆమె తండ్రి మరణం తర్వాత చోళ రాజ్యంలో అస్థిరత నెలకొంటుంది. దీంతో కులుత్తోంగ చోళుడు తన తాతా సామ్రాజ్యాన్ని కాపాడి చక్రవర్తిగా అక్కడే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా తమిళనాడుని దిగ్విజయంగా ఏలారు. (క్రీ.శ. 1061-1118) మధ్య చాళుక్యుల చక్రవర్తిగా కులోత్తుంగుడు వ్యవహరించారు. అయితే అతడి కుమారుడు విక్రమ చోళుడు.. చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. తెలుగు వారైన చాళుక్యుల రక్తం విక్రమ చోళుడిలో ఉంది. దీన్ని బట్టి గొప్ప తమిళ రాజ్యంగా చెప్పుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని ఓ తెలుగు వ్యక్తి పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ ప్రకారం చూసుకుంటే తమిళ చరిత్రపైనా మనవారి ముద్ర స్పష్టంగా ఉందని చెప్పవచ్చు.
Image credit: Wikimedia Commons
తెలుగు రాజు పేరు మీద ‘చెన్నై’
తమిళనాడు రాజధానిగా ఉన్న చెన్నైకి ఆ పేరు ఓ తెలుగు వ్యక్తి ద్వారా వచ్చింది. ఆంధ్ర పద్మనాయక ప్రభువైన వెంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1639లో ఈ పట్టణాన్ని పాలించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మద్రాసు పట్టణంగా మార్చారు. కాలక్రమణా ఆ పట్టణం మద్రాసుగా మారింది. కానీ స్థానికులు మాత్రం చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడేవారు. స్థానికుల కోరిక మేరకు స్వాతంత్రం అనంతరం 1996 ఆగస్టులో మద్రాసు పేరును చెన్నైగా మార్చారు.
Image credit: Wikimedia Commons
మద్రాసుపై తెలుగు వారి ప్రభావం
ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మద్రాసు (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారే అన్ని రంగాల్లో కీలకపాత్రలు పోషించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. 1925-29 మధ్య శ్రీకాళహస్తి జమీందారు పానగంటి రామారాయనం జస్టిస్ పార్టీ అధ్యక్షులుగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి హయాంలోనే ప్రస్తుత త్యాగరాయనగర్ రూపుదిద్దుకుంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజు శ్రీ రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. రావు బహదూర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్‌గా పనిచేశారు. అంతేకాదు వీడిపోయే ముందువరకూ కూడా తెలుగు వ్యక్తి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ముగ్గురు వ్యక్తులు తెలుగువారే. ఇలా రాజకీయాలతో పాటు విద్య, వైద్యం, న్యాయశాస్త్రం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు.
Image credit: Wikimedia Commons
వందల్లో తెలుగు గ్రంధాలు
విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. అటువంటి దేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రందం ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయంలో భద్రంగా ఉంది. దానితో పాటు 778 తాళపత్ర గ్రంథాలు అక్కడి లైబ్రరీలో ఉన్నాయి. గణితం, వైజ్ఞానిక శాస్త్రం, గణితం, పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి తెలుగు సంస్కృతి ప్రభావం తమిళనాడుపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు తమిళనాడు ప్రతీకగా నిలవడాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి.
నవంబర్ 04 , 2024
Sundaram Master Review: ‘సుందరం మాస్టర్’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు
రచన & దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్
సంగీతం : సాయి చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా
ఎడిటర్ : కార్తిక్ ఉన్నవ
నిర్మాతలు : రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
విడుదల తేదీ : 23-02-2024
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.
టెక్నికల్‌గా
ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్ చేసిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
హర్ష నటనకామెడీ సంగీతం
మైనస్ పాయింట్స్
పసలేని క్లైమాక్స్ లాజిక్‌కు అందని సీన్లు
Telugu.yousay.tv Rating : 3/5
ఫిబ్రవరి 23 , 2024
Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్ సక్సెస్ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
నటీనటులు : చైతన్యరావు, సునీల్, హర్ష చెముడు, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు
దర్శకుడు : సంతోష్ కంభంపాటి
సంగీతం : రీ
సినిమాటోగ్రాఫర్ : బాల సరస్వతి
ఎడిటర్ : శశాంక్ ఉప్పుటూరి
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్ శ్రీనివాసన్
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. బార్ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సంతోష్ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్ మూవీగా మారిపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. ‘బబుల్ గమ్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 29-12-2023
రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్ గమ్’. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖ తారలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, ట్రైలర్, పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోషన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.
కథ
హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ.
ఎవరెలా చేశారంటే
హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశాడు. హర్షవర్ధన్, అనుహాసన్ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్ రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రోషన్, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్, క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంసాగదీత సీన్స్
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 29 , 2023
Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
నటీనటులు : నిఖిల్, దివ్యాంన్ష కౌషిక్, సత్య, అజయ్, సాయిరామ్ రెడ్డి, రుక్మిణి వసంత్, హర్ష చెముడు తదితరులు
రచన, డైరెక్టర్ : సుధీర్ వర్మ
సంగీతం: కార్తిక్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: బి.వి.ఎస్. ఎన్. ప్రసాద్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo Review). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. రుక్మిణీ వసంత్ కథానాయిక. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? నిఖిల్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్ బ్రేకప్ అవుతుంది. లవ్ ఫెయిల్ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ పాకెట్ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్ డాన్ బద్రినారాయణ (జాన్ విజయ్) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Appudo Ippudo Eppudo Review)
ఎవరెలా చేశారంటే
హీరో నిఖిల్ (Nikhil) ఎప్పటిలాగే సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడి పాత్రలో నటన పరంగా పెద్దగా మెరుపులు లేదు. సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. హావభావాలను చక్కగా పలకిస్తూ మంచి నటిగా మరోమారు నిరూపించుకుంది. మరో నటి దివ్యాంశ కౌశిక్‌కు ఇందులో మంచి పాత్రే దక్కింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. లుక్స్, గ్లామర్ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హాస్యనటుడు హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. జాన్ విజయ్, అజయ్ పాత్రలు పర్వాలేదు. సత్యదేవ్, సుదర్శన్ పాత్రలు కథలో వేగం పెంచేందుకు దోహదం చేశాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్ స్టోరీ (Appudo Ippudo Eppudo Review)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు తన మార్క్‌ను చూపించాడు. ముఖ్యంగా మూడో వ్యక్తి (కమెడియన్ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల రెండు లవ్‌ట్రాక్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. హీరో పరిచయం, అతడి ఫస్ట్ లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ కాస్త పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్ సీక్వెన్స్ మరింత మైనస్‌గా మారాయి.
సాంకేతికంగా ..
టెక్నికల్ విషయాలకు వస్తే (Appudo Ippudo Eppudo Review) రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కార్తిక్ అందించిన పాటలు సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నిఖిల్ నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
పేలవమైన స్టోరీబోరింగ్ లవ్‌ట్రాక్స్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2/5
నవంబర్ 08 , 2024
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు..
డైరెక్టర్ : మల్లీ అంకం
సినిమాటోగ్రాఫర్ : సూర్య
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : రాజీవ్ చిలక
నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 3 మే, 2024
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
గణపతి పాత్రలో అల్లరి నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రాజ్ సుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్ నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 03 , 2024
Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం.
విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం.
మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 26 , 2024
ANR Award 2024: మోహన్ బాబుతో 17 ఏళ్ల క్రితం జరిగిన గొడవ బయట పెట్టిన చిరంజీవి
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శతజయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రామ్‌చరణ్ (Ramcharan), నాగచైతన్య (Naga Chaitanya) సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఏఎన్నార్ జాతీయ అవార్డ్’ను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. బిగ్‌బీ అమితాబ్ చేతుల మీదుగా చిరు ఈ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడిన చిరు గతంలో వజ్రోత్సావల సందర్భంగా మోహన్‌బాబుతో జరిగిన గొడవను గుర్తుచేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
2007లో తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు వజ్రోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేడుకలో మెగాస్టార్ చిరును లెజండరీ అవార్డ్‌తో సత్కారించాలని నిర్ణయించారు. దీనిపై మాట్లాడిన నటుడు మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను సన్మానిస్తున్నాం అంటూ కొందరు వచ్చారని అయితే లెజండ్‌గా కాదు, సెలబ్రిటీ హోదాలో అవార్డు ఇచ్చి గౌరవిస్తామని చెప్పారన్నారు. 'ఈ సందర్భంగా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుంకుంటున్నా. లెజెండరీ అంటే ఏంటి? సెలబ్రిటీ అంటే ఏంటో ఓ పుస్తకం రాసి వాటికి అర్ధం వివరించి అవార్డు ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీలో బతికి ఉన్న నటుల్లో తొలిసారి రాజ్యసభకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిని. కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అది లెజెండరీ కాదా? కులమతాలకు అతీతంగా 25% పేదలకు ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాను అది లెజెండరీ కాదా? 500 సినిమాలకు పైగా నటించాను, 45 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను అది లెజెండరీ కాదా? అంటూ సినీ పెద్దలను ప్రశ్నించారు.
https://twitter.com/lyf_a_zindagii/status/1850924373890552313
అప్పుడు చిరు ఏమన్నారంటే?
మోహన్ బాబు ప్రశ్నించడంపై చిరంజీవి సైతం ఘాటుగా స్పందించారు. ‘ఒక రామారావు, రాఘవేంద్రరావు, బాపు గారు, విశ్వనాథ్ గారు, దాసరి నారాయణ గారు ఉన్నారు. వారంతా లెజెండ్స్. వారికి అవార్డు ఇవ్వండి. నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా ఒకే ఏజ్ వాళ్లం. నాకు అవార్డు ఇచ్చి నన్ను వారి నుంచి దూరం చేయకండి. నన్ను పెద్దవాడిని చేయకండి అని ముందే చెప్పాను. నాకు లెజెండరీ అవార్డు వద్దు అన్నది సత్యం. అయితే నేను లెజెండరీ అవార్డు తీసుకొనేందుకు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను దానికి అర్హుడిని కాదని భావిస్తే ఆ అవార్డును తీసుకోను. దానిని ఓ బాక్స్‌లో పెట్టి సరెండర్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ అవార్డుకు అర్హుడినైతే దానిని అప్పుడే తీసుకొంటాను. 100 ఏళ్ల ఫంక్షన్ జరిగే సమయానికి నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు అప్పటి వరకు పెద్దవాళ్లం అవుతాం. అప్పుడు నాకు అర్హత ఉంటే అవార్డు తీసుకొంటాను. అప్పటి వరకు ఆ అవార్డును సమాధి చేస్తాను’ అని వజ్రోత్సవం వేడుకలో చెప్పుకొచ్చారు.
ఏఎన్నార్ ఈవెంట్‌లో ఏం చెప్పారంటే?
ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు వజ్రోత్సవం సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నా ఇల్లు అనుకుంటే ఇంట గెలిచే అవకాశం 2007లో వజ్రోత్సవం సందర్భంగా వచ్చిందని చిరు అన్నారు. అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డు ప్రధానం చేస్తామంటే చాలా సంతోషం వేసిందన్నారు. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంతమంది హర్షించని సమయంలో తనకు ఆ అవార్డు తీసుకోవాలని అనిపించలేదన్నారు. అందుకే తనకు వచ్చిన అవార్డును ఓ బాక్స్‌లో పెట్టి నాకు అర్హత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తీసుకొంటానని చెప్పానన్నారు. ‘ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నాఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు పుచ్చుకొన్న రోజున, అదీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా తీసుకొన్న రోజున, నా మిత్రుడు నాగార్జున మనస్పూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకు మీకే అర్హత ఉందని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంట గెలిచాను. రచ్చ గెలిచాను అనే ఫీలింగ్ కలిగింది’ అని మెగాస్టార్ అన్నారు.
https://twitter.com/i/status/1850904660875288817
‘ఆ మాటలకు వణుకు వచ్చింది’
ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ మంచి జరిగినా, అవార్డు వచ్చినా తొలుత అమితాబ్ నుంచే శుభాకాంక్షలు వస్తాయని అన్నారు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా 'చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని అమితాబ్ అన్నారని గుర్తుచేశారు. ఆ మాటలు విన్నాక చిన్న వణుకు వచ్చిందని పేర్కొన్నారు. అయితే తన మనసు అమితానందంతో నిండిపోయిందని చిరంజీవి తెలిపారు. అటు 'సైరా' సినిమాలో తన గురువు పాత్ర కోసం అమితాబ్‌ను సంప్రదించినప్పుడు వెంటనే ఓకే చెప్పారని చిరు తెలిపారు. ఫార్మాలిటీస్ (పారితోషికం) గురించి అడిగినప్పుడు ‘అలాంటిదేది అక్కర్లేదు.. నువ్వు నా స్నేహితుడివి’ అన్నారని గుర్తుచేసుకున్నారు.
అక్టోబర్ 29 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్ మధ్య చీలికలు తప్పదా?
రామ్‌చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game changer). 'ఆర్ఆర్‌ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఖాయమంటూ పలు వేదికలపై దిల్‌రాజు స్పష్టం చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే పొంగల్ బరిలో నిలిచిన చిరుకు చరణ్ నుంచి గట్టి పోటీ తప్పదా అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
క్రిస్మస్ నుంచి సంక్రాంతికి లాక్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. బడా బడా హీరోలందరూ తమ చిత్రాలను సంక్రాంతికి లాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అప్‌కమింగ్ చిత్రం 'విశ్వంభర'ను పొంగల్ రేసులో నిలిపారు. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ లేటెస్ట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'ను సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో క్రిస్మస్ నాటికి రిలీజ్ సాధ్యం కాకపోవచ్చని సమాచారం. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరు-రామ్‌చరణ్ మధ్య బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడే కారణమా?
గేమ్ ఛేంజర్ చిత్రం డిసెంబర్ నుంచి సంక్రాంతికి మారడం వెనక డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని క్రిస్మస్ కంటే సంక్రాంతికి తీసుకువస్తేనే తమకు లాభదాయకంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ల అంటున్నారట. అలా కాదని క్రిస్మస్‌కు తీసుకొస్తే తమకు గిట్టుబాటు కాకపోవచ్చని తేల్చి చెబుతున్నారట. పైగా జనవరి 10 నుంచి సంక్రాంతి చిత్రాలు వస్తుండటంతో లాంగ్ పీరియడ్ కలెక్షన్స్ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. 20 రోజుల కలెక్షన్స్‌తోనే 'గేమ్ ఛేంజర్' సరిపెట్టుకోవాల్సి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ పూర్తిగా ఇరాకటంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
చిరు వెనక్కి తగ్గేనా!
తండ్రి కొడుకులైనా చిరంజీవి, రామ్‌చరణ్ ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద తలపడలేదు. ‘విశ్వంభర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’గా పోటీ మారితే ఫ్యాన్స్‌కు తప్పుడు సంకేతం ఇచ్చినవారవుతారు. రిలీజ్ సందర్భంగా ఏ సినిమా చూడాలన్న విషయంలో మెగా ఫ్యాన్స్ తర్జనభర్జన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోసం ‘విశ్వంభర’ను పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం లేకపోలేదని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్‌పై ఎప్పటినుంచో సందిగ్దం నెలకొంది. నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు థమన్ క్రిస్మస్ కానుకగా సినిమా వస్తుందని చెప్పినా మెగా ఫ్యాన్స్ పూర్తిగా విశ్వసించలేదు. ఇప్పుడేమో సంక్రాంతికి సినిమా వస్తుందంటూ మరో ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి కూడా మిస్ అయితే ‘గేమ్ ఛేంజర్’పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతికే ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుబడితే మెగాస్టార్ వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రీషూట్‌కు నో చెప్పిన చరణ్!
‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. చరణ్‌తో వాటిని రీషూట్ చేాయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ద్వారా చరణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇందుకు అతడు నో చెప్పినట్లు తెలిసింది. తిరిగి ‘గేమ్ ఛేంజర్’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్ సంసిద్ధంగా లేరని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది.
చరణ్- నీల్ కాంబో లోడింగ్!
రామ్ చరణ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్‌తో చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో 'NTR 31'తో పాటు సలార్ 2, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అటు చరణ్ సైతం బుచ్చిబాబుతో పాటు సుకుమార్‌తో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాత చరణ్-నీల్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
అక్టోబర్ 09 , 2024
This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
సుందరం మాస్టర్
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ రాయ్
బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్ సరోజ్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్య గమనిక
విరాన్ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్ వేణు మురళీధర్ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక. రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది.
సైరెన్
జయం రవి, అనుపమ పరమేశర్వన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సైరెన్’ (Siren). ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు.
ఆర్టికల్ 370
అందాల తార యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆర్టికల్ 370’ (article 370). ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
ఫిబ్రవరి 19 , 2024
Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చిరు - త్రిష ఆలింగనం
చిరు షేర్ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్ నుంచి బయటకొచ్చి మెగాస్టార్ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1754373323910533528
18 ఏళ్ల తర్వాత..
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.
ఆచార్యకు నో చెప్పిన త్రిష!
నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ చిరు లేటెస్ట్ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.
సెకండ్ హీరోయిన్ ఎవరో?
‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్ తెగ వెతికేస్తున్నట్లు టాక్. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్, హానీ రోజ్, సంయుక్త మీనన్ పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్ హీరోయిన్‌గా త్రిష ఫైనల్ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
13 భారీ సెట్‌లు..!
చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది.
ఫిబ్రవరి 05 , 2024
Mechanic Rocky Review: విష్వక్ సూపర్.. ఆ తప్పు చేయకుంటే బొమ్మ బ్లాక్ బాస్టరయ్యేది!
నటీనటులు: విష్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేదీ: 22-11-2024
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) నుంచి ఈ ఏడాది వచ్చిన ‘గామి’ (Gaami), ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Review)తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విష్వక్ (Vishwaksen) వచ్చేశాడు. అతడు నటించిన మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో విష్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) చేశారు. రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. విష్వక్ హ్యాట్రిక్ కొట్టాడా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
రాకీ (విష్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ (నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేరిపోతాడు. రిపేర్లతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. కాలేజీ మానేయడంతో వారు విడిపోతారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? కథలో రాంకీ రెడ్డి (సునీల్) ఎవరు? అతడి ఎంట్రీతో రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విష్వక్ సేన్ (Mechanic Rocky Review) ఎప్పటిలాగే సెటిల్ నటనతో అదరగొట్టాడు. హుషారైన పాత్రలో ఎంతో యాక్టివ్‌గా కనిపించి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైనా పంచ్‌లతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. అందంగా కనిపిస్తూ హావభావాలను చక్కగా పలికించారు. కొన్ని సన్నివేశాల్లో పోటీపడి మరి నటించారు. తెరపై మీనాక్షి, విష్వక్ సేన్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వారి లవ్‌ట్రాక్ కూడా బాగుంది. సునీల్, నరేష్, హర్షవర్ధన్‌కు కూడా బలమైన పాత్రలే దక్కాయి. హర్ష చెముడు తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను జోడించి నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రవితేజ ముళ్లపుడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో బలమైన అంశాలను తెరపై చూపినప్పటికీ, అవసరానికి మించిన కమర్షియల్ హంగులు, కామెడీ సన్నివేశాలు కారణంగా అవి తెలిపోయాయి. ఫస్టాఫ్ మెుత్తం పాత్రల పరిచయానికి, హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్, కమర్షియల్ హంగులు, పాటలు మధ్య రొటిన్‌గా సాగిపోతుంది. సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండాఫ్ నుంచి అసలైన కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. ద్వితీయార్థమే సినిమాకు బలం. అనూహ్యమైన ట్విస్టులు, ప్రతీ పాత్ర కథను మరో మలుపుకు తీసుకెళ్లడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మిడిల్ క్లాస్ వారి కోరికలను ఆసరగా చేసుకొని కొందరు ఎలా మోసం చేస్తారో దర్శకుడు చక్కగా చూపించాడు. ఫస్టాఫ్ విషయంలో దర్శకుడు జాగ్రత్తపడి ఉంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యేదని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే (Mechanic Rocky Review) సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ (Mechanic Rocky music director) నేపథ్య సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ తనకు ఇచ్చిన బాధ్యతను వందశాతం నెరవేర్చాడు. ఫస్టాఫ్ విషయంలో ఎడిటర్ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విష్వక్ నటనసెకండాఫ్‌ట్విస్టులు
మైనస్ పాయింట్స్
ప్రథమార్థంకమర్షియల్ హంగులు
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 22 , 2024
Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునపై కేసు నమోదు
సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల స్థలం కబ్జా!
నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
https://twitter.com/jsuryareddy/status/1842478697938403807
కక్ష్య సాధింపు చర్యలేనా!
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.
తీవ్రంగా ఖండించిన టాలీవుడ్
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అటు తారక్ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్ నటుడు వెంకటేష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
అక్టోబర్ 05 , 2024
Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
డ్యాన్స్‌కు కేరాఫ్!
‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్-15 సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రగులుతోంది మొగలిపొద (ఖైదీ)
చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్ ఓసారి మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q
చక్కని చుక్క (పసివాడి ప్రాణం)
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్ ద్వారానే చిరు బ్రేక్ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.
https://www.youtube.com/watch?v=q5aetbezCqM
నవ్వింది మల్లె చెండు (అభిలాష)
‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది.
https://www.youtube.com/watch?v=82hUDmPYazk
హే పాప (త్రినేత్రుడు)
‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్ చేసింది.
https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y
పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు)
‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ క్లాప్ అంటూ సాంగ్‌ను స్టార్ట్ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=fsnOGypjHI0
గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.
https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k
స్టార్ స్టార్ మెగాస్టార్ (కొదమ సింహం)
కొదమ సింహం సినిమాలోని 'స్టార్ స్టార్ మెగాస్టార్' సాంగ్ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్ వేయలేదు.
https://www.youtube.com/watch?v=cFKyIHvudzI
బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk
రూపుతేరా మస్తానా (రిక్షావోడు)
రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్ బీట్‌ను మ్యాచ్ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=mugdo_VO9pY
నడక కలిసిన నవరాత్రి (హిట్లర్)
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=j2HY4G63qaE
ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి)
ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్ చేసి భుజాలు ఎగరేసే స్టెప్ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్ చుట్టుకొని మాస్ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.
https://www.youtube.com/watch?v=oppz5I9KeQA
దాయి దాయి దామ్మ (ఇంద్ర)
‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=39W78Hp4E8A
ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య)
‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.
https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY
మన్మథ మన్మథ (ఠాగూర్)
వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్ మెస్మరైజ్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150)
‘ఖైదీ నెంబర్ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
సెప్టెంబర్ 23 , 2024
Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్’ సరసన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్ కాదు భయ్యా!
2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్ - కలెక్షన్స్ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu)
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.
ఆయ్ (Aay)
నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ కూడా కలుపుకుంటే ‘ఆయ్’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ & ఫ్యూచరిక్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటివారు స్పెషల్ క్యామియోలతో అలరించారు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.
హనుమాన్ (Hanuman)
తేజసజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్ క్రేజ్‌తో ప్రశాంత్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టనున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
Devara Story Prediction: కొరటాల శివ సూపర్ హిట్ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్ స్టోరీ ఇదేనా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా నేడు రిలీజ్ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన గత చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను అంచనా వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొరటాల ఫార్ములా ఇదే?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (Mirchi), ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage), ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కథ, నేపథ్యం వేర్వేరు అయినప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న ఫార్ములా మాత్రం ఒక్కటే. అది ఏంటంటే, ఔట్‌సైడర్ అయిన హీరో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇబ్బందులకు గురిచేస్తున్న విలన్‌ను బుద్ది చెప్తాడు. కట్ చేస్తే హీరోకు ఆ ప్రాంత విలన్‌కు లింకప్ చేస్తూ ఓ గతం ఉంటుంది. పైన చెప్పిన ఈ సినిమాల ప్లాట్స్‌ను గుర్తుచేసుకొని దానికి ఇప్పుడు చెప్పిన ఫార్మూలాను అన్వయించుకుంటే మీకూ ఇది నిజమే అనిపిస్తుంది. కొరటాల శివ గత చిత్రం 'ఆచార్య' కూడా ఇదే ఫార్మూలతో వచ్చిందే. ఔట్‌సైడర్ అయిన చిరు, పాదగట్టం అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అరచాకం సృష్టిస్తున్న విలన్లను అంతం చేస్తాడు. రామ్‌చరణ్ - పాదగట్టం - చిరును లింకప్ చేస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ను రాసుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.
దేవర స్టోరీ ఇదేనా?
కొరటాల శివ గత చిత్రాల ఫార్మూలాను ఆధారంగా కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను ప్రిడిక్షన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఫస్ట్ టీజర్‌లో చూపించిన ఎర్ర సముద్రాన్ని ఒక ప్రాంతంగా అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్ర ప్రాంతంలో నివసించే జాలర్లకు ఎన్టీఆర్ నాయకుడు. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న విలన్లకు అతడు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో కుట్ర చేసి విలన్ల గ్యాంగ్ అతడ్ని అంతం చేస్తుంది. విలన్ల దాడి నుంచి తప్పించుకున్న అతడి కుమారుడు (ఎన్టీఆర్) పెద్దయ్యాక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి విలన్లపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ప్లాట్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొరటాల ఫార్మూలాను బట్టి చూస్తే ‘దేవర’ ప్లాట్ ఇదే అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కాని ప్లాట్ మాత్రం కన్విన్సింగ్ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
చరిత్ర సృష్టించిన ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా తాజాగా అది 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో తారక్..
'దేవర' తర్వాత తారక్ లైనప్‌లో బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో పాటు 'NTR 31' కూడా ఉంది. హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, 'NTR 31' ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే తాజాగా కొరటాల శివతో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తారక్ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన ముగ్గురు డైరెక్టర్లతో తారక్ కలయిక సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజీ కలయికకు ఓ కారణం ఉన్నట్లు సమాచారం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు దర్శకులతో తారక్ ఓ ఇంటర్యూలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ట్రైలర్ లోడింగ్..
యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 10) ట్రైలర్ రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు దీన్ని రీలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
సెప్టెంబర్ 10 , 2024
HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చిరులో కసి పెంచిన ఘటన
ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్, మేకప్‌మ్యాన్ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు.
చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి
1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు.
చిరు మెస్మైరైజింగ్ డ్యాన్స్‌కు కారణం ఇదే!
కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట. సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.
రివ్యూవర్ నుంచి పద్మ విభూషణ్ స్థాయికి..
మెగాస్టార్ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్ స్టోరీస్ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.
కుర్ర హీరోలకు అండగా..
కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు.
కళామతల్లి ముద్దు బిడ్డగా..
ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా.
సేవా కార్యక్రమాల్లో ముందజ..
సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
ఆగస్టు 22 , 2024
Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్ మైథాలజీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్, హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం కూడా ‘కల్కి’ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విషయంలో డార్లింగ్ ప్రభాస్‌ను మెగాస్టార్ ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘కల్కి’ బాటలో ‘విశ్వంభర’!
ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఏకంగా 16 భారీ సెట్లు వేయించారు. సీజీ వర్క్ అని తెలియకుండా ఈ సెట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆడియన్స్‌కు అద్భుతమైన ఐ ఫీస్ట్‌ను అందించాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీమ్ కూడా ‘కల్కి’ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట ఈ మూవీ కోసం కొత్త లోకాన్నే సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 8 భారీ సెట్స్ వేశారని టాక్. మరో 4 సెట్స్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ అద్భుతమైన సెట్స్ వేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెటప్‌ను నిర్మిస్తున్నారు.
కల్కి తర్వాత విశ్వంభరే టాప్!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం తర్వాత ఆ స్థాయిలో భారీ ఎత్తున సెట్లు వేసిన చిత్రం విశ్వంభరేనని ఫిల్మ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం కూడా కల్కి స్థాయిలో విజువల్ ట్రీట్‌ను ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నాయి. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. హీరో ప్రభాస్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అలరిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను మెగాస్టార్ చిరు స్వయంగా పంచుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ‘విశ్వంభర’ కోసం చిరు ఎంత డెడికేషన్‌తో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది.
మెగాస్టార్ అసంతృప్తి
లేటెస్ట్ బజ్ ప్రకారం 'విశ్వంభర' సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ ఫుటేజీని తాజాగా చిరు పరిశీలించినట్లు సమాచారం. అంతా బాగానే ఉన్న కొన్ని సీన్లపై చిరు అభ్యంతరం వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది. కథ నుంచి ఆ సన్నివేశాలు డీవియేట్ అవుతున్నట్లు ఆయన భావించారట. దర్శకుడు వశిష్టకు కొన్ని మార్పులను సైతం సూచించినట్లు సమాచారం. దీంతో ఆయా సన్నివేశాలకు సంబంధించి రీషూట్ జరిగే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రీ షూటింగ్ ప్రభావంతో విడుదల తేదీలో ఏమైనా మార్పులు వస్తాయా అన్న అనుమానం కలుగుతోంది.
విలన్‌గా బాలీవుడ్ నటుడు
‘విశ్వంభర’లో చిరుకు విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నాడు. అతడు గతంలో నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో అలరించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో నటిస్తున్నాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. తను నటించే మరో చిత్రంలోని పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో ‘విశ్వంభర’కు నో చెప్పాడని సమాచారం. ఇక కునాల్ కపూర్‌తో ఇప్పటికే కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
View this post on Instagram A post shared by Kunal Kapoor (@kunalkkapoor)
ఆగస్టు 03 , 2024
Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
15 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927
ఏకైకా సౌత్ హీరోగా ప్రభాస్
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్, పఠాన్ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.
త్వరలో టాప్-3లోకి ‘కల్కి’
తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, జవాన్ సినిమాలకు షాక్ తప్పేలా లేదు.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది.
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 13 , 2024