రివ్యూస్
How was the movie?
తారాగణం

నితిన్
శ్రీనివాస్ అకా శీనునేహా బాంబ్
నందిని
ప్రకాష్ రాజ్
గౌరీ శంకర్
సుధ
శీను తల్లిఇళవరసి
నందిని తల్లి
ఎంఎస్ నారాయణ
ప్రిన్సిపాల్
ఎల్బీ శ్రీరామ్
రామనాథందువ్వాసి మోహన్
గ్రామస్థుడు.jpeg)
వేణు మాధవ్
శీను మామసంగీత
నందిని అమ్మమ్మ
రఘు బాబు
గౌరీ అసిస్టెంట్
రఘు కారుమంచి

రాజన్ పి. దేవ్
నందిని తాత
రాళ్లపల్లి
టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉద్యోగి
ఆహుతి ప్రసాద్
పోలీసు అధికారిసిబ్బంది

వివి వినాయక్
దర్శకుడు
దిల్ రాజు
నిర్మాతగిరినిర్మాత

ఆర్పీ పట్నాయక్
సంగీతకారుడువిజయ్ సి. కుమార్
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 5) ఈ మూవీ రిలీజ్ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్ చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దిల్‌రాజు.. స్టెప్పులకే రారాజు!
ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు.. తాజాగా మీమర్స్, డిజిటల్ పేజ్ అడ్మిన్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘నంద నందన సాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలకి అందరితో కలిసి స్టెప్పులు వేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హుక్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో దిల్ మామే హైలెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇతర నిర్మాతలతో పోలిస్తే దిల్‌రాజు చాలా స్పోర్టివ్‌గా ఉంటారని ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/mr_rowdi/status/1775554308127551770?s=20
https://twitter.com/mr_rowdi/status/1775581652800131408
విజయ్, మృణాల్ కూడా ఇంతే!
ఫ్యామిలీ స్టార్ సినిమాలోని 'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. హుక్ స్టెప్పులతో ఆడియన్స్ అలరించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో కూడా రెండ్రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
https://twitter.com/i/status/1775183286417125744
సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఇదే
ఫ్యామిలీ స్టార్ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్‌ను 2 గం.ల 30 నిమిషాలకు ఫిక్స్ చేసింది. 150 నిమిషాల పాటు ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది.
'హిట్ కొట్టేసారండీ'
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్‌రాజు, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. తాజాగా స్పెషల్ షో వేసుకొని చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజస్విని 'హిట్ కొట్టేసారండీ' అని కంప్లీమెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా, క్రెడిబుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అటు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి.. కిల్డ్ ఇట్ అంటూ దేవరకొండను హగ్ చేసుకుందట. మరోవైపు విజయ్ దేవరకొండ తండ్రి కూడా ఈ సినిమా చూసి దిల్‌రాజు బయోపిక్‌లా ఉందని ప్రశంసించారు.
ఏప్రిల్ 04 , 2024

Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్ చరణ్ బిగ్ ఫైట్.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్ స్పాట్ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్ లుక్ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్ ఛేంజర్’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వెంటాడుతున్న లీకుల బెడద!
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ కియారా ఫొటోలు లీక్ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.
https://twitter.com/i/status/1769462838765240477
https://twitter.com/i/status/1769381487143776301
దసరా, సంక్రాంతి పరిశీలన!
గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్ ఛేంజర్'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్ పనులు ప్లానింగ్ చేసుకొని డేట్ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.
చిరు - చరణ్ - తారక్.. బిగ్ ఫైట్!
అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్’ ఫిక్స్ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్ ఫైట్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కలిసి నటించిన తారక్‌తో రామ్ చరణ్ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్!
ఇక గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్'లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మార్చి 18 , 2024

Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటి అయిన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు నేతృత్వంలో ఇండస్ట్రీకి చెందిన 36 మంది ప్రముఖులు సీఎం కలిసి పలు అంశాలపై చర్చించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. అయితే సీఎంను కలిసిన వారిలో ఒక్క మహిళా ప్రతినిధి లేకపోవడాన్ని ప్రముఖ నటి పూనం కౌర్ ప్రశ్నించింది. మరో నటి మాధవిలత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమస్యలు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న సమయంలో హీరోయిన్స్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
రేవంత్‌కు సూటి ప్రశ్నలు..
టాలీవుడ్ నటి మాధవిలత (Actress Madhavi Latha).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టింది. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై సూటిగా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ‘అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు. ఘటనపై సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంది. కొడంగల్లో సీఎం కుటుంబ సభ్యుల వల్ల ఓ రైతు సూసైడ్ చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు కాకపోయినా రూ.25 వేలు అయినా ఇచ్చారా?. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి సాయం చేశారా?. జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలయించాలని భావిస్తున్నారు’ అంటూ నటి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే మాధవిలత BJPలో ఉన్నందున ఆ పార్టీ ప్రతినిధిగా తీవ్ర ఆరోపణలు చేశారని పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి.
https://twitter.com/aadabhyd/status/1872552912662192500
మహిళలకు సమస్యలు లేవా?
గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో జరిగిన సినీ పెద్దల భేటిపై నటి పూనం కౌర్ (Poonam Kour) తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక్క మహిళా ప్రతినిధి లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదు’ అంటూ ఎక్స్ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.
https://twitter.com/poonamkaurlal/status/1872294426640584857
‘సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి’
క్యాన్సర్ బారిన పడ్డ తన బిడ్డకు తారక్ సాయం చేస్తానని మాటిచ్చి చేయలేదని ఓ మహిళ మాట్లాడిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన నటి మాధవిలత నెట్టింట ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బులిస్తూ పోతే హీరోలు రోడ్డునపడి అడుక్కుతినాలి. అభిమాని అంటే ఆశించే వాడు కాదు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే స్వార్థం అవుద్ది.. కానీ, అభిమానం ఎలా అవుద్ధి. ఇంకా రోజుకొకరు మాకు సాయం చేయమని బయటికి వస్తారు. కథలు పట్టుకుని ఫిల్మ్ నగర్‌లో చాలా మంది తిరుగుతుంటారు. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది’ అని మాధవీలత తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు తారక్ ఫ్యాన్స్ మద్దతిస్తున్నారు.
డిసెంబర్ 27 , 2024

Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023

Game Changer Day 1 Collections: సెన్సేషనల్ రికార్డు దిశగా గేమ్ ఛేంజర్ వసూళ్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా, శంకర్ కెరీర్‌ను నిర్ణయించే సినిమాగా గుర్తింపు పొందింది. అలాగే దిల్ రాజు బ్యానర్ 50వ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శుక్రవారం(జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రం డే 1 కలెక్షన్లపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంపై మొదటి నుంచి విశేషంగా హైప్ క్రియేట్ చేసినప్పటికీ, ప్రమోషన్లు సరైన వేగంతో సాగలేకపోయాయి. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చిత్ర బుకింగ్స్ కూడా కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ, సినిమా రిలీజ్ రోజుకి ట్రెండ్ మాత్రం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం రామ్ చరణ్, శంకర్‌కి మరొక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
డే 1 ఓపెనింగ్స్ రికార్డులు
“గేమ్ ఛేంజర్” ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా బుకింగ్స్ సాలిడ్‌గా కొనసాగుతున్నాయి. యూఎస్ మార్కెట్‌లో ప్రీమియర్స్ ద్వారా మొదటి రోజే 1 మిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం. ఈ హవా మొదటి రోజుకు వరల్డ్ వైడ్ సుమారు 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసి, 120 నుండి 150 కోట్ల గ్రాస్ వరకు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రముఖ ట్రేడ్ ప్రిడిక్షన్స్
ఈ చిత్రానికి సంబంధించి ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రిడిక్షన్స్ అనుసరించి, “గేమ్ ఛేంజర్” పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా విజువల్స్, గ్రాండ్ మేకింగ్, రామ్ చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శంకర్ దర్శకత్వ శైలి మరొకసారి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.
మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్
ప్రస్తుతం సినిమా ఫైనల్ కలెక్షన్లపై అధికారిక వివరాలు రావాల్సి ఉంది. యూఎస్ మార్కెట్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, మొదటి రోజే ఈ చిత్రం భారీ కలెక్షన్లను అందుకుంటుందని స్పష్టమవుతోంది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను బట్టి, ఇది రామ్ చరణ్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
సినిమా కథ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆధారంగా చేసుకుని కథ నడుస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) “అభ్యుదయం” పార్టీ పేరుతో పరిపాలిస్తుంటాడు. అయితే, ఆయన తనయుడు మంత్రి అయిన బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య) ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి ఉంటాడు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్‌గా రామ్ నందన్ (రామ్ చరణ్) నియమించబడతాడు. మోపిదేవి, రామ్ నందన్ మధ్య పొలిటికల్ యుద్ధం ఎలా ప్రారంభమవుతుంది? ఈ క్రమంలో సత్యమూర్తి తన అనుచరుల ఎదుట రామ్ నందన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? అసలు అభ్యుదయం పార్టీ స్థాపకుడైన అప్పన్న (రామ్ చరణ్ ద్విపాత్రాభినయం) కథతో సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు వెండితెర మీద గేమ్ ఛేంజర్‌లో చూడాల్సిందే.
“గేమ్ ఛేంజర్” దిల్ రాజు బ్యానర్‌కు 50వ చిత్రంగా, శంకర్ దశాబ్దాల కెరీర్‌లో మరొక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. సినిమా బుకింగ్స్ మొదలయిన తర్వాత నుండి ట్రెండ్ అంచనాలకు మించి సాగుతోంది. ఈ చిత్రం భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
జనవరి 10 , 2025

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మరో 8 రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ వర్క్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు 165 నిమిషాల నిడివిని సెన్సార్ సభ్యులు ఫిక్స్ చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌కు సెన్సార్ బోర్టు (Central Board of Film Certification) చురకలు అంటించినట్లు తెలుస్తోంది.
ఇంగ్లీషు టైటిల్‌పై మండిపాటు!
గతంతో పోలిస్తే ఇటీవల సినిమా టైటిల్స్ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తెలుగుకు బదులు పరభాష పదాలను తెలుగు టైటిల్స్‌గా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ సైతం తెలుగుకి బదులు ఇంగ్లీషు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సంబంధించి సెన్సార్ సభ్యులు (Central Board of Film Certification).. మూవీ టీమ్‌కు చురకలు అంటించినట్లు తెలుస్తోంది. సినిమా మెుదట్లో టైటిల్ కార్డ్‌ను సైతం తెలుగు పదాల్లో ఇంగ్లీషు భాషలో ‘Game Changer’ పెట్టడాన్ని సెన్సార్ సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం. తెలుగులో కూడా పెట్టాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ రిలీజ్‌కు ఇలా ఇంగ్లీషు టైటిల్‌తో రావడంపై ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ అంటూ పెట్టేందుకు చిత్ర బృందం అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది.
బ్రహ్మీకి షాక్..!
చరణ్ - శంకర్ కాంబోలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’లో దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ టైటిల్స్ సందర్భంగా ఆయన పేరును ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ అని టీమ్ ప్రెజెంట్ చేసినట్లు సమాచారం. ఇది చూసిన సెన్సార్ సభ్యులు పద్మశ్రీ పదాన్ని పేరుకు ముందు తొలగించాలని సూచించింది. కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలను మూవీ టైటిల్స్ సందర్భంగా ప్రదర్శించకూడదని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ‘దేనికైనా రెడీ’ సమయంలో బ్రహ్మీ పేరు ముందు పద్మశ్రీ పెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో ఆ తప్పు రిపీట్ కాకుండా సెన్సార్ బోర్డు కత్తెర పెట్టింది.
మరిన్ని కత్తెరలు..
తెలుగు టైటిల్, పద్మశ్రీ పదం తొలగింపుతో పాటు మరికొన్ని కత్తెరలు సైతం ‘గేమ్ ఛేంజర్’కు సెన్సార్ బోర్డు (Censor Board) విధించింది. కొన్ని సీన్లలో లిక్కర్ బ్రాండ్లను నేరుగా చూపించడాన్ని తప్పుబట్టింది. ఆయా లేబుల్స్‌ను తొలగించాలని చెప్పింది. అలాగే సినిమాలో ఎక్కువ సార్లు ఉన్న ‘చట్ట ప్రకారం’ పదాన్ని ‘లెక్క ప్రకారం’గా ఛేంజ్ చేయాలని సూచించింది. దీంతో పాటు కేరళ అనే పదాన్ని కూడా తొలిగించాలని చెప్పింది. ఓ పేపర్ కట్టింగ్ ఉన్న ‘దుర్గ శక్తి నాగ్‌పాల్’ పేరును ‘సుచిత్ర పాండే’గా మార్చాలని మూవీ టీమ్‌కు స్పష్టం చేసింది. ఇవి మినహా సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
https://twitter.com/JohnWick_fb/status/1874672597172101375
మరికొద్ది సేపట్లో ట్రైలర్ రిలీజ్..
'గేమ్ ఛేంజర్' ట్రైలర్‌ను మరికొద్ది సేపట్లో మూవీ టీమ్ రిలీజ్ చేయబోతోంది. ఇవాళ (జనవరి 2) సాయంత్రం 5:04 గం.లకు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఎస్.జే. సూర్యతో పాటు సముద్రఖని, అంజలి, సునీల్, శ్రీకాంత్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
జనవరి 02 , 2025

Game Changer Record: ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి భారతీయ పాటగా గుర్తింపు.. ఆ పాట ఏదంటే?
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) గురించి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయికగా, దిల్‌రాజు భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రతి పాటను ఎంతో విశిష్టంగా రూపొందించడమే కాకుండా, వాటి విజువల్స్ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయనున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో ఆ పాటల విశేషాలు, వాటి వెనుక ఆసక్తికర విషయాలను చూద్దాం.
1. ‘జరగండి..
ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘జరగండి.. జరగండి..’ గ్రాండ్ విజువల్స్‌తో అలరిస్తోంది. 70 అడుగుల ఎత్తయిన కొండ, గ్రామీణ వాతావరణంలో నిర్మించిన విలేజ్ సెట్‌లో ఈ పాటను షూట్ చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, సెట్‌లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ సహా, ఇతర వస్తువులు పూర్తిగా పర్యావరణహితమైన జనపనారతో తయారు చేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 13 రోజుల పాటు జరిగిన చిత్రీకరణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=45vS1-xtnp8&pp=ygUYamFyYWdhbmRpIGphcmFnYW5kaSBzb25n
2. ‘రా మచ్చా
ఈ పాట యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ‘రా మచ్చా..’ పాటలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 మందికిపైగా జానపద కళాకారులు పాల్గొన్నారు. గుస్సాడీ (ఆదిలాబాద్), చావ్ (పశ్చిమ బెంగాల్), ఘూమ్రా (ఒడిశా), గోరవర (కర్ణాటక) వంటి ప్రాంతీయ నృత్యాలు ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి. పాట విజువల్స్ గ్రాండ్‌గా ఉండేలా రూపొందించారు.
https://www.youtube.com/watch?v=QeMeM87O1ns&pp=ygUgcmEgbWFjaGEgbWFjaGEgZ2FtZSBjaGFuZ2VyIHNvbmc%3D
3. ‘నానా హైరానా..’
శంకర్ చిత్రాలకు తగినట్టు ఈ సినిమాకు కూడా సాంకేతికతలో కొత్తదనాన్ని చేర్చారు. ‘నానా హైరానా..’ పాటను తొలిసారి ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. న్యూజిలాండ్ అందమైన లొకేషన్లలో తీసిన ఈ మెలోడీ పాటకు మనీశ్ మల్హోత్ర కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పాట చిత్రీకరణ వేదికపై అద్భుతంగా కనిపించనుంది.
https://www.youtube.com/watch?v=EqDlrimnMCE&pp=ygUebmFuYSBoYXJ5YW5hIGdhbWUgY2hhbmdlciBzb25n
4. ‘దోప్’
కరోనా సెకండ్ వేవ్ సమయంలో రష్యా నుంచి 100 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో రప్పించి ‘దోప్’ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో 8 రోజుల్లో చిత్రీకరించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు కూడా మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదలై సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది.
https://www.youtube.com/shorts/Y131i3ji8oE
5. థ్రిల్ పంచే ఐదో పాట
ప్రస్తుతం విడుదలైన నాలుగు పాటలు మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఐదో పాటను ప్రేక్షకులు సినిమాను చూస్తున్న సమయంలోనే అనుభవించనున్నారు. ఈ పాట సినిమా క్లైమాక్స్‌లో థ్రిల్ పంచుతుందని చిత్రబృందం వెల్లడించింది.
‘గేమ్ ఛేంజర్’ పాటలు సంగీతం, విజువల్స్, నృత్యాలతో ప్రత్యేకతను కలిగించి ప్రేక్షకుల మన్ననల్ని గెలుచుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి పాటకూ ఉన్న ప్రత్యేకత ఈ సినిమాను ప్రేక్షకుల్లో మరింత ఆసక్తికరంగా నిలపనుంది. జనవరి 10న ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాటలు వెండితెరపై ఎలా ఆకట్టుకుంటాయో చూడాల్సిందే!
జనవరి 02 , 2025

Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం కిమ్స్ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.
Courtesy Instagram: dilraju
మీడియాతో మాట్లాడిన దిల్ రాజు, ‘‘ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతో బాధాకరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించినప్పటి నుంచి నా బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటున్నా. అయితే నేను అమెరికాలో ఉన్న కారణంగా ఇక్కడికి రాలేకపోయాను. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిని కలిశా. ప్రస్తుతం జరిగిన ఘటనపై పూర్తిగా దృష్టి సారించాను. అల్లు అర్జున్‌ను కూడా త్వరలోనే కలుస్తా. పరిశ్రమలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం చేస్తాం. రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం,’’ అన్నారు.
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతోంది
‘‘శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగవుతోంది. వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. తాను త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా,’’ అని ఆయన పేర్కొన్నారు.
https://twitter.com/FilmyBowl/status/1871521244375572512
అదంతా దుష్ప్రచారమే
‘‘సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసిందేం కాదు. ఇది ఒక అపశ్రుతి. కానీ ఈ సంఘటనపై కొందరు దుష్ప్రచారం చేస్తుండడం బాధాకరం. ప్రభుత్వం చిత్ర పరిశ్రమను దూరం పెడుతోందనేది అసత్య ప్రచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా సినీ పరిశ్రమకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. త్వరలోనే చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో కలిసి సీఎం గారిని కలవాలని యోచిస్తున్నాం. ఎలాంటి సమస్యలు కలుగకుండా పరిశ్రమ కోసం పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాను,’’ అని దిల్ రాజు వెల్లడించారు.
డిసెంబర్ 24 , 2024

Game Changer Teaser: లక్నోలో ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్.. ఎందుకంటే?
‘RRR’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ తేదీని చిత్ర బృందం లాక్ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
టీజర్ ఎప్పుడంటే?
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు వెల్లడించారు.
లక్నోలోనే ఎందుకు?
గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్‌డేట్ ఇస్తూ గేమ్ ఛేంజర్ గురించి చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్‌లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్ చేస్తారో లేదో చూడాలి.
ఇదే తొలి చిత్రం!
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఇప్పటివరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్‌మెన్’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్ అయిన చిత్రాలు. ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్ చేశారు. కెరీర్‌లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్ ‘గేమ్ ఛేంజర్’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.
ఆ ఫైట్ సినిమాకే హైలెట్!
ఇటీవల టీజర్ సూన్ అంటూ గేమ్ ఛేంజర్ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో చరణ్ ఓ టేబుల్ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్ ఛేంజర్’ ఇంట్రడక్షన్ సీన్ అని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఈ మాబ్ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్ హెలికాఫ్టర్ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే 'రా మచ్చ మచ్చ' సాంగ్ వస్తుందని చెబుతున్నారు.
రికార్డు బిజినెస్?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నవంబర్ 05 , 2024

Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్ కలెక్షన్స్.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). పరుశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే మిక్స్‌డ్ టాక్ రావడంతో తొలి రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. విజయ్ కెరీర్‌లోనే అతి తక్కువ డే 1 కలెక్షన్స్ ఈ సినిమాకే వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరి వీకెండ్‌కైనా ఈ మూవీ కలెక్షన్లలో పురోగతి వచ్చిందా? శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది?
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ వీకెండ్ ముగిసే సరికి భారత్‌లో రూ.11.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలి రోజున ఈ చిత్రం రూ.5.75 కోట్లు, రెండో రోజు రూ.3.2 కోట్లు, మూడో రోజు రూ. 3 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంపై వస్తోన్న ట్రోల్స్, నెగిటివ్ ప్రచారం.. ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం
అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 5లక్షలకు పైగా డాలర్లను వసూలు చేసింది. ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఓవర్సీస్ కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమే.
కథేంటి?
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) మధ్య తరగతి యువకుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైదరాబాద్‌లోనే పనిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో ఊహించని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికందుతుంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ తన కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.
ఏప్రిల్ 08 , 2024

Game Changer Story: షాకింగ్.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కథ లీక్.. ఆందోళనలో రామ్ చరణ్ ఫ్యాన్స్!
'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) వంటి గ్లోబల్ స్థాయి సక్సెస్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్.. ఈ కథను లీక్ చేయడం గమనార్హం.
కథ ఏంటంటే?
మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్ ఛేంజర్ ప్లాట్‌ను అమెజాన్ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
వామ్మో ఏకంగా అన్ని కోట్లా!
‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ నిలవనుంది.
గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఆమె తండ్రి బోని కపూర్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/1012_raj/status/1770365882738573469
ఆ రోజున డబుల్ ధమాకా!
మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్ యూనిట్ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ లభించనుంది.
మార్చి 20 , 2024

Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల యంగ్ హీరో దిల్‌రాజు సోదరుడు కుమారుడు ఆశీష్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. ఈ మధ్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా పెళ్లి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పేరు #TaapseePannu హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.
https://twitter.com/memesbyAru/status/1762745277944054182
తాప్సీ పన్ను.. తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్ (Mathias Boe)ని వివాహం చేసుకోనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. మార్చి నెలఖారు లోపు పెళ్లి బంధంతో వీరు ఒక్కటవుతారని సమాచారం.
సినీ తారల వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారిపోయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తాప్సి - మథియస్ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని అంటున్నారు.
సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
సుమారు పదేళ్లుగా తాప్సీ - మథియస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఈ జంట చాలా జాగ్రత్త పడింది. ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.
బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఆ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది.
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.
‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు.
తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్ ఖేల్ మీన్ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 28 , 2024

69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్.. అవార్డ్స్ విజేతలు వీరే!
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు.
https://twitter.com/i/status/1714234869629558869
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.
https://twitter.com/i/status/1714263091029107087
పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు.
https://twitter.com/bharatidubey/status/1714279017837474231
'ఆర్‌ఆర్‌ఆర్' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.
https://twitter.com/i/status/1714256005079704005
'ఆర్‌ఆర్‌ఆర్'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714253448215228480
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు.
https://twitter.com/i/status/1714255504153993419
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు.
https://twitter.com/i/status/1714253832241422699
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం.
https://twitter.com/i/status/1714266870713647487
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714230631885062219
జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
https://twitter.com/i/status/1714224832316080266
ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.
https://twitter.com/i/status/1714218637362659515
జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం.
https://twitter.com/alluarjun/status/1714300482934751553
అక్టోబర్ 18 , 2023

Game Changer: ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు పెంచిన తెలంగాణ సర్కార్, ఎంతంటే?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై నీలి నీడలు కమ్మాయి. అయితే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అభ్యర్థన మేరకు టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుతో పాటు ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
తెలంగాణలో టికెట్ ధరల పెంపు
తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని చిత్ర బృందం కోరగా, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.
సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరను అదనంగా రూ.100 పెంచుకునే వీలును కల్పించారు.మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు అనుమతించారు.జనవరి 11 నుంచి 19 వరకు, రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.సింగిల్ స్క్రీన్‌లలో అదనంగా రూ.50,మల్టీ ప్లెక్స్‌లలో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
అయితే, విడుదల రోజున జనవరి 10 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చే సూచనను ప్రభుత్వం తిరస్కరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ముందుగానే అనుమతిని ఇచ్చింది.
జనవరి 10న అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు.ఈ బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు.అదే విధంగా, ఆరు షోలకు జనవరి 10న ప్రత్యేక అనుమతి ఇచ్చారు.జనవరి 11 నుంచి 23 వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చి,సింగిల్ స్క్రీన్‌లలో అదనంగా రూ.135 (జీఎస్టీతో కలిపి),మల్టీ ప్లెక్స్‌లలో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి) వరకు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును కల్పించారు.
ఫ్యాన్స్‌లో సంబరాలు
తెలంగాణ & ఏపీ ప్రభుత్వాల నిర్ణయాలతో రామ్ చరణ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మెగా ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రదర్శనలు ప్లాన్ చేస్తూ, ఈ సినిమా టికెట్ ధరలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం వల్ల మొదటి రోజున సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, టికెట్ ధరల పెంపు, అనుమతులు ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
జనవరి 09 , 2025

Allu Arjun: పవన్‌ను మళ్లీ టార్గెట్ చేసిన బన్నీ ఫ్యాన్స్.. నెట్టింట వాడీ వేడీ చర్చ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ తాజాగా పరామర్శించారు. పోలీసుల ఆంక్షల మధ్య ఆస్పత్రికి వెళ్లిన బన్నీ.. బాధితుడి యోగ క్షేమాల గురించి స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #AlluArjun హ్యాష్‌ట్యాగ్‌ను బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త అంశాన్ని అల్లు అభిమానులు లేవనెత్తుతున్నారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్‌కు హాజరై తిరుగు ప్రయాణంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. బన్నీకో రూల్.. పవన్ కల్యాణ్‌కు మరో రూలా అంటూ నిలదీస్తున్నారు.
ఏం జరిగిందంటే?
ఏపీలోని రాజమండ్రిలో శనివారం (డిసెంబర్ 4) ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్‌రాజుతో పాటు చిత్ర బృందమంతా అటెండ్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్ చూసేందుకు వచ్చిన మెగా అభిమానులు తోకడ చరణ్, ఆరవ మణికంఠ అనే ఇద్దరు యువకులు తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్‌కు గురై మరణించారు. దీనిపై ఎక్స్‌వేదికగా స్పందించిన పవన్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అటు నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షలు అందించనున్నట్లు చెప్పారు.
https://twitter.com/Bhacho4JSP/status/1876141605826220322
పవన్‌కు మానవత్వం లేదా?
సంథ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల పవన్ స్పందిస్తూ ఎక్కడో మానవీయ కోణం లోపించిందని అన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ.. చనిపోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు యాక్సిడెంట్ జరిగిన రోడ్డు సరిగా లేదంటూ గత ప్రభుత్వంపైకి ఘటనను తోసివేయడాన్ని తప్పుబడుతున్నారు. ‘సినిమాలకెళ్లి చొక్కాలు చించుకోకపోతే.. బైక్ యాక్సలేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎక్కడికి పోతుంది’ అని ఈవెంట్‌కు వచ్చిన యూత్‌ను పవన్ రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు.
https://twitter.com/Anithareddyatp/status/1876285328962756885
ఆ రెండు ఘటనల్లో తేడా ఏముంది?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట, గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌ను బన్నీ ఫ్యాన్స్ లింకప్ చేస్తున్నారు. తొక్కిసలాటకు పరోక్షంగా బన్నీ బాధ్యుడైతే.. ఈ యాక్సిడెంట్‌కు పవన్, చరణ్ కూడా బాధ్యులు కాదా? అని నిలదీస్తున్నారు. అప్పుడు అల్లు అర్జున్ అరెస్టు మీకు కరెక్ట్ అనిపించినప్పుడు.. ఇప్పుడు పవన్‌ను కూడా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేవనెత్తుతున్న ఈ ప్రశ్నలకు వైకాపా పార్టీ సైతం మద్దతు తెలుపుతోంది. ఆ పార్టీకి చెందిన అంబటి రాంబాబు తాజాగా ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరి ఈ అంశంపై పవన్‌ను తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి రోజా కూడా బాధిత కుటుంబాల రోదనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు.
https://twitter.com/sakshinews/status/1876293675040592171
https://twitter.com/RojaSelvamaniRK/status/1876477413007450332
మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్..
యాక్సిడెంట్‌ను ఆయుధంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైకాపా నేతలకు మెగా ఫ్యాన్స్ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ అభిమాని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని చివర్లో పవన్ రెండు చేతులు జోడించి మరి సూచించారని గుర్తు చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారన్న విషయాన్ని కూడా పవన్ చెప్పారన్నారు. మీ కుటుంబ సభ్యుల్ని అడిగానని చెప్పమన్న పవన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానుల క్షేమం కోసం పాటుపడే వ్యక్తి పవన్ అంటూ ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైందని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/CultFanIkkadaa/status/1876266372940152896
https://twitter.com/PowerStarFc_JSP/status/1876412576437006379
శ్రీతేజ్‌ను పరామర్శించిన బన్నీ
ఇదిలా ఉంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తాజాగా పరామర్శించారు. బాలుడు చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి బన్నీ వెళ్లారు. అతడితో పాటు FDC ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు కూడా ఆస్పత్రికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న బన్నీ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బన్నీ రాక నేపథ్యంలో హాస్పిటల్ పరిసరాల్లో భారీగా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. బాలుడ్ని పలకరించిన అనంతరం బన్నీ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/KINGSNEWS7/status/1876555256303382879
జనవరి 07 , 2025

Sankranthi Movies Telugu: సంక్రాంతికి ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే!
సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. సొంతూళ్లకు టికెట్లు బుక్ చేసుకునే పనిలో తెలుగు ప్రజలు బిజీగా ఉన్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఈ సంక్రాంతిని మరింత వినోదాత్మకంగా మార్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సిద్ధమైంది. ప్రేక్షకులను అలరించేందుకు పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు..
గేమ్ ఛేంజర్ (Game Changer)
రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్నిటికంటే ముందుగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.
డాకూ మహారాజ్ (Daku Maharaj)
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్' ఈ సంక్రాంతికి వినోదాన్ని పంచనుంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. ఇందులో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా చేశారు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసేంది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చారు.
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)
ఈ సంక్రాంతికి రాబోతున్న మరో స్టార్ హీరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ కుటుంబ కథలో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు..
బచ్చలమల్లి (Bachchala Malli)
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బచ్చలమల్లి'. ఈ చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
నీలి మేఘ శ్యామ (Neeli Megha Shyama)
విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధా కృష్ణ జంటగా నటించిన చిత్రం 'నీలి మేఘ శ్యామ'. రవి. S. వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆహా వేదికగా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. '35 చిన్న కథ కాదు'లో నటించిన విశ్వదేవ్ రాచకొండ ఇందులో లీడ్ రోల్‌లో నటించడంతో ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది. 'ఓ ట్రెక్కింగ్ యువకుడి జీవితాన్ని ఏ విధంగా మార్చింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.
TitleCategoryLanguagePlatformRelease DateBlack WarrantSeriesHindiNetflixJan 10Legend of FluffyComedy ShowEnglishNetflixJan 07Jerry Springer DocumentaryEnglishNetflixJan 07The unshop 6SeriesEnglishNetflixJan 09Goos BumpsSeriesEnglishNetflixJan 10Sabarmati ReportMovieHindiZee5Jan 10Roadies Double CrossReality ShowEnglishJio CinemaJan 11FocusMovieEnglishAmazonJan 10Shark Tank India 4Reality ShowHindiSonyLIVJan 06
జనవరి 06 , 2025

Sankranthiki Vasthunnam: ఒకేసారి 3 వేల మందికి సెల్ఫీ.. వెంకీ మామా నిజంగా గ్రేట్!
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh) ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా యంగ్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ వినూత్న ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రమోషన్‌కు నటుడు వెంకటేష్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
3000 మందితో ఫొటోలు..
'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు వెంకటేష్ క్రేజీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 3000 మందికి పైగా అభిమానులతో ఏకధాటిగా ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వెంకీతో ఫొటో కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ బారులు తీరడం ఈ వీడియోలో గమనించవచ్చు. క్యూలో నిలబడిన అభిమానులు తమ వంతు రాగానే ఒక్కొక్కరిగా వెంకటేష్‌తో ఫొటో దిగారు. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
https://twitter.com/baraju_SuperHit/status/1875442823736258582
వెంకీ నిజంగా గ్రేట్..
సాధారణంగా సెలబ్రిటీలు ఒకరిద్దరితో ఫొటోలు దిగాలంటేనే నీరసించిపోతారు. అటువంటిది వెంకటేష్ ఏకంగా 3000+ మందితో ఒకేసారి ఫొటోలు దిగడమంటే సాధారణ విషయం కాదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘వెంకీ మామా నిజంగా గ్రేట్’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఏమాత్రం విసుగులేకుండా ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగడాన్ని మెచ్చుకుంటున్నారు. ఫ్యాన్స్‌తో ఎలా వ్యవహరించాలో చూపిస్తూ ప్రస్తుత తరం హీరోలకు వెంకటేష్ ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
మూడు పాటలు ట్రెండింగ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మూడు సాంగ్స్ విడుదలవ్వగా అన్ని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ‘గోదారి గట్టు’, ‘మీను’, ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల పాడిన 'గోదారి గట్టు' సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాగే వెంకటేష్ స్వయంగా స్వరం అందించిన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ ఆకట్టుకుంటోంది.
మాజీ పోలీసు అధికారిగా..
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆయనకు భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి నటించారు. వీరితోపాటు సినిమాలో ఉపేంద్ర, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రం కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుందని మూవీ టీమ్ ధీమాగా ఉంది.
జనవరి 04 , 2025

Ram Charan Cutout: రామ్‌చరణ్ బిగ్గెస్ట్ కటౌట్.. హెలికాఫ్టర్‌తో పూల వర్షం.. ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. 'పుష్ప 2' (Pushpa 2) తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. జనవరి 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ అభిమాన హీరో కోసం దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ను ఫ్యాన్స్ సిద్ధం చేస్తున్నారు.
దేశంలో అతిపెద్ద కటౌట్
ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్ భారీ కటౌట్ విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. 256 అడుగుల ఎత్తు ఉండే దీన్ని డిసెంబర్ 29న ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత ‘దిల్’ రాజు హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదగానే ఈ బిగ్ కటౌట్ లాంచింగ్ జరగనుంది. అనంతరం కటౌట్‌పై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కటౌట్ తయారీ పనులు నాలుగు రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దది అని అభిమానులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి 15 వందల నుంచి రెండు వేల మంది అభిమానాలు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కటౌట్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి సైతం లభించినట్లు పేర్కొన్నారు.
https://twitter.com/baraju_SuperHit/status/1872646837410394324
ట్రైలర్ రిలీజ్ మరింత ఆలస్యం!
'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమా రిలీజ్‌కు సరిగ్గా 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటివరకూ ట్రైలర్‌ను రిలీజ్ చేయకపోవడంపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సాధారణంగా ఏ సినిమా ట్రైలర్ అయినా విడుదలకు 15 రోజుల ముందు రిలీజ్ చేస్తుంటారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ లాంటి పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ ఇంకా విడుదల కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం సినిమా రిలీజ్‌కు ఐదు రోజుల ముందు ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చరణ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీకి రామ్‌చరణ్ పారితోషికంపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు చరణ్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ బడ్జెట్‌లో దీని వాటా 22% వరకూ ఉందని ప్రచారం జరుగుతోంది. అటు ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్. సినిమాలోని పాటలకు ఏకంగా రూ.80-90 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి’, ‘రా మచ్చ మచ్చ’, ‘నానా హైరానా’, ‘దోప్’ సాంగ్స్ టీజర్స్ చూస్తే సాంగ్స్‌కు బాగా ఖర్చు చేసినట్లు అర్ధమవుతోంది.
డిసెంబర్ 28 , 2024

Tollywood Industry Meeting: శాంతించిన సీఎం రేవంత్.. టికెట్ల పెంపుపై కమిటీ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు.. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు.
తొక్కిసలాట వీడియో ప్రసారం..
బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నుంచి 36 మంది సీఎంతో (Tollywood Industry Meeting) సమావేశమయ్యారు. దిల్‌రాజుతో పాటు అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సీ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, రాఘవేంద్రరావు, కిరణ్ అబ్బవరం తదితరులు భేటికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు.
https://twitter.com/NTVJustIn/status/1872173132062286004
సెలబ్రిటీల ప్రతిపాదనలు
సీఎంతో భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పలు ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేది తమ కోరికని సినీ నటుడు నాగార్జున అన్నారు. యూనివర్సల్ లెవల్లో స్టూడియో సెటప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని దర్శకుడు రాఘవేంద్రరావు సీఎంకు సూచించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడిన సీనియర్ నటుడు మురళి మోహన్.. అది తమనెంతో బాధించిందన్నారు. 'ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది' అంటూ చెప్పుకొచ్చారు. ‘నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలి. నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా చేయాలనేది మా కల’ అని నిర్మాత దగ్గుబాటి సురేష్ సీఎంతో అన్నారు.
ఆ విషయంలో సీఎం తగ్గేదేలే..
సినీ పెద్దల అభిప్రాయాలను విన్న సీఎం రేవంత్ రెడ్డి (Tollywood Industry Meeting).. ప్రభుత్వ వైఖరి ఎంటో స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి. పెట్టులబడుల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటాం. అంతేకాదు బెనిఫిట్ షోలు కూడా ఉండవు. దీనిపై అసెంబ్లీలో చెప్పిన మాటలకు మేం కట్టుబడి ఉంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు.
భేటిపై దిల్ రాజు వివరణ..
సీఎం రేవంత్‌రెడ్డితో సెలబ్రిటీల సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. ఈ భేటి ముగిసిన అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు భేటిలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య గ్యాప్ ఉందనేది కేవలం అపోహ మాత్రమేనని దిల్‌రాజు స్పష్టం చేశారు. 'తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిలిం హబ్‌గా మార్చడానికి కృషి చేస్తాం. తెలంగాణ సామాజిక కార్యక్రామల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి సహకారం ఉండాలని ప్రభుత్వం కోరింది. డ్రగ్స్, గంజాయి లాంటి ఆవగాహన కార్యక్రమాల్లో ఇకనుంచి నటీనటులు పాల్గోంటారు. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు అంశం అనేది చాలా చిన్న విషయం. ఆ రెండింటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఘటనల వలన ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది అది నిజం కాదు. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో నివేదిక ఇస్తాం’ అంటూ దిల్‌రాజు వివరించారు.
https://twitter.com/ManobalaV/status/1872198044768469412
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..
టాలీవుడ్‌లో సమస్యలు (Tollywood Industry Meeting), ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పరిశోధించనుంది. అలాగే అదనపు షోల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, టికెట్ రేట్ల పెంపుపై కూడా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ సూచనలను ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
డిసెంబర్ 26 , 2024

Allu Arjun: బన్నీని చూసి విజయ్ దేవరకొండ ఎమోషనల్.. కానరాని మెగా హీరోలు!
‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. దీంతో శనివారం (డిసెంబర్ 14) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ (Allu Arjun Release From Jail) విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు ప్రస్తుతం సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రానా, వంశీపైడిపల్లి, దిల్‌రాజు, కొరటాల శివ, హరీష్ శంకర్‌తో పాటు పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బన్నీ-రౌడీ భాయ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బన్నీని హత్తుకున్న విజయ్..
అల్లు అర్జున్ (Allu Arjun) జైలు నుంచి ఇంటికి చేరుకున్నారన్న వార్త వినగానే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆగమేఘాల మీద బన్నీ ఇంటికి వచ్చేశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో బన్నీ ఫోన్‌లో మాట్లాడుతుండగా విజయ్‌కు నిర్మాత అల్లు అరవింద్ కరచలనంతో స్వాగతం పలికారు. అప్యాయంగా విజయ్‌ను కౌగిలించుకున్నారు. అటు అల్లుఅర్జున్ కూడా ఫోన్ కాల్ ఆపేసి విజయ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై ఇద్దరు ఒకరినొకరు అప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కష్టకాలంలో అల్లు అర్జున్‌కు అండగా నిలిచిన రౌడీ భాయ్‌ను బన్నీ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
https://twitter.com/ANI/status/1867791848879927789
కంటతడి పెట్టిన సుక్కు
‘పుష్ప 2’ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ కూడా బన్నీని పలకరించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. బన్నీని చూడగానే డైరెక్టర్ సుకుమార్ చాలా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. దీంతో సుక్కును బాధపడవద్దని బన్నీ వారించారు. ప్రేమగా గుండెలకు హత్తుకొని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుకుమార్, బన్నీ బంధం ఎంత బలమైందో మరోమారు నిరూపితమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తర్వాత బన్నీతో పాటు పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్న సుకుమార్, పుష్ప 2 నిర్మాతలు ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తాము అండగా ఉన్నామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
https://twitter.com/Telugu_Cult/status/1867793674119393356
https://twitter.com/PTI_News/status/1867794765691203656
మెగా హీరోలు ఎక్కడ?
శుక్రవారం (డిసెంబర్ 13) అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకొని మరి బన్నీ ఇంటికి వెళ్లారు. భార్య సురేఖతో కలిసి వెళ్లి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత సోదరుడు నాగబాబు (Naga Babu) సైతం బన్నీ ఇంటికి వెళ్లిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే శనివారం బన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క మెగా హీరో అతడ్ని పరామర్శించేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి భార్య సురేఖ (Surekha Konidela) ఒక్కరే బన్నీ ఇంటికి వెళ్లారు. అల్లుఅర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్‌లలో ఎవరూ బన్నీని పలకరించడానికి వెళ్లలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదం మరోమారు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది.
https://twitter.com/ANI/status/1867809564848177444
బన్నీకి ఎమోషనల్ స్వాగతం
శనివారం (డిసెంబర్ 14) తెల్లవారుజామున చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు బన్నీని విడుదల చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బన్నీకి కుటుంబల సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన తండ్రిని చూసిన కుమారుడు అయాన్ పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. తర్వాత సతీమణి స్నేహాను అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా స్నేహా బావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/ANI/status/1867768390590611610
https://twitter.com/GulteOfficial/status/1867779035968995415
https://twitter.com/ANI/status/1867770277155017094
‘ఆ ఘటనలో నా ప్రమేయం లేదు’
ఇంటి వద్ద బన్నీ మీడియాతో మాట్లాడారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన (Sandhya Theatre Incident) గురించి మాట్లాడుతూ ‘దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్తున్నా. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె (చనిపోయిన రేవతి) కుటుంబాన్ని కలుస్తా. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు’ అని అల్లు అర్జున్ అన్నారు.
https://twitter.com/ANI/status/1867823379673432179
డిసెంబర్ 14 , 2024