
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Netflix
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం

వరుణ్ తేజ్
వరుణ్
సాయి పల్లవి
భానుమతిసాయి చంద్
భానుమతి తండ్రి
సత్యం రాజేష్
వరుణ్ స్నేహితుడుధాశ్యం గీతా భాస్కర్భానుమతి అత్త
మనీషా ఈరాబతిని
వరుణ్ కజిన్
హర్షవర్ధన్ రాణే
భానుమతి పొరుగు/దావాదారుకటారినా రిక్టర్సుజీ
కవిత చంద్రశేఖర్
గౌరీ ప్రియ
సిబ్బంది

శేఖర్ కమ్ముల
దర్శకుడు
దిల్ రాజు
నిర్మాతశక్తికాంత్ కార్తీక్సంగీతకారుడు
విజయ్ సి. కుమార్
సినిమాటోగ్రాఫర్
మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు

Actress Neha Shetty: ‘బెదురులంక’ బ్యూటీకి టాలీవుడ్ ఫిదా..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
ఆగస్టు 28 , 2023

BABY: తెలుగింటి అందం వైష్ణవీ చైతన్య లేలేత సొగసులకు ఫిదా కావాల్సిందే.. ఇంతకు ఈమె ఎవరంటే?
కుర్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన 'బేబీ' చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఈ చిన్నది ప్రమోషన్స్‌లో బిజీ బీజీగా గడుపుతోంది. దీంతో వైష్ణవి పాప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వైష్ణవీ చైతన్య తెలుగు అమ్మాయే. 1996లో జనవరి 4న 1996 విజయవాడలో జన్మించింది.
యాక్టింగ్‌లోకి రాకముందు.. ఈ చక్కని గుమ్మ యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి ఫేమస్ అయింది
యుట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీరిస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అలవైకుంఠాపురంలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇంకా పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ కెరీర్‌లో జెట్ వేగంతో దూసుకెళ్తోంది
నటిగా, మోడల్‌గా , డ్యాన్సర్‌గా బహుముఖ పాటవాన్ని చూపుతూ తాజాగా హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ విజయవాడ పిల్ల
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్లు ఈ మధ్య భారీగానే పెంచుకుంటోంది. లెలేత అందాల ప్రదర్శనతో కుర్రకారుకు వల విసురుతోంది.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసిన ఈ అమ్మడి అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
మరో మూడు రోజుల్లో బేబీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ జోడీగా నటిస్తోంది
ఇప్పటికే బేబీ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. సాంగ్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.
ఇద్దరు యువకుల ప్రేమ మధ్యలో నలిగిపోయే యువతి పాత్రలో వైష్ణవీ కనిపించనుంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం అయితే తెరకెక్కింది.
ఇప్పటికే ఈ చిత్రం బృందం వినూత్నంగా ప్రచారాన్ని మొదలు పెట్టింది.
సోమవారం హైదరాబాద్- బోరబండలో ఆటో డ్రైవర్లతో కలిసి సినిమా విశేషాలను పంచుకుంది.
జూలై 11 , 2023

ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడిన ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ డుంకీ చిత్రంలోని లుట్ ఫుట్ గయా పాటను మంచి రిదమ్‌తో పాడాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా SRK ఫ్యాన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్ సైతం అయాన్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియో షారుఖ్ ఖాన్‌కు చేరింది. అయాన్ టాలెంట్‌పై SRK స్పందిస్తూ.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన బుడ్డోడివి అంటూ ప్రశంసించాడు.
అల్లు అర్జున్ కొడుకు అయాన్.. సెలబ్రెటీ కిడ్ మాదిరిలా కాకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ తన టాలెంట్‌ను చాటుతుంటాడు. తన తండ్రి స్టార్ డమ్‌ను ఏమాత్రం తనపై ప్రభావం లేకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడుతుంటాడు.
అయితే ఈ మధ్య అల్లు అర్జున్‌తో కారులో ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో తనకు ఇష్టమైన సాంగ్‌ను పాడుతా అంటూ బన్నీకి చెప్పాడు. రీసెంట్ మూవీ డుంకీ చిత్రంలోని "లుట్ ఫుట్ గయా" అంటూ తనదైన స్వాగ్‌లో అయాన్ హమ్ చేశాడు. బ్లాక్, వైట్ అండ్ ఎల్లో జెర్సీ వేసుకున్న అయాన్ చివర్లో షారుక్ ఖాన్ స్టైల్‌లో ఓ లుక్ ఇస్తూ ముగించాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయాన్‌కు గొప్ప భవిష్యత్ ఉందంటూ అతని ప్రతిభ ప్రశంసిస్తూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/SRKUniverse/status/1761332479590297791?s=20
ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ స్పందించారు. "నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన వ్యక్తివి అంటూ ప్రశంసించారు. అలాగే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను తన పిల్లల చేత త్వరలో పాడిస్తానని ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు. షారుక్ స్పందించడంపై అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అగ్రహీరోల మధ్య జరిగిన ఈ స్వీట్ కాన్వర్జేషన్ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది.
https://twitter.com/iamsrk/status/1761701819687030986?s=20
టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గతంలో జవాన్ సినిమా విడుదలైన సమయంలో షారుక్ నటనను ప్రశంసిస్తూ బన్నీ కామెంట్ చేశాడు. మాస్ అవతార్‌లో షారుక్ లుక్ అదిరిపోయిందని, జవాన్ చిత్రం అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అంటూ ప్రశంసించాడు. ఆ చిత్ర యూనిట్‌గా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ పోస్ట్‌పై SRK సైతం స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని పేర్కొన్నాడు.
https://twitter.com/iamsrk/status/1702214179212411127?s=20
తాజాగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ వీడియో అదేస్థాయిలో షారుక్ స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు షారుక్ ఖాన్ డుంకీ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
ఫిబ్రవరి 26 , 2024

Disha Patani: ఎద పొంగులతో రెచ్చిపోయిన దిశా పటాని.. హాట్ ట్రీట్‌తో ఫిదా అవుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.
ఎద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా ఫొటోల్లో ఈ బ్యూటీ ఎద పొంగులతో రెచ్చిపోయింది. టైట్ ఫిట్ డ్రెస్‌లో తన ఎదలను ఉబికేలా చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని కామెంట్లు పెడుతున్నారు.
దిశా పెట్టే బోల్డ్ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
లోఫర్ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
లోఫర్ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.
దిశా నటించిన ఎం.ఎస్ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2), బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
భాగీ సినిమా షూటింగ్ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే టైగర్, దిశా రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’ చిత్రంలో దిశా హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ డిసెంబర్ 15న రిలీజ్ కాబోతోంది.
పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.
సెప్టెంబర్ 23 , 2023

Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు
డైరెక్టర్: సాయి రాజేశ్
నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్)
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు. తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్‌కి తెలియకుండా విరాజ్‌తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే?
సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్‌గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్‌గా వైష్ణవి చక్కగా చేసింది. లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌గా..
తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్‌తో ప్రేక్షకుడ‌్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్‌లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథనం, డైలాగ్స్
నిర్మాణ విలువలు
యూత్ ఎలిమెంట్స్
సంగీతం
మైనస్ పాయింట్స్
సాగతీత సన్నివేశాలు
క్లైమాక్స్
చివరగా.. యూత్ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’
రేటింగ్: 3/5
https://www.youtube.com/watch?v=_npN4uwDMLk
జూలై 14 , 2023

సాయి పల్లవి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు ఆమె మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాలో మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరి సాయి పల్లవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Sai Pallavi) విషయాలు ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి ముద్దు పేరు?
మలార్
సాయి పల్లవి పేరు ఎవరు పెట్టారు?
సాయి పల్లవి పేరును పుట్టపర్తి సాయిబాబా పెట్టారు
సాయి పల్లవి వయస్సు ఎంత?
1992, మే 9న జన్మించింది
సాయి పల్లవి తెలుగులో నటించిన తొలి సినిమా?
ఫిదా
సాయి పల్లవి ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
సాయి పల్లవి ఎక్కడ పుట్టింది?
కోటగిరి, తమిళనాడు
సాయి పల్లవి ఏం చదివింది?
MBBS
సాయి పల్లవి అభిరుచులు?
డ్యాన్సింగ్, సింగింగ్
సాయి పల్లవికి ఇష్టమైన ఆహారం?
చాకోలెట్స్, స్వీట్స్
పూజా హెగ్డేకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
సాయి పల్లవికి ఇష్టమైన హీరో?
కమల్ హాసన్, మమ్మాటి
సాయి పల్లవికి ఇష్టమైన హీరోయిన్?
జ్యోతిక, సిమ్రాన్
సాయి పల్లవి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సాయి పల్లవి తల్లిదండ్రుల పేరు?
సెంతమార కన్నన్, రాధ కన్నన్
సాయి పల్లవి రాకముందు ఏం చేసేది?
సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు పలు డ్యాన్స్ షోల్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షోలో కూడా సాయి పల్లవి పార్టిసిపేట్ చేసింది.
సాయి పల్లవి ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/saipallavi.senthamarai/
సాయి పల్లవి నికర ఆస్తుల విలువ?
రూ.30కోట్లు
https://www.youtube.com/watch?v=1OtXtXJWTVg
ఏప్రిల్ 16 , 2024

Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
శ్రియా రెడ్డి అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
సలార్‌లో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ నటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రియారెడ్డి గతంలో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు... కానీ ఈమె మరెవరో కాదు హీరో విశాల్‌కు స్వయాన వదిన.
హీరో విశాల్ సోదరుడు విక్రమ్‌ను పెళ్లి చేసుకున్న ఈ సుందరాంగి.. సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది.
లేటు వయసులోనూ తన ఒద్దికైన ఫిజిక్‌తో పెద్దసంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
సలార్ సినిమాలో శ్రియా రెడ్డి.. పృథ్విరాజ్ సవతి తల్లి కూతురిగా నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె అందానికి కుర్రకారు దాసోహమంటున్నారు.
40ఏళ్ల వయసులోనూ ఈ ఘాటు అందాలు ఏంటని నెటిజన్స్ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న శ్రియా రెడ్డికి అవకాశాలు అంతంత మాత్రమే వచ్చినా... తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.
ప్రస్తుతం ఈ బామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా రెడ్డి, హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు కనువిందు చేస్తుంటుంది.
ముఖ్యంగా చీర కట్టులో ఎద అందాల ఆరబోతతో కవ్విస్తుంటుంది.
చీరలోనో కాదు మోడ్రన్ డ్రెస్‌లోనూ కావాల్సినంత అందాన్ని అప్పనంగా అభిమానులకు అందిస్తుంటుంది.
పదునైన చూపులతో గాలం వేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది.
ప్రస్తుతం శ్రియారెడ్డి ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 1.6మిలియన్ దాటింది.
సలార్ మూవీ హిట్‌తో ఈ కుందనపు బొమ్మకు అవకాశాలు దక్షిణాదిలో వెల్లువెత్తుతున్నాయి.
మరి భవిష్యత్‌లో ఈ ఘాటు అందం ఎన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి.
డిసెంబర్ 26 , 2023

Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తన తొలి ఫిల్మ్‌తోనే చెరగని ముద్ర వేసింది. తాజాగా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవికి సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగలింది. గతంలో ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింలోకి వచ్చాయి. దీంతో నెటిజన్లు సాయిపల్లవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
సాయిపల్లవి వీడియో వైరల్
అమరన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/ViralVidox/status/1850064411202932830
కశ్మీర్ హింసాకాండ పైనా..
ఇదే ఇంటర్వ్యూలో కశ్మీరి పండిట్ల హత్యాకాండపైనా సాయి పల్లవి మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్‌గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్‌ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది’ అంటూ సాయిపల్లవి ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సాయిపల్లవిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అయితే అమరన్ రిలీజ్ సందర్భంలో ఈ వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
https://twitter.com/divya_gandotra/status/1784199470219251986
వాళ్లే టార్గెట్ చేస్తున్నారా?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
అక్టోబర్ 26 , 2024

Kavya Thapar Hot Pics: కసి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న కావ్యా థాపర్
కావ్య థాపర్ హీరోయిన్‌గా రూపొందిన 'విశ్వం' చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ అమ్మడి పర్‌ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే #KavyaThapar హ్యాష్‌ట్యాగ్ నెట్టింద తెగ ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన అందం, డ్యాన్స్‌తో లుక్స్ తిప్పుకోనివ్వకుండా చేసిందని పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1844650013252825352
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్‌ను కాదని మరో సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్‌గా పాట బాధ్యతను అప్పగించారు. భీమ్స్ పాడిన ఈ పాటకు గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ స్టెప్పులు వేసి ఊర్రూతలూగించారు.
https://twitter.com/actressspecial/status/1844644160881426905
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
ఇదిలా ఉంటే తను సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కావ్యా తెలిపారు. విశ్వం సినిమా హిట్ కావాలని నవరాత్రుల సందర్భంగా ఉపవాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
అక్టోబర్ 11 , 2024

WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్‌డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
]చంద్రముఖిచంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2023

Sai Pallavi: చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో దుమ్ములేపిన సాయిపల్లవి.. వీడియో వైరల్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ‘అమరన్’ అనే చిత్రంలో సాయిపల్లవి నటించింది. అందులో అద్భుతమైన నటన కనబరిచి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ చిత్రానికి గాను తాజాగా ఉత్తమనటి అవార్డు అందుకొని నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఉత్తమ నటిగా సాయిపల్లవి..
తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Chennai International Film Festival) వేడుకలు తాజాగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. ఈ ఏడాది విడుదలై సత్తా చాటిన చిత్రాలు, తమ ప్రతిభతో ఆకట్టుకున్న సెలబ్రిటీలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగా ‘అమరన్’ చిత్రానికి గాను సాయిపల్లవి (Sai Pallavi) ఉత్తమనటి (Best Actress Award)గా ఎంపికైంది. ఇందులో ఆమె పోషించిన ఇందు రెబకా పాత్ర ప్రేక్షకుల హృదయాలను బాగా హత్తుకోవడంతో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును సాయి పల్లవికి అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తమ నటిగా సాయిపల్లవి ఎంపిక చేయడం నూటికి నూరు శాతం సరైన నిర్ణయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అవార్డు అందుకుంటున్న వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/SaiPallavi92s/status/1870115679048806503
సాయిపల్లవి రియాక్షన్..
‘అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఎంపిక కావడంపై సాయిపల్లవి స్పందించింది. ‘22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషం, గర్వంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు విడుదలయ్యాయి. ఎంతో పోటీ నెలకొంది. అలాంటి సమయంలో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. నా అభిమానులకు ధన్యవాదాలు. వారు చూపించే ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంటుంది. దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ఒక జవాను కథ (అమరన్) ఇది. రాజ్‌కుమార్ పెరియాసామి వంటి దర్శకులే ఇలాంటి మరెన్నో కథలు మనకు అందించగలరు’ అని సాయిపల్లవి తెలిపారు.
https://twitter.com/Vinothkann41751/status/1870038015319650540
క్యూట్ లుక్స్‌కు ఫిదా..
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు సాయిపల్లవి ట్రెడిషనల్ లుక్‌లో హాజరైంది. సంప్రదాయ పద్దతిలో చీరకట్టుకొని అక్కడి వారిని సర్‌ప్రైజ్ చేసింది. ఈవెంట్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అక్కడి వారిని ఫిదా చేసింది. వాటన్నింటిని ఒక దగ్గర చేర్చిన ఆమె అభిమానులు స్లోమోషన్ వీడియోను క్రియేట్ చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. సాయిపల్లవి అందానికి మైమరిచిపోతున్నారు. ఆమె నవ్వు చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘క్యూట్‌నెస్ ఓవర్ లోడింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలపై మీరు లుక్కేయండి.
https://twitter.com/SaiPallavi92s/status/1870320285653545018
https://twitter.com/SaipalluRasigai/status/1870358434572284183
నాల్గో స్థానంలో సాయిపల్లవి..
నవంబర్ నెలలో దేశంలోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాప్ - 10 హీరోయిన్ల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసింది. ఇందులో సాయిపల్లవి దేశంలోనే టాప్- 4 స్థానంలో నిలిచింది. స్టార్ హీరోయిన్ సమంత ఇందులో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అలియా భట్, నయనతార రెండు మూడు స్థానాల్లో నిలిచారు. దీపికా పదుకొనే (5వ), త్రిష (6వ), కాజల్ అగర్వాల్ (7వ), రష్మిక మందన్న (8వ), శ్రద్ధా కపూర్ (9వ), కత్రినా కైఫ్ (10వ) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
https://twitter.com/OrmaxMedia/status/1870369651441758522
డిసెంబర్ 21 , 2024

Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఇండియన్ సినిమా చరిత్రను తిరిగరాసిన పుష్ప రాజ్ వీకెండ్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టాడు. బాక్సాఫీస్ (Pushpa 2 Day5 Box Office Collections) వద్ద ఊచకోత సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.800 కోట్ల క్లబ్‌లో
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్ పూర్తయ్యే సరికి తొలి నాలుగు రోజుల్లో (Pushpa 2 Box Office Collections) ఈ చిత్రం రూ. వరల్డ్ వైడ్‌గా రూ.829 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అత్యంత వేగంగా రూ.800 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. కాగా, ఈ చిత్రం తొలి రోజు రూ. 282.91 కోట్లు, రెండో రోజు రూ.134.63 కోట్లు, మూడో రోజు రూ.159.25 కోట్లు, నాల్గో రోజు రూ.204.52 కోట్లు తన ఖాతాలో వేసుకుందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. థియేటర్లలో పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాయి.
https://twitter.com/PushpaMovie/status/1866057903498829889
హిందీలో రికార్డుల పరంపర
బాలీవుడ్ ప్రేక్షకులు 'పుష్ప 2' (Pushpa 2 day 5 Box Office Collections) చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్‌లో తొలి రోజు నుంచి కాసుల వర్షం కుపిరిస్తున్నారు. అక్కడ ఫస్ట్ డే రోజున రూ.72 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి 'పుష్ప 2' ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో నాల్గో రోజైన ఆదివారం (డిసెంబర్ 8) ఏకంగా రూ.86 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి అక్కడ ఒక రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా హిందీలో వీకెండ్ పూర్తయ్యే సరికి రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను 'పుష్ప 2' తన ఖాతాలో వేసుకుంది. తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్ల నెట్ వసూళ్లను పుష్ప 2 రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అంటూ స్పష్టం చేశారు.
https://twitter.com/PushpaMovie/status/1866041047488528542
https://twitter.com/PushpaMovie/status/1866022278150160679
రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి?
‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్ (Pushpa 2 Box Office Collections)లో చేరేందుకు రూ.171 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ దూకుడు చూస్తుంటే రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీకెండ్ అయిపోయిన నేపథ్యంలో ఒక వేళ కలెక్షన్స్ తగ్గినా ఎల్లుండి మాత్రం కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఫాస్టెస్ట్ థౌజండ్ క్రోర్స్ (Fastest Rs.1000 Movie) సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒక సారి ఆ ఫీట్ సాధించాక ‘పుష్ప 2’ టార్గెట్ రూ.1500 కోట్ల మైలురాయిపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా చేశాడు. జగపతిబాబు, సునీల్, రావు రమేష్, అనసూయ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా రానుంది.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
డిసెంబర్ 09 , 2024

Pushpa 2 Day 2 Collection Worldwide: దారుణంగా పడిపోయిన ‘పుష్ప 2’ డే 2 కలెక్షన్స్.. ఎందుకంటే?
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. గురువారం (డిసెంబర్ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బన్నీ యాక్టింగ్ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్ నటన బాగుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్ హిట్ టాక్ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా సాధించని విధంగా తొలి రోజు రూ.294 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సెకండ్ డే వచ్చేసరికి పుష్ప 2 కలెక్షన్స్‌లో భారీ కోత పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రెండో రోజు కలెక్షన్స్..
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్ 5) వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.417.5 కోట్ల గ్రాస్ (Pushpa 2 Day 2 Collection Worldwide) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.134.6 కోట్లు రాబట్టినట్లు తెలిపాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్ (రూ.282 కోట్లు)తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయినట్లు స్పష్టమవుతోంది. 54 శాతం మేర ‘పుష్ప 2’ వసూళ్లలో కోత పడిందని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.
కోతకు కారణమిదే!
అయితే తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ (Pushpa 2 Day 2 Collection Worldwide) తగ్గడానికి ఓ కారణం ఉంది. డిసెంబర్ 5 ‘పుష్ప 2’ రిలీజ్ కాగా ముందు రోజు చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4 రా. 9:30, ఒంటి గంట తర్వాత స్పెషల్ షోస్ వేశారు. ఈ ప్రీమియర్స్‌కు ఒక్కో టికెట్‌ను రూ.1200కు పైగా విక్రయించారు. ఈ క్రమంలో డే 1 కలెక్షన్స్‌లో ఈ ప్రీమియర్స్ వసూళ్లను సైతం కలపడం వల్ల వసూళ్లు పెద్ద మెుత్తంలో కనిపించాయి. ఇక సెకండ్ డేకు వచ్చే సరికి టికెట్ల రేట్లు ప్రీమియర్స్‌తో పోలిస్తే తగ్గటం కూడా కలెక్షన్స్‌లో కోతకు కారణమైంది.
డే 1 కలెక్షన్స్ ఏరియాల వారీగా..
పుష్ప 2 చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్ వసూలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయస్ట్ ఓపెనింగ్స్ అని ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.
https://twitter.com/MythriOfficial/status/1865012207060422928
రాజమౌళి రికార్డులకు పాతర
తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ (Pushpa 2 Day 2 Collection Worldwide) చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294 కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. అటు నార్త్‌లోనూ 'పుష్ప 2' చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్ ఇచ్చాడు.
https://twitter.com/MythriOfficial/status/1864976017733095871
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
డిసెంబర్ 07 , 2024

Pushpa 2 Movie Box Office Collection: అన్ని రికార్డులు బ్రేక్.. ఇండియాలో నంబర్ 1 చిత్రంగా పుష్ప 2
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్ చేస్తోంది. గురువారం (డిసెంబర్ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ బన్నీ యాక్టింగ్ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్ నటన బాగుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్ హిట్ టాక్ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
డే 1 కలెక్షన్స్ ఎంతంటే..
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్ 5) వరల్డ్ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్ వసూలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయస్ట్ ఓపెనింగ్స్ అని వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.
https://twitter.com/MythriOfficial/status/1865012207060422928
రికార్డులు గల్లంతు
తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294 కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. అటు నార్త్‌లోనూ 'పుష్ప 2' చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్ ఇచ్చాడు.
https://twitter.com/MythriOfficial/status/1864976017733095871
బెనిఫిట్ షోలు రద్దు
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' ప్రీమియర్స్ (Pushpa 2 Movie Box Office Collection) సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఓ బాలుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బెన్‌ఫిట్‌షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నందున వాటిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారకులపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
డిసెంబర్ 06 , 2024

Varun Tej: వరుస ఫ్లాప్స్.. వరుణ్ తేజ్ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?
మెగా హీరో వరుణ్‌తేజ్ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్ ఫిల్మ్ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో అతడి కెరీర్ పరంగా తిరుగుండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ అతడ్ని పూర్తిగా ఢీలా పడేలా చేశాయి. రీసెంట్‌గా చేసిన ‘మట్కా’ చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాను వరుణ్ పట్టాలెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడిపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. హీరోగా మానేసి విలన్ పాత్రలు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ‘మట్కా’ (Matka) ఫ్లాప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వరుణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించనున్నట్లు సమాచారం. 'మట్కా' షూటింగ్ దశలో ఉండగా దర్శకుడు మేర్లపాక గాంధీ కథకు సంబంధించి వరుణ్‌తేజ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కు వరుణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
సినిమాలకు వరుణ్ బ్రేక్!
కరుణ కుమార్ దర్శకత్వంలో ఎంతో కష్టపడి చేసిన 'మట్కా' ఎవరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలవడం వరుణ్ తేజ్‌ను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. రొటీన్ స్టోరీ, పూర్ స్క్రీన్‌ప్లేతో అస్సలు బాలేదన్న టాక్ వచ్చింది. అయితే నటుడిగా వరుణ్ తేజ్ మాత్రం పూర్తిగా న్యాయం చేశాడన్న ప్రశంసలు కూడా వచ్చాయి. ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమా ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో వరుణ్ తేజ్ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని వరుణ్ నిర్ణయించుకున్నారట. ఈసారి ఆడియన్స్‌ను మెప్పించే కథ రావాలని గట్టిగా ఫిక్సయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
‘విలన్‌గా చేసుకో’
వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన గత ఆరు చిత్రాల్లో ఒక్క 'ఎఫ్ 3' మాత్రమే మంచి విజయం సాధించింది. అది కూడా వరుణ్ తేజ్ స్ట్రైట్ ఫిల్మ్ కాదు. అందులో వెంకటేష్ కూడా చేయడంతో సక్సెస్ క్రెడిట్ పూర్తిగా వరుణ్‌కు ఇవ్వలేము. వరుస ఫ్లాప్స్‌తో అభిమానులను నిరాశ పరుస్తుండంతో వరుణ్ తేజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. స్క్రిప్ట్ మీదు అసలు శ్రద్ధ వహించడం లేదని విమర్శలు చేస్తున్నారు. మంచి హైట్, ఫిజిక్ ఉన్న నేపథ్యంలో విలన్‌గా ట్రై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాను వరుణ్ తేజ్ ఫాలో అయితే కెరీర్ బెటర్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
‘మట్కా’ ఓటీటీ రిలీజ్ లాక్
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన 'మట్కా' (Matka OTT Release) చిత్రం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘మట్కా’ (Matka)ను వీక్షించవచ్చని తెలిపింది. కాగా ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది.
‘మట్కా’ స్టోరీ ఇదే
మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. పాకిస్తాన్ నుంచి ముంబయికి వచ్చిన రతన్ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నవంబర్ 30 , 2024

HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా?
హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్.
భాగల్‌పూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
బాలీవుడ్ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'తో ఐషా హిందీలో అడుగుపెట్టింది.
భాగల్‌పుర్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది.
నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.
నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.
డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.
సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్, సల్సా, మరెంగ్యూ, జివ్, జాజ్ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.
లండన్‌లోని ప్రముఖ 'పైనాపిల్ డ్యాన్స్ స్టూడియోస్' (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.
నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్ చెబుతారు.
నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట.
హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్ కాగా, మరొకరు మధుబాల.
నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్.
నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్.
నాని నటించిన రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్ కాలేదు.
హిందీలో త్రిప్తి దిమ్రి - విక్కీ కౌషల్ జంటగా నటించిన 'బ్యాడ్ న్యూస్' మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్ అనే పాత్రలో కనువిందు చేసింది.
రీసెంట్‌గా '36 డేస్' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. హిందీలో 'దే దే ప్యార్ దే 2' చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది.
నవంబర్ 21 , 2024

Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ షూటింగ్ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది.
కారణం ఏంటంటే?
శివకార్తికేయన్ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్ షూట్ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’
రాత్రి ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) షూటింగ్ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.
దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్స్ చేశాడు. వాసు, శ్యామ్ సింగరాయ్ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 12 , 2024

Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
40 ఏళ్ల తర్వాత..
కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు.
కమల్ లుక్ కష్టాలు..
‘కల్కి 2898 ఏడీ’ కమల్ హాసన్ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్ ఫైనల్ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్ అశ్విన్ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే మేకప్ నిపుణులను కల్కి టీమ్ సంప్రదించట. అలా కమల్ హాసన్ ప్రస్తుత లుక్ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి.
మేకప్‌కు కోసం 5 గంటలు
కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్ మేకప్ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
బుజ్జి కోసం రూ.4 కోట్లు
‘కల్కి’లో ప్రభాస్ రైడ్ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
700VFX షాట్స్
కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్ అనే మూడు ఫ్యూచరిక్ ప్రపంచాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉపయోగించినట్లు సమాచారం.
హాలీవుడ్ యంత్రాంగం
‘కల్కి 2898 ఏడీ’ విజువల్ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్ వస్తోంది. హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్, ఇంటర్‌స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్ ‘కల్కి’ కోసం పనిచేసింది.
రికార్డు స్థాయి బడ్జెట్
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట.
https://telugu.yousay.tv/kalki-2898-ad-review-kalki-which-raised-the-level-of-indian-cinema-immensely-how-is-the-movie.html#google_vignette
జూన్ 27 , 2024

Vishnupriya Bold Pics: ఇన్నర్ జాకెట్‌లో బయటపడ్డ విష్ణుప్రియ అందాలు!
బుల్లితెరపై ఎంతో పాపులారిటి సంపాదించిన విష్ణుప్రియ (Vishnupriya).. తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తన ఘాటు హోయలతో స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇచ్చిన హాట్ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
లేటెస్ట్‌గా గ్లామర్ ఫొటో షూట్ నిర్వహించిన విష్ణుప్రియ.. షర్ట్ బటన్స్ విప్పేసి బ్లాక్ కలర్ జాకెట్‌లో రెచ్చిపోయింది.
ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ.. అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
విష్ణుప్రియ.. బుల్లితెర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ‘పోవే పోరా’ షో చేసి యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత పలు షోలలో గెస్ట్‌గా, హోస్ట్‌గా కనిపించి తన అల్లరితో అందరి దృష్టిని ఆకర్షించింది. పలుమార్లు బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లోనూ నిలిచింది.
బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి విష్ణుప్రియ ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. ‘జారుతున్నవ్రో.. చేజారుతున్నావ్రో..’ అంటూ మానస్‌తో కలిసి ఆడిపాడింది.
ఈ పాటకు విశేష ఆదరణ లభించడంతో విష్ణుప్రియ పేరు మారుమోగింది. యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది.
జేడీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని.. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి కూడా సిద్ధమేనని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే విష్ణుప్రియ ప్రపోజల్‌ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్‌గా మారిపోయింది.
గత కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.
స్టార్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని అందంతో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటో షూట్‌లను నిర్వహిస్తోంది.
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది విష్ణుప్రియ.
జూన్ 22 , 2024

Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
యంగ్ బ్యూటీ ‘అతిరా రాజ్’ పేరు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.
‘కృష్ణమ్మ’ సినిమాలో ఈ అమ్మడి నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్ దొరికేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శుక్రవారం రిలీజైన (మే 11) ‘కృష్ణమ్మ’ సినిమాతో అతిరా రాజ్.. తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది.
ఇందులో సత్య దేవ్‌కు జోడీగా మీనా పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంటుంది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందంటూ అథిరాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అథిరా రాజ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఈ అమ్మడు 20 ఆగస్టు, 2001న కేరళలోని కన్నూర్‌లో జన్మించింది.
2021లో సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ అతిరా.. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఎంటర్‌టైన్ చేసింది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
2023లో వచ్చిన తమిళ చిత్రం ‘వీరన్’లో లీడ్ రోల్‌లో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మూవీలో సెల్వీ పాత్రలో కనిపించిన అతిరా.. తన నటనతో తమిళ ఆడియన్స్‌ను ముగ్దుల్ని చేసింది.
కాగా రీసెంట్‌గా తమిళంలో వచ్చిన ‘అమిగో గ్యారేజ్’ చిత్రంలోనూ అతిరా హీరోయిన్‌గా చేసింది.
చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో పలు సినిమాల్లో నటించి మాస్టర్ మహేంద్రన్‌కు జోడీగా నటించింది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అతిరా ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది.
ఎప్పటికప్పుడు ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ నెట్టింట తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 103K మంది ఫాలో అవుతున్నారు.
మే 11 , 2024