• TFIDB EN
  • గ్యాంగ్ లీడర్ (1991)
    ATelugu

    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvApp
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinema
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవిరాజారామ్‌
    విజయశాంతికన్యాకుమారి
    ఆనందరాజ్కనకాంబరం
    నిర్మలమ్మశబరి (రాజారాం అమ్మమ్మ)
    సుధలక్ష్మి (రఘుపతి భార్య)
    సుమలతలత (రాఘవ భార్య)
    నూతన్ ప్రసాద్హోంమంత్రి
    నూతలపాటి సుబ్బరోఇంటి యజమాని
    జయలలితచుక్క
    సిబ్బంది
    మాగంటి రవీంద్రనాథ్ చౌదరినిర్మాత
    బప్పి లాహిరిసంగీతకారుడు
    లోక్ సింగ్సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
    Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్‌ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. 1. సంఘర్షణ మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది. 2. స్వయం కృషి చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 3. దేవాంతకుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్‌ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు. 4. మహానగరంలో మాయగాడు చిరంజీవి- విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు. 5. ఛాలెంజ్ చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది. 6. చిరంజీవి చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని  సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది. 7. కొండవీటి రాజా చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది.  'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.  8. ధైర్యవంతుడు చిరు, విజయశాంతి(Chiranjeevi and Vijayashanthi) కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు. 9. చాణక్య శపథం కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది. 10. పసివాడి ప్రాణం చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 11. మంచి దొంగ రాఘవేంద్ర రావు డైరెక్షన్‌ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది. 12. యముడికి మొగుడు చిరంజీవి, విజయశాంతి (Chiranjeevi and Vijayashanthi) జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.  13. యుద్ధ భూమి  మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు. 14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 15. కొండవీటి దొంగ చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. 16. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది. 17. గ్యాంగ్ లీడర్ చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి((Chiranjeevi and Vijayashanthi) హీరోయిన్‌గా నటించింది. 18.  మెకానిక్ అల్లుడు చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు. 19. రుద్ర నేత్ర కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా విజయశాాంతి, రాధ నటించారు. 
    నవంబర్ 07 , 2023
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.  సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    <strong>ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    ఆది సాయి కుమార్ (Aadi Saikumar) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ప్రేమ కావాలి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన  ఆది సాయి కుమార్.. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. లవ్లీ, బ్లాక్, పులిమేక వంటి హిట్ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. ఆది సాయికుమార్ ముద్దు పేరు? ఆది ఆది సాయికుమార్ ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు ఆది సాయి కుమార్ తొలి సినిమా? ప్రేమకావాలి ఆది సాయికుమార్ ఎక్కడ పుట్టాడు? ఆముదాలవలస, ఏపీ ఆది సాయికుమార్ పుట్టిన తేదీ ఎప్పుడు? డిసెంబర్ 29, 1989 ఆది సాయికుమార్ బార్య పేరు? అరుణ ఆది సాయికుమార్ పెళ్లి ఎప్పుడు జరిగింది? 2014 ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరోయిన్? కాజల్ అగర్వాల్ ఆది సాయికుమార్ ఫెవరెట్ హీరో? సాయికుమార్, మెగాస్టార్ చిరంజీవి ఆది సాయికుమార్ తొలి హిట్ సినిమా? ప్రేమ కావాలి తొలి హిట్ అందించింది. ఆ తర్వాత లవ్లీ, బ్లాక్, పులి మేక వంటి చిత్రాలు హిట్లుగా నిలిచాయి. ఆది సాయికుమార్ ఇష్టమైన కలర్? వైట్ కలర్ ఆది సాయికుమార్ ఇష్టమైన సినిమా? పోలీస్ స్టోరీ, గ్యాంగ్ లీడర్ ఆది సాయికుమార్ తల్లి పేరు? సురేఖ ఆది సాయి కుమార్ ఏం చదివాడు? BSC &nbsp;ఆది సాయికుమార్ అభిరుచులు? ఆది సాయికుమార్‌కు క్రికెట్ అంటే ఇష్టం. సినిమాల్లోకి రాకముందు అండర్19 రంజీ ట్రోఫికి సెలెక్ట్ అయ్యాడు.&nbsp; ఆది సాయికుమార్‌కు నచ్చిన ప్రదేశం? అమెరికా ఆది సాయికుమార్ ఎన్ని సినిమాల్లో&nbsp; నటించాడు? &nbsp;2024 వరకు 20 సినిమాల్లో హీరోగా నటించాడు.&nbsp; ఆది సాయికుమార్‌కు ఇష్టమైన ఆహారం? మంసాహారం ఏదైనా ఆది సాయికుమార్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు? &nbsp;దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఆది సాయికుమార్‌కు ఎంత మంది పిల్లలు? ఒక పాప, పేరు అయానా(Ayaana) https://www.youtube.com/watch?v=ex3TOcgOmqI
    మార్చి 21 , 2024
    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్‌ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ పరుశురామ్‌ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఓ సాంగ్‌ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ కూడా అవుతోంది.&nbsp; ఈ సాంగ్‌ నా ఫేవరేట్‌: విజయ్‌ 'ఫ్యామిలీస్టార్‌'కి సంబంధించి మొదటి సాంగ్‌ ప్రోమోను సోమవారం రాత్రి చిత్రబృందం రిలీజ్‌&nbsp; చేసింది. 'నంద నందన' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్‌ BGM అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. పూర్తి పాటని రేపు (బుధవారం) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ ‘నంద నందన’ పాటను అనంత్‌ శ్రీరామ్‌ స్వరపరచగా సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) పాడారు. దీంతో పాటపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్‌ చేసిన విజయ్‌.. 'మొదటిపాట.. నా ఫెవరేట్‌.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది' అని పోస్ట్‌ చేశాడు. కాగా, ఈ చిత్రానికి గోపి సుందరం సంగీతం ‌అందిస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) ఫిదా చేస్తున్న మృణాల్‌..! ఈ సాంగ్‌ ప్రోమోలో హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తళతళ మెరిసిపోయింది. మృణాల్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 'సీతారామం' తర్వాత తిరిగి ఆ స్థాయిలో ట్రెడిషనల్‌ లుక్‌లో మృణాల్‌ కనిపించింది. నుదిటిన బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిగా కనువిందు చేసింది. 28 సెకన్లు ఉన్న ఈ చిన్న ప్రోమోలోనే మృణాల్‌ ఈ స్థాయి ఇంపాక్ట్‌ చూపిస్తే ఇక సినిమాలో ఆమె ఎంతగా మెస్మరైజ్‌ చేస్తుందోనని ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మృణాల్‌ను ఎలా చూడాలని తెలుగు ఆడియన్స్‌ కోరుకుంటున్నారో ఈ చిత్రంలో ఆమె రోల్‌ అలాగే ఉంటుందన్న అంచనాలు కూడా ఈ ప్రోమోతో మెుదలయ్యాయి. ‘దేవర’ స్థానంలో..! 'ఫ్యామిలీ స్టార్‌'&nbsp; రిలీజ్‌పై కూడా చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయం విజయ్‌ దేవరకొండ &nbsp;(Vijay Devarakonda) కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆ రోజునే ఎన్టీఆర్‌ (Jr NTR) 'దేవర' (Devara) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ‘దేవర’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో 'ఫ్యామిలీ స్టార్‌'ను రిలీజ్‌ చేసేందుకు ఆ డేట్‌నే మేకర్స్ ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు. 'ఖుషీతో మంచి హిట్‌ అందుకున్న విజయ్‌.. ఇక ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! గతంలో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' గ్లింప్స్‌.. ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి?' అని విజయ్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాకు బోలెడంత బజ్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ముఖ్యంగా పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ డైలాగ్‌పై రీల్స్‌ చేస్తూ సినిమాను నెటిజన్లకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కథ ఏంటి? ఇందులో విజయ్‌ ఫెమినిస్ట్‌ (Feminist) పాత్రలో కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగి పోయింది.&nbsp; సినిమా కథపై క్రేజీ అప్‌డేట్‌! ఇక ఫ్యామిలీ స్టార్‌ సినిమా కథకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. సినిమా కథ అదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader Movie)కి దగ్గరగా ఉంటుందట. విజయ్‌ మూవీ కూడా ‘గ్యాంగ్‌ లీడర్‌’లాగే ముగ్గురు అన్నదమ్ముల కథ అట. అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో అద్దెకి వచ్చినట్టు, ఇందులో మృణాల్ ఠాకూర్ .. విజయ్ ఇంట్లో రెంట్‌కి దిగుతుందట. కాకపోతే ఇది హీరోయిన్‌ రీవెంజ్‌ స్టోరీ అని అంటున్నారు. చివర్లో విజయ్ ఆమెకు అండగా నిలబడతాడని చెబుతున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.
    ఫిబ్రవరి 06 , 2024
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Dasara: రూ.100 కోట్ల క్లబ్‌లో దసరా..! నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్
    Updated On 6-4-2023 రూ.100 కోట్ల క్లబ్‌లో.. నాని కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు బంపర్ హిట్‌ సాధించాయి. కానీ, అధికారిక గణాంకాల ప్రకారం ఏ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేయలేదు. అయితే 'దసరా’తో నాని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడని YouSay ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగానే కేవలం 6 రోజుల్లోనే ‘దసరా’ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. దీంతో నాని రూ. 100 కోట్లు సాధించిన టాలీవుడ్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. https://twitter.com/NameisNani/status/1643656266248777728 ఈ సారి శ్రీరామ నవమికే ‘దసరా’ పండుగ వచ్చేసింది. సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ‘దసరా’ మూవీ థియేటర్లలో జోరు చూపించింది. నాని మార్క్ యాక్టింగ్, మాస్ యాటిట్యూడ్, బలమైన ఎమోషన్స్, టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో మార్చి 30న విడుదలైన ఈ చిత్రం అంతటా హిట్ టాక్‌ని తెచ్చుకోవడం విశేషం. ఈ క్రమంలో ఆడియెన్స్ దృష్టి సినిమా కలెక్షన్లపై పడింది. కచ్చితంగా భారీ వసూళ్లను రాబడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. పండితుల అంచనాలను కూడా అందుకుంటూ దసరా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్‌సీస్‌లో ‘దసరా’ జోరు.. ఓవర్‌సీస్‌లోనూ ‘దసరా’ మూవీ అదరగొడుతోంది. యుఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్‌సీస్‌లో దసరా కలెక్షన్స్‌ రూ.20 కోట్లు దాటినట్లు మేకర్స్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో దసరా కలెక్షన్స్‌ 2.47 లక్షల డాలర్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో ఈ వికెండ్‌ కూడా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంతటా హౌస్ ఫుల్.. నాని కెరీర్‌లోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ తీసుకొచ్చిన సినిమా దసరా. పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు పెరిగిపోవడం, ప్రమోషన్లు కూడా కలిసి రావడంతో ప్రేక్షకుల దృష్టి ‘దసరా’ వైపు మళ్లింది. దీంతో థియేటర్లలో సీట్లను ఆడియన్స్‌ ముందుగానే బుక్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కొచ్చి, బెంగుళూరులలో సినిమా చూడటానికి జనం ఆసక్తి చూపించారు. దసరా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సీటు దొరకని పరిస్థితి ఏర్పడింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాంలలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ హవా చూస్తుంటే వీకెండ్‌లో ‘దసరా’ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. https://telugu.yousay.tv/review-dussehra-movie-review-nani-showed-universal-form-with-ooramas-performance.html ఏప్రిల్ 7 వరకు పోటీలేదు.. హిట్ టాక్ పొందడంతో ‘దసరా’ సినిమా కనీసం రెండు, మూడు వారాల పాటు నాన్‌స్టాప్‌గా ఆడే అవకాశం ఉంది. దీంతో పాటు ‘దసరా’కు దరిదాపులో ఏ పెద్ద సినిమా కూడా విడుదల కావట్లేదు. అయితే ఏప్రిల్ 7న రవితేజ ‘రావణాసుర’ మినహాయిస్తే టాలీవుడ్‌లో బడా సినిమాల రిలీజ్‌లు లేవు. ఈ లెక్కన చూసుకుంటే ‘దసరా’కు తిరుగులేదనే చెప్పాలి. రావణాసుర చిత్రం టాక్‌ దసరా వసూళ్లపై ప్రభావం చూపొచ్చు. రవితేజ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఈ వికెండ్‌ కూడా దసరా వైపే ప్రేక్షకులు మెుగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నాని సినిమా రూ.150 కోట్లు వసూలు చేయడం ఏమంత కష్టం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.&nbsp; దసరా రూ. 100 కోట్లు ఎంసీఏ రూ.70 కోట్లు&nbsp; గ్యాంగ్ లీడర్ రూ.70 కోట్లు శ్యాంసింగరాయ్ రూ.65 కోట్లు నేను లోకల్ రూ.60 కోట్లు మజ్ను రూ.58 కోట్లు నిన్ను కోరి రూ.55 కోట్లు భలే భలే మగాడివోయ్ రూ.51 కోట్లు దేవదాస్ రూ.48 కోట్లు జెర్సీ రూ.45 కోట్లు అంటే సుందరానికి రూ.40 కోట్లు జెంటిల్‌మెన్ రూ.32 కోట్లు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, నాని ఇందులో పూర్తిస్థాయి హీరోగా నటించలేదు. Please Note... దసరా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని తొలిసారిగా అంచనా వేసిన వెబ్‌సైట్ ‘YouSay’నే..!
    ఏప్రిల్ 06 , 2023
    <strong>Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!</strong>
    Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
    సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్‌ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ&nbsp; పవర్‌ఫుల్‌ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; బాహుబలి (Baahubali) బాహుబలిలో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్‌ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్‌ చాలా అద్భుతంగా చేశాడు.&nbsp; https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN శివ (Siva) హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్‌ చైన్‌ తెంపే సీన్‌ ఇప్పటికీ చాలా ఫేమస్‌.&nbsp; https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g ఆర్ఆర్‌ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్‌ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్‌ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&amp;v=Y8rREdo1LqU&amp;feature=youtu.be సలార్‌ (Salaar) ఇందులో హీరో ప్రభాస్‌ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్‌ ఫైట్‌, కాటేరమ్మ ఫైట్‌, క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ దుమ్మురేపాడు.&nbsp; https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID యానిమల్‌ (Animal) అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్‌ రీవెంజ్‌ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit సింహాద్రి (Simhadri) ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్‌ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్‌ సీన్‌ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్‌ విజిల్స్ వేయిస్తాయి.&nbsp; https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS విక్రమార్కుడు (Vikramarkudu) స్టార్‌ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్‌ రాథోడ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ మాత్రం నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY కర్తవ్యం (Karthavyam) టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti)&nbsp; చేసిన రోల్‌ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.&nbsp; https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg అంకుశం (Ankusam) హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.&nbsp; https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_ గ్యాంగ్ లీడర్ (Gang Leader) మెగాస్టార్‌ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్‌ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్‌ అయ్యింది.  https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C అర్జున్ రెడ్డి (Arjun Reddy) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది.&nbsp; https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) టాలీవుడ్‌లోని క్లాసిక్‌ హీరోగా ‘రామ్‌ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్‌ తొలిసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడం విశేషం.&nbsp; https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a పోకిరి (Pokiri) ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్‌ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.&nbsp; https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
    మార్చి 28 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.&nbsp; ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు&nbsp; సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.&nbsp; ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    మార్చి 31 , 2023
    Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
    Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
    ఏ సినిమాకైనా సరైన ముగింపు అవసరం. మూవీలో పాత్రల తీరుతెన్నులు, కథాబలం, హాస్యం, భావోద్వేగాలు ఎంత చక్కగా కుదిరినప్పటికీ క్లైమాక్స్‌ సరిగ్గా లేకుంటే ఆశించిన ఫలితం లభించలేదు. అందుకే డైరెక్టర్లు సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు అని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా సినిమా ముగింపును డిజైన్‌ చేసుకొని హిట్స్‌ కొడుతుంటారు. తెలుగులో ఇప్పటివరకూ వందలాది చిత్రాలు విడుదలైన కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అటువంటి బెస్ట్‌ క్లైమాక్స్‌ సీన్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దసరా (Dasara) నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్‌ 'దసరా'. నూతన డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అప్పటివరకూ మోస్తరుగా సాగుతున్న కథకు క్లైమాక్స్‌తో గట్టి బూస్టప్‌ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా నాని ఆ సీన్‌లో విశ్వరూపం చూపిస్తాడు. శత్రువులను ఊచకోత కోస్తాడు. 15నిమిషాల పాటు సాగే క్రైమాక్స్ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/IUCbmWfVd8g?si=CPovFG1Ig_7cdS9b ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) రామ్‌చరణ్‌, తారక్‌ కథానాయకులుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ప్రతీ సీన్ ఓ దృశ్యకావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తరుముకొస్తున్న బ్రిటిష్‌ సేనలను ఎదిరించే ధీరులుగా క్లైమాక్స్‌లో తారక్‌, చరణ్‌లను చూపించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను శ్రీరాముడిగా చూపే సీన్‌ను ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. అటు తారక్‌ సైతం ఎంతో సాహసోపేతంగా బ్రిటిష్‌ సైన్యాన్ని ఏరిపారేస్తాడు. https://youtu.be/8HTrv_MAuSE?si=CMqWkW8LRa3GqLA9 బాహుబలి 2 ‘బాహుబలి 2’ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ద్వారాలు మూసి ఉన్న మాహిష్మతి కోటలోకి అమరేంద్ర బాహుబలి తాడి చెట్లను ఉపయోగించి వెళ్లే సీన్‌ ఆకట్టుకుంటుంది. భల్లాలదేవ సైన్యంతో ప్రభాస్‌ సానుభూతి పరులు చేసే యుద్దం గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. చివర్లో రాణాను చంపి ప్రభాస్‌ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో సినిమా ముగుస్తుంది.&nbsp; https://youtu.be/4s6k7UpFnKc?si=7G-OJDfUuey9hKVV గ్యాంగ్‌ లీడర్‌ (Gang Leader) మాస్‌ ఆడియన్స్‌కు ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో అదరగొట్టాడు. అటు చిరు సినిమాల్లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్‌ అనగానే ముందుగా ఈ సినిమానే అందరికీ గుర్తుకు వస్తుంది. తన అన్నను చంపిన విలన్లపై క్లైమాక్స్‌లో చిరు రివేంజ్ తీర్చుకోవడం హైలెట్‌గా నిలుస్తుంది. సోదరుడ్ని ఎలా చంపారో ‌అచ్చం అదే విధంగా బండరాయి కట్టిన భారీ ప్రొక్లెయిన్‌ను విలన్‌ మీద వేసి చిరు హతమారుస్తాడు.&nbsp; https://youtu.be/v0_E2uqVeaM?si=8z1LFqnzEJ3Wzy4x ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టిగా ‘ఈగ’ సినిమా తెరకెక్కింది. పవర్‌ఫుల్‌ విలన్‌ సుదీప్‌ను ఒక సాధారణ ఈగ ఎలా చంపుతుంతో క్లైమాక్స్‌లో రాజమౌళి చూపించాడు. తాను చనిపోతానని తెలిసి కూడా ఈగ మంటల గుండా మందుగుండు ఉన్న తుపాకీలోకి దూకుతుంది. దీంతో గన్‌ ఫైర్‌ అయ్యి విలన్‌ చనిపోయే సీన్స్‌ క్లాప్స్ కొట్టిస్తుంది.&nbsp; https://youtu.be/1SCFGWtXtDE?si=r1AnoKHjBFFyrNXu పోకిరి (Pokiri) తెలుగులో అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘పోకిరి’ తరహా క్లైమాక్స్ ఎందులోనూ రాలేదు. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మహేష్‌ బాబు.. పోలీసు అని రౌడీలను ఏరివేసే మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసి సగటు ఆడియన్స్ షాక్‌కు గురవుతారు. తన తండ్రిని చంపిన ప్రకాష్‌ &amp; కోపై క్లైమాక్స్‌లో రివేంజ్‌ తీర్చుకునే సీన్ నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/PvkITH66FEc?si=2CJl4283NO85bYmd తమ్ముడు (Thammudu) స్పోర్ట్స్‌ తరహాలో ఓ క్లైమాక్స్‌ను డిజైన్ చేయవచ్చు అని ‘తమ్ముడు’ సినిమా ద్వారా డైరెక్టర్‌ జగన్నాథ్‌ చూపించారు. తన అన్న కోసం బాక్సింగ్‌ కోర్టులో నిలిచిన పవన్‌ కల్యాణ్‌.. తొలుత విలన్‌ చేతుల్లో తన్నులు తింటాడు. తన తండ్రి, అన్న మాటలతో ప్రేరణ పొంది.. తిరిగి పుంజుకుంటాడు. విలన్‌ను బాక్సింగ్‌ కోర్టులో ఓడించి తన అన్న కలను నెరవేరుస్తాడు. అప్పటివరకూ పనికిరాని వాడంటూ తిట్టిన తండ్రి చేత శభాష్ అనిపించుకుంటాడు.&nbsp; https://youtu.be/CZY-tl5JbSo?si=Ui97I0J_rOAi5s5j ఖుషి (kushi) పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు ఎస్‌.జే. సూర్య రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ను రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్‌ ప్లాన్‌ చేశారు. ఊరికి వెళ్లిపోతున్న హీరోయిన్‌ను పవన్‌ కల్యాణ్ ఏంతో టెన్షన్‌తో వెతుకుతుంటాడు. కట్‌ చేస్తే పెళ్లై వారిద్దరూ అరడజనుకు పైగా పిల్లలతో కనిపించి చివర్లో కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు.&nbsp; https://youtu.be/R9VXMjfP6Kc?si=nt00kn-z4dqexdCZ విరుపాక్ష (Virupaksha) సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా చేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. ఓ హారర్‌ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయినే ప్రధాన విలన్‌ తెలియడంతో ఆడియన్స్‌ షాకవుతారు. ఈ మూవీ ముగింపును చూసి ఆడియన్స్‌ చాలా థ్రిల్‌ ఫీలవుతారు. ఈ విజయంలో క్లైమాక్స్‌ కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి.&nbsp; https://youtu.be/C1vmB8G2oTw?si=hcLk1a9tPl1WC6xQ సై (Sye) నితిన్‌ - జెనిలియా జంటగా నటించిన ఈ సినిమా ఓ కాలేజీ గ్రౌండ్‌ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు కాలేజీ స్టూడెంట్‌ అయిన నితిన్‌ తోటి విద్యార్థులతో కలిసి.. విలన్లతో రగ్బీ ఆడతాడు. మానవ మృగాల్లాంటి విలన్లతో కాలేజీ కుర్రాళ్లు పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.&nbsp; https://youtu.be/oc4J_qQcNkw?si=rSuIQ2jUftA4c4Mx రోబో 2.0 (Robo 2.0) డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్.. విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. ఓ ఫుట్‌బాల్‌&nbsp; స్టేడియంలో విలన్‌ పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)తో రోబో (రజనీకాంత్‌) తలపడతుంది. ఈ తరహా క్లైమాక్స్‌ను హాలీవుడ్‌లో తప్ప భారత సినీ చరిత్రలో చూసి ఉండరు.&nbsp; https://youtu.be/I04BTA2fl-E?si=9hCEwzbPcG-m81VM అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo) అల్లుఅర్జున్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘అలా వైకుంఠపురంలో’ ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఓ పాటతో దర్శకుడు త్రివిక్రమ్‌ ముగించడం విశేషం. క్లైమాక్స్‌లో ‘సిత్తరాల సిరపడు’ పాటతో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పాట పూర్తయ్యే లోగా విలన్‌తో పాటు అతడి అనుచరులకు తనదైన శైలిలో బుద్ది చెబుతాడు.&nbsp; https://youtu.be/ljHApHUTWeo?si=90dOM8aTCAWsSHoU అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్‌ వైవిధ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫైట్స్‌ లేకుండా భావోద్వేగ మాటలతోనే త్రివిక్రమ్‌ ఈ సినిమాను ముగించాడు. తన అత్తను పుట్టింటికి తీసుకెళ్లేందుకు పవన్‌ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెుత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించడం గమనార్హం.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=42tjl5fOTTS4xEz6 సుస్వాగతం (Suswagatham) భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ క్లైమాక్స్‌ వరకు హీరోయిన్‌ను సిన్సియర్‌గా లవ్‌ చేస్తుంటాడు. కానీ ఆమె పవన్‌ ప్రేమను అర్థం చేసుకోదు. క్లైమాక్స్‌లో పవన్‌ ప్రేమను అర్థం చేసుకొని హీరోయిన్‌ అతడి వద్దకు వెళ్తుంది. అప్పుడు పవన్‌ చెప్పే డైలాగ్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె ప్రేమకోసం తాను ఏమేమి కోల్పోయానో చెప్పడంతో పాటు.. ప్రేమ మూలంగా యువత ఎలా పిచ్చోళ్లుగా మారుతున్నారో పవన్‌ పేర్కొంటాడు.&nbsp; https://youtu.be/323OoE0Figo?si=pm-8iXzG8DleERw1
    మార్చి 12 , 2024
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్‌ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్‌ ఆ హీరో పాత్రలను ఓన్‌ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్‌ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ (Aadavari Matalaku Arthale Verule)&nbsp; సినిమాలో హీరో వెంకటేష్‌ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్‌ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్‌ క్లాస్‌ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.&nbsp; రఘువరన్‌ బీటెక్‌ ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్‌ (ధనుష్‌) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.&nbsp; తమ్ముడు ఈ (Thammudu) సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్‌ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్‌ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్‌ కోర్టులో బుద్ది చెప్తాడు.&nbsp; అలా వైకుంఠపురంలో ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్‌ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని&nbsp; భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్‌ క్లాస్‌ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు. గ్యాంగ్‌ లీడర్‌ గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.  అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్‌ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్‌ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.  అ ఆ ఇందులో (A Aa) నితిన్‌ (Nithin) పక్కా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్‌ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.&nbsp; జెర్సీ (Jersey) క్రికెటర్‌ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్‌ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.&nbsp; నేనింతే&nbsp; ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.&nbsp; యోగి ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్‌ క్లాస్‌ యువతకు చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది. 
    మార్చి 01 , 2024
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    విజయశాంతి(19) తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్‌ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్‌గా నిలిచాయి. వాటిపై ఓ లుక్‌ వేద్దాం. గూండా(1984) చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'గూండా'. ఈ చిత్రాన్ని&nbsp; ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాగు(1984) తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెండోసారి చిరంజీవి- రాధ జత కట్టారు. ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్‌లో వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దొంగ(1985) ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేని సమయంలో ఈ చిత్రం విజయం సాధించి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి- రాధ హిట్ పెయిర్‌గా నిలిచారు. పులి(1985) చిరంజీవి- రాధ జంటగా నటింటిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ భరత్ డైరెక్ట్ చేశారు. రక్త సింధూరం(1985) ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ జంటగా మెప్పించిన మరో చిత్రం పులి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ఆడలేదు. అడవి దొంగ(1986) చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List)&nbsp; జంటగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.&nbsp; కొండవీటి రాజా(1986) కే. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ కాంబోలో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కొండవీటి రాజా'. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. &nbsp;రుద్ర నేత్ర(1989) కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా రాధ, విజయశాంతి నటించారు.&nbsp; రాక్షసుడు(1986) చిరంజీవి- రాధ కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. రాక్షసుడు చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. జేబు దొంగ(1987) కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి- రాధ మరోసారి తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఈ చిత్రం హిందీలో ఆజ్‌కా గ్యాంగ్‌ లీడర్ పేరుతో డబ్‌ చేశారు. యముడికి మొగుడు(1988) చిరంజీవి, రాధ, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.&nbsp; మరణ మృదంగం(1988) ఏ కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ మరోసారి నటించింది. స్టేట్ రౌడీ(1989) బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, రాధ(Chiranjeevi and Radha Movies List)&nbsp; పోటీపడిమరి నటించారు. లంకేశ్వరుడు(1989) చిరంజీవి, రాధ, రేవతి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఇది ఆయనకు 100వ సినిమా. కొండవీటి దొంగ(1990) చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌లలో కొండవీటి దొంగ ఒకటి. ఈ చిత్రాన్ని కొదండ రామిరెడ్డి డైరెక్ట్ చేశారు. చిరంజీవి సరసన రాధ, విజయశాంతి జంటగా నటించారు. కొదమ సింహం(1990) చిరంజీవి- రాధ కలిసి నటించిన చివరి సినిమా ఇది. ఈ సినిమాను కే మురళిమోహన్‌రావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్‌తో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
    నవంబర్ 08 , 2023
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు&nbsp; రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..&nbsp; టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
    అక్టోబర్ 06 , 2023
    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
    ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు రంగబలి(Rangabali) నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, తదితరులు నటించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. జులై 7న సినిమా విడుదల కానుంది.&nbsp; రుద్రంగి(Rudrangi) బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం ‘రుద్రంగి’. జగపతి బాబు, మమత మోహన్‌దాస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అజయ్ సామ్రాట్ డైరెక్షన్ చేయగా నోఫెల్ రాజా మ్యూజిక్ అందించాడు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.&nbsp; భాగ్ సాలే(Bhaag Saale) శ్రీసింహ కోడూరి హీరోగా వస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకి శ్రీసింహ సరసన నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ మూవీని క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. జులై 7న రిలీజ్ అవుతోంది. ఇద్దరు(Iddaru)&nbsp; యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మాణంలో వస్తోందీ సినిమా. జులై 7న రిలీజ్ కానుంది.&nbsp; సర్కిల్(Circle) ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం ‘సర్కిల్’.&nbsp; నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు ఇందులో నటించారు. జులై 7న మూవీ రిలీజ్.&nbsp; ఓ సాథియా (Oo Sathiya) దివ్య భావన దర్శకత్వంలో ‘ఓ సాథియా’ తెరకెక్కింది. ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటించారు. చందన కట్టా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సైతం జులై 7న విడుదల కానుంది. 7.11 PM ఆసక్తికరమైన కథాంశంతో 7.11 PM మూవీ థియేటర్లలోకి వస్తోంది. చైతు మాదాల ఈ మూవీని తెరకెక్కించాడు. సాహస్, దీపిక ప్రధాన పాత్రల్లో నటించారు. నరేశ్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సినిమాను నిర్మించారు. జులై 7న విడుదల కాబోతోంది. మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్ (Mohanakrishna’s Gang Leader) మోహనకృష్ణ, సౌజన్య, హరిణి, సుమన్, తదితరులు నటించిన చిత్రమే ఇది. మోహనరావు డైరెక్షన్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.&nbsp; నాతో నేను(Natho Nenu) సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు నటించిన చిత్రం ‘నాతో నేను’. జులై 7న విడుదల కానుంది. తుర్లపాటి శాంతికుమార్ దర్శకత్వం వహించగా ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateIshq Next DoorMovieHindiJio CinemaJuly 3GoodNightMovieTamilDisney + HotstarJuly 3BabylonMovieEnglishAmazon PrimeJuly 5Sweet Kaaram CoffeeWeb SeriesTeluguAmazon PrimeJuly 6The Pope's ExorcistMovieEnglishNetflixJuly 7DeepFakeLoveWeb SeriesEnglishNetflixJuly 7AdhuraWeb SeriesHindiAmazon PrimeJuly 7TarlaMovieHindiZee5July 7IB 71MovieHindiDisney + HotstarJuly 7FarhanaMovieTamil/TeluguSony LivJuly 7BlindMovieHindiJio CinemaJuly 7 APP ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్ల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ‘YouSay Web’బటన్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.&nbsp;&nbsp;&nbsp;
    జూలై 03 , 2023
    <strong>Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా</strong>
    Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా
    బాలీవుడ్‌ బ్యూటీ నికితా దత్తా.. తన అంద చందాలతో మతి పోగొడుతోంది.&nbsp; ఆరెంజ్‌ కలర్‌ బికినీలో తన ఒంపు సొంపులను ప్రదర్శించి కుర్రకారును ఫిదా చేసింది. ముఖ్యంగా బీచ్‌లో ఈ అమ్మడి సొగసులను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు.&nbsp; మరో పోస్టులో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. రెడ్‌ కలర్‌ బ్రాలో ఎద అందాలు ఆరబోసింది. నికితా దత్తా వ్యక్తిగత విషయాలకు వస్తే.. కెరీర్‌ ప్రారంభంలో ఆమె మోడల్‌గా పని చేసింది.&nbsp; ‘ఫెమినా మిస్‌ ఇండియా-2012’ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌ చిత్రం 'లేఖర్‌ హమ్‌ దివానా' (2014) సినిమాతో నికితా తెరంగేట్రం చేసింది.&nbsp; 2015లో డ్రీమ్ గార్ల్‌ అనే సిరీయల్‌ ద్వారా బుల్లితెరలోనూ ఈ అమ్మడు అడుగుపెట్టింది.&nbsp; 2018లో వచ్చిన 'లస్ట్‌ స్టోరీస్‌'తో నికితా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.&nbsp; ఆ తర్వాత కబీర్‌ సింగ్‌ (2019)లో జియా పాత్రలో అందంగా కనిపించి మెప్పించింది. మస్కా, ది బిగ్‌ బుల్‌, డైబ్బుక్‌, రాకెట్‌ గ్యాంగ్‌, దంగే చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయింది.&nbsp; ‘ఆఫత్‌’, ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ సిరీస్‌లలో నికితా దత్తా కీలక పాత్ర పోషించింది.&nbsp; నికితా ప్రస్తుతం ‘జ్యూయల్‌ తీఫ్‌’, ‘ఘరాట్‌ గణపతి’, ‘గుల్‌ గుల్‌ బకావాలి’ చిత్రాల్లో నటిస్తోంది.&nbsp; ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp;
    ఏప్రిల్ 26 , 2024
    Heroines Remuneration: రెమ్యూనరేషన్‌లో హీరోలతో పోటీ పడుతున్న కథానాయికలు.. టాప్ ఎవరంటే?
    Heroines Remuneration: రెమ్యూనరేషన్‌లో హీరోలతో పోటీ పడుతున్న కథానాయికలు.. టాప్ ఎవరంటే?
    సినిమా విజయాల్లో హీరోలతో పాటు హీరోయిన్స్‌ కీలక పాత్ర పోషిస్తారు. చివరి వరకూ ఉంటూ తమ నటనతో ఆకట్టుకుంటారు. అంతేగాక పాటల్లో గ్రామర్‌ షో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. హీరోయిన్ల కోసమే సినిమా చూసే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారంటే ఎలాంటి అతియోక్తి లేదు. మరి సినిమా కోసం ఎంతగానో కష్టపడే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది?. సౌత్‌ ఇండియా కథానాయికల్లో పారితోషికంలో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం. ఐశ్వర్య రాయ్‌ ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న సౌత్‌ ఇండియన్‌ కథానాయికగా ఐశ్వర్యరాయ్‌ నిలిచింది. పొన్నియన్‌ సెల్వన్‌-2 సినిమా కోసం ఆమె రూ.10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు&nbsp; తెలిసింది. దక్షిణాది సినీరంగంలో ఇంత పెద్ద మెుత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకున్న ఏకైక నటి ఐశ్వర్యనే. నయనతార&nbsp; ప్రముఖ హీరోయిన్‌ నయనతార లీడ్ రోల్‌ ఉన్న సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ. 5 - 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో తన ప్రాధాన్యత బట్టి గరిష్టంగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. సమంత టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోందట. ఒక్కో సినిమాకు రూ. 3 - 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.&nbsp; శృతి హాసన్‌ ప్రముఖ నటి శృతి హాసన్ ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా మంచి హిట్ ‌అందుకుంది. శృతి ఒక సినిమాకు&nbsp; రూ. 6-8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.&nbsp; పూజా హెగ్డే టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తెలుగుతో పాటు, బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ భామ ఒక్కో సినిమాకు రూ. 3.5 - 5 కోట్లు తీసుకుంటోంది. పూజా ప్రస్తుతం SSMB 28 సినిమాలో నటిస్తోంది.&nbsp; అనుష్క శెట్టి తెలుగులోని టాప్‌ హీరోయిన్స్‌ జాబితాలో అనుష్క శెట్టి కచ్చితంగా ఉంటుంది. అరుంధతి, రుద్రమ దేవి, బాహుబలి 1, 2 సినిమాల ద్వారా ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. అనుష్క కూడా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తుందట. అనుష్క రీసెంట్‌ మూవీ ‘Ms.శెట్టి Mr. పొలిశెట్టి’ విడుదలకు సిద్ధంగా ఉంది.&nbsp; రకూల్ ప్రీత్‌ సింగ్ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఒక్కో సినిమాకు రూ. 3-5 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌పై తన ఫోకస్‌ పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రకూల్‌ తన హాట్‌ ఫొటోలను షేర్ చేస్తూ&nbsp; సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది.&nbsp; తమన్నా భాటియా మిల్కీ బ్యూటి తమన్న రీసెంట్‌గా F2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ భామ సైతం సినిమాకు రూ. 4 - 5 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌.&nbsp; రష్మిక మందన్న ప్రస్తుతం సినిమాల పరంగా రష్మిక ఎంతో దూకుడుగా ఉంది. చకా చకా సినిమాలు చేసేస్తూ కథానాయికలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ భామ కూడా ఒక్కో సినిమాకు రూ. 4 - 5&nbsp; కోట్లు డిమాండ్ చేస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్‌ కొంత కాలం సినిమాకు గ్యాప్ ఇచ్చింది. ఒక బిడ్డకు జన్మించిన కాజల్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ రూ. 2 - 4 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.
    మే 15 , 2023
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్‌.. ఓ లుక్కేయండి!
    కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్‌’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్‌’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఈగల్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘ఈగల్‌ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్‌ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు. రాజా సాబ్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‌’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుంగీతో కనిపించడం విశేషం.&nbsp; ఆపరేషన్‌ వాలెంటైన్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్‌ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.&nbsp; భీమా ప్రముఖ హీరో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సైతం హల్‌చల్‌ చేసింది. ఇందులో గోపిచంద్‌ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.&nbsp; గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విశ్వక్‌ సేన్‌ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.&nbsp; వెట్టైయాన్‌ జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్‌'. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ సంక్రాంతి రోజున విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ పోస్టర్‌ వింటేజ్‌ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది. ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్ ది ఆల్‌టైమ్‌ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్‌ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్‌ తమిళ హీరో ధనుష్‌ నటించిన లెటేస్ట్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్‌ మతేశ్వరణ్‌ డైరెక్ట్ చేశారు.&nbsp; అంబాజీపేట మ్యారేజీ బ్యాండు యంగ్‌ హీరో సుహాస్‌, డైరెక్టర్‌ దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.&nbsp;
    జనవరి 17 , 2024
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
    కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; బట్టల సత్తి (Battala Satti) టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్‌ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా చేసిన 'లేడీస్‌ ట్రైలర్‌' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.&nbsp; శుభలేఖ సుధాకర్‌ (Subhalekha Sudhakar) విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్‌ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్‌ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు. రామిరెడ్డి (Spot Nana Rami Reddy) కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్‌ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్‌ హీరోగా చేసిన ‌’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్‌ పెడతా’ అనే డైలాగ్‌ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్‌ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; సుత్తి వీరభద్రరావు&nbsp; (Sutti Veerabhadra Rao) సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్‌ అయ్యింది.&nbsp; https://twitter.com/i/status/1674734022793244672 సుత్తివేలు (Suthivelu) అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.&nbsp; షావుకారు జానకి (Shavukaru janaki) షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.&nbsp; సాక్షి రంగారావు (Sakshi Ranga rao) ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన&nbsp; 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు&nbsp; 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.&nbsp; అల్లరి నరేష్‌ (Allari Naresh) ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్‌.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్‌ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్‌’గా నరేష్‌ గుర్తింపు పొందాడు.&nbsp; వందేమాతరం శ్రీనివాస్‌ (Vandemataram Srinivas) టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్‌’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.&nbsp; సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri) టాలీవుడ్‌ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు. మహర్షి రాఘవ (Maharshi Raghava) వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.&nbsp; దిల్‌ రాజు (Dil Raju) ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్‌ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్‌' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్‌ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.&nbsp; వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) నటుడు వెన్నెల కిషోర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్‌.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.&nbsp; సత్యం రాజేష్‌ (Satyam Rajesh) నటుడు సత్యం రాజేష్‌ అసలు పేరు.. రాజేష్‌ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్‌.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్‌ పాత్రల్లో కనిపించి సాలిడ్‌ విజయాలను అందుకున్నాడు. చిత్రం శ్రీను (Chithram Srinu) చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu bhaskar) డైరెక్టర్ భాస్కర్‌.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్‌’తో హ్యాట్రిక్‌ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్‌’ చిత్రానికి హారిస్‌ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆహుతి ప్రసాద్‌ (Ahuti Prasad) నటుడు ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం&nbsp; ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్‌ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్‌ బారిన పడి&nbsp; జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.&nbsp;&nbsp; జేడీ చక్రవర్తి (JD Chakravarthy) హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు&nbsp; నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.&nbsp; బొమ్మాళి రవి శంకర్‌ (Bommali Ravi Shankar) తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్‌ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్‌ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి'&nbsp; చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన రవిశంకర్‌.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్‌ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్‌ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.&nbsp; https://twitter.com/ramanuja2797/status/1393914318530351116 దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్‌ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్‌ తన పేరులో కలుపుకున్నాడు. బాహుబలి ప్రభాకర్‌ (Bahubali Prabhakar) ‘రైట్‌ రైట్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్‌.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్‌ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.&nbsp; ప్రభాస్‌ శ్రీను (Prabhas Srinu) పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్‌ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి గాను ప్రభాస్‌ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.&nbsp;
    మార్చి 07 , 2024
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    తారాగణం - అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్&nbsp; డైరెక్టర్ - పీ మహేష్ బాబు నిర్మాత -&nbsp; ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి బ్యానర్ - UV క్రియేషన్స్ సంగీతం - రధన్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే&nbsp; జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం.. కథేంటంటే..? మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్‌ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.&nbsp; హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది.&nbsp; క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్. ఎలా ఉందంటే?&nbsp; రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.&nbsp; ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్‌ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది.&nbsp; ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్‌’గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు. బలాలు నవీన్ పొలిశెట్టి నటనఅనుష్క పర్ఫామెన్స్వన్‌లైన్ కామెడీ పంచ్‌లు బలహీనతలు సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటంసినిమాలోని పాటలు టెక్నికల్ పరంగా.. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్‌ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి. చివరగా.. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 07 , 2023
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    Vishwambhara : 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో చిరంజీవి... సినిమాలో ఇదే కీలకం!
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్‌ పూనకాలతో తాండవం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్‌ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌' (Bhoola Shankar)గా వచ్చిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైనట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు అదేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ అయింది. స్టాలిన్ చిత్రం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ జోడీ ఎలాంటి కెమిస్ట్రీని స్క్రీన్‌పై పండిస్తారని చర్చించుకుంటున్నారు. అయితే విశ్వంభర సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిపోనుందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో చిరంజీవి 75 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో కనిపిస్తాడని తెలిసింది. ఈ గెటప్‌లో చిరంజీ మునుపెన్నడు కనిపించని లుక్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని టాక్. ప్లాష్ బ్యాక్ నేపథ్యంగా వచ్చే సీన్స్ గ్రాఫిక్స్ విజువ్ వండర్స్‌గా ఉంటాయని సమాచారం. మరోవైపు రీసెంట్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్  సైతం చేశాడు. ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే పాత్రను డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్యారెక్టరైజేషన్‌తో పాటుగా ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందని చిన్నపాటి లీక్స్ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని క్రేజీ గెటప్‌లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర చిత్రం కోసం ప్రత్యేకంగా తన బాడీని టోన్ చేస్తున్నారు. యంగ్‌గా కనిపించేందుకు ఎక్కువసేపూ వ్యయామం చేస్తున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం.
    ఫిబ్రవరి 26 , 2024

    @2021 KTree