• TFIDB EN
  • గాడ్ ఫాదర్
    UATelugu2h 37m
    సీఎం పీకేఆర్‌ మృతితో ఆ స్థానాన్ని అల్లుడు జైదేవ్‌ (సత్యదేవ్‌) హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నుతాడు. దానికోసం దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే బ్రహ్మ తేజ (చిరంజీవి) అడ్డుగా నిలబడతాడు. ఇంతకీ బ్రహ్మకు పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? సత్య ప్రియ (నయనతార), మసూద్‌ భాయ్‌ (సల్మాన్‌) ఎవరు? అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    బ్రహ్మ తేజ / అబ్రమ్ ఖురేషి
    సల్మాన్ ఖాన్
    మసూమ్ భాయ్
    నయనతార
    సత్యప్రియ సత్య జైదేవ్ దాస్
    సత్యదేవ్ కంచరణా
    జైదేవ్ దాస్ జై
    పూరి జగన్నాధ్
    గోవర్ధన్
    మురళీ శర్మ
    నారాయణ వర్మ
    తాన్య ఎస్ రవిచంద్రన్
    జాన్వి
    సముద్రకని
    ACP ఇంద్రజీత్ IPS
    సర్వదమన్ డి. బెనర్జీ
    సిఎం పద్మకాంత్ రాందాస్ రెడ్డి పికెఆర్
    సునీల్
    కోటి
    బ్రహ్మాజీ
    నరసింహా రెడ్డి
    దివి వడ్థ్యరేణుక
    షఫీ
    మురుగన్
    సాయాజీ షిండే
    బంగారం నాయుడు
    భరత్ రెడ్డి
    రామ్ ప్రసాద్
    అనసూయ భరద్వాజ్
    రామ్ ప్రసాద్ భార్య
    కస్తూరి శంకర్
    బ్రహ్మ తల్లి
    మురళీ మోహన్
    ఆశ్రమంలో ఒక పెద్ద మనిషి
    ప్రగతి మహావాది
    సౌజన్య
    నవాబ్ షా
    అబ్దుల్
    గంగవ్వ
    కాంతమ్మ
    మాస్టర్ యువన్యువ బ్రహ్మ
    అహనాయువ సత్య
    ప్రభుదేవా
    స్వయంగా
    సిబ్బంది
    మోహన్ రాజాదర్శకుడు
    RB చౌదరి
    నిర్మాత
    N. V. ప్రసాద్నిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    నీరవ్ షా
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?</strong>
    Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. [toc] భోళా శంకర్ ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు. గాడ్ ఫాదర్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది. ఖైదీ నంబర్ 150 చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంజి చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ దాదా M.B.B.S "మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఠాగూర్ తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. మృగరాజు హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. స్నేహం కోసం కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. హిట్లర్ మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది. ముగ్గురు మొనగాళ్లు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. మెకానిక్ అల్లుడు "శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆజ్ కా గూండా రాజ్ "గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఘరానా మొగుడు "అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. పసివాడి ప్రాణం&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.&nbsp; చక్రవర్తి&nbsp; రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆరాధన&nbsp; భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; దొంగ మొగుడు&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; వేట&nbsp; &nbsp;ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్&nbsp; &nbsp;యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; రాజా విక్రమార్క &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ప్రతిబంధ్&nbsp; &nbsp;రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రినేత్రుడు &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; ఖైదీ నంబర్ 786 &nbsp;విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అడవి దొంగ &nbsp;చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; నాగు&nbsp; తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.&nbsp; ఇంటిగుట్టు &nbsp;చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.&nbsp; దేవాంతకుడు దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.&nbsp; హీరో విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్‌ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు. ‘ఖైదీ’ &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష&nbsp; ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; ప్రేమ పిచ్చోళ్లు&nbsp; &nbsp;ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.&nbsp; బంధాలు అనుబంధాలు&nbsp; ‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.&nbsp; మంచు పల్లకీ&nbsp; &nbsp;వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.&nbsp; యమ కింకరుడు&nbsp; యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. చట్టానికి కళ్లులేవు చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 47 రోజులు కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు. మోసగాడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రేమ తరంగాలు 'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్‌. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. పున్నమి నాగు 'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇది కథ కాదు కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. మనవూరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Coolie Movie: </strong><strong>రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!</strong>
    Coolie Movie: రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!
    భారతీయ చిత్ర పరిశ్రమల్లో కాంబినేషన్స్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. ఇద్దరు హీరోల కాంబో సెట్‌ అయ్యిందంటే సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు అంతా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జాతీయ స్థాయి దిగ్గజ నటులు ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ క్రేజీ కాంబో కోలివుడ్‌లో లాక్‌ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ హీరో నటించబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతడు చేయబోయే చిత్రం ఏంటి? ఇప్పుడు చూద్దాం.  క్రేజీ కాంబో లోడింగ్‌..! తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఏపీలోని వైజాగ్‌లో జరుగుతుండటం విశేషం. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ (Aamir Khan) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమీర్‌ ఖాన్‌ కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; 29 ఏళ్ల క్రితమే.. రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 29 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆటంక్‌ హై ఆటంక్‌’ (Aatank Hi Aatank) అనే ఫిల్మ్‌లో వీరిద్దరు తొలిసారి నటించారు. అయితే ఇది ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియక పోవచ్చు. ‘ది గాడ్ ఫాదర్‌’ అనే నవల ఆధారంగా దర్శకుడు దిలీప్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జుహి చావ్లా ఫీమేల్‌ లీడ్‌గా కనిపించింది. అప్పట్లో రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అమీర్‌ ఖాన్‌, రజనీ నటనపై ప్రశంసలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరు మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విలన్‌గా కన్నడ స్టార్‌! రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనివిందు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్‌తో తెర పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో రజనీతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఉపేంద్ర విలన్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 171వ చిత్రంగా కూలీ తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా ‘కూలీ’ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అటు ‘విక్రమ్‌’ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్‌ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. రజనీ వ్యాఖ్యలపై దుమారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై మంత్రి ఎ.వి. వేలు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాజాగా రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరుణా నిధి మరణం తర్వాత పార్టీని ప్రస్తుత సీఎం స్టాలిన్‌ చక్కగా నడిపిస్తున్నారని రజనీ అన్నారు. రాష్ట్ర మంత్రి దురై మురుగన్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయన లాంటి పెద్దలున్న పార్టీని స్టాలిన్‌ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూ సరదాగా సెటైర్లు వేశారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి దురై మురుగన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి దురై మురుగన్‌ ఘాటుగా బదులిచ్చారు. సినిమా రంగంలోని పెద్ద నటులంతా వయసు మీరి, పళ్లు పోయి, గడ్డాలు పెంచుకొని చావబోయే స్థితిలోనూ నటిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి అన్నారు. అలాంటి వారి వల్ల యువకులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. ఈ పరస్పర మాటల దాడి కోలివుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?
    Chiru Remake Movies: రీమేక్ మూవీలతో దూసుకెళ్తున్న చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్‌!. కారణం అదే?
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తెలుగులో నెంబర్‌ వన్‌ హీరోగా సెటిల్‌ అయిన సమయంలో చిరు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు వెళ్లారు. అక్కడ పెద్దగా కలిసిరాకపోవడంతో తిరిగి తనకు ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి తిరిగి వచ్చేశారు. అలాగే సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేశారు. అయితే చిరు మెుదటి ఇన్నింగ్స్‌తో పోలిస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ రీమెక్స్‌ చుట్టూ తిరుగుతోంది. రీఎంట్రీ తర్వాత చిరు తొలి చిత్రం ‘ఖైదీ 150’ నుంచి రీసెంట్‌ భోళాశంకర్‌ వరకూ మెుత్తం 6 సినిమాలు చేయగా అందులో మూడు రీమెక్సే ఉన్నాయి. మెగాస్టార్‌ చిరు వరుసగా రీమెక్ సినిమాలు చేయడం ఫ్యాన్స్‌కు అంతగా రుచించడం లేదు. స్ట్రైయిట్ చిత్రాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. దీనికితోడు చిరు చేస్తున్న చిత్రాలన్నీ తమిళం, మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచినవే. దీంతో ఆ సినిమాలను సబ్‌టైటిల్స్ పెట్టుకొని మరీ మూవీ లవర్స్‌ చూసేస్తున్నారు. ఇది చిరు సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. అందువల్లే చిరు తీసిన రీమెక్‌ సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. చిరు స్థాయి కలెక్షన్స్‌ను రాబట్టలేక చతికిలపడుతున్నాయి. చిరు తన సెకండ్ ఇన్సింగ్స్‌లో చేసిన రీమెక్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళ్‌లో మురుగదాస్ డైరెక్ట్ చేయగా తెలుగులో వీవీ వినాయక్ రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులో మంచి హిట్‌ టాక్ తెచ్చుకుంది. గాడ్‌ ఫాదర్‌ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా చిరు ‘గాడ్ ఫాదర్‌’ సినిమా చేశారు. లూసీఫర్‌లో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రను తెలుగులో చిరు చేశారు. ఈ సినిమా&nbsp; గతేడాది దసరా కానుకగా విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది.&nbsp; భోళా శంకర్&nbsp; చిరు హీరోగా మేహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా తమిళంలో అజిత్‌ హీరోగా చేసిన ‘వేదాలం’ చిత్రానికి రీమేక్‌. భోళాశంకర్‌లో చిరు సరసన తమన్నా నటించగా, చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేసింది. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.&nbsp; బ్రో డాడీ మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బ్రో డాడీ’ సినిమాను కూడా చిరు రీమేక్‌ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్‌ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp;
    జూన్ 02 , 2023
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్‌ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి. [toc] Samantha Ruth Prabhu సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్‌ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి. Samantha bikini images Kajal Aggarwal కాజల్ అగర్వాల్ &nbsp; తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్‌ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.&nbsp; Kajal Agarwal bikini video https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250 Tamannaah Bhatia తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్‌ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. Tamannaah Bhatia Bikini images View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) Anushka Shetty అనుష్క శెట్టి&nbsp; పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు. Anushka shetty Bikini Images Disha Patani దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో&nbsp; హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది. Disha Patani Bikini images Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్‌ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి. Pragya Jaiswal bikini Images ShwetaTiwari శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి. ShwetaTiwari Bikini Images Deepika Padukone దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది. deepika padukone bikini Images Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి. Pooja Hegde Bikini Images Pooja Hegde Hot Videos https://twitter.com/RakeshR86995549/status/978983052364808194 View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) Raashii Khanna రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. Raashii Khanna Bikini images Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్‌ బీట్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్‌ వేయండి https://twitter.com/PicShareLive/status/1525365506471231488 Ketika Sharma Bikini Images కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్‌ వేయండి Ketika Sharma Bikini Images Catherine Tresa కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి. Catherine Tresa Bikini images Mrunal Thakur మృణాల్ ఠాకూర్ లవ్‌ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి. Mrunal Thakur Bikini images Mrunal Thakur hot video https://twitter.com/MassssVishnu/status/1786566946600988750 https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193 https://twitter.com/SastaJasoos/status/1788498532162236427 Anasuya Bharadwaj బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి. Anasuya Bharadwaj Bikini images View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Nidhhi Agerwal నిధి అగర్వాల్&nbsp; ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్‌-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. Nidhhi Agerwal Bikini Images Mehreen Kaur Pirzada మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. Mehreen Kaur Pirzada Bikini Videos View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) Manushi Chillar మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి. Manushi Chillar Bikini Images Manushi Chillar Bikini videos View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182 Sobhita Dhulipala శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి. Sobhita Dhulipala bikini images Hot videos View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) Tripti Dimri తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి. Tripti Dimri Bikini images View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) Shirley Setia షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. Shirley Setia Bikini Images
    మే 11 , 2024
    <strong>Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌!&nbsp;</strong>
    Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌!&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్‌ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్‌. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్‌ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్‌ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్‌ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.&nbsp; చిన్న చిత్రాలపై ప్రశంసలు.. చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.‌ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్‌ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్‌ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి. https://twitter.com/GulteOfficial/status/1856370891417932076 యంగ్‌ హీరోలకు భరోసా తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్‌ హీరోలకు మెగాస్టార్‌ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్‌ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్‌ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్‌ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్‌ ఫొటోలో సుహాస్‌ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్‌ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్‌ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్‌ రోల్‌ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.&nbsp; జపాన్‌ వెళ్లనున్న మెగాస్టార్‌! మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ&nbsp; మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్‌ వెళ్లనున్నారు.&nbsp; అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం చిరు వెనక్కి తగ్గారు.&nbsp; ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్‌ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.&nbsp;
    నవంబర్ 13 , 2024
    <strong>Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!</strong>
    Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!
    అల్లు అర్జున్‌, మెగా (Allu vs Mega) కుటుంబాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరినట్లు గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ (Allu Arjun) లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)ను బాయ్‌కాట్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ నెట్టింట పిలుపు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ - సుకుమార్‌ కాంబోలోని పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజైంది. అయితే ఇందులో బన్నీ చెప్పిన డైలాగ్స్‌ మెగా ఫ్యామిలీ టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్‌ మద్దతు ఇవ్వడం వల్లే ఈ స్థాయి మనస్పర్థలు వచ్చాయని అంతా భావిస్తున్నారు. కానీ, ఆ ఘటన కంటే ముందే మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు చెడిందని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఖైదీ నెంబర్‌ 150 సమయంలో..&nbsp; మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాల్లో పెద్దగా కలిసి రాకపోవడంతో ‘ఖైదీ నెంబర్‌ 150’ (Khaidi No. 150) సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌ తండ్రి, గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) అధినేత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఎంతగానో ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా రామ్‌ చరణ్‌ తెరపైకి వచ్చి తాను నిర్మిస్తానని పట్టుబట్టాడు. ఈ విషయంలో చిరు కూడా కొడుకు పక్షాన నిలబడ్డాడు. దీంతో రామ్‌చరణ్‌ ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేసి ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రాన్ని నిర్మించారు. ఈ విషయంలో అల్లు అరవింద్‌ బాగా హర్ట్ అయినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. ఆ తర్వాత అయినా చిరుతో చేయవచ్చని అల్లు అరవింద్ భావించారు. ఆ కోరిక ఇప్పటివరకూ నెరవేరలేదు. ‘ఖైదీ నెంబర్‌ 150’ తర్వాత చిరు వరుసగా ‘సైరా నరసింహా రెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాలను రామ్‌చరణ్‌ బ్యానర్‌లోనే చేయడం గమనార్హం. గీతా ఆర్ట్స్‌ను దూరం పెట్టిన మెగా హీరోలు? ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం నుంచే మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం మెుదలైందన్న వాదనలు ఉన్నాయి. 2017లో ఆ చిత్రం రిలీజవ్వగా అప్పటినుంచి ఒక్క మెగా హీరో కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించలేదు. 2016లో రామ్‌ చరణ్‌తో చేసిన ‘ధ్రువ’ చిత్రం మెగా హీరోలతో అల్లు అరవింద్‌ చేసిన ఆఖరి మూవీ. అంతకుముందు రామ్‌ చరణ్‌తో 'మగధీర', సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్ల నువ్వు లేని జీవితం’, చిరంజీవితో లెక్కలేనన్ని సినిమాలను అల్లు అరవింద్‌ ప్రొడ్యూస్ చేశారు. వాస్తవానికి గీతా ఆర్ట్స్‌లో వచ్చిన మెజారిటీ హిట్‌ చిత్రాలు చిరంజీవి నటించినవే. అప్పట్లో&nbsp; క్రమం తప్పకుండా చిరుతో అల్లు అరవింద్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే రామ్‌చరణ్‌ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ స్టార్ట్‌ చేశారో ఆ తర్వాత చిరు ఒక్క మూవీ కూడా అల్లు అరవింద్ బ్యానర్‌లో చేయలేదు. మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ కూడా ఆ బ్యానర్‌లో నటించలేదు. దీంతో అల్లు అరవింద్‌ను సినిమాల పరంగా దూరం పెట్టారా అన్న అనుమానం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.&nbsp; అల్లు బ్రాండ్‌ కోసమేనా ఇదంతా? నిన్న, మెున్నటి వరకూ అల్లు, మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీ వర్గాలు, ఆడియన్స్‌ ఒకటిగానే చూశారు. ఆ రెండు కుటుంబాలకు చిరంజీవినే పెద్ద తలగా భావించారు. చిరు తర్వాతనే అల్లు అరవింద్‌ అయినా అన్న భావన చాలా మందిలో ఉండేది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి, స్టార్ ప్రొడ్యుసర్‌గా వెలుగొందుతున్న తన తండ్రికి మెగా కాంపౌండ్‌లో ఉండటం వల్ల సరైన గుర్తింపు రాలేదని అల్లు అర్జున్‌ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2021లో వచ్చిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడం కూడా బన్నీ ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చినట్లు టాక్ ఉంది. చిరంజీవి అంటే మెగా అనే బ్రాండ్‌ ఎలా ఉందో, తన పేరు మీద అల్లు అన్న బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలని బన్నీ భావించినట్లు టాక్‌. తద్వారా తన తండ్రికి చిరుకు మించిన గుర్తింపు తీసుకురావాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్‌ను దాటి బన్నీ బయటకు వచ్చేశారని తెలుస్తోంది. అందుకే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం, అంతకముందు పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అని వ్యాఖ్యానించడం ఈ క్రమంలో జరిగినవేనని అంటున్నారు.&nbsp; చిరు కూడా దూరం పెట్టాడా? మెగాస్టార్‌ చిరంజీవి ప్రతీ ఒక్కరినీ సమానంగా చూస్తుంటారు. మెగా హీరోలతో పాటు కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న వారిని సైతం స్వయంగా ఈవెంట్స్‌కు వెళ్లి మద్దతిస్తున్నారు. వారి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసి తనవంతుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటీవల ‘మట్కా’ సినిమా పోస్టర్‌ను సైతం షేర్‌ చేసి నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌కి అల్‌ ది బెస్ట్ చెప్పారు. అలాగే కూతురు నిర్మించిన ‘పరువు’ సిరీస్‌ను సైతం ప్రచారం చేశారు. అటువంటి చిరు తన మేనల్లుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ గురించి ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం చర్చకు తావిస్తోంది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘పుష్ప 2’ గురించి కనీసం ప్రస్తావించకపోవడం అల్లు - మెగా కుటుంబాల మధ్య ఉన్న వివాదానికి అద్దం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిరు కూడా అల్లు అర్జున్‌ను దూరం పెట్టారా? అన్న భావను కలిగిస్తున్నాయి. అటు అల్లు అర్జున్‌ సైతం ఇటీవల బాలయ్య షోలో పాల్గొని చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను తోటి యాక్టర్లుగా మాత్రమే ట్రీట్‌ చేశాడు. మామయ్య అంటూ ఎక్కడా మాట్లాడలేదు.&nbsp; ‘పుష్ప 2’తో ముదిరిన వివాదం అల్లు, మెగా కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా వారంతా ఒకటే ఫ్యామిలీ అని న్యూట్రల్‌ ఆడియన్స్‌ ఇప్పటివరకూ అభిప్రాయపడుతూ వచ్చారు. ఒకరిపై ఒకరు నేరుగా విమర్శ చేసుకోనప్పుడు ఎందుకు అనవసరంగా రూమర్లు స్ప్రెడ్‌ చేస్తారని ఫిల్మ్‌ వర్గాలు సైతం మండిపడుతూ వచ్చాయి. అయితే ‘పుష్ప 2’ లాంటి పాన్‌ ఇండియా చిత్రంలో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేసినట్లు వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇది కావాలని చేసి ఉంటే మాత్రం కచ్చితంగా అది రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుందని అంటున్నారు. సందర్భానుసారం వచ్చిన డైలాగ్స్‌ మాత్రమే అని బన్నీ ఫ్యాన్స్‌ చెబుతున్నప్పటికీ మెగా ఫ్యాన్స్‌ ఒప్పుకోవడం లేదు. తమ అభిమాన కుటుంబాన్ని కించపరిచేందుకే బన్నీ కావాలని టార్గెట్‌ చేశాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మున్ముందు ఈ వివాదం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.&nbsp;
    డిసెంబర్ 05 , 2024
    <strong>Brahmaji vs Sathyadev: సత్యదేవ్‌పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్‌!</strong>
    Brahmaji vs Sathyadev: సత్యదేవ్‌పై బ్రహ్మాజీ అనుచిత వ్యాఖ్యలు.. బెడిసికొట్టిన ప్రమోషన్స్‌!
    సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zebra Movie). ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్‌ కార్తీక్‌ (Eshwar Karthik) దర్శత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar), జెన్నిఫర్‌ (Jenniffer) హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాలీ ధనంజయ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హాజరై సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా హీరో సత్యదేవ్‌తో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబధించిన ప్రోమోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అయితే ఇందులో సత్యదేవ్‌పై బ్రహ్మాజీ నోరుపారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.&nbsp; ప్రోమోలో ఏముందంటే? బ్రహ్మాజీతో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను నటుడు సత్యదేవ్‌ తన ఎక్స్ ఖాతాలో పంచున్నారు. ఇందులో బ్రహ్మాజీ వస్తూనే 'ఈ న్యూసెన్స్ ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటీ అని చిరగ్గా ముఖంగా పెట్టి సత్యదేవ్‌ను అడిగారు. నువ్వు డ్యాన్స్‌ చేశావా అని ప్రశ్నించగా.. ఏదో హుక్‌ స్టెప్‌ వేశాను అని సత్యదేవ్‌ అంటాడు. 'హుక్కా.. బొక్కా' అల్లు అర్జున్‌ అయితే డ్యాన్స్ కోసం వెయిట్‌ చేస్తారు, నీకోసం ఎవరు చూస్తారు అని బ్రహ్మాజీ విసుక్కుంటాడు. జిబ్రా అనగానే థియేటర్లు బద్దలు కొట్టుకొని ప్రేక్షకులు వచ్చేస్తారా అంటు మండిపడ్డాడు. సలార్‌, కేజీఎఫ్‌ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ జిబ్రాకు వర్క్‌ చేశారని సత్యదేవ్‌ చెప్పగానే బ్రహ్మాజీ బిగ్గరగా నవ్వుతాడు. అలా అని పేర్లు వేసేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. అప్పుడు సత్యదేవ్‌ నీలాగా పోస్టులు పెట్టి డిలీట్‌ చేయను అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ప్రోమోను మీరు ఓసారి చూసేయండి. https://twitter.com/i/status/1857340000733720861 మరీ ఓవర్‌ చేశారా? ప్రస్తుతం తమ సినిమాలను వినూత్నంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 'జిబ్రా' టీమ్ ఇలా బ్రహ్మాజీ, సత్యదేవ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు ఇంటర్వ్యూను ప్లాన్‌ చేసింది. అయితే ఈ ప్లాన్‌ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. ఎవరైన సినిమాను ప్రమోట్‌ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. కానీ ప్రోమోను పరిశీలిస్తే ప్రతీ దశలోనూ బ్రహ్మాజీ 'జిబ్రా' మూవీని ఏకిపారేయడం చూడవచ్చు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సత్యదేవ్‌ను చాలా పర్సనల్‌గా అటాక్‌ చేసినట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో పోలుస్తూ నీ స్థాయి ఇంతే అన్నట్లు ఇండైరెక్ట్‌గా పంచ్‌లు వేసినట్లు ఉందన్నారు. అలాగే ‘జిబ్రా’ అనేది బ్రహ్మాండమైన సినిమా అనుకోవాలా? జనాలు ఎగబడిపోవాలా? అంటూ చేసిన కామెంట్స్‌ సినిమాపై నెగిటివిటీని పెంచేలా ఉందని చెబుతున్నారు.&nbsp; https://twitter.com/powerstarp1/status/1857413471135998113 https://twitter.com/ganeshmunju11/status/1857355491401154992 https://twitter.com/Rohit_RC_/status/1857383353298600053 బ్రహ్మాజీ అలా.. చిరు ఇలా 'జిబ్రా' సినిమా రిలీజ్‌ నేపథ్యంలో మంగళవారం (నవంబర్‌ 12)న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి ఇందులో హీరోగా చేసిన సత్యదేవ్‌పై ప్రశంసలు కురిపించాడు. తనకు మూడో తమ్ముడు అంటూ ఆకాశానికి ఎత్తాడు. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ, నిజమైన ఎమోషన్‌ అతడిలో ఉన్నాయని చెప్పారు. మంచి నటుడు అయినప్పటికీ సరైన సినిమాలు పడదలేన్నారు. అందుకే తన 'గాడ్‌ ఫాదర్‌' సినిమాకు రిఫర్ చేసినట్లు చెప్పారు. అతడి చేసిన 'జిబ్రా' సూపర్ హిట్‌ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పాడు. https://twitter.com/i/status/1856606401709162891
    నవంబర్ 16 , 2024
    Divi Vadthya: లంబసింగి బ్యూటీ ‘దివి వద్త్యా’ గురించి ఈ విషయాలు తెలుసా?
    Divi Vadthya: లంబసింగి బ్యూటీ ‘దివి వద్త్యా’ గురించి ఈ విషయాలు తెలుసా?
    యంగ్‌ బ్యూటీ దివి వద్త్యా (Divi Vadthya).. 'లంబసింగి' (Lambasingi) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు ఆడియన్స్‌ దృష్టి దివిపై పడింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు వారు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; దివి.. మార్చి 15, 1996లో హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు.. శశికాంత్ వద్త్యా, దేవకి. పదో తరగతి వరకూ జూబ్లీ హిల్స్‌లోని పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె చదువుకుంది. జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.&nbsp; కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన దివి.. పలు ఫ్యాషన్‌ సంస్థలకు మోడలింగ్‌ చేసింది. 2018లో తొలిసారిగా 'లెట్స్‌ గో' అనే షార్ట్‌ ఫిల్మ్‌లో దివి నటించింది.&nbsp; మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన మహర్షి (2019) సినిమాతో దివి వెండితెరపై అడుగుపెట్టింది. ఇందులో కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో కొన్ని సీన్లలో కనిపించింది.&nbsp; ఆ తర్వాత సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) హీరోగా చేసిన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమాలో దివి మరోమారు తళుక్కుమంది. ఇందులో దివ్య పాత్రలో కనిపించి పర్వాలేదనిపించింది.&nbsp; ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4’లో అడుగుపెట్టిన దివికి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. 49 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. తన అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేసింది.&nbsp; బిగ్‌ బాస్‌ తర్వాత దివికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 'క్యాబ్‌ స్టోరీస్‌'&nbsp; అనే చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ పాత్రలో ఈ భామ సర్‌ప్రైజ్‌ చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.&nbsp; మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’లో కనిపించి దివి మరింత పాపులర్‌ అయ్యింది. తన సినిమాలో దివికి అవకాశమిస్తానని బిగ్‌బాస్ స్టేజీపైన చిరు చెప్పడమే కాకుండా ‘గాడ్‌ ఫాదర్‌’ ద్వారా ఆ మాటను నిలబెట్టుకోవడం విశేషం.&nbsp; అదే ఏడాది మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా చేసిన ‘జిన్నా’ (Jinna) సినిమాలోనూ దివి ఓ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి ఈ బ్యూటీని నిరాశ పరిచింది.&nbsp; అనంతరం ‘రుద్రంగి’ సినిమాలో 'జాజి మెుగులాలి' పాటలో దివి చిందేసింది. తన అద్భుతమైన నృత్యంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.&nbsp; తాజాగా ఆమె నటించిన ‘లంబసింగి’ విజయం సాధించడంతో ఈ భామ చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర విజయంతో వరుస అవకాశాలు వస్తాయని ఈ దివి ఆశిస్తోంది.&nbsp; ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన దివి.. గతంలో రవితేజ (Ravi Teja) సినిమాలో తనకు అవకాశం వచ్చిందని చెప్పింది. అయితే చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మిస్‌ అయ్యిందని పేర్కొంది. అలా ఎందుకు జరిగిందో తెలీదని చెప్పుకొచ్చింది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడినట్లు దివి తెలిపింది. బాత్రూమ్‌లో షవర్‌ కింద ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వాపోయింది.&nbsp; అయితే గతంలో ఓ వ్యక్తిని ప్రేమించినట్లు దివి ఓ ఇంటర్యూలో తెలిపింది. అతని కుటుంబంలో చిన్న సమస్య రావడంతో బ్రేకప్‌ చెప్పుకున్నట్లు వివరించింది. 
    మార్చి 16 , 2024
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?&nbsp; టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.&nbsp; టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి&nbsp; https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.&nbsp; లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.&nbsp; టిల్లు:&nbsp; పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.&nbsp; టిల్లు:&nbsp; నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.&nbsp; టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ&nbsp; టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. &nbsp;అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.&nbsp; నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'&nbsp; https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..&nbsp; టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..&nbsp; టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:&nbsp; డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..&nbsp; లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..&nbsp; టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..&nbsp; మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:&nbsp; లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:&nbsp; నాదా...? నా హార్ట్ చాలా వీకూ..&nbsp; ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:&nbsp; నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..&nbsp; పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్: &nbsp;ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    <strong>Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌</strong>
    Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్‌
    మంచు మోహన్‌ బాబు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. గంటకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. మోహన్‌ బాబు (Mohan Babu), మంచు మనోజ్‌ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తొలుత ఆస్తుల వ్యవహారంలా కనిపించినా రోజులు గడుస్తున్న కొద్ది కుటుంబంలోని మరిన్ని లొసుగులు వెలుగు చూస్తున్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఫ్యామిలీ గొడవలు ప్రస్తావిస్తూ లేఖలు విడుదల చేయడం, ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం, మీడియాపై మోహన్‌ బాబు దాడి ఇలా వరుస ఘటనలతో మంచు లొల్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారుతోంది.&nbsp; మోహన్‌ బాబు హెల్త్‌ బులెటిన్‌ మంగళవారం రాత్రి ఘర్షణ అనంతరం మోహన్‌బాబు అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. 'డిసెంబర్ 10న రాత్రి 8 30 గంటలకు మోహన్ బాబు గారిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. బాడీ పెయిన్స్, యాంగ్జైటీతో సృహలేని స్థితిలో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హుటాహుటిన ఆయకు ఎమర్జెనీ వైద్యాన్ని అందించాం.. ఆయన ఎడమ కంటి కింద గాయం అయింది.. రక్తపోటు చాలా పెరిగింది.. హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది.. తగిన చికిత్సను అందించాం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది' అని వైద్యులు తెలిపారు. https://twitter.com/Hyderabad_Mail/status/1866749374581313939 రచ్చ పెట్టుకుంటే గెలవలేరు: విష్ణు కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ చేస్తోన్న ఆరోపణలు గురించి మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. అయితే ఫ్యామిలీ విషయాల గురించి తాను స్పందించనని విష్ణు తేల్చిచెప్పారు. కానీ, ఆత్మ గౌరవ పోరాటమంటూ మనోజ్‌ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించాడు. ‘ప్రేమతో గెలవాల్సింది.. రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు మనోజ్‌ను శత్రువుగా చూస్తున్నారన్న ప్రశ్నపై ‘దాని గురించి చెప్పేదేమి లేదండి. ఇమ్మెచ్యూర్‌గా ఫ్యామిలీ గురించి తను మాట్లాడొచ్చు. చిన్నవాడిగా అవగాహన లేకుండా ఏదైనా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఫ్యామిలీ గురించి మాట్లాడను’ అని అన్నాడు.&nbsp; https://twitter.com/10TvTeluguNews/status/1866746906011111783 మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు తాజా ప్రెస్‌ మీట్‌లో మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న చేసిన పెద్ద తప్పు ఏదైన ఉందంటే అది ముగ్గురు పిల్లలను ఎక్కువగా ప్రేమించడమేనని అన్నారు. 'ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం. ఇండస్ట్రీలో ఉన్నవారందరికీ ఇది తెలుసు. మీడియాకు నాదొక రిక్వెస్ట్‌. మీకు ఫ్యామిలీస్‌ ఉన్నాయి.. ఫాదర్స్‌ ఉన్నారు. ఏ కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. పెద్దలంటారు ఫ్యామిలీస్ ఆర్‌ కాంప్లికేటెడ్ అని. నేననుకున్నా నా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని, కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. అన్‌ఫార్చ్యునేట్‌గా ఇలా ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వస్తది, ఇలా మాట్లాడాల్సి వస్తది, ఇలాంటి పరిస్థితి నా ఫ్యామిలీకి వస్తదని ఎప్పుడు ఊహించలేదు’ అని విష్ణు అన్నారు.&nbsp; https://twitter.com/abntelugutv/status/1866750818646626628 ‘నాన్నను&nbsp; క్షమించండి’ మంగళవారం రాత్రి జర్నలిస్టుపై మోహన్‌ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మంచు విష్ణు స్పందించారు. 'జర్నలిస్టుపై దాడి విచారకరం. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్‌ ఇంట్లోకి వచ్చాడు’ అని విష్ణు అన్నారు. కంటతడి పెట్టిన మనోజ్‌.. మంచు విష్ణు కంటే ముందు సోదరుడు మనోజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో కంటతడి పెట్టి బావోద్వేగానికి గురయ్యారు.‘నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నాను.  ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా’ అని మనోజ్‌ వ్యాఖ్యానించారు. https://twitter.com/swetchadaily/status/1866744650738044980 'అందుకే ఇంటికి వచ్చా'.. కొంతమంది బంధువులు, నాన్న సన్నిహితుల సూచనతో ఈ ఇంటికి వచ్చానని మనోజ్‌ తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా బయట ఉంటున్నావు. ఇంట్లో అమ్మానాన్న మాత్రమే ఉన్నారు. మీ అన్న ఫ్యామిలీతో దుబాయ్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. నీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో నీ భార్యకు మీ తల్లి, పెద్దవాళ్ల అవసరముంది. ఒక్కడివే ఎలా చూసుకుంటావు?’ అని వారు నాతో అన్నట్లు చెప్పారు. తన భార్య కూడా వారిని సమర్థించి..&nbsp; మాట వినాలని కోరడంతో ఈ ఇంటికి తిరిగి వచ్చానని వివరించారు.&nbsp; ‘అన్న కోసం గొడ్డులా పనిచేశా’ తనపై చాలా ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్‌ అన్నారు. ‘దీనికి నేనేమీ చెప్పలేను. ఆధారాలు మాత్రమే చూపించగలను. నేనెప్పటినుంచో కూర్చొని మాట్లాడదామన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను. ఆమె కోసం పోరాడాను. అందులో తప్పేముంది? పది మంది కోసం నిలబడినందుకు నేను చెడ్డవాడిని అయ్యాను. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేశాను. రమ్మంటే వచ్చాను.. పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను. గొడ్డులా కష్టపడ్డాను. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. ఏ రోజూ ఒక్క రూపాయి అడిగింది లేదు.. ఆశించింది లేదు’ అని అన్నారు.&nbsp; https://twitter.com/abntelugutv/status/1866742963445043239
    డిసెంబర్ 11 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; సగం రీమేక్‌లే.. సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. &nbsp; దిగజారిన స్థాయి? తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది. తేడాకొడుతున్న రీమేక్? ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే .&nbsp; సక్సెస్ ఫార్ములా? చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.&nbsp; రీమేక్స్ వద్దు.. చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు.&nbsp;
    ఆగస్టు 11 , 2023
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సత్యదేవ్ (Satyadev) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో  సత్యదేవ్ ఒకరు. బ్లఫ్‌ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సత్యదేవ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ అసలు పేరు? సత్యదేవ్ కంచరణా సత్యదేవ్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు సత్యదేవ్ తొలి సినిమా? మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం ద్వారా సత్యదేవ్ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యాడు. హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'బ్లప్‌ మాస్టర్'  సత్యదేవ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఏపీ సత్యదేవ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1989 జులై 4 సత్యదేవ్‌కు వివాహం అయిందా? దీపికతో 2016లో పెళ్లి జరిగింది. 2020లో ఈ జంటకు ఒక కొడుకు జన్మించాడు. పేరు సావర్ణిక్ సత్యదేవ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ తొలి హిట్ సినిమా? జ్యోతి లక్ష్మి చిత్రం సత్యదేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, గాడ్‌ఫాదర్ వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సత్యదేవ్‌కు ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ సత్యదేవ్ తల్లిదండ్రుల పేర్లు? ప్రసాద్‌ రావు, లక్ష్మి సత్యదేవ్‌కు ఇష్టమైన ప్రదేశం? విశాఖపట్నం &nbsp;సత్యదేవ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొద్దికాలం బెంగుళూరులో పనిచేశాడు. సత్యదేవ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? &nbsp;2024 వరకు 30 సినిమాల్లో నటించాడు.&nbsp; సత్యదేవ్‌కు ఇష్టమైన ఆహారం? దోశ సత్యదేవ్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7.5 కోట్లు సత్యదేవ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సత్యదేవ్ ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=bLnXyZ4pzhE
    మార్చి 21 , 2024
    Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..!&nbsp;
    Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..!&nbsp;
    సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా ఓక బృందమే పనిచేస్తుంది. అయితే, రాను రాను ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది. ఎవరో అప్‌డేట్స్ లీక్ చేయడం కన్నా.. చిత్రబృందమే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అర చేతిల్లోకి రావడంతో సినిమాకు కావాల్సిన ప్రచారమూ దక్కుతోంది. ఈ కోవలోకి చెందిందే చిరు లీక్స్. మెగాస్టార్ చిరంజీవి ఈ అప్‌డేట్స్‌ని అధికారికంగా లీక్ చేస్తుండటం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.&nbsp; తప్పుని ఒప్పులా.. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ బ్రెయిన్‌కు చిరు లీక్స్ నిదర్శనం. గతంలో చిరంజీవి పలు లీకులను చేశాడు. ఆచార్య టైటిల్ రివీల్ చేయడం, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి అన్యాపదేశంగా చెప్పేశాడు.&nbsp; https://twitter.com/AKentsOfficial/status/1666764990228107267 పొరపాటున వెల్లడించిన వివరాల వల్ల కొంతవరకు విమర్శలకు గురయ్యారు. కానీ, ఇప్పుడు అదే నెగెటివ్ పాయింట్‌ని పాజిటివ్‌గా మలిచిన నటుడు చిరంజీవి.&nbsp; లీక్ చేస్తున్నామని అధికారికంగా వెల్లడించి మరీ చెప్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గాడ్‌ఫాదర్ మూవీ నుంచి చిరులీక్స్‌ని అఫీషియల్ చేసేశాడు మెగాస్టార్.&nbsp; ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని స్వయంగా మెగాస్టారే రివీల్ చేస్తున్నాడు.&nbsp; https://twitter.com/MeherRamesh/status/1666809538392240129 ఇతర పీఆర్‌లతో పోలిస్తే చిరుకి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. దీంతో ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఈ లీక్స్ ఉపయోగపడుతున్నాయి. అలా గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల నుంచి చేసిన లీక్స్ థియేటర్లకు జనాలను రప్పించాయి.&nbsp; ఇప్పుడు ఇదే పంథాలో భోళాశంకర్ మూవీ నుంచి మేకింగ్ వీడియోను ఫ్యాన్స్‌కి లీక్ చేశాడు. ఓ సాంగ్ కోసం రూపొందించిన భారీ సెట్‌ వీడియో ఇది. ఇందులో ‘జాం జాం జజ్జనిక.. తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క’ సాంగ్‌కి చిరు, సుమంత్, తమన్నా, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. ఈ పాటను కాసర్ల&nbsp; శ్యాం రాయగా, మహతి స్వర సాగర్ స్వరపరిచాడు. వీజే శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించాడు.&nbsp; సినిమా అనేది కోట్ల రుపాయలతో కూడుకున్న బిజినెస్. సినిమాలోని ఏ విషయం లీకైనా అది మొత్తం సినిమా రెవెన్యూపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటేన్ చేస్తూ ఉంటారు సిబ్బంది.&nbsp; తెలియకుండానే చిరు చేసిన లీక్స్ కారణంగా కొందరు విమర్శించారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తలనొప్పిలా మారాడని పెదవి విరిచారు.&nbsp; ఇప్పుడు ఇదే సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. చిరు నుంచి ఎప్పుడెప్పుడు లీక్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండటం గమనార్హం.&nbsp; భోళాశంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. దీంతో 2 నెలల ముందు నుంచే సినిమా ప్రమోషన్లను తన స్టైల్‌లో మొదలు పెట్టాడు చిరు. ఒకొక్క లీక్ ఇస్తూ జనాల్లో తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక అధికారిక ప్రచారాలు సపరేటు.&nbsp; తమిళ సినిమా వేదాళంకు రిమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. తెలుగులో మెహర్ రమేశ్ తీస్తున్నాడు. చిరుకు జోడీగా తమన్నా నటించింది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషించింది. https://www.youtube.com/watch?v=91RtI6ZG2bc
    జూన్ 09 , 2023
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది. టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది. ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల జాతర చేస్తోంది. ఒక్క పక్క టెలివిజన్ షోలు చేస్తూనే ఇన్‌స్టాలో హాట్ షో చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. కొద్దిరోజులుగా శ్రీముఖి ఇన్‌స్టాలో హట్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది. తాజాగా మిల్కీ వైట్, లైట్ పింక్ లెహంగాలో ఈ శ్రీముఖి తళుక్కున మెరిసింది. ఎప్పటికప్పుడూ హాట్ ఫొటో షూట్లతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తన ప్రతి గ్లామరస్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. బిగ్ బాస్ 3 రన్నరప్‌ తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. అప్పట్లో జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో రామ్ పొత్తినేని సిస్టర్ క్యారెక్టర్ చేసింది.&nbsp; తాజాగా గాడ్‌ఫాదర్ సినిమాలోనూ శ్రీముఖి మెరిసింది. సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఈ అల్లరి పిల్ల ఎదురుచూస్తోంది. బీబీజోడీ, పటాస్ వంటి టెలివిజన్ షోలతో క్రేజ్ సంపాదిస్తోంది. మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ దూసుకెళ్తోంది
    ఏప్రిల్ 06 , 2023
    <strong>Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌&nbsp;</strong>
    Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌&nbsp;
    సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zibra). 'పుష్ప'లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్‌ టాక్‌తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్‌గా సక్సెస్‌ మీట్‌ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. ఇదిలాఉంటే నటుడు సత్యదేవ్‌ ప్రేక్షకులను ఉద్దేశించి తాజాగా బహిరంగ లేఖ రాశారు. గతంలో చేసిన ‘బ్లఫ్‌ మాస్టర్‌’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.&nbsp; సత్యదేవ్‌ ఏం రాశారంటే? ‘జీజ్రా’ (Zibra) చిత్రానికి వస్తోన్న విశేష ఆదరణ చూసి సత్యదేవ్‌ (Satyadev) సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ రిలీజ్‌ చేశాడు. 'ఇది మీరిచ్చిన విజయం. మీరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇలాంటి హిట్ కోసం 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్‌ అని అనిపించుకోవడానికి ఎంతో ఎదురుచూశాను. నేను హిట్ కొడితే, మీరు ఆనందిస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. బ్లఫ్‌ మాస్టర్‌ సినిమాని మీరు థియేటర్‌లో చూడలేకపోయారు. తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి ఎంతో ఆదరించారు. జీబ్రా విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా. దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని రాసుకొచ్చారు. https://twitter.com/ActorSatyaDev/status/1861276550337073501 ప్రతీ సినిమాకు ఎదురీతే టాలెంట్ ఉన్న సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలలో సత్యదేవ్‌ (Satyadev) ఒకరు. ప్రతీ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్‌ జీబ్రాతో తన రాత మారుతుందని భావించారు. పాజిటివ్‌ టాక్‌ రావడంతో సంబరపడిపోయాడు. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్‌లో కనిపించకపోవడంతో సత్యదేవ్‌ కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి సత్యదేవ్‌కు కొత్తేమి కాదు. అతడి తొలి ఫిల్మ్‌ నుంచి ఇదే పరిస్థితిని ఫేస్‌ చేస్తూ వస్తున్నాడు. హీరోగా తన ఫస్ట్‌ ఫిల్మ్‌ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కొవిడ్‌ కారణంగా ఓటీటీలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన 'తిమ్మరుసు'పై కూడా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం పడింది. 50 శాతం మందినే థియేటర్లలోకి అనుమతించడంతో అనుకున్న సక్సెస్‌ రాలేదు. అనంతరం చేసిన ‘బ్లఫ్‌ మాస్టర్‌’ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన 'కృష్ణమ్మ' రెండేళ్ల పాటు ఆగిపోయింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చినా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవికి ప్రతినాయకుడిగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్యదేవ్‌కు అవకాశాలు దక్కలేదు. ఇలా ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న సత్యదేవ్‌ ‘జీబ్రా’ విషయంలో మళ్లీ రిపీట్ కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూనే తన సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు.&nbsp; 'జీబ్రా' నిజంగానే బాగుందా? దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలోని ఆర్థిక నేరాల్ని ఆధారంగా చేసుకొని జీబ్రాను రూపొందించారు. గ్యాంగస్టర్‌ ప్రపంచంతో స్టోరీని ముడిపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్‌ ఉద్యోగి సూర్య పాత్రలో సత్యదేవ్‌ (Satyadev) ఆకట్టుకున్నాడు. తన సెటిల్డ్‌ నటనతో మెప్పించాడు. రూ.5 కోట్ల ఫ్రాడ్‌ విషయంలో గ్యాంగ్‌స్టర్ అయిన విలన్‌ చేతికి హీరో చిక్కడం, ఆ డబ్బు సంపాదించేందుకు హీరో పడే కష్టాలు ఆకట్టుకుంటాయి. అయితే దేశ రాజకీయాలనే శాసించే అపరకుభేరుడైన విలన్ కేవలం రూ.5 కోట్ల కోసం హీరో వెంటపడటమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కిక్కిచ్చే మూమెంట్స్‌ పెద్దగా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి, థ్లిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారికి జీబ్రా తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు.&nbsp; స్టోరీ ఏంటంటే? మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ.
    నవంబర్ 26 , 2024
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం (మే 1) ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; హిందీలో తగ్గేదేలే! గతంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఆదరణ లభించింది. బన్నీ అద్భుతమైన నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ‘పుష్ప 2’ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ నార్త్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. తెలుగులో ఈ సాంగ్‌ 20 గంటల వ్యవధిలో 84 లక్షల వ్యూస్‌ సాధిస్తే.. హిందీలో ఏకంగా కోటి వ్యూస్‌ రాబట్టడం విశేషం. ఈ లిరికల్‌ సాంగ్‌ను తెలుగులో 4.8 లక్షల మంది లైక్‌ చేయగా.. హిందీలో 5.2 లక్షలుగా ఉంది. కాగా, విడుదలైన ఆరు భాషల్లోనూ ఈ చిత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళ్తుండటంతో మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా పుష్పగాడి హవా మెుదలైందంటూ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; టైటిల్‌ సాంగ్ అదరహో.. బుధవారం సాయంత్రం పుష్ప 2 సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్'&nbsp; అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. పుష్ప 2 నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.&nbsp; https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 02 , 2024
    <strong>Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!</strong>
    Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!
    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa: The Rise) చిత్రం 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బన్నీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మెగా ఫ్యామిలీ లక్ష్యంగా బన్నీ ఈ కామెంట్స్‌ చేశారంటూ మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అటు అల్లు అర్మీ సైతం వారికి దీటుగా సమాధానం ఇస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌కు హై ఓల్టేజ్‌ పవర్‌ ఇచ్చే అప్‌డేట్‌ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్‌ 'పుష్ప' చిత్రంలో నటుడు రావు రమేష్‌ (Rao Ramesh) ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంపీ భూమిరెడ్డి పాత్రలో అయన కనిపించింది కొద్దిసేపే అయిన కథపై ఎంతో ఇంపాక్ట్‌ చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రావు రమేష్‌ 'పుష్ప 2'లో తన పాత్ర గురించి చెబుతూనే 'పుష్ప 3' క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. 'పుష్ప కథ అంతా చెప్పి ఒక్క సీన్‌ మాత్రమే షూట్‌ చేశారు. మిగిలిన డేట్స్‌ పుష్ప 2కి వాడుకుంటాం సర్‌ అన్నారు. నేనూ ఓకే అన్నాను. పార్ట్‌ 2లో మంచి పాత్రే పడింది. ఇప్పుడు పార్ట్‌ 3 కూడా అంటున్నారు. అందులోనూ నా పాత్ర ఉండొచ్చేమో' అంటూ రావు రమేష్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. 'పుష్ప 3' పక్కాగా ఉంటుందని రావు రమేష్‌ చెప్పకనే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్‌ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nasavnensasthaa/status/1828421405731697031? క్లైమాక్స్‌లో హింట్‌! ‘పుష్ప 3’ సంబంధించి ప్రస్తుతం మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఉంటుందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అంతేకాదు పార్ట్‌ 3కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చూపిస్తారని సమాచారం. అయితే పుష్ప 3 వెంటనే పట్టాలెక్కకపోవచ్చని సమాచారం. బన్నీ-సుకుమార్‌ రెండు మూడేళ్ల గ్యాప్‌ తీసుకునే అవకాశముందని అంటున్నారు. అటు బన్నీ, సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. సుకుమార్‌ ఇప్పటికే రామ్‌చరణ్‌తో ఓ సినిమాను అనౌన్స్‌ చేయగా, బన్నీ చేతిలో త్రివిక్రమ్‌, తమిళ స్టార్ డైరెక్టర్‌ అట్లీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 3' ఇప్పట్లో రాకపోవచ్చని సమాచారం.&nbsp; తొలి పార్ట్‌కి మించి..&nbsp; ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, ఫస్ట్‌, సెకండ్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడిన దర్శకుడు సుకుమార్‌ సినిమాపై హైప్‌ను పెంచే కామెంట్స్‌ చేశారు. మెుదటి భాగాన్ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పుష్ప 2లో సమాధానం దొరుకుతుందని సుకుమార్‌ తెలిపారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్‌ ఆడే గేమ్‌, ఎమోషనల్‌ సీన్స్‌, పుష్ప రాజ్‌ vs భన్వర్‌సింగ్‌ షెకావత్‌ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.&nbsp; ‘కేజీఎఫ్‌’ ఫార్మూలా! డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప 3’ విషయంలో ‘కేజీఎఫ్‌’ (KGF Movie) ఫార్మూలాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆపై వెంటనే సెకండ్‌ పార్ట్‌ను పట్టాలెక్కించి ‘కేజీఎఫ్‌ 2’ను కూడా రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్‌ 3’ గ్యాప్‌ ఇచ్చి ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అటు యష్‌ సైతం ‘టాక్సిక్‌’ అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘పుష్ప 3’పై వస్తోన్న లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే సుకుమార్‌ - బన్నీ కూడా ప్రశాంత్‌ నీల్‌- యష్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ ఫినిష్‌ చేసి ఆ తర్వాత ‘పుష్ప 3’ని పట్టాలెక్కించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    <strong>ANR Award 2024: మోహన్ బాబుతో 17 ఏళ్ల క్రితం జరిగిన గొడవ బయట పెట్టిన చిరంజీవి</strong>
    ANR Award 2024: మోహన్ బాబుతో 17 ఏళ్ల క్రితం జరిగిన గొడవ బయట పెట్టిన చిరంజీవి
    అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శతజయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రామ్‌చరణ్‌ (Ramcharan), నాగచైతన్య (Naga Chaitanya) సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డ్‌’ను మెగాస్టార్‌ చిరంజీవికి అందజేశారు. బిగ్‌బీ అమితాబ్‌ చేతుల మీదుగా చిరు ఈ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడిన చిరు గతంలో వజ్రోత్సావల సందర్భంగా మోహన్‌బాబుతో జరిగిన గొడవను గుర్తుచేసుకున్నారు.&nbsp; అసలేం జరిగిందంటే? 2007లో తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు వజ్రోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేడుకలో మెగాస్టార్‌ చిరును లెజండరీ అవార్డ్‌తో సత్కారించాలని నిర్ణయించారు. దీనిపై మాట్లాడిన నటుడు మోహన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను సన్మానిస్తున్నాం అంటూ కొందరు వచ్చారని అయితే లెజండ్‌గా కాదు, సెలబ్రిటీ హోదాలో అవార్డు ఇచ్చి గౌరవిస్తామని చెప్పారన్నారు. 'ఈ సందర్భంగా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుంకుంటున్నా. లెజెండరీ అంటే ఏంటి? సెలబ్రిటీ అంటే ఏంటో ఓ పుస్తకం రాసి వాటికి అర్ధం వివరించి అవార్డు ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీలో బతికి ఉన్న నటుల్లో తొలిసారి రాజ్యసభకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిని. కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అది లెజెండరీ కాదా? కులమతాలకు అతీతంగా 25% పేదలకు ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాను అది లెజెండరీ కాదా? 500 సినిమాలకు పైగా నటించాను, 45 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను అది లెజెండరీ కాదా? అంటూ సినీ పెద్దలను ప్రశ్నించారు. https://twitter.com/lyf_a_zindagii/status/1850924373890552313 అప్పుడు చిరు ఏమన్నారంటే? మోహన్ బాబు ప్రశ్నించడంపై చిరంజీవి సైతం ఘాటుగా స్పందించారు. ‘ఒక రామారావు, రాఘవేంద్రరావు, బాపు గారు, విశ్వనాథ్ గారు, దాసరి నారాయణ గారు ఉన్నారు. వారంతా లెజెండ్స్. వారికి అవార్డు ఇవ్వండి. నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా ఒకే ఏజ్ వాళ్లం. నాకు అవార్డు ఇచ్చి నన్ను వారి నుంచి దూరం చేయకండి. నన్ను పెద్దవాడిని చేయకండి అని ముందే చెప్పాను. నాకు లెజెండరీ అవార్డు వద్దు అన్నది సత్యం. అయితే నేను లెజెండరీ అవార్డు తీసుకొనేందుకు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను దానికి అర్హుడిని కాదని భావిస్తే ఆ అవార్డును తీసుకోను. దానిని ఓ బాక్స్‌లో పెట్టి సరెండర్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ అవార్డుకు అర్హుడినైతే దానిని అప్పుడే తీసుకొంటాను. 100 ఏళ్ల ఫంక్షన్ జరిగే సమయానికి నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు అప్పటి వరకు పెద్దవాళ్లం అవుతాం. అప్పుడు నాకు అర్హత ఉంటే అవార్డు తీసుకొంటాను. అప్పటి వరకు ఆ అవార్డును సమాధి చేస్తాను’ అని వజ్రోత్సవం వేడుకలో చెప్పుకొచ్చారు.&nbsp; ఏఎన్నార్‌ ఈవెంట్‌లో ఏం చెప్పారంటే? ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు వజ్రోత్సవం సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నా ఇల్లు అనుకుంటే ఇంట గెలిచే అవకాశం 2007లో వజ్రోత్సవం సందర్భంగా వచ్చిందని చిరు అన్నారు. అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డు ప్రధానం చేస్తామంటే చాలా సంతోషం వేసిందన్నారు. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంతమంది హర్షించని సమయంలో తనకు ఆ అవార్డు తీసుకోవాలని అనిపించలేదన్నారు. అందుకే తనకు వచ్చిన అవార్డును ఓ బాక్స్‌లో పెట్టి నాకు అర్హత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తీసుకొంటానని చెప్పానన్నారు. ‘ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నాఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు పుచ్చుకొన్న రోజున, అదీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా తీసుకొన్న రోజున, నా మిత్రుడు నాగార్జున మనస్పూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకు మీకే అర్హత ఉందని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంట గెలిచాను. రచ్చ గెలిచాను అనే ఫీలింగ్ కలిగింది’ అని మెగాస్టార్ అన్నారు. https://twitter.com/i/status/1850904660875288817 ‘ఆ మాటలకు వణుకు వచ్చింది’ ఏఎన్నార్‌ నేషనల్ అవార్డు అందించిన బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ మంచి జరిగినా, అవార్డు వచ్చినా తొలుత అమితాబ్‌ నుంచే శుభాకాంక్షలు వస్తాయని అన్నారు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా 'చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్‌ సినిమా' అని అమితాబ్‌ అన్నారని గుర్తుచేశారు. ఆ మాటలు విన్నాక చిన్న వణుకు వచ్చిందని పేర్కొన్నారు. అయితే తన మనసు అమితానందంతో నిండిపోయిందని చిరంజీవి తెలిపారు. అటు 'సైరా' సినిమాలో తన గురువు పాత్ర కోసం అమితాబ్‌ను సంప్రదించినప్పుడు వెంటనే ఓకే చెప్పారని చిరు తెలిపారు. ఫార్మాలిటీస్‌ (పారితోషికం) గురించి అడిగినప్పుడు ‘అలాంటిదేది అక్కర్లేదు.. నువ్వు నా స్నేహితుడివి’ అన్నారని గుర్తుచేసుకున్నారు.
    అక్టోబర్ 29 , 2024

    @2021 KTree